టీఎస్ ఈఏపీసెట్ 2024 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions TS CETs

టీఎస్ ఈఏపీసెట్ 2024 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

టీఎస్ ఈఏపీసెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ వెలువడింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ పరీక్షను మే 9వ తేదీ నుండి మే 12వ తేదీల మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసారు. ఇది వరకు టీఎస్ ఎంసెట్ పేరుతొ నిర్వహించే ఈ పరీక్షను ఈ ఏడాది నుండి టీఎస్ ఈఏపీసెట్ పేరుతొ నిర్వహిస్తున్నారు. టీఎస్ ఈఏపీసెట్ అనగా తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ పార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం.

టీఎస్ ఈఏపీసెట్ 2024

Exam Name TS EAPCET 2024
Exam Type Entrance Exam
Exam For Admission for Engineering & Agriculture
Exam Date 09-12 May 2024
Exam Duration 3 Hours
Exam Level State Level (Telangana)
  • టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షను తెలంగాణాలోని యూనివర్సిటీలు మరియు టెక్నికల్ ఇనిస్టిట్యూట్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల యందు మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.
  • టీఎస్ ఈఏపీసెట్ 2024 జవాహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరపబడుతుంది.
  • తెలంగాణ ఎంసెట్‌కు ఏటా రెండు లక్షల నుండి మూడు లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
  • టీఎస్ ఈఏపీసెట్ 2024 తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుంది.
  • పూర్తి ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షలో 160 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలకు 3 గంటల నిడివిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

టీఎస్ ఈఏపీసెట్ 2024 సమాచారం

టీఎస్ ఈఏపీసెట్ 2024 ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు

ఇంజనీరింగ్ కోర్సులు అగ్రికల్చర్ కోర్సులు
బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ & బయోటెక్నాలజీ
బయోటెక్నాలజీ వెటర్నరీ సైన్స్ & ఫుడ్ టెక్నాలజీ
బీటెక్ (డెయిరీ టెక్నాలజీ ) బీఎస్సీ హార్టీ కల్చర్ & ఫారెస్ట్రీ
బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) బ్యాచిలర్ అఫ్ ఫిషరీ సైన్స్
బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ యానిమల్ హుస్బెండరీ
బీఫార్మసీ & ఫార్మాడీ బీఫార్మసీ & ఫార్మాడీ

ఎంబీబీస్, బీడీఎస్, హోమియోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్ వంటి మెడికల్ కోర్సుల ప్రవేశాలు జాతీయ స్థాయిలో జరిగే నీట్ ప్రవేశపరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయి.

టీఎస్ ఈఏపీసెట్ 2024 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. భారతీయ మూలాలు కలిగిన విదేశీయలు(PIO) మరియు విదేశాల్లో స్థిరపడిన భారతీయలు (OCI) కూడా అర్హులు.
  • ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణా సంబంధించిన విద్యార్థులు లోకల్ లేదా నాన్ లోకల్ సంబంధిత అర్హుత నిమయాలు సంతృప్త పరచాలి.
  • ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తు చేసేవారు మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తిచేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • అగ్రికల్చర్ మరియు మెడికల్ కోర్సుల ప్రవేశాలకోసం దరఖాస్తు చేసేవారు బోటనీ, జువాలజీలు ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తిచేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగా ఒకేషనల్ మరియు రెండేళ్ల డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • ఇంజనీరింగ్ మరియు ఫార్మా కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 16 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
  • అగ్రికల్చర్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 17 ఏళ్ళు నుండి 22 ఏళ్ళ మధ్య ఉండలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది.

టీఎస్ ఈఏపీసెట్ 2024 షెడ్యూల్

దరఖాస్తు పార్రంభం 26 ఫిబ్రవరి 2024
దరఖాస్తు చివరి తేదీ 06 ఏప్రిల్ 2024
చేర్పులు మార్పులు 07 ఏప్రిల్ 2024
హాల్ టికెట్ మే 2024
టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీ 09 - 12 మే 2024
టీఎస్ ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 2024
టీఎస్ ఈఏపీసెట్ కౌన్సిలింగ్ జులై 2024
టీఎస్ ఈఏపీసెట్ ఎగ్జామ్ టైమింగ్ 09:00 AM TO 12:00 PM
03:00 PM TO 06:00 PM

టీఎస్ ఈఏపీసెట్ 2024 దరఖాస్తు ఫీజు

పరీక్ష పేపర్ జనరల్ కేటగిరి ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు
ఇంజినీరింగ్ (E) 900/- 500/-
అగ్రికల్చర్ (A) 900/- 500/-
ఇంజనీరింగ్ & అగ్రికల్చర్ (E & A) 1800/- 1,000/-
  • 250/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: -
  • 500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: -
  • 2500/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: -
  • 5000/- అపరాధ రుసుము తో దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ: -

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

టీఎస్ ఈఏపీసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ

టీఎస్ ఈఏపీసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. తెలంగాణ అధికారిక ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (ఇంటర్మీడియట్)
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అడిగిన వివరాలు పూరించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు టీఎస్ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సగం దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం కల్పిస్తుంది.

ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాక విద్యార్థి యొక్క ప్రాథమిక వివరాలు దరఖాస్తులో ఆటోమేటిక్ పద్దతిలో నింపబడతాయి. ఏవైనా మార్పులు ఉంటె విద్యార్థికి సవరించుకునే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత దశలో పరీక్ష పేపర్ ఎంపిక, మీడియం ఎంపిక, పరీక్ష కేంద్రం ఎంపిక వంటివి అభ్యర్థి పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరిగా సంబంధిత ధ్రువపత్రాలు అప్లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

టీఎస్ ఈఏపీసెట్ జిల్లాల వారీగా రీజనల్ పరీక్ష కేంద్రాలు

  • హైదరాబాద్ సెంట్రల్ : అబిడ్స్, నాచారం, సికింద్రాబాద్. మౌలాలీ, ఓల్డ్ ఆల్వాల్
  • హైదరాబాద్ ఈస్ట్ : ఔషాపుర్, బొడొప్పల్, చర్లపల్లి IDA, ఘట్కేసర్, కీసర, కొర్రెముల, ఉప్పల్. హయత్ నగర్, నాగోల్, ఇబ్రహీంపట్నం, కర్మాంఘాట్, ఎల్బీ నగర్, నాదర్గుల్, రామోజీ ఫిల్మ్ సిటీ
  • హైదరాబాద్ నార్త్ : దుండిగల్, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ ఆల్వాల్.
  • హైదరాబాద్ సౌత్:  శంషాబాద్.
  • హైదరాబాద్ వెస్ట్ : హాఫీజ్పేట్ హిమాయత్నగర్, బాచుపల్లి, కూకట్పల్లి, గండిపేట, షైక్పేట్, మొయినాబాద్.
  • నల్గొండ : నల్గొండ, కోదాడ. సూర్యాపేట్
  • ఖమ్మం : ఖమ్మం, సత్తుపల్లి, పాలవొంచా.
  • కరీంనగర్ : జిగిత్యాల్, కరీంనగర్, మంథాని.
  • మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్, కుర్నూల్.
  • మెదక్ : నర్సాపూర్, సుల్తాన్పూర్, పటాన్చెరు, రుద్రారం, సిద్దపేట.
  • ఆదిలాబాద్ : ఆదిలాబాద్.
  • నిజామాబాద్: ఆర్మూర్, నిజామాబాద్.
  • వరంగల్ : వరంగల్, హనుముకొండ. హాసనపర్తి, నర్సంపేట
  • ఆంధ్రప్రదేశ్ : విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. కర్నూలు, గుంటూరు

టీఎస్ ఈఏపీసెట్ 2024 ఎగ్జామ్ నమూనా

టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్ష పూర్తి ఆన్‌లైన్‌ (CBT) విధానములో కంప్యూటర్ ఆధారంగా నిర్వహించబడుతుంది. మూడు గంటల కాలవ్యవధిలో 160 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. పరీక్ష నిర్ణహించిన తేదీల్లో రెండు సెషన్లలో జరుగుతుంది.

మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరపబడుతుంది. ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారికి ఒకే రోజు రెండు సెషన్లలో పరీక్ష పూర్తివుతుంది.

ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి జరిగే ప్రశ్నపత్రంలో మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీల నుండి 160 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో మ్యాథ్స్ నుండి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలు మరియు కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలు వచ్చే విదంగా పేపర్ కూర్పు ఉంటుంది. సమయం 3 గంటలు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

అగ్రికల్చర్ ప్రవేశాలకు సంబంధించి జరిగే ప్రశ్నపత్రంలో బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీల నుండి 160 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇందులో బోటనీ నుండి 40 ప్రశ్నలు, జూవాలజి నుండి 40 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలు మరియు కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలు వచ్చే విదంగా పేపర్ కూర్పు ఉంటుంది. సమయం 3 గంటలు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
మ్యాథమెటిక్స్/బయాలజీ 80 ప్రశ్నలు 80 మార్కులు 3 గంటలు
ఫిజిక్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు
కెమిస్ట్రీ 40 ప్రశ్నలు 40 మార్కులు
160 ప్రశ్నలు 160 మార్కులు

టీఎస్ ఈఏపీసెట్ 2024 క్వాలిఫై మార్కులు & ర్యాంకింగ్ విధానం

టీఎస్ ఈఏపీసెట్ 2024 పరీక్షలో 25 శాతంకు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులందరిని ర్యాంకింగు కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు యెటువంటి క్వాలిఫై మార్కులు లేవు. ఎంసెట్ హాజరైన వారందరికీ వారి కోటా అనుసారం ప్రవేశాలు కల్పిస్తారు.

ఇకపోతే టీఎస్ ఈఏపీసెట్ మార్కుల లెక్కింపు నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వివిధ సెషన్లలో అభ్యర్థులకు వచ్చిన మార్కులును నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి కేటగిరి వారీగా, అర్హుత నిబంధలను అనుచరించి తుది మెరిట్ జాబితా తయారుచేస్తారు. అభ్యర్థుల తుది ర్యాంకుల ప్రకటన ఎంసెట్ మరియు ఇంటర్మీడియట్ లో వారు సాధించిన మార్కుల ఆధారంగా వెలువడుతుంది.

75శాతం టీఎస్ ఈఏపీసెట్ వెయిటేజీని మరియు 25 శాతం ఇంటర్మీడియేట్ వెయిటేజీని ఆధారంగా చేసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటన జరిగిన ఇది పది రోజుల్లో ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ లో ర్యాంకు కార్డుతో పాటు కౌన్సిలింగ్ షెడ్యూల్ అందుబాటులో ఉంచబడుతుంది.

Eamcet-normalization-formula

Where,
SASD: Sum of Average (A) and Standard Deviation (SD) of the subject of a session in which the candidate appeared.
GASD: Sum of Average (A) and Standard Deviation (SD) of all the candidates across all sessions of the subject put together.
STA: Average mark of the top 0.1% of the candidates in the subject of a session in which the candidate appeared.
GTA: Average mark of the top 0.1% of all the candidates across all the sessions of the subject put together.

టీఎస్ ఈఏపీసెట్ 2024 అగ్రికల్చర్ సిలబస్ టీఎస్ ఈఏపీసెట్ 2024 రిజిస్ట్రేషన్ లింక్
టీఎస్ ఈఏపీసెట్ 2024 ఇంజనీరింగ్ సిలబస్ టీఎస్ ఈఏపీసెట్ 2024 మాక్ టెస్ట్ 

Post Comment