ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్టడీ సర్కిల్ పంపకం సంబంధించి ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఏపీ స్టడీ సర్కిల్ ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర విభజన ఒప్పందలకు లోబడి రెండు తెలుగు రాష్ట్రల విద్యార్థులకు సమానంగా సేవలు అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతిలో ఈ స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని డా బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పేరుతో నడుపుతున్నారు. ఈ సెంటర్లలో అర్హులైన అభ్యర్థులకు పూర్తి రెసిడెన్సియల్ పద్దతిలో పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు.
పథకం పేరు | ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ |
స్కాలర్షిప్ టైప్ | పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ |
ఎవరికి అందిస్తారు | ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు |
అర్హుత | ఆరు లక్షలలోపు కుటుంబ ఆదాయం |
ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే, డిఫెన్స్, డీఎస్సీ వంటి రాష్ట్ర, జాతీయ స్థాయి నియామక పరీక్షలకు పూర్తి ఉచితంగా రెసిడెన్సియల్ టైపు శిక్షణ అందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఏపీ స్టడీ సర్కిల్ పేరుతో కేవలం యూపీఏసీ పరీక్షలకు సంబంధించి మాత్రమే శిక్షణ అందించే ఈ ప్రోగ్రామ్, ప్రస్తుతం దాదాపు అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తుంది.
ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందే విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటుగా ఉచిత వసతి కూడా కల్పిస్తుంది. అంతే లేకుండా సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రతినెల 2,250/- రూపాయల వరకు స్టైపెండ్ అందిస్తుంది.
వీటికి అదనంగా ఎన్‌సిఈఆర్‌టి స్టాండర్డ్ మెటీరియల్స్, పర్సనల్ అలోవెన్సు కింద పురుషులకు 750/-, మహిళకు రూ 1000/- లతో పాటుగా 200 వరకు మెడికల్ అలోవెన్సు కుండా అందిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు సరిపోయేలా గరిష్టంగా 10 నెలలు కోచింగ్ అందిస్తారు.
ఏపీ స్టడీ సర్కిల్ ఎలిజిబిలిటీ
- గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత
- వయస్సు 21 నుండి 35 ఏళ్ళ మధ్య ఉండాలి
- కుటుంబ ఆదాయం ఆరు లక్షలలోపు ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ స్టడీ సర్కిల్ దరఖాస్తు
ఏపీ స్టడీ సర్కిల్ అడ్మిషన్లు ఏటా జులై మరియు ఆగష్టు నెలలో నిర్వహిస్తారు. వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్ అనుసారం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సంబంధించి ఆయా పరీక్షలలో ఏపీ నుండి అర్హుత పొంది ఉండాలి.
ఏపీ స్టడీ సర్కిల్ సంబంధించిన నోటిఫికేషన్ మీకు స్థానిక వార్త పత్రికల్లో మరియు న్యూస్ ఛానెళ్లలో ప్రచురిస్తారు. నోటిఫికేషన్ అనుసారం ఏపీ స్టడీ సర్కిల్ పోర్టల్ ద్వారా సంబంధిత పోటీపరీక్ష శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సంఖ్యను బట్టి, అర్హుత పరీక్ష లేదా అభ్యర్థి అకాడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులను గుర్తించి ఉచిత శిక్షణ మరియు వసతి అందిస్తారు.
Please give chance stady circle plzz sir
https://apstdc.apcfss.in/ యందు సంప్రదించండి. సివిల్స్, గ్రూప్ 1, 2 సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. దాని గడువు కూడా ముగిసించి.