కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | జాతీయ ముఖ్యాంశాలు
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | జాతీయ ముఖ్యాంశాలు

రెండు దేశాల మధ్య టూరిస్ట్ రైలు నడిపే మొదటి ఏజెన్సీగా ఐఆర్సీటీసీ

'టూరిస్ట్ రైలు ద్వారా రెండు దేశాలను కనెక్ట్ చేసిన మొదటి భారతీయ ఏజెన్సీగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిలిచింది. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "దేఖో అప్నా దేశ్". ప్రతిపాదితతో 'భారత్ గౌరవ్ పధకం' కింద ఐఆర్సీటీసీ ఈ టూరిస్ట్ ట్రైనును ఇండియా - నేపాల్ మధ్య నడుపుతుంది. ఈ ట్రైన్ ఢిల్లీలోని రామాయణ యాత్ర సర్క్యూట్ నుండి ప్రారంభమై సుమారు 8 వేల కిలోమీటర్ల దూరంలోని నేపాల్ దేశానికి చేరుకుంటుంది.

Advertisement

నానో యూరియా ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ

గుజరాత్‌లోని కలోల్‌లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నానో యూరియా వ్యవసాయ పంటలు & మొక్కలకు ప్రత్యామ్నాయ ఎరువుగా ఉపయోగపడనుంది.

పర్యావరణ అనుకూల ఉత్పత్తిగా రూపొందించిన ఇది అధిక సామర్థ్యంతో సంప్రదాయ యూరియా అవసరాన్ని 50% లేదా అంతకంటే ఎక్కువ తగ్గించనుంది. ఈ సంధర్బంగా ప్రధాని మాట్లాడుతూ ఒక చిన్న బాటిల్ (500 మి.లీ) నానో యూరియా ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న ఒక 50 కిలోల గ్రాన్యులర్ యూరియాకు సమానమని తెలియజేసారు.

వర్సిటీల విజిటర్‌గా గవర్నర్‌ను తొలగించే బిల్లులకు బెంగాల్ ప్రభుత్వం ఆమోదం

గవర్నర్‌ను ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సందర్శకుడిగా తొలగించే ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గవర్నర్ స్థానంలో విద్యాశాఖ మంత్రిని ప్రైవేట్ వర్సిటీల ‘విజిటర్’గా నియమించేలా చట్టాన్ని రూపొందిస్తుంది. అలానే ఆ రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్‌గా గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను తొలగించే రెండో బిల్లులను కూడా పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం ఆమోదించింది. యూనివర్సిటీల వీసీల నియామకాల్లో గవర్నర్ల పెత్తనానికి స్వప్తి పలికేందుకు మమతా ప్రభుత్వం యోచిస్తుంది.

భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ విడుదల

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) దేశం యొక్క మొట్టమొదటి జాతీయ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీని (NASP 2022) ప్రకటించింది. 2030 నాటికి ప్రపంచంలో ఎయిర్ స్పోర్ట్స్‌కు భారతదేశాన్ని హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో భారతదేశంలో ఏరో స్పోర్ట్స్ స్థితిని మెరుగుపరచడానికి ఇది ప్రారంభించబడింది. దీనిని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 07 జూన్ 2022న విడుదల చేసారు. ఈ పాలసీ ద్వారా 11 ఎయిర్ స్పోర్ట్స్ లను ప్రమోట్ చేయనున్నారు.

'క్రాంతి గాథ' గ్యాలరీని ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబై రాజ్‌భవన్‌లోని బ్రిటిష్ కాలం నాటి భూగర్భ బంకర్‌లో కొత్తగా రూపొందించిన 'క్రాంతి గాథ' భారతీయ విప్లవకారుల గ్యాలరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. బ్రిటిష్ కాలం నాటి ఈ భూగర్భ బంకరును 2016 లో ముంబై రాజ్‌భవన్‌ కింద గుర్తించారు. దీనిని ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టు అయినా విప్లవకారులను శిక్షించేందుకు ఉపయోగించేవారు. ఇదే పర్యటనలో మహారాష్ట్ర కొత్త గవర్నర్‌ నివాసం మరియు కార్యాలయమైన జల్ భూషణ్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

'భారత్ గౌరవ్' పథకం కింద మొదటి రైలు ప్రారంభం

భారత్ గౌరవ్ రైలు పథకం కింద భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీసును ఇండియన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ రైలును సౌత్ స్టార్ రైల్ మరియు ఫ్యూచర్ గేమింగ్ & హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించనున్నాయి. ఈ రైలు కోయంబత్తూర్ మరియు షిర్డీ మధ్య సేవలు అందించనుంది. దీనితో భారత్ గౌరవ్ రైలు పథకం కింద మొదటి రైలును నడుపుతున్న రైల్వే జోనుగా దక్షిణ రైల్వే నిలిచింది.

భారత్ గౌరవ్ ట్రైన్ పథకం అనేది దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నెలలో ప్రకటించింది. ఈ పధకంలో భాగంగా ప్రైవేట్ సంస్థలకు ఈ టూరిస్టు రైళ్లను నిర్వహించే అవకాశం కల్పిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

ఐదు రాష్ట్రాల హైకోర్టుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరాఖండ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మరియు గౌహతి (అస్సాం) రాష్ట్రాలు ఉన్నాయి.

  • ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ విపిన్ సంఘీ, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  • తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ అమ్జద్ అహ్తేషామ్ సయ్యద్ నియమితులయ్యారు.
  • రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ షిండే శంభాజీ శివాజీ నియమితులయ్యారు.
  • గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ రష్మిన్ ఎం ఛాయా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

నేషనల్ యోగా ఒలింపియాడ్ 2022

ఎన్‌సిఇఆర్‌టి నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ యోగా ఒలింపియాడ్ 2022ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఈ యోగా ఒలింపియాడ్‌ను విద్యా మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సంయుక్తంగా జూన్ 18 నుండి 20, 2022 వరకు నిర్వహిస్తోంది.

జాతీయ యోగా ఒలింపియాడ్ 2016 లో ఎన్‌సిఇఆర్‌టి ద్వారా ప్రారంభించబడింది. ఇది ఏటా విద్యార్థులకు యోగాసనాలను సంబంధించి క్విజ్ పోటీలు నిర్వహిస్తుంది. విజేతలకు జూన్ 21, ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం రోజున అవార్డులు అందిస్తుంది.

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రువాండా పర్యటన

26వ కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశం (CHOGM)లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాఎస్. జైశంకర్, రువాండాలోని కిగాలీకి చేరుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇంతకుముందు రెండుసార్లు వాయిదా పడిన ఈ సమావేశం ఈ ఏడాది జూన్ 22న నిర్వహించారు. పర్యటన సందర్భంగా, డాక్టర్ జైశంకర్ కామన్వెల్త్ సభ్య దేశాల ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.

ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా ఉన్న రుచిరా కాంబోజ్, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా నియమితులైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. రుచిరా కాంబోజ్ 1987- ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) బ్యాచుకు చెందిన అధికారిని.

Advertisement

Post Comment