నాబార్డు ఉద్యోగాలు | తాజా నోటిఫికేషన్ మరియు ఎంపిక ప్రక్రియ
Bank Jobs Latest Jobs

నాబార్డు ఉద్యోగాలు | తాజా నోటిఫికేషన్ మరియు ఎంపిక ప్రక్రియ

నియామక బోర్డు నాబార్డు
నియామక పరీక్షా గ్రూపు A,B,C జాబ్స్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్
వయో పరిమితి 21 - 30 ఏళ్ళ మధ్య
తాజా నోటిఫికేషన్ క్లిక్ చేయండి

వ్యవసాయం, గ్రామీణాభివృద్దే ధ్యాయంగా 1981 లో నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) యేర్పాటుచేయడం జరిగింది. దేశ ఆర్థికవృద్ధికి పట్టు కొమ్మలుగా నిలిచే గ్రామాలను ఆర్థిక ప్రగతిపథంలో నడిపించేందుకు ఒక ప్రత్యేక డెవలప్మెంట్ ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్ ఉండాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరియు భారత ప్రభుత్వం పట్టుబట్టడంతో 1981 లో నాబార్డ్ ఏర్పాటుచేస్తూ భారత ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసింది.

Advertisement

నాబార్డ్ గ్రామీణ ఆర్థికవృద్ధిని పెంపొందించడంతో పాటుగా, వ్యవసాయ సంస్థాగత రుణాల క్రమబద్దీకరణ, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ ఆవిష్కారణలు, అగ్రికల్చర్ లో సాంకేతిక పరిచయం, స్థిరమైన వ్యవసాయ దిగుబడులు పెంచడం వంటి బృహత్తరమైన విధులు నిర్వర్తిస్తుంది. గ్రామీణ ఆర్థికవృద్ధిని బలోపేతం చేసే ఈ అంశాలన్నీ..తెరవెనక నిర్విరామంగా అమలుపరిచే ఉత్సాహవంతమైన సిబ్బంది నియామకం కోసం, నాబార్డ్ ఏడాది పొడుగున నియామక ప్రకటనలు జారీచేస్తుంది. రెగ్యులర్ లేదా కాంట్రాక్టు పద్దతిలో జరిగే ఈ నియామకాలకు సంబంధించి పూర్తి ఇప్పుడు తెల్సుకుందాం.

నాబార్డ్ నియామక ప్రక్రియకు సంబంధించి రెగ్యులర్ కోటాలో భర్తీచేసే ఉద్యోగాలు. అభ్యర్థి విద్యార్హుత, ఉద్యోగ హోదా పరంగా గ్రూప్ A, గ్రూపు B, గ్రూపు C లుగా విభజించి భర్తీ ప్రక్రియ చేపడతారు. గ్రూపు A కేటగిరిలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు, గ్రూపు B లో డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు, గ్రూపు C లో ఆఫిస్ అటెండర్ పోస్టులను భర్తీచేస్తారు.

నాబార్డ్ గ్రూపు A ఉద్యోగాలు

నాబార్డ్  కార్యాలయాల్లో రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS), ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్ (P & SS), రాజభాష మరియు లీగల్ విభాగాలలో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి పోస్టులను గ్రూపు A విభాగంలో భర్తీచేస్తారు. రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS) సంబంధించిన సిబ్బందిని తిరిగి గ్రేడు A, గ్రేడు B అధికారులుగా విభజించి నియామకం చేపడతారు. గ్రేడ్ A అధికారికి అసిస్టెంట్ మేనేజర్ హోదాను, గ్రేడ్ B అధికారికి మేనేజర్ స్థాయి హోదాను కల్పిస్తారు. గ్రేడ్ ఏ అధికారులు జిల్లా డెవలప్మెంట్ మేనేజర్ (DDM) గా నియమింపబడతారు. గ్రేడ్ ఏ లో ఎంపికైన అధికారులు కెరీర్ పరంగా డైరెక్టర్ హోదాకి ఎదిగే అవకాశం ఉంటుంది.

రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్, రాజభాష, లీగల్ అధికారులు నాబార్డ్ కు సంబంధించిన రీజినల్ కార్యాలయాల్లో చీఫ్ జనరల్ మేనేజర్స్ కింద అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు రూపకల్పన చేసే పథకాలు, పాలసీల విధివిధానాలపై వీరు పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు అమలుచేసే రురల్ డెవలప్మెంట్ పోజెక్టులు, పథకాలు గ్రౌండ్ స్థాయిలో విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వాలకు, బ్యాంకింగ్ పరిశ్రమకు మధ్య వీరు అనుసంధాన కర్తలుగా విధులు నిర్వర్తిస్తారు.

ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్ (P & SS) అధికారులు నాబార్డ్ రీజనల్ కేంద్రాలలో వాచ్ అండ్ వార్డ్ సేవలు అందిస్తారు, వీరు నాబార్డ్ కార్యలయాలకు సంబంధించి అంతర్గత సెక్యూరిటీ, సీసీటీవీ నిఘా, ప్రోటోకాల్ నిర్వహణ, బ్యాంకుల ఆస్తులు సంరక్షణ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే అధికారాల నియంత్రణ వంటి వివిధ విధులు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు పోస్టుల నియామకాలకు సంబంధించి విద్య అర్హుతలు, నియామక ప్రక్రియ వంటి మరిన్ని వివరాల కోసం వాటికీ సంబంధించిన నియామక ప్రకటన ఆర్టికల్స్ లో చూడగలరు.

నాబార్డ్ గ్రూప్ B ఉద్యోగాలు

నాబార్డ్ రీజినల్ కార్యాలయాల్లో రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ సంబంధిత పోస్టులను గ్రూప్ బి నియామక ప్రక్రియ ద్వారా భర్తీచేస్తారు. రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్లు నాబార్డ్ రీజినల్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్స్ ఆధ్వర్యంలో పనిచేయాల్సి ఉంటుంది. వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి సంబంధిత పాలసీల పరిశోదన, అమలుతీరు, నిధులు సేకరణ, డేటాబేస్ నిర్వహణ వంటి మొదలగు విధులు వీరు నిర్వర్తిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాల కోసం గ్రూప్ బి నియామక ప్రకటన ఆర్టికల్ లో చూడగలరు.

నాబార్డ్ గ్రూప్ C ఉద్యోగాలు

నాబార్డ్ రీజినల్ కార్యాలయాల్లో ఆఫీస్ అటెండర్ సంబంధిత కిందిస్థాయి సిబ్బంది నియామకాన్ని గ్రూప్ సి ద్వారా భర్తీచేస్తారు. వీరు నాబార్డ్ కార్యాలయాల్లో రోజువారీ సాధారణ ఆఫీస్ విధులు నిర్వర్తిస్తారు. మరిన్ని వివరాల కోసం గ్రూపు సి ఉద్యోగ ప్రకటన ఆర్టికల్ లో చూడగలరు.

గ్రూపు A, గ్రూపు B, గ్రూపు C సిబ్బంది నియమాకాలతో పాటుగా అవసరాన్ని బట్టి రెగ్యులర్ లేదా కాంట్రాక్టు పద్దతిలో కొందరు ప్రత్యక అధికారులను సమయానుసారం నియమించుకుంటుంది.

Advertisement