బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ – మైనారిటీ బాలికలకు
Scholarships

బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ – మైనారిటీ బాలికలకు

స్కూల్ మరియు కాలేజీ విద్యకు నోచుకోని నిరుపేద మైనారిటీ బాలిక విద్యార్థులకు బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్ ద్వారా తిరిగి తమ విద్యను కొనసాగే అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ 2003 లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించారు. రెండు లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉండే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనూలు మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) లకు చెందిన బాలిక విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఈ స్కాలర్షిప్ ద్వారా అర్హులైన మైనారిటీ బాలిక విద్యార్థులకు అడ్మిషన్, ట్యూషన్ ఫీజుతో సహా, బుక్స్, స్టేషనరీ, బోర్డింగ్, లార్జింగ్ మరియు ఇతర చార్జీలు కూడా చెల్లిస్తారు. దీనిని గతంలో మౌలానా ఆజాద్ జాతీయ స్కాలర్‌షిప్ పేరుతో అందించే వారు.

స్కాలర్షిప్ పేరు గం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్షిప్
ఎవరు అర్హులు మైనారిటీ బాలిక విద్యార్థులు
దరఖాస్తు ముగింపు తేదీ 15-10-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 31-10-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 31-10-2022

ఈ పథకం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ మరియు గుర్తింపు కలిగిన ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో చదివే మైనారిటీ బాలిక విద్యార్థులకు వర్తింపజేస్తారు. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా ఏటా దాదాపు 10 లక్షల మంది మైనారిటీ బాలిక విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. విద్యార్థి అకాడమిక్ పరీక్షలలో కనీసం 50 శాతం మార్కులు సాధించి, కుటుంబ ఆదాయం రెండు లక్ష రూపాయల లోపు ఉంటె ఈ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పేమెంట్ వివరాలు

స్కాలర్షిప్ విలువ
క్లాస్ IX - X 5,000/-
క్లాస్ XI - XII 6,000/-

స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ

జాతీయ కమిషన్ సెక్షన్ 2 (సి) మైనారిటీల చట్టం, 1992 ప్రకారం గుర్తించబడిన ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన మరియు జొరాస్ట్రియన్ (పార్సీలు) కుటుంబాలకు చెందిన క్లాస్ IX నుండి క్లాస్ XII చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రెండు లక్షల రూపాయలు మించకూడదు.

విద్యార్థి అకాడమిక్ పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ స్కాలర్షిప్ కుటుంబంలో ఇద్దరు పిల్లలు వరకు మాత్రమే అందిస్తారు. విద్యార్థి చెల్లుబాటు అయ్యే కుల మరియు ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు కలిగివుండాలి. విద్యార్థి తన ఆధార్ నెంబరుతో లింక్ చేయించుకున్న బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి

దరఖాస్తు చేయండి

ఈ స్కాలర్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ ఆయా రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు స్థానిక  పత్రికల్లో లేదా న్యూస్ ఛానెల్స్ ద్వారా విడుదల చేస్తాయి. అర్హుత ఉండే విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో, ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్థులు అందించిన వివరాలు అన్ని సక్రమంగా ఉండి, సదరు విద్యార్థి అర్హులు అని భావిస్తే, వారి బ్యాంకు అకౌంటులో స్కాలర్షిప్ జమచేస్తారు. ఇది వరకే అర్హుత పొందిన విద్యార్థులు తిరిగి కొత్త అకాడమిక్ ఏడాది కోసం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Post Comment