స్వదేశీ చదువులకే కుటుంబ బడ్జెట్లు పరిధిని దాటుతుంటే విదేశీ విద్య గురించి ఇంకా వేరే చెప్పాలా. అందులోనా అమెరికాలో ఉన్నత విద్య అంటే ఇక్కడ ఖర్చు చేసే ప్రతీ రూపాయాకు సుమారు 75 చే గుణించాలి. F1 వీసా ద్వారా యూఎస్ వెళ్లే విద్యార్థులకు వారానికి 20 గంటలు కంటే ఎక్కువ జాబ్ చేసే అవకాశం ఉండదు.
అది కూడా రెండవ ఏడాది నుండి అనుమతిస్తారు. దీనిబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ / గ్రాడ్యుయేషన్ పూర్తిచేసేందుకు అవసరమయ్యే మోత్తం ఖర్చులు చెల్లించేందుకు విద్యార్థి సిద్ధంగా ఉండాలి. ఇందులో ట్యూషన్ ఫీజులతో పాటుగా వసతి, ఫుడ్, ట్రావెలింగ్, హెల్త్ వంటి ఇతర ఖర్చులు ఉంటాయి.
యూఎస్ స్టూడెంట్ వీసా ఖర్చులు
F1 స్టూడెంట్ వీసా, M1 స్టూడెంట్ వీసా, J1 ఎక్స్చేంజి వీసా దరఖాస్తు ఫీజు $ 160 డాలర్లు ఉంటుంది. దీనితో పాటుగా Student and Exchange Visitor Information System (SEVIS) రిజిస్ట్రేషన్ ఫీజు $ 350 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు రుసుములు కలుపుకుంటే $ 510 డాలర్లు అవుతుంది. వీటితో పాటుగా అదనపు రుసుములు ఉంటాయి.
F1, M1, J1 దరఖాస్తు ఫీజు | $ 160 డాలర్లు |
SEVIS రిజిస్ట్రేషన్ ఫీజు | $ 350 డాలర్లు |
మొత్తం | $ 510 డాలర్లు |
యూఎస్ ట్రావెలింగ్ ఖర్చులు
యూఎస్ ట్రావెలింగ్ ఖర్చులు మనం ప్రయాణించే సీజన్, టిక్కెట్ బుకింగ్ సమయం, ఎంపిక చేసుకున్న విమానయాన సంస్థ, వెళ్లే యుఎస్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రయాణ తేదికి 60 రోజుల ముందు బుక్ చేసే టిక్కెట్ చార్జీలు, ప్రయాణానికి కొద్దిరోజుల ముందు బౌల్ చేసే టిక్కెట్ చార్జీల కంటే తక్కువ ఉంటుంది.
సాధారంగా ఢిల్లీ నుండి అమెరికాకు పోయే విమానాల టిక్కెట్లు రుసుములు 35 వేల నుండి 80 వేల వరకు ఉంటుంది. కానీ ఆగష్టు మరియు సెప్టెంబర్ మధ్య యూఎస్ పోయే విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ సీజన్లో ప్రయాణ ఖర్చులు తడిచి మోపుడు అవుతాయి.
AUG - September | Really Expensive (Lots of students travel for MS) |
MAY- June | Expensive (Indian Summer Holidays) |
December | Really Expensive (Christmas travel) |
యూఎస్ యూనివర్సిటీల ట్యూషన్ ఫీజులు
యూఎస్ లో రెండు రకాల యూనివర్సిటీలను ప్రధానంగా మనం చుడ్డొచ్చు. అందులో ఒకటి పబ్లిక్ / స్టేట్ యూనివర్సిటీలు కాగా మిగతావి ప్రైవేట్ యూనివర్సిటీలు. పబ్లిక్ యూనివర్సిటీలతో పోల్చుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీ చదువులు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. అదే విధంగా సోషల్ సైన్సెస్ కోర్సుల కంటే ఇంజనీరింగ్, మెడిసిన్, మానేజ్మెంట్ కోర్సులకు అధిక ఫీజులు ఉంటాయి.
అండర్ గ్రాడ్యుయేషన్ కంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ఫీజులు అధిక మొత్తంలో ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల ఫీజులు $20,000 to $40,000 డాలర్ల మధ్య ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు $20,000 to $45,000 డాలర్ల వరకు ఉండొచ్చు.
Private Universities | Around $ 60,000 per year |
Public Universities (In States ) | Around $26,290 - $35,830 |
Public Universities (Out of States ) | Around $10.000 - $20,000 |
English language studies | Around $700 to $2,000 PM |
Community colleges | Around $6,000 to $20,000 per year |
యూఎస్ వసతి & జీవన వ్యయాలు
విదేశీ విద్యార్థుల కోసం దాదాపు అన్ని యూనివర్శిటీలు తమ క్యాంపస్ యందు వసతి సదుపాయం కల్పిస్తాయి. పరిమిత ఫీజులతో అందించే ఈ వసతిని ఉపయోగించుకోవడం ఉత్తమం. క్యాంపస్ బోర్డింగ్ ఇష్టం లేని వారు రూమ్స్ లేదా అపార్టుమెంట్స్ లో ఉండాల్సి వస్తుంది. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
ఐదు నుండి పది మంది విద్యార్థులు జతకట్టడం ద్వారా ఈ ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ ఖర్చులు కూడా ఉండే ప్రాంతాన్ని బట్టి, ఉండే అపార్టుమెంట్ అనుచరించి ఏడాదికి 6000 డాలర్ల నుండు 40 వేల డాలర్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒంటిగా ఉండే విద్యార్థులు క్యాంపస్ బోర్డింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ఉత్తమం.
ఇతర ఖర్చులు
ఇకపోతే ఫుడ్, విద్య సంబంధిత ఇతర ఖర్చులు, వినోదపు ఖర్చులు, యూనివర్సిటీ బయట ఉంటే ట్రావెలింగ్ ఖర్చులు, హెల్త్ కు సంబంధించి పెట్టె ఖర్చులు వంటి ఇతర జీవన వ్యయాలు ఉండనే ఉంటాయి. వీటికి ఎలా లేదన్న ఏడాదికి 10 వేల నుండి 20 వేల డాలర్ల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది.
మీరు సొంత ఖర్చులతో వెళ్తున్న లేదా విద్యా రుణం సహాయంతో సిద్దమౌతున్నా.. ఈ అన్నిటా ఖర్చులను కవర్ చేసే ఆర్థిక నిధిని పక్కాగా అంచనా వేచుకోవాలి. దేశం విడిచే ముందు వీటికి సంబంధించి పూర్తి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, దానికి తగ్గ ఏర్పాటు చేసుకుని మీ విదేశీ ఉన్నత విద్య డ్రీమ్ నిజం చేసుకోండి.
Food | $2000 - $3000 |
Clothes and footwear | $1000- $1500 |
Books and Stationery | $1000- $1500 |
Health | $ 500 |
Entertainment | $ 1000 |
Others | $ 3000 |