ఇండియాలో టాప్ మెడికల్ ప్రవేశ పరీక్షల వివరాలు పొందండి. సెంట్రల్ & స్టేట్ మెడికల్ యూనివర్సిటీలు మరియు మెడికల్ ఇనిస్టిట్యూట్లలో మెడికల్ యూజీ మరియు పీజీ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే నీట్ యూజీ, నీట్ పీజీ, నీట్ ఎండిఎస్, ఏఎఫ్ఎంసీ, ఏఐఏపీజీసెట్, జిప్‌మర్, ఎయిమ్స్ వంటి మెడికల్ యూజీ మరియు పీజీ ప్రవేశ పరీక్షల పూర్తి సమాచారం పొందండి.
నీట్ యూజీ ఎగ్జామ్
నీట్ (యూజీ) అనగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేషన్) అని అర్ధం. నీట్ (యూజీ) పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో మొదటి ఏడాది ఎంబీబీస్ మరియు బీడీఎస్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు గవర్నమెంట్ అఫ్ ఇండియా కనుసన్నలల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులు ఎయిమ్స్ మరియు జిప్మెర్ సహా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ లేదా డెంటల్ కౌన్సిల్ అనుమతితో నడుస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు. కెరీర్ పరంగా వైద్యరంగంలో స్థిరపడాలనే ఆశయాన్ని చేరువ చేసే ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
నీట్ పీజీ ఎగ్జామ్
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ), మాస్టర్స్ ఇన్ సర్జరీ (ఎంఎస్) మరియు ఇతర మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు చేపట్టేందుకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తారు. ఎంబీబీఎస్ పూర్తిచేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నీట్ పీజీ పరీక్ష సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 30 నిముషాలు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 3 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 50 ప్రశ్నలు, పార్ట్ B లో 50 ప్రశ్నలు మరియు పార్ట్ C 100 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
నీట్ ఎండీఎస్ ఎగ్జామ్
మాస్టర్స్ ఆఫ్ డెంటల్ సైన్స్ (MDS) కోర్సులలో ప్రవేశాలు చేపట్టేందుకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ నీట్ ఎండీఎస్ పరీక్షను నిర్వహిస్తుంది. బిడీఎస్ పూర్తిచేసి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటు ద్వారా ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ట్ ఎండీఎస్ పరీక్ష సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్ష నిడివి 3 గంటలు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 240 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 2 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 100 ప్రశ్నలు, పార్ట్ B లో 140 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్
ఫెలోస్ ఆఫ్ నేషనల్ బోర్డు (ఎఫ్ఎన్‌బీ) కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎఫ్‌ఈటీ) నిర్వహించబడుతుంది. ఈ టెస్టు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్‌బీఈ దేశ వ్యాప్తంగా దాదాపు 700 పైగా హాస్పిటళ్లలో 80 పైగా మెడికల్ విభాగాల్లో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఈ 700 హోస్పిటళ్లలో ఎన్‌బీఈ గుర్తింపు కలిగిన 9500 పైగా డీఎన్‌బీ & ఎఫ్ఎన్‌బీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎఫ్ఎన్‌బీ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఎన్‌బీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం కోర్సులలో ఏదోకటి పూర్తిచేసి ఉండాలి. ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్టులో అభ్యర్థులు చూపిన మెరిట్ ఆధారంగా ఎఫ్ఎన్‌బీ కోర్సుల కోసం ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రాం అందిస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వివిధ సందర్భాలలో అభ్యర్థులు చూపే ప్రతిభను నమోదుచేస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఏటా జరిగే నేషనల్ బోర్డు ఎగ్జామినేషన్ కాన్వాకేషన్ లో ఎఫ్ఎన్‌బీ ఫెలోషిప్ అవార్డు అందజేస్తారు.
డీఎన్‌బీ పీడీసెట్
డీఎన్‌బీ సెకండరీ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు - పోస్ట్ డిప్లొమా సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఎన్‌బీ పీడీసెట్) నిర్వహిస్తారు. ఈ కోర్సుల నిడివి రెండేళ్లు ఉంటుంది. సంబంధిత స్పెషలైజ్షన్లో మెడికల్ పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటు నుండి గడువులోపు దరఖాస్తు చేసుకోండి.
ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్
విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ విద్యార్థులు మరియు ఎన్ఆర్ఐ విద్యార్థుల అర్హుతను నిర్ణహించేందుకు ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
విదేశాలలో పూర్తిచేసిన వైద్య డిగ్రీ ఇండియాలో చెల్లుబాటు కావాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాలి. మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసేందుకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్లో తప్పక అర్హుత సాదించాలి. ఈ స్క్రీనింగ్ టెస్టును నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తుంది.