ఏఐఏపీజీసెట్ 2023 : నోటిఫికేషన్, షెడ్యూల్ & ఎగ్జామ్ తేదీ
Admissions Medical Entrance Exams

ఏఐఏపీజీసెట్ 2023 : నోటిఫికేషన్, షెడ్యూల్ & ఎగ్జామ్ తేదీ

ఆయుర్వేద, యునానీ, సిద్ధా & హోమియోపతి సంబంధించి ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఏఐఏపీజీసెట్ నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్నా ఆయుష్ కాలేజీలు, యూనివర్సిటీలు, డ్రీమ్డ్ వర్సిటీలలో పీజీ అడ్మిషన్లు పొందొచ్చు.

ఆయుష్ కోర్సులుగా పిలుచుకునే ఈ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే సంబంధిత గ్రూపులలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు గడువులోపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Exam Name AIAPGET PG 2023
Exam Type Entrance Exam
Admission For Ayush PG Courses
Exam Date NA
Exam Duration 2.00 Hours
Exam Level National Level

ఏఐఏపీజీసెట్ ఎలిజిబిలిటీ

  • ఆయుష్ పీజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఐఎంసిసి గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • ఆయా కోర్సులకు సంబంధించి ఏడాది ఇంటెర్షిప్ పూర్తిచేసి ఉండాలి.
  • ఇంతకు ముందు ఈ కోర్సులలో పీజీ చేసిన అభ్యర్థులు మరోమారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.

ఏఐఏపీజీసెట్ ముఖ్యమైన తేదీలు

ఏఐఏపీజీసెట్ దరఖాస్తు ప్రారంభం -
ఏఐఏపీజీసెట్ దరఖాస్తు గడువు -
ఏఐఏపీజీసెట్ ఎగ్జామ్ తేదీ -
ఏఐఏపీజీసెట్ ఫలితాలు -

ఏఐఏపీజీసెట్ ఎగ్జామ్ ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ ఫీజు జనరల్ - 2700/-
ఈబీసీ - 2450/-
ఎస్సీ, ఎస్టీ - 1800/-
ఎగ్జామ్ సెంటర్లు విజయవాడ, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై

ఏఐఏపీజీసెట్ రిజిస్ట్రేషన్

ఆయుష్ పీజీ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఆయుష్ అడ్మిషన్ (www.ntaaiapget.nic.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఏఐఏపీజీసెట్ ఎగ్జామ్ నమూనా

ఆయుష్ పీజీ పరీక్షా సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి 2 గంటలు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు -1 మార్కు ఇవ్వబడుతుంది. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు.

ఒకటికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను పరిగణలోకి తీసుకోరు. ప్రశ్నలు ఈ సబ్జెక్టుల సంబంధిత గ్రాడ్యుయేషన్ లెవెల్ సిలబస్ నుండి ఇవ్వబడతయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్. హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
ఎండీ /ఎంఎస్ & పీజీ డిప్లొమా 120 ప్రశ్నలు 400 మార్కులు 2 గంటలు

ఏఐఏపీజీసెట్ అడ్మిషన్ ప్రక్రియ

ఆయుష్ పీజీ అడ్మిషన్ ప్రక్రియ ఏఐఏపీజీసెట్ పీజీ సెట్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ అడ్మిషన్ ప్రకియ ఆయుష్ అడ్మషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. ఇందు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎటువంటి పాత్ర నిర్వర్తించాదు. సీబీటీ పరీక్షలో 50 పెర్సెంటైల్ మార్కులు సాధించిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటిస్తారు.

అందుబాటులో ఉండే సీట్లలో 57% శాతం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు విదేశీ విద్యార్థులకు ఇతర కేటగిరి విద్యారులకు కేటయిస్తారు. రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపు 2006 సంబంధించిన అడ్మిషన్ చట్టం నియమాలకు అనుగుణంగా జరుగుతుంది. వివిధ కేటగిర్లకు సంబందించిన రిజర్వేషన్ కోటా ఈ క్రింది విదంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ
ఎస్సీ
ఎస్టీ
ఈడబ్ల్యూఎస్
పిహెచ్
27%
15%
7.5%
10%
5%