టీఎస్‌పీఎస్సీ ఏఈఈ నోటిఫికేషన్ 2022 | మొత్తం 1,540 పోస్టులు
Latest Jobs TSPSC

టీఎస్‌పీఎస్సీ ఏఈఈ నోటిఫికేషన్ 2022 | మొత్తం 1,540 పోస్టులు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. 1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 14 మధ్య చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Advertisement

సివిల్, మెకానికల్, ఎలెక్టికల్ విభాగాల్లో బ్యాచిలర్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుండి 44 ఏళ్ళు మధ్య ఉండాలి. ఎంపికైన వారికీ కనిష్టంగా 54,220 /- నుండి గరిష్టంగా 133,630/- మధ్య జీతభత్యాలు అందిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ పోర్టల్ యందు ఓటిపీఆర్ నమోదు చేసుకుని ఉండాలి. ఈ నియామక ప్రకటన సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

టీఎస్‌పీఎస్సీ ఏఈఈ పోస్టుల ఖాళీలు

టీఎస్‌పీఎస్సీ ఏఈఈ 2022 నోటిఫికేషన్ ద్వారా సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించి 1,540 పోస్టులు భర్తీ చేస్తుంది. ఇందులో మిషన్ భగీరథ పరిధిలో 302 పోస్టులు,  పీఆర్ & ఆర్డీ (సివిల్) విభాగంలో 211 పోస్టులు, ఎంఏ & యూడిలో 147 పోస్టులు ఐ & కాడ్ యందు 704 పోస్టులు ఉన్నాయి.

ఏఈఈ విభాగం ఎలిజిబిలిటీ పోస్టుల ఖాళీలు
పీఆర్ & ఆర్డీ (సివిల్) మిషన్ భగీరథ బీటెక్ (సివిల్) 302 పోస్టులు
పీఆర్ & ఆర్డీ (సివిల్) బీటెక్ (సివిల్) 211 పోస్టులు
ఎంఏ & యూడి-హెచ్ (సివిల్) బీటెక్ (సివిల్) 147 పోస్టులు
టిడబ్ల్యూ (సివిల్) బీటెక్ (సివిల్) 15 పోస్టులు
ఐ & కాడ్ విభాగం బీటెక్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ & అగ్రికల్చర్) 704 పోస్టులు
ఐ & కాడ్ (GWD) (మెకానికల్) బీటెక్ (మెకానికల్) 3 పోస్టులు
టీఆర్ & బీ (సివిల్) బీటెక్ (సివిల్) 145 పోస్టులు
టీఆర్ & బీ (ఎలక్ట్రికల్) బీటెక్ (ఎలక్ట్రికల్) 13 పోస్టులు

Advertisement

Post Comment