ఇండియాలో అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు | ఐసీఏఆర్ ఎగ్జామ్స్
Admissions Agriculture Exams

ఇండియాలో అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు | ఐసీఏఆర్ ఎగ్జామ్స్

దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలు మరియు అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్లలో అగ్రికల్చర్ యూజీ మరియు పీజీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల పూర్తి సమాచారం ఇక్కడ పొందండి. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే పరీక్షలతో పాటుగా వివిధ ప్రైవేట్ మరియు డ్రీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించే పరీక్షలు కూడా ఉన్నాయి

ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ ఎగ్జామ్

AIEEA UG - Exam Date, Eligibility, Registrationఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీలల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసీఏఆర్ ఏఐఈఈఏ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్" అని అర్ధం.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. దేశంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలన్ని ఐసీఏఆర్ కనుసన్నలలో పనిచేస్తాయి.

ఐసీఏఆర్-ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్ డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి.

వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది. ఏఐఈఈఏ యూజీ పరీక్ష ద్వారా 2784 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో 2189 సీట్లు 59 ఐసీఏఆర్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో భర్తీచేస్తారు.

ఐసీఏఆర్ ఏఐఈఈఏ పీజీ ఎగ్జామ్

AIEEA PG - Exam Date, Eligibility, Registrationఐసీఏఆర్-ఏఐఈఈఏ పీజీ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిరవహిస్తారు. ఐసీఏఆర్-ఏఐఈఈఏ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్ అని అర్ధం.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. దేశంలో ఉన్నా అగ్రికల్చర్ యూనివర్సిటీలన్ని ఐసీఏఆర్ కనుసన్నలలో పనిచేస్తాయి.

ఐసీఏఆర్-ఏఐఈఈఏ ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్  డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది.

ఐసీఏఆర్ ఏఐసీఈ ఎగ్జామ్

ICAR AICE - Exam Date, Eligibility, Registrationఐసీఏఆర్ ఏఐసీఈ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసీఏఆర్ ఏఐసీఈ "ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్" అని అర్ధం. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి.

ఐసీఏఆర్ ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్ డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది.

ఏపీ ఈఎపీసెట్ ఎగ్జామ్

AP EAPCET Notification And Scheduleఏపీ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల యందు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈఏపీసెట్ అనగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ పార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

డిపార్టుమెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో కాకినాడ జేఎన్టీయూ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్-ఫార్మసీ పేరుతొ వేర్వేరుగా జరిగే ఈ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో అందుబాటులో ఉంటుంది. పూర్తి ఆన్‌లైన్‌(CBT) విధానంలో జరిగే ఈ పరీక్షలో 160 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు 3 గంటల నిడివిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్

TS EAMCET Notification And Scheduleటీఎస్ ఎంసెట్ 2023 పరీక్షను తెలంగాణాలోని యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల యందు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. టీఎస్ ఎంసెట్‌ను జవాహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరపబడుతుంది. తెలంగాణ ఎంసెట్‌కు ఏటా రెండు లక్షల నుండి మూడు లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

ఎంసెట్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్-ఫార్మసీ పేరుతొ వేర్వేరుగా జరిగే ఈ పరీక్ష, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుంది. పూర్తి ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షలో 160 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు 3 గంటల నిడివిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

టీఎస్ అగ్రిసెట్ & అగ్రి ఇంజనీరింగ్ సెట్

TS AGRICET - Dates, Registration, Application, Eligibilityహైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ అగ్రికల్చర్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

అగ్రి ఇంజనీరింగ్ సెట్ ద్వారా బీటెక్ అగ్రికల్చర్ కోర్సుల యందు ప్రవేశాలు కల్పిస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి మొత్తం 71 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి మొత్తం 8 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

Post Comment