ఏపీ పీజీసెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams University Entrance Exams

ఏపీ పీజీసెట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

ఏపీ యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ పీజీ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ పీజీసెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ ఏపీ పీజీసెట్ 2023 పరీక్షలను జూన్ 6 నుండి 10వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.

Advertisement
Exam Name AP PGCET 2023
Exam Type Entrance Test
Admission For PG Courses
Exam Duration 90 Minutes
Exam Level State Level (AP)

గతంలో యూనివర్సిటీ వారీగా నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల స్థానంలో గత రెండేళ్లుగా ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీ మరియు వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.

రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సెట్ చైర్మనుగా యోగి వేమన యూనివర్సిటీ వీసీ మునగల సూర్యకలావతి, కన్వినరుగా వై. నజీర్ అహ్మద్ వ్యవహరించనున్నారు. ఈ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.

రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. అర్హులైన విద్యార్థులు గడువులోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

ఏపీ పీజీసెట్ ద్వారా భర్తీ చేసే పీజీ కోర్సులు

ఏపీ పీజీసెట్ మూడు కేటగిరిల వారీగా నిర్వహిస్తున్నారు. మొదటి కేటగిరిలో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, కేటగిరి 2 లో కామర్స్ & ఎడ్యుకేషన్ మరియు కేటగిరి 3 లో సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు.

కేటగిరి -I ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కేటగిరి -II కామర్స్ & ఎడ్యుకేషన్ కేటగిరి -III సైన్స్ కోర్సులు
101 - English
102 - General
103 - Telugu
104 - Literature
105 - Sanskrit
106 - Hindi
107 - Urdu
108 - Tamil
109 - Folklore
110 - B.F.A.
111 - Humanities & Social Sciences
112 - Performing Arts and Music
113 - Performing Arts
114 - History
115 - Political Science
116 - Economics
117 - Tourism
201 - Commerce
202 - Education
203 - Physical Education
301 - Life Sciences
302 - FNS
303 -  Botany
304 - Sericulture
305 - Zoology
306 - Mathematical Sciences
307 - Statistics
308 - Physical Sciences
309 - Electronics
310 - Chemical Sciences
311 - Polymer Science
312 - Geology
313 - Psychology
314 - Computer Science
315 - Geography

ఏపీ పీజీసెట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ -
దరఖాస్తు చివరి తేదీ -
హాల్ టికెట్ డౌన్‌లోడ్ -
పరీక్ష తేదీ 6-10 జూన్ 2023
ఫలితాలు -
కౌన్సిలింగ్ -

ఏపీ పీజీసెట్ ద్వారా అడ్మిషన్ పొందే యూనివర్సిటీలు

ఆంధ్ర యూనివర్సిటీ - విశాఖపట్నం డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ - శ్రీకాకుళం
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - తిరుపతి డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ - కర్నూలు
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ -అనంతపూర్ ద్రవిడియన్ యూనివర్సిటీ - కుప్పం
ఆచార్య నాగార్జన యూనివర్సిటీ - గుంటూరు కృష్ణ యూనివర్సిటీ - మచిలీపట్నం
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - తిరుపతి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ - రాజమహేంద్రవరం
యోగి వేమన యూనివర్సిటీ - కడప క్లస్టర్ యూనివర్సిటీ - కర్నూలు
రాయలసీమ యూనివర్సిటీ - కర్నూలు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ - ఒంగోలు
విక్రమ సింహపురి యూనివర్సిటీ - నెల్లూరు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ - అనంతపూర్

ఏపీ పీజీసెట్ 2023 ఎలిజిబిలిటీ

  • పీజీ స్పెషలైజెషన్ సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అయినవారు మరియు చివరి ఏడాది పరీక్షా రాస్తున్నవారు అర్హులు.
  • స్కాలర్షిప్ పొందేందుకు ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థుల గరిష్ట వయసు 34 ఏళ్ళు, ఈడబ్ల్యూఎస్, మైనారిటీస్ మరియు అంగవైకుల్యం ఉన్న అభ్యర్థుల వయసు 30 ఏళ్ళు మించకూడదు.
  • ఇంతకు ముందు పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు స్కాలర్షిప్, హాస్టల్ వసతి సౌలభ్యలకు అనర్హులు.
  • లాంగ్వేజ్ స్పెషలైజషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో ఇవ్వబడతాయి.
  • ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించని కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ అనుచరించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీ పీజీసెట్ 2023 ఎగ్జామ్ ఫీజు

రిజర్వేషన్ కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి Rs 850 /-
బీసీ Rs 750 /-
ఎస్సీ, ఎస్టీ & ఇతరులు Rs 650 /-

దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు, జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.

ఏపీ పీజీసెట్ 2023 రిజిస్ట్రేషన్

ఏపీ పీజీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యోగివేమన యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు (www.yvu.edu.in) ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. మొదట అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించి, దరఖాస్తులో కోరిన వ్యక్తిగత, విద్య వివరాలు తప్పులు దొర్లకుండా నింపాలి.

ఉత్తీర్ణత సాధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, టెన్త్ హాల్ టికెట్ నెంబర్, ఇతర ధ్రువపత్రాలు దరఖాస్తు చేసే సమయంలో అందుబాటులో ఉంచుకోండి. వ్యక్తిగత చిరునామా, ఫోన్ నెంబర్ మరియు మెయిల్ అడ్రస్ వివరాలు సక్రమంగా పొందుపర్చండి. దరఖాస్తు తుది సమర్పణ ముందు పొందుపర్చిన వివరాలు మరోమారు సరిచూసుకుని సమర్పించండి. అలానే రెండు జతల దరఖాస్తు సెట్లను ప్రింటు తీసి భద్రపర్చుకోండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

ఏపీ పీజీసెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఏపీ పీజీసెట్ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా పూర్తి ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఇవ్వబడతయి. వాటి నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగిటివ్ మార్కులు లేవు. ప్రశ్నలు అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుండి ఇవ్వబడతాయి.

ఎగ్జామ్ విధానం ప్రశ్నలు మార్కులు వ్యవధి
సీబీటీ - ఆబ్జెక్టివ్ మోడ్ 100 ప్రశ్నలు 100 మార్కులు 90 నిముషాలు

ఏపీ పీజీసెట్ క్వాలిఫై మార్కులు & సీట్ల కేటాయింపు

రాతపరీక్షలో కనీసం 35 శాతం మార్కులు సాధించిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. వివిధ కేటగిర్ల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు లోకల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అభ్యర్థులకు కేటాయిస్తారు. రేజర్వేషన్ల పరంగా ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీ అభ్యర్థులకు 29%, NCC అభ్యర్థులకు 1%, క్రీడాకులకు 0.5% మరియు మహిళకు 33% సీట్లు కేటాయిస్తారు.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఎస్సీ అభ్యర్థులు 15% శాతం
ఎస్టీ అభ్యర్థులు 8 శాతం
బీసీ కులాలు 29 శాతం
మహిళలు 33% శాతం
NCC, Sports 1 శాతం, 0.5 శాతం

ప్రవేశానికి సంబంధించి కొన్ని నియమాలు

  • అడ్మిషన్ పొందిన అభ్యర్థులు యూజీసీ నియమానుసారం ఏడాదిలో 75% హాజరు తప్పనిసరి.
  • అడ్మిషన్ పొందిన మొదటి పది రోజుల్లో అభ్యర్థి సదురు కాలేజీలో హాజరు కాకుంటే ఆ సీటును తప్పించే అధికారం వారికీ ఉంటుంది.
  • రెగ్యులర్ కోర్సులలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులు ఇతర కోర్సులలో జాయిన్ అవ్వెందుకు, ఉద్యోగాలు చేసేందుకు అనుమతి ఉండదు.
  • ప్రతి సెమిస్టర్ చివరిలో పరీక్షలు నిర్వహించబడతాయి. సప్లిమెంటరీ పరీక్షలు ఉండవు.
  • ర్యాగింగ్ కార్యకలాపాల్లో పాల్గునే అభ్యర్థులు శిక్షార్హులు.
  • వరుస పది రోజులు క్లాసులకు హాజరుకాని విద్యార్థులు. దానికి సంబంధించి పర్మిషన్ కల్గిఉండాలి.

Advertisement

Post Comment