ఈ స్కిల్ ఇండియా : ఆన్‌లైన్ స్కిల్ లెర్నింగ్ పోర్టల్
Online Education Useful websites

ఈ స్కిల్ ఇండియా : ఆన్‌లైన్ స్కిల్ లెర్నింగ్ పోర్టల్

ఈ స్కిల్ఇండియా ప్రోగ్రాంను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) ప్రారంభించింది. భారతీయ యువతలో వివిధ అంశాల యందు నైపుణ్య శిక్షణ అందించి వారిని ప్రయోజకులను చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం దీన్ని 2015 లో ప్రారంభించింది.

Advertisement

"స్కిల్ ఇండియా మిషన్" పేరుతో పిలుచుకునే ఈ ప్రోగ్రాం ద్వారా 40 కోట్ల భారతీయాలకు 2022 నాటికీ వివిధ ఒకేషనల్ అంశాల యందు పూర్తిస్థాయి నైపుణ్య శిక్షణ అందించి వారికీ ఉపాధి కల్పించాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీని కోసం రీజనల్ వారీగా పట్టణ మరియు గ్రామీణ యువతకు వేరువేరుగా ప్రభత్వ స్కీమ్స్ రూపొందించి, శిక్షణ, ఉపాధితో పాటుగా వారికీ సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు.

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దేశ వ్యాప్తంగా పది వేలకు పైగా ట్రైనింగ్ సెంటర్స్ కలిగిఉంది. ఈ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా 538 ట్రైనింగ్ భాగస్వామ్యులు, 1500+ అంశాల యందు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా దాదాపు 20 లక్షలకు పైగా నైపుణ్య శిక్షణ పొందారు. అందులో రెండు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించారు. మిగతా వారికీ తాము సొంతగా బిజినెస్ చేసుకునేందుకు సహాయం అందించారు.

ఈ స్కిల్ఇండియా ప్రోగ్రాం ద్వారా ఒకేషనల్ నైపుణ్య సంబంధిత కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందించునున్నారు. దాదాపు వెయ్యి గంటలకు పైగా డిజిటల్ స్కిల్ కోర్సులను వెబ్సైటు మరియు మొబైల్ యాప్ ద్వారా పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.

ఆసక్తి, అభిరుచి ఉన్న ఉన్న అభ్యర్థులు ఈ ఆన్‌లైన్ డిజిటల్ స్కిల్ లెర్నింగ్ ద్వారా కెరీర్ పరంగా ఉత్తమ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఈ కోర్సులను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో పాటుగా మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థల సహాయంతో అందిస్తున్నారు.

eskillindia courses2

eskillindia courses2

Advertisement