తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 28 ఆగష్టు 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. ఇవి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
ప్రపంచ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు నీరజ్ చోప్రా
ఆగస్టు 28, 2023న హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన చారిత్రాత్మక ప్రదర్శనలో నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అతను జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ (86.60 మీటర్లు) మరియు చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ 86.67 లను అధిగమించి విజేతగా నిలిచాడు.
1987లో కాశీనాథ్ నారాయణ్ పాటిల్ కాంస్య పతకం సాధించిన తర్వాత, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారతీయుడు. ఈ అత్యుత్తమ ప్రదర్శన నీరజ్‌కు బంగారు పతకాన్ని అందించడమే కాకుండా ప్రపంచ వేదికపై భారతీయ క్రీడలకు ట్రయల్‌బ్లేజర్‌గా నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత చోప్రాకి ఇది రెండో అతిపెద్ద అంతర్జాతీయ బంగారు పతకం. చోప్రా విజయం భారతదేశంలోని చాలా మంది యువ క్రీడాకారులకు జావెలిన్ త్రో క్రీడను చేపట్టేందుకు స్ఫూర్తినిస్తుంది.
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టకు చారిత్రాత్మక స్వర్ణం
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2023 ఐబీఎస్ఏ (ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) వరల్డ్ గేమ్స్‌లో భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ జట్టు ఆస్ట్రేలియా జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియాను 114/8కి పరిమితం చేసిన భారత్, ఆపై సవరించిన 42 పరుగుల లక్ష్యాన్ని 3.3 ఓవర్లలో ఛేదించింది. వర్షం-ప్రభావిత ఫైనల్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌లో అంధుల క్రికెట్ భాగం కావడం ఇదే తొలిసారి. ఈ మహిళల అంధుల క్రికెట్ యొక్క మొట్టమొదటి ఎడిషన్‌లో స్వర్ణం సాధించి భారతదేశం చరిత్ర సృష్టించింది.
ఎక్సర్‌సైజ్ బ్రైట్ స్టార్‌లో పాల్గొన్న భారత వైమానిక దళం
ఈజిప్టులో నిర్వహించే బహుళజాతి వ్యాయామం ' బ్రైట్ స్టార్ -23'లో భారత వైమానిక దళం పాల్గొంది. భారత సాయుధ దళాలు మొత్తం 549 మంది సిబ్బందితో బ్రైట్ స్టార్ వ్యాయామంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ వ్యాయామం ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 14 వరకు ఈజిప్ట్‌లోని మహ్మద్ నగుయిబ్ మిలిటరీ బేస్‌లో జరగనుంది. ఇది యూఎస్ సెంటికం మరియు ఈజిప్షియన్ సైన్యం నేతృత్వంలోని బహుళజాతి ట్రై-సర్వీసెస్ ఉమ్మడి సైనిక వ్యాయామం.
ఇది మొదట 1977 క్యాంప్ డేవిడ్ ఒప్పందం సమయంలో యూఎస్ మరియు ఈజిప్ట్ మధ్య ద్వైపాక్షిక శిక్షణా వ్యాయామంగా ప్రారంభించబడింది. ఈ వ్యాయామం యొక్క మొదటి ఎడిషన్ 1980 సంవత్సరంలో ఈజిప్టులో నిర్వహించబడింది. 1995 నుండి ఇతర దేశాల భాగస్వామ్యం కోసం వ్యాయామం విస్తరించబడింది. మునుపటి ఎక్సర్‌సైజ్ బ్రైట్ స్టార్ 2021 సంవత్సరంలో నిర్వహించబడింది, ఇందులో 21 దేశాల బలగాలు పాల్గొన్నాయి.
ఈ సంవత్సరం 34 దేశాలు ఎక్సర్‌సైజ్ బ్రైట్ స్టార్- 23లో పాల్గొంటున్నాయి. ఇది మిడిల్ ఈస్ట్ & నార్త్ ఆఫ్రికా రీజియన్‌లో ఇప్పటివరకు జరగని అతిపెద్ద ఉమ్మడి సైనిక వ్యాయామంగా నిలవనుంది. మొత్తం 549 మంది సిబ్బందితో భారత సాయుధ దళాలు బ్రైట్ స్టార్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత సైన్యానికి 23 జాట్ బెటాలియన్ నుండి ఒక బృందం ప్రాతినిధ్యం వహిస్తోంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2023లో ప్రణయ్‌కి కాంస్యం
బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2023 లో పురుషుల సింగిల్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పోరులో ప్రణయ్ మూడు గేమ్‌లలో 21-13, 15-21, 16-21తో స్థానిక ఫేవరెట్ అక్సెల్‌సెన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
31 ఏళ్ల ప్రణయ్ బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన ఐదవ భారతీయ పురుషుల సింగిల్స్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ గ్లోబల్ షోపీస్ ఈవెంట్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ (2021)కి చేరుకున్న ఏకైక భారతీయుడిగా కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు అబాయాలు ధరించడం నిషేధం
పాఠశాలల్లో కొంతమంది ముస్లిం మహిళలు ధరించే పూర్తి నిడివి గల అబాయాలను ధరించడాన్ని ఫ్రాన్స్ నిషేధించనుంది. మతపరమైన తీవ్రవాదంగా భావించే వాటిని అణిచివేసేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఈ నిషేధం ఒక భాగం. మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఈ నిషేధం వర్తిస్తుంది. ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి €1,500 (దాదాపు $1,600) వరకు జరిమానా విధించవచ్చు.
ఈ నిషేధంపై మిశ్రమ స్పందనలు వెల్లడివుతున్నాయి. లౌకికవాదాన్ని పరిరక్షించడం మరియు పాఠశాలల్లో మతపరమైన విభజనను నిరోధించడం అవసరమని వాదిస్తూ కొందరు నిషేధానికి మద్దతు ఇస్తున్నారు. మరికొందరు నిషేధాన్ని వ్యతిరేకించారు, ఇది వివక్షత మరియు మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తుందని వీరు వాదిస్తున్నారు.
మతపరమైన దుస్తులపై ఫ్రాన్స్ విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. 2004లో ఫ్రెంచ్ ప్రభుత్వం పాఠశాలల్లో కండువాలు ధరించడాన్ని నిషేధించింది. 2010లో ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో పూర్తిగా ముఖానికి వేసుకునే ముసుగులు ధరించడాన్ని నిషేధించింది. సెక్యులరిజాన్ని పరిరక్షించడానికి మరియు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరినీ సమానంగా చూడడానికి ఈ నిషేధాలు అవసరమని ఫ్రెంచ్ ప్రభుత్వం వాదిస్తోంది.