సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్ గైడెన్స్
Entrepreneur Guide

సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్ గైడెన్స్

సోలో ప్రోపరైటెర్షిప్ అనేది వ్యక్తిగత వ్యాపార రిజిస్ట్రేషన్. ప్రభుత్వ అనుమతితో తమ సొంత వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దీనికి ఎటువంటి చట్టబద్దత ఉండదు. ఏ భాగస్వాములు ఉండరు. వ్యాపారం, పెట్టుబడి, లాభాలు వ్యక్తిగతమైనవి. కాంట్రాక్టర్లు, చిరు వ్యాపారాలు, కన్సల్టెన్సీ సర్వీసులు. రిటైల్ దుకాణాలు వంటివి సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్'కు ఉదాహరణలు.

Advertisement

సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్ పద్ధతులు

  • షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్
  • MSME ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్
  • GST రిజిస్ట్రేషన్

సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్ ఒక సాధారణ బిజినెస్ అనుమతి లైసెన్స్. దీన్ని షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద నమోదు చేసుకోవచ్చు. లేదా MSME ద్వారా ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ విధానములో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా సులభంగా GST నెంబర్ దరఖాస్తు చేయడం ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఈ మూడింటిలో  ఏది గొప్పది అనేది మీ బిజినెస్ స్వభావం పై ఆధారపడి ఉంటుంది. మీ బిజినెస్ 20 లక్షలు పైబడి జరిగితే మీరు తప్పనిసరిగా GST కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలా కాకుంటే ఉద్యోగ్ ఆధార్ లేదా సాధారణ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ ఉత్తమం.

మీ బిజినెస్ లాభనష్టాల అంచనాకు దూరంగా ఉంటె MSME రిజిస్ట్రేషన్ ద్వారా ఉపయోగపరమైన ప్రభుత్వ సౌలభ్యలు అందుకోవచ్చు. అలానే లోన్లు తెచ్చుకునేందుకు అవకాశం మెండుగా ఉంటాయి. కొన్ని వ్యాపారాలకు ఈ మూడు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యే డాక్యూమెంట్స్

  • ఆధార్ కార్డు /ఓటర్ కార్డు
  • పాన్ కార్డు
  • బ్యాంకు అకౌంట్
  • రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రెస్స్ లేదా షాప్ అడ్రెస్స్

సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ మరియు రిజిస్ట్రేడ్ ఆఫీస్ అడ్రెస్ ఉంటె సరిపోతుంది. సంబంధిత రిజిస్ట్రేషన్ పోర్టల్ లలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ లైసెన్సు సులభంగా పొందొచ్చు. దరఖాస్తు రుసుములు కూడా పరిమితంగా ఉంటాయి. సోలో ప్రోపరైటెర్షిప్ రిజిస్ట్రేషన్ కు బిజినెస్ నేమ్  రిజిస్ట్రేషన్ అవసరంలేదు.

Advertisement

Post Comment