జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు కులాలకు చెందిన విద్యార్థుల విదేశీ చదువులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. గతంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరుతో అందించే ఈ పథకంను ప్రస్తుతం జగనన్న విదేశీ విద్యా దీవెనగా అమలు చేస్తున్నారు.
స్కాలర్షిప్ పేరు | జగనన్న విదేశీ విద్యా దీవెన |
స్కాలర్షిప్ టైప్ | విదేశీ విద్యకు ఆర్థిక సాయం |
ఎవరికి అందిస్తారు | ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, కాపు |
అర్హుత | కుటుంబ ఆదాయం 8 లక్షలలోపు |
దరఖాస్తు చివరి తేదీ | 30 సెప్టెంబర్ 2022 |
ఈ పథకం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 200 యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే అందిస్తున్నారు. 100 లోపు ర్యాంకు కలిగిన యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కోర్సు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. 101 -200 మధ్య యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు 50శాతం ఫీజు లేదా గరిష్టంగా 50 లక్షల వరకు చెల్లిస్తారు.
8 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉండే విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 35 ఏళ్లలోపు ఉండాలి. విదేశాల్లో ఉన్నత విద్య చేయాలనే నిరుపేద విద్యార్థుల కలను ఈ పథకం నిజం చేయనుంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, పిలిప్పీన్స్, సింగపూర్ వంటి దేశాలలో మానేజ్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు జగనన్న విదేశీ విద్యా దీవెన అవకాశం కల్పిస్తుంది.
ఈ పథకం కింద దరఖాస్తు చేసే అభ్యర్థులు చెల్లిబాటు అయ్యే పాసుపోర్టు, వీసా కలిగి ఉండాలి. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే యూనివర్సిటీ ప్రవేశ పరీక్షా లేదా టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జీమ్యాట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలలో అర్హుత సాధించి ఉండాలి. విదేశీ విద్య సాయం విద్యార్థి జాయిన్ అయ్యే యూనివర్సిటీ, దేశం మరియు కోర్సుపైన ఆధారపడి ఉంటుంది. ఈ సాయాన్ని రెండు దశలలో అందజేస్తారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ఎలిజిబిలిటీ
- 8 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, కాపు, మైనారిటీ కులాలకు చెందిన విద్యార్థులు.
- అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
- దరఖాస్తు చేసే అభ్యర్థి చెల్లిబాటు అయ్యే పాసుపోర్టు, వీసా కలిగి ఉండాలి.
- అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో అర్హుత పొంది ఉండాలి.
- టోఫెల్, ఐఇఎల్టిఎస్ మరియు జిఆర్ఇ, జీమ్యాట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలలో అర్హుత సాధించి ఉండాలి.
జగనన్న విదేశీ విద్యా దీవెన దరఖాస్తు ప్రక్రియ
ప్రభుత్వ ఏటా 1000 మంది నిరుపేద విద్యార్థులను విదేశీ విద్యకోసం ఇతర దేశాలకు పంపించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. అర్హుత ఉండే అభ్యర్థులు ప్రభుత్వ జన్మభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అర్హుత పరీక్షా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి, తద్వారా ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తారు. సరిఫికేట్ వెరిఫికేషన్'కు అభ్యర్థులు ఈ క్రింది వాటితో హాజరవ్వాల్సి ఉంటుంది.
అవసరమయ్యే సర్టిఫికెట్లు
టెన్త్ సర్టిఫికెట్ / మీసేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేటెడ్ | పాసుపోర్టు |
తెల్ల రేషన్ కార్డు / మీసేవ ఆదాయ ధ్రువపత్రం | జిఆర్ఇ/జిమాట్ పాస్ కార్డు |
క్యాస్ట్ సర్టిఫికెట్ | టోఫెల్/ ఐఇఎల్టిఎస్ స్కోర్ కార్డు |
పాస్ సర్టిఫికెట్ / ఫ్రొవిజనల్ మార్క్ షీట్ | వీసా |
ఐ-20 డాక్యుమెంట్ | విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ |