ఐసీఏఆర్ ఏఐసీఈ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Agriculture Exams NTA Exams

ఐసీఏఆర్ ఏఐసీఈ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఏఐఈఈఏ జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) 2022 పరీక్ష షెడ్యూల్ వెలువడింది. అగ్రికల్చర్ యూజీ కోర్సులలో అడ్మిషన్లు కల్పించే ఈ పరీక్ష యొక్క దరఖాస్తు ప్రక్రియ 20 జులై 2022 నుండి 19 ఆగష్టు 2022 మధ్య నిర్వహించనున్నారు.

Advertisement

ఐసీఏఆర్ ఏఐసీఈ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసీఏఆర్ ఏఐసీఈ "ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్" అని అర్ధం. జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి.

ఐసీఏఆర్ ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్ డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది.

ఐసీఏఆర్ ఏఐసీఈ - జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ పరీక్ష ద్వారా 905 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో 666 సీట్లు 55 ఐసీఏఆర్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో భర్తీచేస్తారు. మిగతా స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్న సీట్లలో 25% (RLB CAU Jhansi, NDRI Karnal and Dr. RP CAU Pusa, Bihar 100% seats) ICAR AICE- JRF/SRF (Ph.D) పరీక్షా ఆధారంగా భర్తీచేస్తాయి. ఐసీఏఆర్ ఏయూ పరిధిలో 2 నుండి 4 ఏళ్ళ వ్యవధితో దాదాపు 73 రకాల ప్రధాన అగ్రికల్చర్ సబ్జెక్టులలో జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి.

ఐసీఏఆర్ ఏఐసీఈ - జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ పరీక్ష ద్వారా అగ్రికల్చర్ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ (NTS) అందిస్తుంది. అడ్మిషన్ పొందిన ఏడాది తర్వాత బ్యాంకు ద్వారా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు 2000/-, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు 3000/- చెప్పున ప్రతి నెల అందజేస్తారు.

దీనితో పాటుగా ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన టాప్ 600 మందికి ఐసీఏఆర్ పీజీ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తుంది. పీజీ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత రీసెర్చ్ కోర్సులలో చేరేందుకు ఆసక్తి చూపే అభ్యర్థులకు దీన్ని అందజేస్తారు. పీజీ కోర్సులో చేరిన మొదటి ఏడాదిలో దరఖాస్తు చేసుకుంటే రీసెర్చ్ ప్రోగ్రాంలో చేరే సమయానికి ఇది అందుబాటులోకి వస్తుంది.

పీజీ స్కాలర్షిప్ కోసం ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా 12,640 /- రూపాయలు అందజేస్తారు. దీనితో పాటుగా విద్యార్థి అకాడమిక్ అవసరాల కోసం ఏడాదికి 6,000/- రూపాయలు కంటైన్జెంట్ గ్రాంట్ అందజేస్తారు.

ఐసీఏఆర్ ఏఐసీఈ 2022

Exam Name ICAR AICE- JRF/SRF (Ph.D) 2022
Exam Type Admission
Admission For Agriculture UG Courses
Exam Date -
Exam Duration 2 Hours
Exam Level National Level

ఐసీఏఆర్ ఏఐసీఈ వివరాలు

ఏఐసీఈ 2022 జెఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్(పీహెచ్డీ) షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 20 జులై 2022
దరఖాస్తు తుది గడువు 19 ఆగష్టు 2022
ఎగ్జామ్ తేదీ -
ఫలితాలు -

ఐసీఏఆర్ ఏఐసీఈ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి
  • 50 శాతం మార్కులతో సంబంధిత అగ్రికల్చర్ పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణతయి ఉండాలి. షెడ్యూల్ కులాల వారికీ 10శాతం మార్కుల సడలింపు ఉంటుంది
  • దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల కనీస వయస్సు 22 ఏళ్ళు నిండి ఉండాలి

ఐసీఏఆర్ ఏఐసీఈ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి 1850/- (OBC & Other : 1820/-)
ఎస్సీ, ఎస్టీ పీడీ అభ్యర్థులు 920/-

ఐసీఏఆర్ ఏఐసీఈ పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్, సికిందరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్

ఐసీఏఆర్ ఏఐసీఈ దరఖాస్తు ప్రక్రియ

ఐసీఏఆర్ ఏఐసీఈ పీహెచ్డీ ప్రవేశ పరీక్షా రాసేందుకు ఆసక్తి అర్హుత ఉన్న అభ్యర్థులు NTA ICAR అధికారిక (www.icar.nta.nic.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి.

అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఐసీఏఆర్ ఏఐసీఈ ఎగ్జామ్ నమూనా

ఐసీఏఆర్ ఏఐసీఈ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 2 గంటల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు -1 మార్కు తొలగిస్తారు.

సమాధానం గుర్తించని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించారు. క్వశ్చన్ పేపర్లో మొత్తం 120 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు సంబంధిత ఆప్షనల్ పీజస్థాయి సిలబస్ నుండి ఇవ్వబడతయి.

 సెక్షన్ / సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
పార్ట్ A : జనరల్ నాలెడ్జ్ & రీజనింగ్ ఎబిలిటీ 20 80 2.00 గంటలు
పార్ట్ B: ఆప్షనల్ స్పెషలైజ్డ్ సబ్జెక్టు 50 200
పార్ట్ C: ఆప్షనల్ స్పెషలైజ్డ్ సబ్జెక్టు 50 200
మొత్తం 120 480

ఐసీఏఆర్ ఏఐసీఈ ఎగ్జామ్ పూర్తియిన 10 నుండి 15 రోజుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైటులో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. పరీక్షా వివిధ షిఫ్టులలో జరిగితే నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి తుది ఫలితాలు విడుదల చేస్తారు. మార్కుల సమమైనప్పుడు తక్కువ నెగిటివ్ మార్కులు వచ్చేవారికి ప్రధాన్యత ఇస్తారు. అప్పటికి తేలకుంటే ఎక్కువ వయస్సున్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటురు.

Advertisement

Post Comment