డా.ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తన అనుబంధ పీహెచ్డీ సెంటర్లలో ఫుల్ టైమ్ మరియు పార్ట్-టైమ్ పీహెచ్డీ కోర్సులు అందిస్తుంది. పీహెచ్డీ ప్రోగ్రాంలో చేరేందుకు సంబంధిత సబ్జెక్టు యందు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాసు చేసేందుకు అర్హులు. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రకటన యూనివర్సిటీ పోర్టల్ యందు అందుబాటులో ఉంచుతారు. పీహెచ్డీ కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి మరికొన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఫుల్-టైమ్ పీహెచ్డీ కోర్సులు చేసేందుకు అర్హుతలు
- డాక్టర్ ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క మెడికల్ సైన్సెస్ తో అనుబంధించబడిన ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎండీ, ఎంఎస్, డిఎన్బి / ఎండిఎస్ / ఎండీ (ఆయుష్ కోర్సులు.) / ఎంఎస్సీ (ఎన్) / ఎంపీటీ లేదా ఎంఎస్సీ -మెడికల్) లలో ఉత్తీర్ణత అయి ఉండాలి.
- ఎంసీఐ, డీసీఐ, సీసీఐఎం, ఐఎన్సి / సీసీహెచ్ మొదలైన సెంట్రల్ కౌన్సిళ్ల గుర్తింపును పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
- మెడికల్ సైన్సెస్ (బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ మొదలైనవి) కు సంబంధించిన సైన్స్ ఫ్యాకల్టీ నుండి గుర్తింపు పొందిన మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఫుల్ టైమ్ పీహెచ్డీ అడ్మిషన్ పొందేందుకు అర్హులు.
- గరిష్ట వయోపరిమితి లిమిట్ లేదు
పార్ట్-టైమ్ పీహెచ్డీ కోర్సులు చేసేందుకు అర్హుతలు
- పైన పేర్కొన్న అవసరమైన అర్హతలు కలిగి, డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ అనుబంధ సంస్థలలో పనిచేసే టీచింగ్ సిబ్బంది దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- ఐదు సంవత్సరాల అనుభవంతో రాష్ట్ర మరియు జాతీయ పరిశోధనా సంస్థ / విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు / శాస్త్రవేత్తలు / పరిశోధకులు అర్హులు.
- గరిష్ట వయోపరిమితి లిమిట్ లేదు