డీఎన్‌బీ పీడీసెట్‌ 2023 : ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ
Admissions Medical Entrance Exams

డీఎన్‌బీ పీడీసెట్‌ 2023 : ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ

డీఎన్‌బీ సెకండరీ పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు - పోస్ట్ డిప్లొమా సెంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఎన్‌బీ పీడీసెట్‌) నిర్వహిస్తారు. ఈ కోర్సుల నిడివి రెండేళ్లు ఉంటుంది. సంబంధిత స్పెషలైజ్షన్లో మెడికల్ పీజీ డిప్లొమా చేసిన అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటు నుండి గడువులోపు దరఖాస్తు చేసుకోండి.

Advertisement
Exam Name DNB PDCET 2023
Exam Type Entrance Exam
Admission For PG DNB Courses
Exam Date NA
Exam Duration 2.30 Hours
Exam Level National Level

డీఎన్‌బీ పీడీసెట్‌ 2023 ముఖ్యమైన తేదీలు

డీఎన్‌బీ పీడీసెట్‌ రిజిస్ట్రేషన్ -
డీఎన్‌బీ పీడీసెట్‌ తుది గడువు -
డీఎన్‌బీ పీడీసెట్‌ ఎగ్జామ్ తేదీ -
డీఎన్‌బీ పీడీసెట్‌ ఫలితాలు -

డీఎన్‌బీ పీడీసెట్‌ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ జారీచేసిన పీజీ డిప్లొమా సర్టిఫికెట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ద్రువీకరణను పరీక్షా సమయంలో మరియు అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరి చూపించాల్సి ఉంటుంది
  • ఒకటికి మించి చేసిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. ఆన్లైన్ ద్వారా చేసే దరఖాస్తు ప్రస్తుత విద్య సంవత్సరానికి మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి
  • పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు

డీఎన్‌బీ పీడీసెట్‌ రిజిస్ట్రేషన్

డీఎన్‌బీ పీడీసెట్‌ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (www.nbe.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

దరఖాస్తు ఫీజు Rs 5000/-
ఎగ్జామ్ సెంటర్లు విశాఖపట్నం, హైదరాబాద్

డీఎన్‌బీ పీడీసెట్‌ ఎగ్జామ్ ఫార్మేట్

డీఎన్‌బీ పీడీసెట్‌ సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి 2 గంటల 30 నిముషాలు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి.సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి.

తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగించబడుతుంది. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించబడవు. ఒకదానికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను లెక్కించారు.

సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
అనాటమీ ఫిజియాలజీ  బయోకెమిస్ట్రీ
పాథాలజీ, మైక్రోబయాలజీ & ఫార్మకాలజీ
జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ రేడియోథెరపీ
జనరల్ సర్జరీ, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్ & రేడియోడయాగ్నోసిస్
పీడియాట్రిక్స్
ENT & ఆప్తాల్మాలజీ
ఒబెస్ట్ట్రిక్స్  గైనకాలజీ
కమ్యూనిటీ మెడిసిన్
25
25
35
35
15
20
25
20
800 2.30 గంటలు

డీఎన్‌బీ పీడీసెట్‌ క్వాలిఫై మార్కులు

డీఎన్‌బీ పీడీసెట్‌ కనీస అర్హుత మార్కులు సాధించిన వారికి మాత్రమే ర్యాంకింగ్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేటగిరి వారీగా ఈ క్రింది కనీస అర్హుత మార్కులు నిర్ణయించింది. ఇందులో అర్హుత మార్కులు ఈ విద్య ఏడాదికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

కేటగిరి కనీస అర్హుత మార్కులు
జనరల్
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్
50%
40%

Advertisement