Advertisement
ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు : ఏయూఈఈటీ ప్రవేశ పరీక్ష
Universities

ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు : ఏయూఈఈటీ ప్రవేశ పరీక్ష

ఆంధ్ర యూనివర్సిటీ పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి యూజీ & పీజీ కోర్సులు ఆఫర్ చేస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీఈ), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఏంఈ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) పేర్లతో అందిస్తున్న ఈ కోర్సులు ఆంధ్ర యూనివెర్సిటీతో పాటుగా దాని అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏయూ ఇంజనీరింగ్ సెట్ మరియు ఇతర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ర్యాంకుల ఆధారంగా నిర్వహిస్తారు.

ఏయూ బీఈ & బీటెక్ కోర్సులు కోర్సులు నాలుగేళ్ళ నిడివితో ఆఫర్ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో అభ్యర్థులు ఎనిమిది సెమిస్టరు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక సెమిస్టరు యందు పాస్ కాని అభ్యర్థులు, వచ్చే ఏడాది అదే సెమిస్టరు పరీక్షకు హాజరుకావడం ద్వారా ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. కోర్సులు సంబంధించి సీట్ల వివరాలు మరియు ట్యూషన్ ఫీజుల వివరాలు అడ్మిషన్ సమయంలో అందుబాటులో ఉంచుతారు.

ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ క్యాంపసులో మరియు అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆరేళ్ళ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏయూఈఈటీ పరీక్షను నిర్వహిస్తారు. ఈ కోర్సులో మొదటి నాలుగేళ్లు బీటెక్, చివరి రెండేళ్లు ఎంటెక్ డిగ్రీ అందిస్తారు.

నాలుగేళ్ళ ఇంజీనిరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు పోయే విద్యార్థులకు బీటెక్ పట్టా మాత్రమే అందిస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ యందు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుందుకు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఏయూలో బీఈ మరియు బీటెక్ కోర్సులు

  • BE సివిల్ ఇంజనీరింగ్
  • BE సివిల్ ఎన్విరాన్మెంటల్
  • BE మెక్. మెరైన్ ఇంజనీరింగ్
  • BE మెకానికల్ ఇంజనీరింగ్
  • BE ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • BE ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
  • B.Tech. కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్
  • BE మెటలర్జికల్ ఇంజనీరింగ్
  • BE మెరైన్ ఇంజనీరింగ్
  • BE నావల్ ఆర్కిటెక్చర్
  • B.Tech. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
  • B.Tech. కెమికల్ ఇంజనీరింగ్
  • B.Tech. జియో-ఇన్ఫర్మాటిక్స్
  • B.Tech. సిరామిక్ టెక్నాలజీ బి.ఆర్క్
  • B.Tech. బయోటెక్నాలజీ
  • BE (బ్యాచిలర్ ఎలెక్టోరియల్ మెకానికల్ ఇంజనీరింగ్ 2010 - 2011)
  • పిజి డిప్లొమా ఇన్ కండిషన్ మానిటరింగ్ కోర్సు AU మరియు CMSI 2010–2011

ఏయూలో ఏంఈ మరియు ఎంటెక్ కోర్సులు

  • ME ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ & మేనేజ్‌మెంట్
  • ME సాయిల్ మెకానిక్స్ మరియు ఫౌండేషన్ ఇంజనీరింగ్
  • ME మెషిన్ డిజైన్
  • ME హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎనర్జీ సిస్టం
  • ME CAD / CAM
  • M.Tech. టెక్నాలజీ ఫోర్కాస్టింగ్
  • ME కంట్రోల్ సిస్టమ్
  • ME పవర్ సిస్టమ్ & ఆటోమేషన్
  • ME మెరైన్ ఇంజనీరింగ్ & మెకానికల్ హ్యాండ్లింగ్
  • M.Tech. కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ
  • M.Tech. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • M.Tech. కెమికల్ ఇంజనీరింగ్
  • M.Tech. మినరల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్
  • M.Tech. బయో-టెక్నాలజీ
  • M.Tech. కంప్యూటర్ ఎయిడెడ్ కెమికల్ ఇంజనీరింగ్
  • M.Tech. జియో-ఇంజినీరింగ్
  • M.టెక్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్.
  • M. ప్లానింగ్
  • M.Tech. కమ్యూనికేషన్ సిస్టమ్స్.
  • MCA (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్)
  • M. ప్లానింగ్ (ఎన్విరాన్మెంటల్)
  • M.Tech ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ కెమికల్ ఇంజనీరింగ్‌
  • M.Tech. ( సిఎస్‌టి విత్ స్పెషలైజషన్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌‌)
  • M.Tech. (సిఎస్‌టి విత్ స్పెషలైజషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
  • M.Tech. (సిఎస్‌టి విత్ స్పెషలైజషన్ ఇన్ బయో ఇన్ఫోర్మోటిక్స్)
  • M.Tech. (సిఎస్‌టి విత్ స్పెషలైజషన్ ఇన్ కంప్యూటర్ నెట్‌వర్క్‌)
  • M.Tech. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్
  • M.Tech. ఇండస్ట్రీ పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీరింగ్.
  • M.Tech. బయో-ఇన్ఫర్మాటిక్స్
  • ME వాటర్ రిసోర్సెస్ & GIS
  • ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ అప్లైడ్ కెమిస్ట్రీ
  • ME ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
  • M.Tech. (విఎల్‌ఎస్‌ఐ) కోర్సు
  • ME (ఇండస్ట్రియల్ మెటలర్జీ)
  • ME కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
  • ME స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ / ప్రకృతి విపత్తు నిర్వహణ
  • ME హైడ్రాలిక్ మరియు కోస్టల్ హార్బర్ ఇంజనీరింగ్
  • M.టెక్ రాడార్ మరియు మైక్రోవేవ్ ఇంజనీరింగ్
  • M.Tech. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
  • M.Tech. (బయో మెడికల్ ఇంజనీరింగ్)

ఏయూలో ఎంఈ మరియు ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు

  • M.Tech. ఇండస్ట్రీ పొల్యూషన్ కంట్రోల్ ఇంజనీరింగ్
  • M.Tech. కంప్యూటర్ ఎయిడెడ్ కెమికల్ ఇంజనీరింగ్
  • M.Tech. నానో-టెక్నాలజీ
  • M.Tech. బయో-ఇన్ఫర్మాటిక్స్
  • M.Tech. (A1 రోబోటిక్స్లో స్పెషలైజేషన్‌తో CST)
  • M.Tech. కంప్యూటర్ నెట్‌వర్క్‌లు
  • ME ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్
  • ME వాటర్ రిసోర్సెస్ & GIS
  • ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్
  • ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • ఇంటిగ్రేటెడ్ MS సాఫ్ట్‌వేర్ & MS సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్
  • ఎంఎస్ మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ
  • M. ప్లానింగ్
  • ME CAD / CAM.
  • ME ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
  • ME కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
  • ME స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ / ప్రకృతి విపత్తు నిర్వహణ
  • ME హైడ్రాలిక్ మరియు కోస్టల్ హార్బర్ ఇంజనీరింగ్
  • M.టెక్ రాడార్ మరియు మైక్రోవేవ్ ఇంజనీరింగ్
  • M.Tech. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
  • M.Tech. (రిమోట్ సెన్సింగ్)
  • M.Tech. బయో మెడికల్ ఇంజనీరింగ్)
  • MS (EEE) మరియు ఇంటిగ్రేటెడ్ MS మెకానికల్ MS కెమికల్ ఇంజనీరింగ్
  • MS కంప్యూటర్ సైన్స్, MS మరియు MS (ECE)
  • ME (పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్ కంట్రోల్)
  • ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ (సివిల్).
  • B.Engg. (ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్.)
  • MS (టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్).
  • M.Tech. (నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్)

Post Comment