టీఎస్ సీపీగెట్ 2023 నోటిఫికేషన్ : ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ, కౌన్సిలింగ్
Admissions TS CETs University Entrance Exams

టీఎస్ సీపీగెట్ 2023 నోటిఫికేషన్ : ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ, కౌన్సిలింగ్

సీపీగెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ అడ్మిషన్ టెస్ట్ ద్వారా డిగ్రీ, బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆయా పీజీ కోర్సులలో ప్రవేశాలు పొందొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సీపీగెట్ 2023 పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన మరియు జెఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలలో పీజీ, పీజీ డిప్లొమా మరియు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.

Exam Name CPGET 2023
Exam Type Admission Test
Admission For PG Courses
Exam Date June 2023
Exam Duration 90 Minutes
Exam Level State Level

టీఎస్ సీపీగెట్ ద్వారా ప్రవేశాలు పొందే యూనివర్సిటీలు

తెలంగాణ పీజీ ఎంట్రన్స్ టెస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 ప్రభుత్వ యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ పీజీ కళాశాలలో ఎంఎస్సీ, ఎంఏ, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల యందు ప్రవేశాలు కల్పిస్తారు.

  • ఉస్మానియా యూనివర్సిటీ
  • శాతవాహన యూనివర్సిటీ
  • జెఎన్టీయూ హైదరాబాద్
  • తెలంగాణ యూనివర్సిటీ
  • కాకతీయ యూనివర్సిటీ
  • మహాత్మ గాంధీ యూనివర్సిటీ
  • పాలమూరు యూనివర్సిటీ
  • తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం

టీఎస్ సీపీగెట్ 2023 ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతయి ఉండాలి. చివరి ఏడాది పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేందుకు అర్హులు
  • స్కాలర్షిప్ పొందేందుకు ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థుల గరిష్ట వయసు 34 ఏళ్ళు, ఈడబ్ల్యూఎస్, మైనారిటీస్ మరియు అంగవైకుల్యం ఉన్న అభ్యర్థుల వయసు 30 ఏళ్ళు మించకూడదు.
  • ఇంతకు ముందు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు స్కాలర్షిప్, హాస్టల్ వసతి సౌలభ్యలకు అనర్హులు.
  • లాంగ్వేజ్ స్పెషలైజషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో ఇవ్వబడతాయి.
  • ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించని కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ అనుచరించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • బీకామ్ అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్ కోర్సుకు దరఖాస్తు చేసేందుకు అనర్హులు
  • ఎంఏ లాంగ్వేజ్ కోర్సులకు బీఈ, బీటెక్, బీఫార్మసీ అభ్యర్థులు అనర్హులు
  • బీఈ, బీటెక్, బీఫార్మసీ అభ్యర్థులు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేరేందుకు అనర్హులు

టీఎస్ సీపీగెట్ 2023 ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ 12 మే 2023
దరఖాస్తు చివరి తేదీ 11 జూన్ 2023
పరీక్ష తేదీ జూన్ చివరి వారంలో
ఫలితాలు జులై 2023
కౌన్సిలింగ్ జులై 2023

టీఎస్ సీపీగెట్ ఎగ్జామ్ ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

  • జనరల్ అభ్యర్థులు ఒక్కో పేపరుకు : 800/-
  • ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు : 600/-
  • అదనంగా ఒక్కో పేపరుకు : 450/-
హైదరాబాద్ వెస్ట్ (కూకట్పల్లి, పటాన్ చెరువు చుట్టు ప్రక్కల ) హైదరాబాద్ ఈస్ట్ (మల్లాపూర్, ఘట్కేసర్  చుట్టూరా)
హైదరాబాద్ నార్త్ (మెడ్చెల్, గాండిమైసమ్మ చుట్టూరా ) హైదరాబాద్ సౌత్ (ఎల్.బి.నగర్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్)
ఆదిలాబాద్ కరీంనగర్
ఖమ్మం కోదాడ
నల్గొండ మహాబుబ్‌నగర్
వరంగల్ నిజామాబాద్

టీఎస్ సీపీగెట్ 2023 దరఖాస్తు

టీఎస్ సీపీగెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఉస్మానియా  అధికారిక వెబ్సైటు (www.pget.tsche.ac.in) ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో కోరిన వ్యక్తిగత, విద్య వివరాలు తప్పులు దొర్లకుండా నింపాలి.

ఉత్తీర్ణత సాధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్, ఇతర ధ్రువపత్రాలు దరఖాస్తు చేసే సమయంలో అందుబాటులో ఉంచుకోండి. వ్యక్తిగత చిరునామా, ఫోన్ నెంబర్ మరియు మెయిల్ అడ్రస్ వివరాలు సక్రమంగా పొందుపర్చండి.

దరఖాస్తు తుది సమర్పణ ముందు పొందుపర్చిన వివరాలు మరోమారు సరిచూసుకోండి. చివరిగా అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించి. దరఖాస్తు ప్రింట్ తీసి భద్రపర్చుకోండి.

టీఎస్ సీపీగెట్ ఎగ్జామ్ నమూనా

టీఎస్ సీపీగెట్ ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబడుతుంది. ఎంపీ.ఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ మినహా మిగతా అన్ని పేపర్లు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 100 మార్కులకు జరుగుతాయి. 100 ప్రశ్నలను 90 నిముషాల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు ఒక మార్కు ఇవ్వబడుతుంది. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. M.P.Ed ఎంట్రన్స్ టెస్ట్  75 ప్రశ్నలతో 75 మార్కులకు జరుగుతుంది. మిగతా 25 మార్కులు ఉస్మానియా యూనివర్సిటీ ఫీజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ అభ్యర్థుల ఫీజికల్ ఆక్టివిటీ ప్రతిభ ఆధారంగా కేటాయిస్తుంది.

ప్రశ్నపత్రం బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో నాలుగు రకాల ప్రశ్నలు ఇమిడిఉంటాయి. అవి సారూప్యతలు, వర్గీకరణ, సరిపోలిక, పరిశోధనా అధ్యయనం / ప్రయోగం / సైద్ధాంతిక దృక్పథం యొక్క గ్రహణశక్తిని పరీక్షించే విదంగా ఉంటాయి.

ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ మరియు మైక్రోబయాలజీ పేపర్లు పార్ట్ A, పార్ట్ B లుగా ఉంటాయి. పార్ట్ A లో కెమిస్ట్రీ నుండి 40 ప్రశ్నలు, పార్ట్ B లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టు (ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ మరియు బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) నుండి 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ఎగ్జామ్ పేపర్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
ఆప్షనల్ పేపర్ 100 100 90 నిముషాలు

టీఎస్ సీపీగెట్ అడ్మిషన్ ప్రక్రియ

వివిధ కేటగిర్ల వారీగా రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరిధికి చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఎస్సీ అభ్యర్థులు 15% శాతం
ఎస్టీ అభ్యర్థులు 8 శాతం
బీసీ కులాలు 29 శాతం
మహిళలు 33% శాతం
NCC, Sports 1 శాతం, 0.5 శాతం

టీఎస్ సీపీగెట్ నియమ నిబంధనలు

  • అడ్మిషన్ పొందిన అభ్యర్థులు యూజీసీ నియమానుసారం ఏడాదిలో 75% హాజరు తప్పనిసరి.
  • అడ్మిషన్ పొందిన మొదటి పది రోజుల్లో అభ్యర్థి సదురు కాలేజీలో హాజరు కాకుంటే ఆ సీటును తప్పించే అధికారం వారికీ ఉంటుంది.
  • రెగ్యులర్ కోర్సులలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ఇతర కోర్సులలో జాయిన్ అవ్వెందుకు, ఉద్యోగాలు చేసేందుకు అనుమతి ఉండదు.
  • ప్రతి సెమిస్టర్ చివరిలో పరీక్షలు నిర్వహించబడతాయి. సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు.
  • ర్యాగింగ్ కార్యకలాపాల్లో పాల్గునే అభ్యర్థులు శిక్షార్హులు.
  • వరుస పది రోజులు క్లాసులకు హాజరుకాని విద్యార్థులు. దానికి సంబంధించి పర్మిషన్ కల్గిఉండాలి.

టీఎస్ సీపీగెట్ ద్వారా అడ్మిషన్ పొందే కోర్సులు

సైన్స్ పీజీ కోర్సులు
ఎంఎస్సీ బోటనీ (61) ఎంఎస్సీ ఫిజిక్స్ (69)
ఎంఎస్సీ కెమిస్ట్రీ (62) ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ (70)
ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ (63) ఎంఎస్సీ జూవాలాజీ (71)
ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ (64) ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్ ససైన్స్/ ఫోరెన్సిక్ సైన్స్/జెనెటిక్స్ /మైక్రోబయాలజీ (72)
ఎంఎస్సీ జియోగ్రఫీ (65) ఎంఎస్సీ బయో టెక్నాలజీ (73)
ఎంఎస్సీ జియో ఇన్ఫర్మాటిక్స్ (66) ఎంఎస్సీ న్యూట్రషన్ & డైటెటిక్స్ (74)
ఎంఎస్సీ జియాలజి (67) ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ (శాతవాహన యూనివర్సిటీ ) (75)
ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ (68) ఎంఎస్సీ సైకాలజీ (కాకతీయ యూనివర్సిటీ) (76)
ఆర్ట్స్ పీజీ కోర్సులు
M.A.  AIHCA (11) M.A. సంస్కృతం  (18)
M.A. అరబిక్ (12) M.A. తెలుగు  (19)
M.A. ఇంగ్లీష్ (13) M.A. ఉర్దూ (20)
M.A. హిందీ (14) M.A. ఇస్లామిక్ స్టడీస్  (21)
M.A. కన్నడ (15) M.A. భాషాశాస్త్రం  (22)
M.A. మరాఠీ (16) M.A. ఫిలాసఫీ (23)
M.A. పర్షియన్ (17) M.A.  థియేటర్ ఆర్ట్ (24)
సోషల్ సైన్సెస్ పీజీ కోర్సులు
M.A.  ఎకనామిక్స్ (31) మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (MHRM) కాకతీయ యూనివర్సిటీ (38)
M.A. హిస్టరీ (33) మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్‌మెంట్ (MTM)  కాకతీయ యూనివర్సిటీ (39)
M.A. జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్(34) M.A. పొలిటికల్ సైన్స్ (40)
 మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (M.Lib.I.Sc.) (2ఏళ్ళు) / B.Lib.I.Sc. (ఏడాది) (35) M.A. సైకాలజీ  (ఉస్మానియా యూనివర్సిటీ) (41)
M.Li.Sc. (ఒక సంవత్సరం) కాకతీయ యూనివర్సిటీ (36) M.A. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్  (43)
మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (M.S.W.) (37) M.A.సోషియాలజీ (43)
కామర్స్ పీజీ కోర్సులు
మాస్టర్ ఆఫ్ కామర్స్ (M.Com ) (51)
ఎడ్యుకేషన్ పీజీ కోర్సులు
M.Ed (మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్) (56)
M.P.Ed (మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) (57)
పీజీ డిప్లొమా కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్  (84)
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు
బయో టెక్నాలజీ  (91)
కెమిస్ట్రీ / ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (92)
ఎకనామిక్స్ (93)
ఎంబీఏ  (94)

Post Comment