Advertisement
నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి అడ్మిషన్లు | JNVST 2023
Admissions School Entrance Exams

నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి అడ్మిషన్లు | JNVST 2023

జవహర్ నవోదయ విద్యాలయాలో 2023-24 విద్యా ఏడాదికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ పాఠశాలు మరియు ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాలలో ఈ ఏడాది 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జనవరి 31 లోపు నవోదయ అధిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

జవహర్ నవోదయ విద్యాలయాలు

జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రతిభావంతులైన రూరల్ విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన పాఠశాల విద్యను అందించాలనే లక్ష్యంతో 1986 లో వీటిని స్థాపించారు. జవహర్ నవోదయ విద్యాలయాలు పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన నవోదయ విద్యాలయం సమితి ద్వారా నడపబడుతున్నాయి.

జవహర్ నవోదయ విద్యాలయాలు భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 636 నవోదయ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠశాలన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అకాడమిక్ పాఠ్యప్రణాళికను అనుచరిస్తాయి. జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందిస్తారు. స్పోర్ట్స్, NCC, NSS కార్యక్రమాల్లో శిక్షణ అందిస్తారు.

నవోదయ విద్యాలయాలు పూర్తి  కో-ఎడ్యుకేషనల్ రెసిడెన్సియల్ స్కూళ్ళుగా నిర్వహించబడుతున్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ స్కూళ్ళు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో, సకల వసతులతో కూడిన పూర్తిస్థాయి ఉచిత విద్యను అందుకుంటున్నారు. వీటికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అందించబడుతుంది.

నవోదయ విద్యాలయాలు ప్రధానంగా క్లాస్ VI నుండి XII సంబంధించి గ్రామీణ టాలెంటెడ్ విద్యార్థులపై ఫోకస్ పెడుతుంది. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు ఏటా రెండు లేదా మూడు ఫేజ్ ల్లో నిర్వహిస్తారు. క్లాస్ V చదువుతున్న విద్యార్థులు నవోదయ విద్యాలయం సమితి నిర్వహించే ప్రవేశ పరీక్షాలో మెరిట్ సాధించడం ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. ఒక సారి నవోదయ స్కూళ్లలో అడ్మిషన్ పొందితే క్లాస్ VI  నుండి XII వరకు ఇంకా వెనక్కి తిరిగే అవకాశం ఉండదు.

జవహర్ నవోదయ విద్యాలయాల సెలక్షన్ టెస్ట్ (JNVST)

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు JNVST ప్రవేశ పరీక్షా ద్వారా నిర్వహిస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా భారీ యెత్తున పోటీ ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతి నవోదయ పాఠశాలలో క్లాస్ VI సంబంధించి 80 సీట్లు భర్తీచేస్తారు.

అందుబాటులో ఉన్న ఈ 80 సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులచే 25 శాతం సీట్లు అర్బన్ విద్యార్థులచే భర్తీ చేస్తారు. ప్రవేశ ప్రకటన ఏటా జూన్ నెలలో స్థానిక వార్త పత్రికల ద్వారా విడుదల చేస్తారు. మొదటి ఫేజ్ పరీక్షా జనవరిలో, సెకండ్ ఫేజ్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తారు.

JNVST ఎలిజిబిలిటీ

  • నవోదయ విద్యాలయం ఏ జిల్లాలో ఉంటె, ఆ జిల్లా విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు
  • క్లాస్ VI కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 12 ఏళ్ళు, గరిష్టంగా 16 ఏళ్ళ మధ్య ఉండాలి
  • బాలికా విద్యార్థుల కోసం 1/3 వంతు సీట్లు కేటాయిస్తారు.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, శారీరక వైకుల్యం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తారు.
  • దరఖాస్తు చేసే అభ్యర్థి ప్రస్తుత విద్య సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో క్లాస్ V చదువుతూ ఉండాలి
  • గ్రామీణ కోటాలో దరఖాస్తు చేసే అభ్యర్థులు క్లాస్ III, IV, V గ్రామీణ ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదివి ఉండాలి
  • ఒక సారి పరీక్షకు హాజరయిన విద్యార్థి మరో మారు హాజరయ్యేందుకు అవకాశం లేదు

JNVST 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభం 1 జనవరి 2023
దరఖాస్తు తుది గడువు 31 జనవరి 2023
Jnvst 2023 ఎగ్జామ్ తేదీ 29 ఏప్రిల్ 2023
Jnvst 2023 ఫలితాలు మే 2023

రిజర్వేషన్ల కోటా

  • అందుబాటులో ఉండే సీట్లలో 75 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులచే భర్తీ చేస్తారు
  • రిజర్వేషన్ కోటా పరంగా 15 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులచే, 7.5 శాతం ఎస్టీ విద్యార్థులచే మరియు 27 శాతం ఓబీసీ విద్యార్థులకు కేటాయిస్తారు
  • అందుబాటులో ఉన్న సీట్లలో 1/3 వంతు సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు

కావాల్సిన డాక్యూమెంట్స్

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • ఇంటిగ్రేటెడ్ & రెసిడెన్సీ సర్టిఫికెట్
  • ట్రాన్సఫర్ సర్టిఫికెట్ (టీసీ)
  • ఆధార్ కార్డు & రేషన్ కార్డు, ఫోటోలు etc

నవోదయ విద్యాలయ దరఖాస్తు విధానం

JNVST దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానములో అందుబాటులో ఉంటుంది. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్సైటు (www.navodaya.gov.in) ద్వారా గడువులోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హుత ఉన్న విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో మొబైల్, కంప్యూటర్, లాప్టాప్ లేదా నెట్ సెంటర్ ద్వారా దరఖాస్తూ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆన్‌లైన్ దరఖాస్తులో విద్యార్థి విద్య, వ్యక్తిగత మరియు చిరునామా వివరాలు పొందపరచాల్సి ఉంటుంది.

ఆ తర్వాత దశలో విద్యార్థి ఫోటో గ్రాఫ్ తో పాటుగా విద్యార్థి మరియు పేరెంట్ సంతకాలను జేపీజి ఫైల్ ఫార్మేట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొందిన విద్యార్థులకు పరీక్షా షెడ్యూల్ కు 10 నుండి 20 రోజుల ముందు వెబ్సైటులో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు. పరీక్షా పూర్తి అయ్యాక ఫలితాలు వెబ్సైటుతో పాటుగా స్థానిక నవోదయ విద్యాలయల్లో లేదా జిల్లా విద్య అధికారి కార్యాలయాలలో అందుబాటులో ఉంచుతారు.

JNVST ఎగ్జామ్ నమూనా

JNVST ప్రవేశ పరీక్షా ఆఫ్‌లైన్ విధానములో పెన్ మరియు పేపర్ (OMR) ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్షా పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. పరీక్షా 2 గంటల నిడివితో 80 ముల్టీఫుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. వాటి నుండి ఒక సరైన సమాధనం గుర్తించాల్సి ఉంటుంది.

సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1.25 మార్కులు కేటాయిస్తారు. పరీక్షా 100 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ మరియు లాంగ్వేజ్ సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతయి. ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మీడియంతో పాటుగా స్థానిక రీజనల్ మీడియంలో అందుబాటులో ఉంటుంది.

టైపు ఆఫ్ టెస్ట్ ప్రశ్నలు మార్కులు సమయం
మెంటల్ ఎబిలిటీ టెస్ట్
అర్థమెటిక్ టెస్ట్
లాంగ్వేజ్ టెస్ట్
40
20
20
50
25
25
60 నిముషాలు
30 నిముషాలు
30 నిముషాలు
మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులు 2 గంటలు

JNVST ఎగ్జామ్ సిలబస్

నవోదయ ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయి సిలబసుతో నిర్వహిస్తారు. ప్రశ్నలు బేసిక్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ మరియు స్థానిక భాషకు సంభందించి ప్రాథమిక స్థాయి ప్రశ్నలు ఉంటాయి.

మెంటల్ ఎబిలిటీ : మెంటల్ ఎబిలిటీ సంబంధించిన ప్రశ్నలు బొమ్మలు మరియు రేఖాచిత్రాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఈ ప్రశ్నలు విద్యార్థి సాధారణ మానసిక పనితీరును అంచనా వేయడానికి ఉద్దేశించబడ్డాయి ఉంటాయి. ఈ సెక్షన్ యందు మొత్తం 40 ప్రశ్నలను పది భాగాలుగా విభజించి, ఒక్కొక్క భాగం నుండి 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి.

అర్థమెటిక్ టెస్ట్ : అంకగణితంలో విద్యార్థి ప్రాథమిక సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ సెక్షన్ యందు 15 అంకగణిత అంశాలపై మొత్తం 20 ప్రశ్నలు ఇవ్వబడతయి. ఇందులో 1. నంబర్స్ & న్యూమరికాల్ సిస్టం. 2. పూర్ణ సంఖ్యలు (హోల్ నంబర్స్) . 3. ఫంక్షనల్ నంబర్స్ & ఫండమెంటల్స్. 4. ఫాక్టర్స్ మరియు గుణిజాలు. 5. LCM మరియు HCF. 6. డెసిమల్స్ & ఫండమెంటల్స్. 7. భిన్నాలను దశాంశాలకు మార్చడం.

8. పొడవు, ద్రవ్యరాశి, సామర్థ్యం, ​​సమయం, డబ్బు. 9. దూరం, సమయం & వేగం. 10. అప్రాక్సిమాషన్ ఎక్సప్రెషన్స్. 11. సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికాల్ ఎక్సప్రెషన్స్. 12. శాతం & అప్లికేషన్లు. 13. లాభం మరియు నష్టం. 14. ఏరియా & వాల్యూమ్ వంటి అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.

లాంగ్వేజ్ టెస్ట్ : ఎంపిక చేసుకున్న భాషలో అభ్యర్థుల పఠన గ్రహణశక్తిని అంచనా వేయడం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ సెక్షన్ యందు మొత్తం 20 ప్రశ్నలు ఐదేసి చెప్పున మొత్తం నాలుగు భాగాలుగా ఇస్తారు. విద్యార్థులు ప్రతి భాగాన్ని జాగ్రత్తగా చదవండి మరియు తదుపరి ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.

ఏపీ మరియు తెలంగాణలో ఉన్న నవోదయ విద్యాలయాలు

రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 24 నవోదయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. అందులో 15 ఆంధ్రప్రదేశ్ లు ఉండగా మిగతా 9 తెలంగాణలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవోదయ స్కూల్స్

జవహర్ నవోదయ విద్యాలయం - లేపాక్షి అనంతపూర్ (ఫోన్ 8556240460)
జవహర్ నవోదయ విద్యాలయం I - పెద్దాపురం, తూర్పు గోదావరి ( ఫోన్ -08852-241354)
జవహర్ నవోదయ విద్యాలయం II - పిచ్చికలపాడు, తూర్పు గోదావరి ( ఫోన్ -087432 16060)
జవహర్ నవోదయ విద్యాలయం - పెద్దవేగి, పశ్చిమ గోదావరి (ఫోన్ 088122 59461)
జవహర్ నవోదయ విద్యాలయం - మద్దిరాల, గుంటూరు (ఫోన్ 01783-238248)
జవహర్ నవోదయ విద్యాలయం - అకిపాడు కడప (ఫోన్ 085652 00077)
జవహర్ నవోదయ విద్యాలయం - బనవాసి కర్నూలు(ఫోన్ 085122 46544)
జవహర్ నవోదయ విద్యాలయం - కృష్ణాపురం నెల్లూరు (ఫోన్ 086202 28722)
జవహర్ నవోదయ విద్యాలయం II - కలుజువాలాపాడు ప్రకాశం (ఫోన్ 9398456224)
జవహర్ నవోదయ విద్యాలయం I - ఒంగోలు, ప్రకాశం (ఫోన్ 085922 00415)
జవహర్ నవోదయ విద్యాలయం - వలసపల్లె చిత్తూరు (ఫోన్ 085712 30631)
జవహర్ నవోదయ విద్యాలయం - వెలేరు హనుమాన్ జంక్షన్ కృష్ణ (ఫోన్ 91802 21104)
జవహర్ నవోదయ విద్యాలయం - కిల్ట్మపాలెం ఎస్ కోట, విజయనగరం (ఫోన్ 9441253157)
జవహర్ నవోదయ విద్యాలయం - వెన్నెలవలస,సరుబుజ్జిలి శ్రీకాకుళం (ఫోన్ - 089422 46803)
జవహర్ నవోదయ విద్యాలయం - కొమ్మాది, మధురవాడ, విశాఖపట్నం (ఫోన్ - 0891-2739245)

తెలంగాణలో నవోదయ స్కూల్స్

జవహర్ నవోదయ విద్యాలయం - కాగజ్ నగర్, ఆదిలాబాద్ (ఫోన్ - 087382 38021)
జవహర్ నవోదయ విద్యాలయం - చొప్పదండి కరీంనగర్ (ఫోన్ - 0878-2281476)
జవహర్ నవోదయ విద్యాలయం - కూసుమంచి, ఖమ్మం (ఫోన్ - 087422 73025)
జవహర్ నవోదయ విద్యాలయం - బిజ్నిపల్లి, మహాబుబ్‌నగర్ (ఫోన్ - 085402 00665)
జవహర్ నవోదయ విద్యాలయం - వరంగల్, మెదక్ (ఫోన్ - 084542 53055)
జవహర్ నవోదయ విద్యాలయం - చెలకుర్తి, నల్గొండ (ఫోన్ - 086802 75430)
జవహర్ నవోదయ విద్యాలయం - కామారెడ్డి, నిజామాబాద్ (ఫోన్ - 084652 75541)
జవహర్ నవోదయ విద్యాలయం  - గోపన్నపల్లి గచ్చిబౌలి హైదరాబాద్ (ఫోన్ - 040 2970 0558)
జవహర్ నవోదయ విద్యాలయం - మామునూర్, వరంగల్ (ఫోన్ - 0870 250 7363)