ఎల్‌పీయూ నెస్ట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams

ఎల్‌పీయూ నెస్ట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ బీటెక్ మరియు ఇతర కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ఎల్‌పీయూ నెస్ట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. పరీక్షను ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 30 మధ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్‌పీయూ నెస్ట్ ద్వారా లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ యందు బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటుగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తారు. పంజాబ్ కేంద్రంగా 2005 నుండి విద్య సేవలు అందిస్తున్న లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ దేశంలో అత్యధిక కేటగిర్లలో విభిన్న కోర్సులను అందిస్తున్న ప్రైవేట్ యూనివెర్సిటీగా పేరుగాంచింది.

ఎల్‌పీయూ నెస్ట్ పరీక్షకు ఏటా దాదాపు 50 వేలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో టాప్ మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 40% స్కాలర్షిప్ రూపంలో అందజేస్తారు.

ఎల్‌పీయూ నెస్ట్ 2023

Exam Name LPUNEST 2023
Exam Type Admission
Admission For B.Tech & BE
Exam Date 5-30 April 2023
Exam Duration 90 Minutes
Exam Level University Level

ఎల్‌పీయూ నెస్ట్ వివరాలు

లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్

లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ బీటెక్, బీటెక్ (ఆనర్స్), బీటెక్ డ్యూయల్ డిగ్రీ మరియు బీటెక్ ఇంటిగ్రేటెడ్ రూపంలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది

బీటెక్ (4 ఏళ్ళు )
బీటెక్ ఆనర్స్ (4 ఏళ్ళు)
బీటెక్ + ఎంటెక్ (డ్యూయల్ డిగ్రీ 6 ఏళ్ళు)
బీటెక్ + ఎంటెక్ (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 5 ఏళ్ళు)
బీటెక్ + ఎంబీఏ (డ్యూయల్ డిగ్రీ 6 ఏళ్ళు)
బీటెక్ + ఎంబీఏ (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ 5 ఏళ్ళు)

లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు

ఏరోస్పేస్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
బయో మెడికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
రోబోటిక్స్ & ఆటోమోషన్ ఇంజనీరింగ్
బయోటెక్నాలజీ
ఆటో మొబైల్ ఇంజనీరింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఫుడ్ టెక్నాలజీ
మెకానికల్ ఇంజనీరింగ్
మెకాట్రోనిక్స్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

ఎల్‌పీయూ నెస్ట్ 2023 ముఖ్యమైన తేదీలు

రిజిస్ట్రేషన్ చివరి తేదీ 31 మార్చి 2023
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ 15మార్చి 2023 O/W
ఎల్‌పీయూ నెస్ట్ 5-30 ఏప్రిల్ 2023
ఫలితాలు 5 మే 2023
కౌన్సిలింగ్ 5 మే 2023 OW

ఎల్‌పీయూ నెస్ట్ ఎగ్జామ్ ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు రుసుములు పరీక్ష కేంద్రాలు
Boys : 1,000 /-
Girls : 500/-
విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు, కాకినాడ, కడప, అనంతపురం, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం.

హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్

 

ఎల్‌పీయూ నెస్ట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి
  • 60 శాతం మార్కులతో మ్యాథ్స్/బయాలజీ కాంబినేషనుతో ఇంటర్/10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి
  • అభ్యర్థులు 1జులై 1999 తర్వాత జన్మించి ఉండాలి

ఎల్‌పీయూ నెస్ట్ రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్

ఎల్‌పీయూ నెస్ట్ రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్ కోసం అభ్యర్థులు లవ్లీ యూనివర్సిటీ అధికారిక యూనివర్సిటీ వెబ్సైటును (www.nest.lpu.in/engineering) సందర్శించండి. అప్లికేషన్ యందు మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అదే విధంగా అభ్యర్థి పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

అభ్యర్థి అప్లికేషన్ ఐడీతో పరీక్షకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వివరాలతో వెబ్సైటు లాగిన్ అవ్వగానే అందుబాటులో ఉన్న ఎగ్జామ్ తేదీలు మరియు సమయాలను మీకు సూచిస్తుంది. వాటిలో మీకు అనుకూలంగా ఉండే తేదీని, సమయాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్లాట్ బుకింగ్ పూర్తిచేసే ముందు అక్కడ కనిపించే మీ ప్రొఫైల్ వివరాలు సరిపోలి ఉన్నాయోలేదో గమనించడం మరవకండి. స్లాట్ బుక్ చేసుకున్నాక ప్రవేశ పరీక్షకు సంబందించిన తాజా వివరాల కోసం తరుసు యూనివర్సిటీ వెబ్సైటును సందర్శిస్తూ ఉండండి. www.nest.lpu.in/engineering

ఎల్‌పీయూ నెస్ట్ ఎగ్జామ్ నమూనా

ఎల్‌పీయూ నెస్ట్ ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష 2.30 గంటల నిడివితో 400 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో మొత్తం మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుండి 100 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి.

ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి. వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు. పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ 1 ఫిజిక్స్ 25 100
పార్ట్ 2 కెమిస్ట్రీ 25 100
పార్ట్ 4 మ్యాథ్స్/బయాలజీ 25 100
పార్ట్ 3 ఇంగ్లీష్ & ఆప్టిట్యూడ్ 25 100
మొత్తం 100 400

Post Comment