ఎల్ఐసీ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ 'బీమా రత్న' ప్రారంభం
భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భీమా రత్న అనే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. బీమా రత్న ప్లాన్ పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది .
అలానే వివిధ ఆర్థిక అవసరాలను తీర్చడానికి నిర్దిష్ట వ్యవధిలో పాలసీదారు మనుగడ కోసం కాలానుగుణ చెల్లింపులను కూడా అందిస్తుంది. ఇంకా, ప్లాన్ లిక్విడిటీ అవసరాల కోసం రుణ సౌకర్యం కూడా అందిస్తుంది.
రూపాయి ఆధారిత క్రిప్టో ఇండెక్స్'ని ప్రారంభించిన కాయిన్‌స్విచ్
భారతదేశపు అతిపెద్ద క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్ కాయిన్‌స్విచ్, దేశంలో మొదటిసారి రూపాయి ఆధారిత క్రిప్టో ఇండెక్స్ (CRE8)ని ప్రారంభించిన సంస్థగా అవతరించింది. కాయిన్‌స్విచ్ దేశంలో ఎనిమిది క్రిప్టో కరెన్సీల పనితీరును ట్రాక్ చేస్తుంది, ఇందులో బిట్‌కాయిన్ (BTC), ఎథేరియం (ETH), బినాన్స్ కాయిన్ (BNB), రిప్పల్ (XRP), కార్డానో (ADA), సోలానా (SOL), పోల్కాడోట్ (DOT) మరియు డాగ్‌కాయిన్ (DOGE) ఉన్నాయి.
భారతీయ రూపాయిలో వర్తకం చేయబడుతున్న క్రిప్టోస్ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో కాయిన్‌స్విచ్ 85% కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సంస్థలో 18 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. ఈ రూపాయి ఆధారిత క్రిప్టో ఇండెక్స్ అనేది క్రిప్టో మార్కెట్ లావాదేవీలపై మరింత పారదర్శకతను తీసుకురావడానికి చేసిన ప్రయత్నంగా ఆ సంస్థ చెప్పుకొచ్చింది.
సెబీ హోల్ టైమ్ మెంబర్‌గా అశ్వనీ భాటియా
మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో హోల్ టైమ్ మెంబర్ (డబ్ల్యూటీఎం)గా అశ్వనీ భాటియా బాధ్యతలు స్వీకరించారు. భాటియా గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసారు. ఈ పదవిలో ఆయన వచ్చే మూడేళ్ళ కాలానికి సేవలు అందించనున్నారు.
మెటా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా జేవియర్ ఒలివాన్
ఫేస్‌బుక్ యొక్క మాతృ సంస్థ మెటా యొక్క ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన జేవియర్ ఒలివాన్ బాధ్యతలు స్వీకరించారు. జేవియర్ ఒలివాన్ ప్రస్తుతం మెటాలో చీఫ్ గ్రోత్ ఆఫీసరుగా ఉన్నారు.
ఎస్‌ఎస్‌బీ డైరెక్టర్ జనరల్‌గా ఎస్‌ఎల్ థాసన్
1988-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి SL థాసేన్ సశాస్త్ర సీమా బల్ (SSB)కి కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన థావోసేన్ గతంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) యొక్క ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.
సశాస్త్ర సీమా బాల్ అనేది నేపాల్ మరియు భూటాన్‌లతో సరిహద్దులో మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం. ఇది భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న ఐదు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి.
ఆర్‌బిఐ రెపో రేటు మరోసారి 50 బేసిస్ పాయింట్లు పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) రెపో రేటును మరోసారి 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90%కి పరిమితం చేసింది. ఐదు వారాల్లో ఇది 2వ పెరుగుదల. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనా 5.7% నుండి 6.7%కి పెరిగినట్లు అంచనా వేసింది. ఆహార, చమురు ధరలు రోజురోజుకు పెరిగిపొతుండంతో కొన్ని దిద్దుబాట్లు చబడుతున్నట్లు వెల్లడించింది. అలానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనా 7.2% ఉండనున్నట్లు తెలిపింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ & సీఈఓగా మణిమేఖలై
ప్రభుత్వరంగ బ్యాంకు అయినా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎ మణిమేఖలైని ప్రభుత్వం నియమించింది. అలానే మరో ప్రభుత్వ బ్యాంకు పంజాబ్ & సింద్ బ్యాంక్ అధిపతిగా స్వరూప్ కుమార్ సాహాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎండీగా అలోక్ కుమార్ చౌదరి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టరుగా అలోక్ కుమార్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అలోక్ కుమార్ ఇదివరకే ఇదే బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (ఫైనాన్స్ )గా విధులు నిర్వర్తించే వారు. ఈ హోదాలో వచ్చే రెండేళ్ల కాలానికి ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఆర్బీఎల్ బ్యాంకు ఎండీ & సీఈఓగా ఆర్ సుబ్రమణ్యకుమార్
ప్రముఖ భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ (RBL) నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఆర్ సుబ్రమణ్యకుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎండీ విశ్వవీర్ అహుజా స్థానంలో 23 జూన్ 2022 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ హోదాలో వచ్చే మూడేళ్ల కాలానికి పనిచేయనున్నారు. ఈయన గతంలో ఇండియన్ బ్యాంకు మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల యందు పనిచేసారు.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ ప్రారంభం
భారతదేశపు ప్రీమియర్ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్‌టెల్, పార్టీనైట్ మెటావర్స్ ప్లాట్‌ఫారమ్‌లో భారతదేశపు మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను ఆవిష్కరించింది. ఈ మల్టీప్లెక్స్ అప్లికేషన్ అందుబాటులో ఉన్న ప్రముఖ ఓటీటీ భాగస్వాముల నుండి కంటెంట్ పోర్ట్‌ఫోలియోల యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇది మెటావర్స్ ఆధారంతో 20-స్క్రీన్ ప్లాట్‌ఫారమ్ ఆధారిత సేవలు అందించనుంది. ఇది దేశంలో ఏర్పాటు చేయబడ్డ మొదటి మెటావర్స్ ఆధారిత మల్టీప్లెక్స్.