రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత,1945 లో ప్రపంచ దేశాలు అన్ని కలిసి ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేసుకున్నాయి. దేశాల మధ్య మరో ప్రపంచ యుద్దానికి అవకాశం లేకుండా ప్రపంచ శాంతి, రక్షణ మరియు ఆర్థిక అభివృద్ధి కోసం అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం వహించగలిగే అత్యంత శక్తివంతమైన ఇంటర్‌గవర్నమెంటల్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. జెనీవా, నైరోబి, వియన్నా మరియు ది హేగ్ లలో దీని ఇతర కార్యాలయాలు కలిగిఉంది. ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి . ఇది ప్రస్తుతం అంతర్జాతీయ శాంతిని పరిరక్షించడం, మానవ హక్కులను పరిరక్షించడం, మానవతా సహాయం అందించడం, సభ్య దేశాలలో స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం మరియు అంతర్జాతీయ చట్టాలను అమలులో ఉండేలా చూడటం వంటి విధులు నిర్వర్తిస్తుంది. వీటికోసం అంశాల వారీగా ప్రపంచవ్యాప్తంగా 15 పరిపాలన ఏజెన్సీలను ఏర్పాటుచేసింది.
యూఎన్ ఏజెన్సీ | సంక్షిప్త రూపం | స్థాపన | ప్రధాన కార్యాలయం |
---|---|---|---|
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ | FAO | 1945 | రోమ్, ఇటలీ |
ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజషన్ | ICAO | 1947 | మాంట్రియల్, క్యూబెక్ |
ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ | IFAD | 1977 | రోమ్, ఇటలీ |
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ | ILO | 1946 (1919) | జెనీవా, స్విట్జర్లాండ్ |
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజషన్ | IMO | 1948 | లండన్ |
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ | IMF | 1945 | వాషింగ్టన్ డిసి |
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ | THAT | 1947 | జెనీవా, స్విట్జర్లాండ్ |
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ | UNESCO | 1946 | పారిస్, ఫ్రాన్స్ |
యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ | UNITED | 1967 | వియన్నా, ఆస్ట్రియా |
వరల్డ్ టూరిజం ఆర్గనైజషన్ | UNWTO | 1974 | మాడ్రిడ్, స్పెయిన్ |
యూనివర్సల్ పోస్టల్ యూనియన్ | UPU | 1947 | బెర్న్, స్విట్జర్లాండ్ |
పవరల్డ్ బ్యాంక్ గ్రూప్ | WBG | 1945 | వాషింగ్టన్ డిసి |
వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ | WHO | 1948 | జెనీవా, స్విట్జర్లాండ్ |
వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజషన్ | WIPO | 1974 | జెనీవా, స్విట్జర్లాండ్ |
వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజషన్ | WMO | 1950 | జెనీవా, స్విట్జర్లాండ్ |