Advertisement
సిబిఎస్‌ఈ సమాచారం 2023 : బోర్డు పరీక్షలు, ఫలితాలు, అడ్మిషన్లు
School Education

సిబిఎస్‌ఈ సమాచారం 2023 : బోర్డు పరీక్షలు, ఫలితాలు, అడ్మిషన్లు

సిబిఎస్‌ఈ దేశంలో పాఠశాల విద్యను అందిస్తున్న బోర్డులలో అతి పెద్దది. ఇది 1962 లో జాతీయ దృక్పథంతో  ఏర్పాటు చేయబడింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకే పాఠ్యప్రణళికతో సెకండరీ విద్యను అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసారు.

సిబిఎస్‌ఈ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 28,526 ప్రభుత్వ & ప్రైవేట్ పాఠశాలలు, అంతర్జాతీయంగా 28 దేశాల్లో 280 స్కూళ్ళు ఈ బోర్డుకు అనుబందంగా పనిచేస్తున్నాయి. ఈ పాఠశాలన్ని ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) పాఠ్యప్రణాళికను తప్పనిసరి ఆచరించాల్సి ఉంటుంది.

జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని రకాల ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు దాదాపు సిబిఎస్‌ఈ ఆధారిత సిలబస్ ఆధారంగానే నిర్వహించబడతాయి. ఈ ప్రశ్నపత్రాలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగా రూపొందించబడతాయి. అందుకే సిబిఎస్‌ఈ విద్యపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మక్కువ చూపిస్తారు.

దేశంలో క్వాలిటీ విద్యకు కేంద్రాలైన కేంద్రీయ విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు కూడా సిబిఎస్‌ఈ బోర్డుకు అనుభందంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి. ఈ జాబితాలో 1,138 కేంద్రీయ విద్యాలయాలు, 3,011 ప్రభుత్వ పాఠశాలలు, 16,741 స్వతంత్ర పాఠశాలలు, 595 జవహర్ నోవోదయ విద్యాలయాలు మరియు 14 సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు ఉన్నాయి.

సిబిఎస్‌ఈ స్కూళ్ళు సెకండరీ మరియు సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ (10+2) ఒకే బోర్డు ద్వారా అందిస్తాయి. X మరియు XII తరగతులకు ఏటా మార్చిలో వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. బోర్డు పరీక్షలలో కనీసం 33% మార్కులు పొందిన వారిని ఉత్తీర్ణతులుగా ప్రకటించి సీనియర్ సెకండరీ మరియు సీనియర్ సర్టిఫికెట్ అంజేస్తారు.

ఒకటి లేదా రెండు సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులకు జులైలో సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. కంపార్ట్‌మెంట్‌లో ఫెయిల్ అయినవారు లేదా మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు వచ్చే ఏడాది తీసుకున్న సబ్జెక్టులన్నింటినీ తిరిగి రాయాల్సి ఉంటుంది .

సిబిఎస్‌ఈ గ్రేడింగ్ సిస్టమ్

Grade గ్రేడ్ A1 గ్రేడ్ A2 గ్రేడ్ B1 గ్రేడ్ B2
Criteria ఉత్తీర్ణులైన టాప్ 1/8వ వంతు విద్యార్థులు తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు
గ్రేడ్ C1 గ్రేడ్ C2 గ్రేడ్ D1 గ్రేడ్ D2 గ్రేడ్ E*
తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు తర్వాత టాప్ 1/8వ వంతు విద్యార్థులు మిగిలిన వాళ్ళు ఫెయిల్

సిబిఎస్‌ఈ సెకండరీ కరిక్యులమ్ (క్లాస్ IX & X)

క్లాస్ IX & X సంబంధించిన సిబిఎస్‌ఈ సెకండరీ కరిక్యులమ్, ఐదు తప్పనిసరి సబ్జెక్టులతో పాటుగా ఒక ఆప్షనల్ సబ్జెక్టు మరియు మరో నాలుగు పాఠశాల ఆధారిత అంతర్గత మూల్యాంకనం కలిగి ఉన్న తప్పనిసరి సబ్జెక్టులు ఉంటాయి. లాంగ్వేజ్ 1 & 2, మాథ్స్, సోషల్ సైన్సెస్ మరియు సైన్స్ సబ్జెక్టులు అందరికి కామన్‌గా ఉంటాయి.

6 వ సబ్జెక్టుగా స్కిల్స్ ఎలెక్టివ్స్ సంబంధిత సబ్జెక్టులు ఆప్షనల్‌గా ఉంటాయి, 7 వ సబ్జెక్టుగా హెల్త్ & ఫీజికల్ ఎడ్యుకేషన్, 8వ సబ్జెక్టుగా వర్క్ ఎక్సపీరియన్స్, 9వ సబ్జెక్టుగా ఆర్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సంబంధిత అంశాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టు గరిష్టంగా 100 మార్కులకు కేటాయించబడి ఉంటాయి.

వీటిలో 80 మార్కులు థియరీ/వారీక్ష పరీక్షలకు, ఇంటర్నల్ అస్సేస్మెంట్స్ సంబంధించి 20 మార్కులు కేటాయిస్తారు. అలానే గ్రూపు A2 సబ్జెక్టులకు సంబంధించి 50 మార్కులు తివారీకి, 50 మార్కులు ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.

సబ్జెక్టు పేరు సబ్జెక్టు గ్రూపు
తప్పనిసరి సబ్జెక్టులు సబ్జెక్టు 1 లాంగ్వేజ్ I గ్రూపు L
సబ్జెక్టు 2 లాంగ్వేజ్ II గ్రూపు L
సబ్జెక్టు 3 సోషల్ సైన్సెస్ గ్రూపు A1
సబ్జెక్టు 4 మ్యాథమెటిక్స్ (స్టాండర్డ్ or బేసిక్) గ్రూపు A1
సబ్జెక్టు 5 సైన్స్ గ్రూపు A1
ఆప్షనల్ సబ్జెక్టులు సబ్జెక్టు 6 స్కిల్స్ ఎలెక్టివ్స్ గ్రూపు S
తప్పనిసరి సబ్జెక్టులు (పాఠశాల ఆధారిత అంతర్గత మూల్యాంకనం) సబ్జెక్టు 7 హెల్త్ & ఫీజికల్ ఎడ్యుకేషన్ గ్రూపు A2
సబ్జెక్టు 8 వర్క్ ఎక్సపీరియన్స్ గ్రూపు A2
సబ్జెక్టు 9 ఆర్ట్ ఎడ్యుకేషన్ గ్రూపు A2
  1. లాంగ్వేజ్ గ్రూప్ : ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటుగా, తెలుగు వంటి 37 ఇతర స్థానిక, ప్రాంతీయ భాషలు ఉన్నాయి. వీటిని నుండి లాంగ్వేజ్ 1 & 2 సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  2. సోషల్ సైన్సెస్ : సోషల్ సైన్సెస్ గ్రూపులో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ మరియు పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి.
  3. సైన్స్ గ్రూప్ : బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  4. మ్యాథమెటిక్స్ : మ్యాథమెటిక్స్ (స్టాండర్డ్ & బేసిక్)
  5. స్కిల్స్ ఎలెక్టివ్స్ : బేసిక్ ఒకేషనల్ సబ్జెక్టులు
  6. ఆర్ట్ ఎడ్యుకేషన్ : పెయింటింగ్, డ్రాయింగ్ etc
  7. హెల్త్ & ఫీజికల్ ఎడ్యుకేషన్ : యోగ , NCC etc

సీనియర్ సెకండరీ కరిక్యులమ్ (క్లాస్ XI & XII)

క్లాస్ XI & XII సంబంధించిన సిబిఎస్‌ఈ సీనియర్ సెకండరీ కరిక్యులమ్ యందు ఐదు తప్పనిసరి సబ్జెక్టులతో పాటుగా ఒక ఆప్షనల్ సబ్జెక్టు మరియు మరో నాలుగు పాఠశాల ఆధారిత అంతర్గత మూల్యాంకనం కలిగి ఉన్న తప్పనిసరి సబ్జెక్టులు ఉంటాయి.

6 వ సబ్జెక్టు ఆప్షనల్‌గా ఉంటుంది. దీనిలో థర్డ్ లాంగ్వేజ్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 7 నుండి 9 వ సబ్జెక్టు వరకు వర్క్ ఎక్సపీరియన్స్ సంబంధించి సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు గరిష్టంగా 100 మార్కులకు కేటాయించబడి ఉంటాయి.

వీటిలో 80 మార్కులు థియరీ/వారీక్ష పరీక్షలకు, ఇంటర్నల్ అస్సేస్మెంట్స్ సంబంధించి 20 మార్కులు కేటాయిస్తారు. అలానే గ్రూపు A2 సబ్జెక్టులకు సంబంధించి 50 మార్కులు తివారీకి, 50 మార్కులు ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.

సబ్జెక్టు పేరు సబ్జెక్టు గ్రూపు
తప్పనిసరి సబ్జెక్టులు సబ్జెక్టు 1 హిందీ/ఇంగ్లీష్ గ్రూపు L
సబ్జెక్టు 2 లాంగ్వేజ్ / గ్రూపు Aసబ్జెక్టు గ్రూపు L
సబ్జెక్టు 3 గ్రూపు A/S నుండి ఏదైనా ఆప్షనల్ సబ్జెక్టు గ్రూపు A1
సబ్జెక్టు 4 గ్రూపు A/S నుండి ఏదైనా ఆప్షనల్ సబ్జెక్టు గ్రూపు A1
సబ్జెక్టు 5 గ్రూపు A/S నుండి ఏదైనా ఆప్షనల్ సబ్జెక్టు గ్రూపు A1
ఆప్షనల్ సబ్జెక్టులు సబ్జెక్టు 6 గ్రూపు A/థర్డ్ లాంగ్వేజ్ సబ్జెక్టు గ్రూపు L/A1
తప్పనిసరి సబ్జెక్టులు (పాఠశాల ఆధారిత అంతర్గత మూల్యాంకనం) సబ్జెక్టు 7 వర్క్ ఎక్సపీరియన్స్ గ్రూపు A2
సబ్జెక్టు 8 వర్క్ ఎక్సపీరియన్స్ గ్రూపు A2
సబ్జెక్టు 9 వర్క్ ఎక్సపీరియన్స్ గ్రూపు A2
లాంగ్వేజ్ గ్రూపు ఎంపికలు ( గ్రూప్ L)
అరబిక్, అస్సామీ, బెంగాలీ, భూటియా, బోడో, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, కోర్ హిందీ, ఎలెక్టివ్ ఇంగ్లీష్, కోర్ ఇంగ్లీష్, ఎలెక్టివ్ జపనీస్, కన్నడ, కాశ్మీరీ, లెప్చా, లింబూ, మలయాళం, మణిపురి, మరాఠీ, మిజో, నేపాలీ, ఒడియా, పర్షియన్ పంజాబీ XI, పంజాబీ XII, రష్యన్, సంస్కృతం XI, కోర్ సంస్కృతం XI , ఎలెక్టివ్ సంస్కృతం XII, కోర్ సంస్కృతం XII, ఎలెక్టివ్ సింధీ, స్పానిష్, తమిళం, తంగ్‌ఖుల్, తెలుగు ఏపీ, తెలుగు తెలంగాణ, టిబెటన్, ఉర్దూ.
 అకాడమిక్ ఎంపికలు (గ్రూప్ A)
అకౌంటెన్సీ, బయాలజీ, బయో టెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, కర్ణాటక్ మెలోడిక్, కర్ణాటక్ వోకల్, కర్ణాటక్ పెర్కషన్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ న్యూ XI, కంప్యూటర్ సైన్స్ న్యూ XII, డ్యాన్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్, పెయింటింగ్, అప్లయిడ్ కమర్షియల్, ఆర్ట్స్, జాగ్రఫీ, హిందుస్తానీ మెలోడిక్, హిందుస్తానీ, పెర్కషన్, హిందుస్తానీ వోకల్, హిస్టరీ, హోమ్ సైన్స్ పాయింటర్స్ ఫర్ రిఫరెన్స్ ఫర్ క్లాస్-XII, ఇన్ఫో ప్రాక్టీసెస్ న్యూ, నాలెడ్జ్ ట్రెడిషన్ - ఇండియాలీగల్ స్టడీ, మ్యాథమెటిక్స్, NCC, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ చేస్తుంది.
స్కిల్ సబ్జెక్టుల ఎంపికలు (S గ్రూప్)
రిటైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వెబ్ అప్లికేషన్, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ మేనేజ్‌మెంట్, టూరిజం, బ్యూటీ & వెల్నెస్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రొడక్షన్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, బ్యాంకింగ్, మార్కెటింగ్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, హార్టికల్చర్, టైపోగ్రఫీ & కంప్యూటర్ అప్లికేషన్, జియోస్పేషియల్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ , ఎలక్ట్రానిక్ టెక్నాలజీ, మల్టీ-మీడియా, టాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్, ఆఫీస్ ప్రొసీజర్స్ & ప్రాక్టీసెస్, షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్), షార్ట్‌హ్యాండ్ (హిందీ), ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్, మెడికల్ డయాగ్నోస్టిక్స్, టెక్స్‌టైల్ డిజైన్, డిజైన్, సేల్స్‌మెన్‌షిప్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ & ఫుడ్ డైటెటిక్స్, మాస్ మీడియా స్టడీస్, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్, ఫ్యాషన్ స్టడీస్, యోగా, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ & ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
కో-స్కాలస్టిక్ ఏరియాస్ (జనరల్ స్టడీస్)
సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, జాతీయ ఐక్యత, అంతర్జాతీయ అవగాహన, సైన్స్ మరియు సమాజం, భారతీయ సమాజం యొక్క సమకాలీన సమస్యలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వం, భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు.