నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Medical Entrance Exams NTA Exams

నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్

డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ (DM), మాస్టర్స్ ఆఫ్ సర్జరీ (MCh) మరియు డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డు (DNB) సూపర్ స్పెషలిటీ కోర్సులలో ప్రవేశాలు చేపట్టేందుకు నేషనల్ బోర్డు ఆఫ్  ఎగ్జామినేషన్ ఈ నీట్ SS పరీక్షను నిర్వహిస్తుంది. DM. MCh మరియు DNB కోర్సులలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ వెబ్సైటు ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోండి.

Exam Name NEET-SS 2023
Exam Type Entrance Exam
Admission For DM & MCh, DNB
Exam Date NA
Exam Duration 3.30 Hours
Exam Level National Level

నీట్ - ఎస్ఎస్ ఎగ్జామ్ షెడ్యూల్ 2023

నీట్ - ఎస్ఎస్ దరఖాస్తు ప్రారంభం NA
నీట్ - ఎస్ఎస్ దరఖాస్తు గడువు NA
నీట్ - ఎస్ఎస్ ఎగ్జామ్ తేదీ NA
నీట్ - ఎస్ఎస్ ఫలితాలు NA

నీట్ - ఎస్ఎస్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు DM, MCh, DNB పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తిచేసి ఉండాలి
  • నీట్ SS పరీక్షకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తప్పనిసరి రిజిస్టర్ చేసుకోవాలి.
  • నేషనల్ మెడికల్ కౌన్సిల్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ద్రువీకరణను పరీక్షా సమయంలో మరియు అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరి చూపించాల్సి ఉంటుంది
  • ఒకటికి మించి చేసిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. ఆన్లైన్ ద్వారా చేసే దరఖాస్తు ప్రస్తుత విద్య సంవత్సరానికి మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి

నీట్ - ఎస్ఎస్ దరఖాస్తు విధానం

నీట్ - ఎస్ఎస్ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (www.nbe.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తు ఫీజు - Rs 4,250/-

ఎగ్జామ్ సెంటర్లు తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్

నీట్ - ఎస్ఎస్ ఎగ్జామ్ ఫార్మేట్

నీట్ - ఎస్ఎస్ ఎగ్జామ్ సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి 3.30 గంటలు. పరీక్షా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు భాగాలుగా ఉంటుంది. 40% ప్రశ్నలు అర్హుత సాధించిన బోర్డ్ స్పెషలిటీ కోర్సు నుండి, మిగతా 60% ప్రశ్నలు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సూపర్ స్పెషలిటీ కోర్సుకు సంబంధించి ఇవ్వబడతాయి. ప్రతి సూపర్ స్పెషలిటీకి ప్రత్యేక ప్రశ్నపత్రం ఇవ్వబడుతుంది.

ప్రశ్నపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 2 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 40 ప్రశ్నలు, పార్ట్ B లో 60 ప్రశ్నలు ఇవ్వబడతాయి. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగించబడుతుంది. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించబడవు. ఒకదానికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను లెక్కించారు.

సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
పార్ట్ - A అనాటమీ
ఫీజియోలజీ
బయో కెమిస్ట్రీ
40 40 (40% వెయిటేజీ) 3.30 గంటలు
పార్ట్ - B పాథాలజీ
ఫార్మకాజీ
మైక్రో బయాలజీ
ఫోరెనిక్ మెడిసిన్
సోషల్ & ప్రివెంటివ్ మెడిసిన్
60 60  (60% వెయిటేజీ)
DM / MCh కోర్సులు
కార్డియాక్ అనస్థీషియా
ఆర్గాన్ ట్రాన్సప్లంట్ అనస్థీషియా & క్రిటికల్ కేర్
పీడియాట్రిక్ మరియు నియోనాటల్ అనస్థీషియా
నియోనాటాలజీ
పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ
పీడియాట్రిక్ కార్డియాలజీ
పీడియాట్రిక్ నెఫ్రాలజీ
పీడియాట్రిక్ ఆంకాలజీ
పీడియాట్రిక్ హెపటాలజీ
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ / జి.ఐ. సర్జరీ
హెపాటో ప్యాంక్రియాటో బిలియరీ సర్జరీ
వాస్కులర్ సర్జరీ
కార్డియో వాస్కులర్ మరియు థొరాసిక్ సర్జరీ
థొరాసిక్ సర్జరీ
పీడియాట్రిక్ కార్డియో-థొరాసిక్ వాస్కులర్ సర్జరీ
న్యూరాలజీ
పీడియాట్రిక్ న్యూరాలజీ
న్యూరోరాడియాలజీ
ఇంటర్వెన్షనల్ రేడియాలజీ
గైనకాలజికల్ ఆంకాలజీ రేప్రొడ్యూక్టీవ్ మెడిసిన్ & సర్జరీ

నీట్ - ఎస్ఎస్ సీట్ల కేటాయింపు

నీట్ - ఎస్ఎస్ ప్రవేశాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తుంది. అడ్మిషన్ ప్రక్రియ నీట్ - ఎస్ఎస్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రిజర్వేషన్ పరమైన సీట్ల కేటాయింపు 2006 సంబంధించిన అడ్మిషన్ చట్టం నియమాలకు అనుగుణంగా జరుగుతుంది. వివిధ కేటగిర్లకు సంబందించిన రిజర్వేషన్ కోటా ఈ క్రింది విదంగా ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరి రిజర్వేషన్ కోటా
ఓబీసీ
ఎస్సీ
ఎస్టీ
ఈడబ్ల్యూఎస్
పిహెచ్
27%
15%
7.5%
10%
5%