Advertisement
అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ రిజిస్ట్రేషన్ మరియు ఎలిజిబిలిటీ
Skill development schemes

అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ రిజిస్ట్రేషన్ మరియు ఎలిజిబిలిటీ

నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ దేశీయ మానవ వనరుల అభివృద్దే ప్రధాన ద్యేయంగా రూపొందింది. ఏ ద్రేశంలోనైనా పారిశ్రామిక అభివృద్ధికి మానవ వనరుల అభివృద్దే కీలకం. మానవ వనరుల అభివృద్ధిలో నైపుణ్యాల అప్‌గ్రేడేషన్ అనేది ఒక ముఖ్యమైన భాగం. నైపుణ్యం సంపాదించడానికి శిక్షణ సంస్థలలో అందించే శిక్షణ మాత్రమే సరిపోదు, ఫీల్డ్ లెవెల్ పారిశ్రామిక శిక్షణ అవసరం.

పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవశక్తి అవసరాలను అందించేందుకు ఆచరణాత్మక శిక్షణ అందించాలనే ప్రధాన లక్ష్యంతో అప్రెంటీస్ చట్టం1961 లో రూపొందించబడింది. ఈ చట్టం ట్రేడ్ అప్రెంటీస్‌ల కోసం అప్రెంటీస్‌షిప్ శిక్షణ అందిస్తుంది. అలానే దీని పరిధిలో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు, టెక్నీషియన్లకు, ఒకేషనల్ టెక్నీషియన్లకు మరియు ఐచ్ఛిక ట్రేడ్ అప్రెంటీస్‌లకు కూడా అప్రెంటీస్‌షిప్ శిక్షణ అవకాశం కల్పిస్తున్నారు.

భారతదేశంలో నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒక ఏడాది ప్రోగ్రామ్, ఈ స్కీమ్ ద్వారా టెక్నికల్ డిగ్రీ అర్హత కలిగిన యువతకు, వారి పని రంగంలో అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు నూతన స్కిల్ డెవలప్మెంట్ అవసరాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర మరియు కేంద్ర పారిశ్రామిక ప్రదేశాలలో శిక్షణ అందిస్తారు. పూర్తి నైపుణ్యం కలిగిన నిర్వాహకుల ద్వారా పూర్తిస్థాయి శిక్షణా మాడ్యూల్‌లతో, అప్రెంటీస్లు ఉద్యోగాన్ని త్వరగా మరియు సమర్ధవంతంగా నేర్చుకునేలా చూస్తారు.

అప్రెంటీస్‌షిప్ కాలంలో, అప్రెంటీస్‌లకు పరిశ్రమలు స్టైఫండ్ చెల్లిస్తాయి, ఇందులో 50% భారత ప్రభుత్వం నుండి యజమానికి తిరిగి చెల్లించబడుతుంది. శిక్షణ కాలం ముగిసిన తర్వాత, అప్రెంటీస్‌లకు భారత ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ జారీ చేయబడుతుంది, ఇది చెల్లుబాటు అయ్యే ఉద్యోగ అనుభవంగా భారతదేశంలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజీలలో నమోదు చేసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న అప్రెంటీస్‌ ప్రోగ్రామ్స్

  1. ట్రేడ్ అప్రెంటీస్
  2. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
  3. టెక్నీషియన్ అప్రెంటీస్
  4. టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్
  5. ఐచ్ఛిక ట్రేడ్ అప్రెంటీస్

అప్రెంటిస్‌షిప్ స్టైఫండ్‌ వివరాలు

  • మొదటి సంవత్సరం అప్రెంటీస్‌లకు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నోటిఫై చేసిన సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనంలో 70% అందిస్తారు.
  • రెండవ సంవత్సరం అప్రెంటీస్‌లకు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నోటిఫై చేసిన సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనంలో 80% అందిస్తారు.
  • మూడవ మరియు 4వ సంవత్సరం అప్రెంటీస్‌లకు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నోటిఫై చేసిన సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతనంలో 90% అందిస్తారు.
  • ట్రేడ్ అప్రెంటీస్‌ల కోసం స్టైఫండ్‌పై అయ్యే ఖర్చు పరిశ్రమల యాజమాన్యాలే భరిస్తారు.
  • గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ & టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్‌లకు స్టైఫండ్ రేట్లు వరుసగా నెలకు రూ. 4984 , రూ. 3542 మరియు రూ.  2758 అందిస్తారు.
  • గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ & టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్ కేటగిరీల స్టైపెండ్‌పై చేసే ఖర్చు యజమాని మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సమానంగా పంచుకోబడుతుంది.

ట్రేడ్ అప్రెంటీస్‌ల రిజిస్ట్రేషన్ & ఎలిజిబిలిటీ

  • ట్రేడ్‌ల శిక్షణ వ్యవధి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది
  • ట్రేడ్ కోసం నిర్దేశించిన విద్యా అర్హత క్లాస్ VIII పాస్ నుండి క్లాస్ XII పాస్ వరకు ట్రేడ్‌ని బట్టి మారుతుంది.
  • 39 ట్రేడ్ గ్రూపులలో 261 ట్రేడ్‌లు అందుబాటులో ఉంటాయి.
  • కొత్త కోర్సులకు అడ్మిషన్ ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో నిర్వహిస్తారు.
  • కనీస వయస్సు 14 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి లేదు.
  • ప్రవేశ ప్రకటన స్థానిక ఐటీఐ ద్వారా వెలువడుతుంది.
  • ప్రవేశాలు NCVT అడ్మిషన్ సిఫారసు ప్రకారం వ్యక్తిగత ట్రేడ్ కొరకు నిర్దేశించిన కనీస అర్హత యొక్క పబ్లిక్ పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా / రాత పరీక్ష ఆధారంగా కల్పిస్తారు.
  • శిక్షణ కాలం పూర్తయిన తర్వాత ట్రైనీలు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో హాజరు కావాలి.
  • నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) సంవత్సరానికి రెండుసార్లు (అక్టోబర్/ నవంబర్ మరియు ఏప్రిల్/ మే) ట్రేడ్ అప్రెంటీస్‌ల కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లు (AITT) నిర్వహిస్తారు.
  • ట్రేడ్ టెస్ట్‌లో విజయవంతమైన ట్రైనీలకు జాతీయ ట్రేడ్ సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది.

గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ మరియు టెక్నీషియన్ శిక్షణ వివరాలు

  • గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటీస్ కేటగిరీ కోసం 163 సబ్జెక్ట్ ఫీల్డ్‌లు అందుబాటులో ఉన్నాయి.
  • టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్ కేటగిరీకి 137 సబ్జెక్ట్ ఫీల్డ్‌లు అందుబాటులో ఉంటాయి.
  • వీటి శిక్షణ వ్యవధి ఏడాది ఉంటుంది.
  • సంబంధిత అప్రెంటీస్‌షిప్ అడ్వైజర్ ఎస్టాబ్లిష్‌మెంట్ మధ్య ఉమ్మడి సంప్రదింపులలో శిక్షణ కార్యక్రమం తయారు చేయబడుతుంది.
  • డిపార్ట్మెంట్ ద్వారా శిక్షణ పూర్తయిన తర్వాత విద్య, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా సర్టిఫికేట్లు ప్రదానం చేయబడతాయి.

Post Comment