ఇండియాలో టాప్ ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలు 2023
Admissions Law Entrance Exams

ఇండియాలో టాప్ ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షలు 2023

ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం వంటి న్యాయవిద్య యూజీ మరియు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించే రాష్ట్ర, జాతీయ లా ఎంట్రన్స్ పరీక్షల పూర్తి సమాచారం పొందండి. అలానే యువ లా గ్రాడ్యుయేట్లకు, లా ప్రాక్టీసుకు సంబంధించి చట్ట పరమైన అర్హుతను కల్పించేందుకు నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్  కోసం పూర్తి వివరాలు తెలుసుకోండి.

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ ఎగ్జామ్)

CLAT - Exam Date, Syllabus, Exam Patternదేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ లా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌బీ) మరియు మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) నిర్వహిస్తారు.

నేషనల్ లా యూనివర్సిటీల ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షలో అర్హుత సాధించటం ద్వారా దేశంలో ఉన్న 21 నేషనల్ లా యూనివర్సిటీలతో పాటుగా ఇంకో 50 పైగా ప్రైవేట్ లా ఇనిస్టిట్యూట్లలో ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం వంటి కోర్సుల యందు ప్రవేశాలు పొందొచ్చు.

బ్యాచిలర్ అఫ్ లా ప్రవేశాల కోసం జరిగే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఆఫ్‌లైన్‌ లో రాతపరీక్ష విధానం ద్వారా జరుగుతుంది. 2 గంటల నిడివితో 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మొత్తం 150 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఐదు సెక్షన్ లుగా విభజించబడి ఉంటాయి. సరైన సమాధానం ఇచ్చిన ప్రశ్నకు 1 మార్కు, తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు -0.25 మార్కులు ఇవ్వబడతాయి.

లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ (ఎల్‌శాట్‌ ఇండియా)

LSAT India - Exam Date, Syllabus, Exam Patternలా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌శాక్‌) అనేది యూఎస్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఏటా ప్రపంచ వ్యాప్తంగా యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి అనేక దేశాల్లో 60 వేలకు పైగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన న్యాయ విద్య ప్రవేశాలను కల్పిస్తుంది.

ఎల్‌శాక్‌ సంస్థ నిర్వహించే ఎల్‌శాట్‌ ప్రవేశ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 920 సెంటర్లలో జరుగుతుండగా, దానికి లక్ష నలభైవేలకు పైగా అభ్యర్థులు హాజరౌతున్నారు. ఎల్‌శాట్‌ ఇండియా అర్హుతతో ఇండియాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ లా ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్ పొందొచ్చు.

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ 2009 నుండి ఇండియాలో తమ సేవలను అందిస్తుంది. ఇండియా లా కాలేజీలకు అనుగుణంగా ఎల్‌శాట్‌ ఇండియా పేరుతో ఎల్ఎల్ఎం, ఎల్ఎల్‌బి కోర్సులలో అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్షా నిర్వహించిన మొదటి ఏడాది దాదాపు 30 వేలకు పైగా లా ఆశావహులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

2019 నుండి ఎల్‌శాక్‌ ఇండియా విద్యార్థులకు అంతర్జాతీయ లా యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఎల్‌శాట్‌ ఇండియాలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థికి 4 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు.

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ (AILET)

AILET Exam - Dates, Registration, Application, Eligibilityనేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీ (NLU Delhi) లో యూజీ, పీజీ మరియు పీహెచ్డీ న్యాయ విద్య కోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ జాతీయ స్థాయి లా ప్రవేశ పరీక్షాలో అర్హుత సాధించటం ద్వారా న్యాయ విద్య కోర్సులకు ఎంతో డిమాండ్ ఉండే నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీలో ఎల్ఎల్‌బి (ఐదేళ్లు), ఎల్ఎల్ఎం (ఏడాది) కోర్సులతో పాటుగా మరికొన్ని న్యాయ సంబంధిత పీహెచ్డీ కోర్సులలో ప్రవేశం పొందొచ్చు.

నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీ, క్లాట్ స్కోరును పరిగణలోకి తీసుకోదు. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలంటే ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. నేషనల్ లా యూనివర్సిటీ ఢీల్లీలో ఎల్ఎల్‌బి (80 సీట్లు), ఎల్ఎల్ఎం (80 సీట్లు) మరియు పీహెచ్డీ (10 సీట్లు) కోర్సులు కలిపి మొత్తం 170 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ 170 సీట్ల కోసం ఏటా 20 నుండి 30 వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు..

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE)

AIBE - Exam Date, Syllabus, Exam Patternయువ లా గ్రాడ్యుయేట్లకు, లా ప్రాక్టీసుకు సంబంధించి చట్ట పరమైన అర్హుతను కల్పించేందుకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ జాతీయ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హుత సాధించడం ద్వారా దేశంలో ఉండే ఎగువ, దిగువ కోర్టులలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు అనుమతి లభిస్తుంది.

2015-16 విద్యా సంవత్సరం నుండి నూతన లా గ్రాడ్యుయేట్లు అందరికి బార్ ఎగ్జామినేషన్ తప్పనిసరి చేసారు. ఈ పరీక్ష ప్రధానంగా న్యాయ పరమైన సబ్జెక్టులపై మరియు చట్టపరమైన అంశాలపై యువ న్యాయవాదుల అవగాహనతో పాటుగా ఆయా అంశాలపై వారికున్న ప్రాధమిక విశ్లేషణ సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు నిర్వహిస్తారు.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ జాతీయ స్థాయిలో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. పరీక్షా 3 గంటల 30 నిముషాల నిడివితో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. అర్హుత సాధించిన అభ్యర్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా "సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్" అవార్డుని అందజేస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు స్టేట్ బార్ కౌన్సిల్'లో అడ్వాకేట్'గా రిజిస్టర్ చేసుకుని ఉండాలి.

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్

Ap LAWCET Notification And Scheduleఏపీ లాసెట్ & ఏపీ  పీజీఎల్ సెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ న్యాయ కళాశాలలో యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఏపీ లాసెట్ పరీక్ష ప్రతి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ పరీక్షల అర్హుతతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లా కాలేజీలు, లా యూనివర్సిటీల యందు న్యాయ విద్యకు సంబంధించే గ్రాడ్యుయేట్ (LLB) మరియు పోస్టుగ్రాడ్యుయేట్ (LLM) కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్షలో 90 నిముషాలలో 120 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.

టీఎస్ లాసెట్ & పీజీఎల్ సెట్

TS LAWCET Notification And Scheduleటీఎస్ లాసెట్ మరియు టీఎస్ పీజీఎల్‌సెట్ పరీక్షలను ఒకేసారి ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పరీక్షలను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కనుసన్నలలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

టీఎస్ లాసెట్ మరియు టీఎస్  పీజీఎల్‌సెట్ అర్హుతతో తెలంగాణాలో ఉన్న లా కాలేజీలు, లా యూనివర్సిటీల యందు న్యాయ విద్యకు సంబంధించే గ్రాడ్యుయేట్( ఎల్ఎల్‌బి) మరియు పోస్టుగ్రాడ్యుయేట్(ఎల్ఎల్ఎం) కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు.

పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్షలో 90 నిముషాలలో 120 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్ష అర్హుతలో బ్యాచిలర్ స్థాయిలో రెండేళ్ల మరియు ఐదేళ్ల ఎల్ఎల్‌బితో పాటు మాస్టర్ స్థాయిలో రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశం పొందొచ్చు.

Post Comment