Advertisement
వైఎస్ఆర్ లా నేస్తం పథకం 2023 : జూనియర్ లాయర్లకు స్టైఫండ్‌
Scholarships

వైఎస్ఆర్ లా నేస్తం పథకం 2023 : జూనియర్ లాయర్లకు స్టైఫండ్‌

వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద ప్రాక్టీసులో ఉండే జూనియర్ న్యాయవాదులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ స్టైపెండ్ అందిస్తుంది. లా నేస్తం పథకం ద్వారా జూనియర్‌ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ సమయంలో మూడేళ్ల పాటు అందిస్తారు.

స్కాలర్షిప్ పేరు వైఎస్ఆర్ లా నేస్తం
స్కాలర్షిప్ టైప్ ఫైనాన్సియల్ అసిస్టెన్స్
ఎవరికి అందిస్తారు జూనియర్ లాయర్లకు
అర్హుత 35 ఏళ్ల లోపు వయస్సు & తొలి మూడేళ్ల ప్రాక్టీసులో ఉండాలి

వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.

వైఎస్ఆర్ లా నేస్తం పథకం జూనియర్ లాయర్లకు ప్రాక్టీసు సమయంలో ఆర్థిక తోడ్పాటును అందివ్వనుంది. ఈ పథకం కుటుంబంలో ఒక వ్యక్తికీ మాత్రమే అందిస్తారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్ ఎన్‌రోల్‌మెంట్ ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి మూడేళ్లను లెక్కిస్తారు. జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి మూడేళ్లు నిండనివారు మిగిలిన కాలానికి మాత్రమే స్టైఫండ్ పొందుతారు.

వైఎస్ఆర్ లా నేస్తం ఎలిజిబిలిటీ

  1. వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  2. అభ్యర్థులు 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
  3. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
  4. మూడేళ్ళ ప్రాక్టీస్ పూర్తిచేసినవారు, సొంత నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షనులో రిజిస్టర్ చేసుకొని వారు ఈ పథకానికి అనర్హులు.
  5. దరఖాస్తుదారుడు తాను ఇంకా ప్రాక్టీస్‌లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్‌ సమర్పించాలి.

వైఎస్ఆర్ లా నేస్తం దరఖాస్తు

అర్హుత ఉన్న అభ్యర్థులు లా నేస్తం అధికారిక వెబ్ సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు సామజిక వెరిఫికేషన్ కోసం  గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపిస్తారు.  వెరిఫికేషన్‌లో దరఖాస్తు సరైనదేనని తేలితే, దానిని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, ఆతర్వాత జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.

కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతరం ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు సీఎప్ఎంఎస్ యందు అప్లోడ్ చేస్తారు. సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు. ఈ దశలన్నీ పూర్తిచేసుకుని తుది ఆమోదం పొందిన వారి అకౌంట్లలో సొమ్మును జమ చేస్తారు. గ్రామ లేదా వార్డు వాలంటీర్లు స్టైఫండ్ చెల్లింపు రసీదును లబ్ధిదారు ఇంటివద్ద అందిస్తారు.

Post Comment