ఏఐఈఈఏ యూజీ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ
Admissions Agriculture Exams Engineering Entrance Exams NTA Exams

ఏఐఈఈఏ యూజీ 2023 : నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ, పరీక్ష తేదీ

ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ 2023 పరీక్ష షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ పరీక్షను అగ్రికల్చర్ మరియు దాని అనుబంధ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీలల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐసీఏఆర్ ఏఐఈఈఏ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ - ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్స్" అని అర్ధం.

జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఐసీఏఆర్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తాయి. దేశంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలన్ని ఐసీఏఆర్ కనుసన్నలలో పనిచేస్తాయి.

ఐసీఏఆర్-ఏయూ పరిధిలో దేశంలో మొత్తం 74 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 63 స్టేట్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ మరియు ఫిషరీ యూనివర్సిటీలు కాగా 4 ఐసీఏఆర్ డ్రీమ్డ్ యూనివర్సిటీలు (IARI, IVRI, NDRI & CIFE,), 3 సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇంకో 4 సెంట్రల్ యూనివెర్సిటీలు ఉన్నాయి.

వ్యవసాయ ఆధారిత దేశమైన ఇండియా ఏటా దాదాపు 27 వేలకు పైగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లును, 14 వేల మంది  పోస్ట్ గ్రాడ్యుయేట్లను మరో 4700 మంది పీహెచ్డీలను అందిస్తుంది. ఏఐఈఈఏ యూజీ పరీక్ష ద్వారా 2784 సీట్లను భర్తీచేయనున్నారు. ఇందులో 2189 సీట్లు 59 ఐసీఏఆర్ అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో భర్తీచేస్తారు.

మిగతా 15% సీట్లు స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీల యందు (RLB CAU Jhansi, NDRI Karnal and Dr. RP CAU Pusa, Bihar 100% seats) ఏఐఈఈఏ యూజీ పరీక్షా ఆధారంగా భర్తీచేస్తాయి. ఐసీఏఆర్-ఏయూ పరిధిలో 4 ఏళ్ళ నిడివితో దాదాపు 11 అగ్రికల్చర్ బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏఐఈఈఏ యూజీ 2023

Exam Name ICAR AIEEA UG 2023
Exam Type Admission
Admission For Agriculture UG Courses
Exam Date NA
Exam Duration 2.30 Hours
Exam Level National Level

ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ సమాచారం

ఏఐఈఈఏ యూజీ ద్వారా అడ్మిషన్ పొందే అగ్రికల్చర్ డిగ్రీలు

B.Sc. (Hons.) Agriculture
B.Sc. (Hons.) Horticulture
B.F.Sc
B.Sc. (Hons.) Forestry
B.Sc. (Hons.) Community Science
Food Nutrition and Dietetics
B.Sc. (Hons.) Sericulture
B. Tech. Agricultural Engineering
B. Tech. Dairy Technology
B. Tech. Food Technology
B. Tech. Bio- Technology

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ప్రవేశ పరీక్షా ద్వారా అగ్రికల్చర్ డిగ్రీలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ (NTS) అందిస్తుంది. అడ్మిషన్ పొందిన ఏడాది తర్వాత బ్యాంకు ద్వారా బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు 2000/-, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు 3000/- చెప్పున ప్రతి నెల అందజేస్తారు.

ఏఐఈఈఏ యూజీ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి
  • 50 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి. షెడ్యూల్ కులాల వారికీ 10శాతం మార్కుల సడలింపు ఉంటుంది
  • అభ్యర్థులు ఎంపిక చేసుకునే డిగ్రీ అనుసరించి ఇంటర్ పిసిబి లేదా ఎంసీబీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి
  • దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల కనీస వయస్సు 16 నిండి ఉండాలి

ఏఐఈఈఏ యూజీ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ -
దరఖాస్తు తుది గడువు -
ఎగ్జామ్ తేదీ -
ఫలితాలు -

ఏఐఈఈఏ యూజీ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి 800/- (OBC : 770/-)
ఎస్సీ, ఎస్టీ పీడీ అభ్యర్థులు 400/-

ఏఐఈఈఏ యూజీ పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
విశాఖపట్నం,విజయనగరం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ,గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప
కర్నూలు.చీరాల, అనంతపురం
హైదరాబాద్,
సికిందరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్

ఏఐఈఈఏ యూజీ దరఖాస్తు విధానం

ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ పరీక్ష రాసేందుకు ఆసక్తి అర్హుత ఉన్న అభ్యర్థులు ఐసీఏఆర్ అధికారిక (www.icar.nta.nic.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి.

అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఏఐఈఈఏ యూజీ ఎగ్జామ్ నమూనా

ఐసీఏఆర్ ఏఐఈఈఏ యూజీ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 2.30 గంటల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు -1 మార్కు తొలగిస్తారు. సమాధానం గుర్తించని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించారు.

అభ్యర్థి దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకున్న మూడు సబ్జెక్టుల (PCB/PCM/PCA/ABC) సంబంధించి పరీక్షా నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్లో ఒక్క సబ్జెక్టు నుండి 50 ప్రశ్నలు చెప్పున మొత్తం150 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు ఇంటర్/10+2 స్థాయి సిలబస్ నుండి ఇవ్వబడతయి.

 పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
PCB/PCM/PCA/ABC 150 600 2.30 గంటలు

ఏఐఈఈఏ యూజీ అడ్మిషన్ ప్రక్రియ

ఐసీఏఆర్ ఏఐఈఈఏ ఎగ్జామ్ పూర్తియిన 10 నుండి 15 రోజుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైటులో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. పరీక్షా వివిధ షిఫ్టులలో జరిగితే నార్మలైజషన్ ప్రక్రియ ద్వారా గణించి తుది ఫలితాలు విడుదల చేస్తారు.

అభ్యర్థుల మార్కుల సమమైనప్పుడు మ్యాథ్స్, బయాలజీ క్రమంలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికీ ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికి సమమైతే తక్కువ నెగిటివ్ మార్కులు వచ్చేవారికి, అప్పటికి తేలకుంటే ఎక్కువ వయస్సున్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటురు.

Post Comment