Advertisement
రిపోర్టులు & ర్యాంకులు | జనవరి 2022
Telugu Current Affairs

రిపోర్టులు & ర్యాంకులు | జనవరి 2022

చైనాలో ప్రపంచ అత్యంత పొడవైన మెట్రో లైన్ ప్రారంభం

చైనా వాణిజ్య నగరం షాంఘైలో ఇటీవలే ప్రారంభించిన రెండు కొత్త మెట్రో మార్గాలతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్ ఉన్న నగరంగా తన ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. కొత్త మార్గాలతో, షాంఘై మెట్రో నెట్‌వర్క్ మొత్తం పొడవు 831 కి.మీలకు విస్తరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో మార్గంగా నిలిచింది.

టాప్ 10 గ్లోబల్ విమానాశ్రయాల జాబితాలో చెన్నై ఎయిర్ పోర్ట్

ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ 'సిరియమ్' ప్రకారం, 2021లో ఆన్-టైమ్ పనితీరు సంబంధించి టాప్ 10 గ్లోబల్ లిస్ట్‌లో స్థానం పొందిన ఏకైక భారతీయ విమానాశ్రయంగా చెన్నై ఎయిర్ పోర్ట్ నిలిచింది. ఈ జాబితాలో టాప్ 1 లో మియామీ ఎయిర్ పోర్ట్ (యూఎస్) ఉండగా ఫుకువోకా ఎయిర్ పోర్ట్ (జపాన్), హనెదా ఎయిర్ ఫోర్ట్ (జపాన్) తర్వాత రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. ఈ లిస్టులో చెన్నై ఎయిర్ పోర్టు 8 వ స్థానం దక్కించుకుంది.

దేశంలో అత్యధిక ఓడీఎఫ్ గ్రామాలను కలిగిన రాష్ట్రంగా తెలంగాణ

స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఫేజ్-2 కార్యక్రమం కింద అత్యధిక బహిరంగ మలవిసర్జన రహిత (ODF ప్లస్) గ్రామాల జాబితాలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు సంబంధించి ఓడీఎఫ్ ప్లస్ జాబితాలో 14,200 గ్రామాలు ఉండగా 13,737 (96.74%) గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా నమోదు అయ్యాయి. ఈ జాబితాలో తమిళనాడు, కర్ణాటకలు తర్వాత స్థానంలో నిలిచాయి.

ఒక గ్రామంలోని అన్ని గృహాలు, అలాగే ప్రాథమిక పాఠశాలు, పంచాయితీ కార్యాలయాలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్డి అందుబాటులో ఉంటూ, ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణను సమగ్రంగా నిర్వహించే గ్రామాలను ఓడీఎఫ్ (ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ) జాబితాలో చేర్చుతారు.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 లో భారతదేశ ర్యాంక్ 83

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ 2022లో భారతదేశం తన స్థానాన్ని ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని 111 దేశాల జాబితాలో 83వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ జాబితాలో భారత్ 90వ స్థానంలో ఉండేది. ఈ ఏడాదికి కూడా జపాన్, సింగపూర్ పాస్‌పోర్ట్లు ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రపంచంలోని అన్ని పాస్‌పోర్ట్‌ల యొక్క అధికారిక ర్యాంకింగును వాటి హోల్డర్లు ముందస్తు వీసా లేకుండా యాక్సెస్ చేయగల గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా ప్రకటిస్తుంది. జపాన్, సింగపూర్ పౌరులు ముందస్తు వీసా లేకుండా 192 దేశాలు సందర్శించ గలరు.

భారతదేశ ఉత్తమ ప్రైవేట్ బ్యాంక్'గా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్‌మెంట్ (PWM) నిర్వహించిన గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భారతదేశంలో అత్యుత్తమ ప్రైవేట్ బ్యాంక్‌గా ఎంపికైంది. ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్‌మెంట్ (PWM) ప్రైవేట్ బ్యాంకులు మరియు అవి పనిచేసే ప్రాంతీయ ఆర్థిక కేంద్రాల వృద్ధి వ్యూహాలను విశ్లేషించి నివేదిస్తుంది.

2022లో గ్లోబల్ నిరుద్యోగం 207 మిలియన్లుగా అంచనా

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (LIO) యొక్క వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్ ట్రెండ్స్ 2022 నివేదిక ప్రకారం, గ్లోబల్ నిరుద్యోగం కనీసం 2023 వరకు కోవిడ్-19కి ముందు ఉన్న స్థాయిల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. 2022 స్థాయి 2019లో 186 మిలియన్లతో పోలిస్తే 207 మిలియన్లుగా అంచనా వేయబడింది, నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి ప్రపంచ కార్మిక మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నందున ఈ నిరుద్యోగ అనిశ్చితి ఇంకొన్నాళ్లు కొనసాగనుందని వెల్లడించింది.

Post Comment