UPSC CRPF 2022 నోటిఫికేషన్ | ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా
Latest Jobs UPSC

UPSC CRPF 2022 నోటిఫికేషన్ | ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ నమూనా

భారత సరిహద్దు భద్రత దళాలల్లో వివిధ సైనిక సిబ్బంది నియామకం కోసం సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా దేశ భద్రతలో ప్రధాన భూమిక పోషించే అస్సాం రైఫిల్స్ (AR), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) మరియు సహస్త్ర సీమ బల్ (SSB ) లలో నియామకాలు చేపడతారు.

నియామక బోర్డు యూపీఎస్సీ
నియామక పరీక్షా సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/పిఈటి
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్
వయో పరిమితి 20 - 25 ఏళ్ళ మధ్య

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ దేశ సరిహద్దు భద్రత వ్యవహారాలలో ప్రధాన భూమిక పోషిస్తాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సహస్త్ర సీమ బెల్ దేశ సరిహద్దు రక్షణ వ్యవహారాలలో సేవలు అందిస్తాయి. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పబ్లిక్ సెక్టర్ సంస్థల భద్రత వ్యవహారాలపై పనిచేస్తుంది.

దేశ శాంతి భద్రత వ్యవహారాలు, టెర్రిస్టు ఆపరేషన్స్ సంబంధిత అంశాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సరిచేస్తుంది. నక్సల్స్ ఆపరేషన్స్, ఎంకౌంటర్ సమస్యలను నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ చూసుకుంటుంది. ఇవే కాకుండా అవసరమైన సమయంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటిలిజెన్స్ బ్యూరో, సిబిఐ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మరియు ఇండియన్ ఆర్మీ తరుపున కూడా విధులు నిర్వర్తిస్తాయి.

ఎలిజిబిలిటీ

  • జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • అసిస్టెంట్ కంమాండెంట్ పోస్టులకు స్త్రీ, పురుషులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయోపరిమితి:  అభ్యర్థుల వయసు 20 నుండి 25 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు 2 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.
  • విద్య అర్హుత:  గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • రాతపరీక్షలో ఉత్తీర్ణతైన అభ్యర్థులు ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులు కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు 200/-
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము లేదు

దరఖాస్తు విధానం

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ పరీక్షకు పోటీపడే అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభించే ముందు కావాల్సిన సమాచారమంతా అందుబాటులో ఉంచుకోండి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. వయస్సు ధ్రువపత్రం, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు  అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. యుపిఎస్‌సి పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపిస్తుంది. ఇమెయిల్ మరియు మొబైల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.

తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉండే పరీక్షాకేంద్రాలు
హైదరాబాద్ విశాఖపట్నం
తిరుపతి చెన్నై & బెంగుళూరు

రాత పరీక్ష & ఇంటర్వ్యూ

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 3 దశలలో నిర్వహించబడుతుంది. మొదటి దశలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణత అయినవారికి రెండవ దశలో ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినా అభ్యర్థులకు 3వ దశలో వ్యక్తిగత ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

రాతపరీక్ష : రాతపరీక్ష రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. జనరల్ ఎబిలిటీ మరియు ఇంటిలిజెన్స్ అంశాలతో 250 మార్కులకు పేపర్ 1 నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ అంశాలతో 200 మార్కులకు పేపర్ 2 నిర్వహిస్తారు. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి. వాటినుండి ఒక సరైన సమాధానాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లీషు మరియు హిందీ బాషలలో అందుబాటులో ఉంటాయి.

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ సరళి
పేపర్ సిలబస్ సమయం మార్కులు
పేపర్ 1 జనరల్ ఎబిలిటీ మరియు ఇంటిలిజెన్స్ 2 గంటలు 250
పేపర్ 2 జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ 3 గంటలు 200
మొత్తం 450 మార్కులు

రాతపరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు ఫీజికల్ మరియు మెడికల్ టెస్టు కోసం ఆహ్వానిస్తారు. నోటిఫికేషన్ లో ఉన్న ఫీజికల్ మరియు మెడికల్ ప్రమాణాలను సంతృప్తి పరిచిన అభ్యర్థులకు చివరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఫీజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్స్ (PET)
ఫీజికల్ టెస్ట్ పురుషులు మహిళలు
100 మీటర్ల రన్నింగ్ 16 సెకన్లు 18 సెకన్లు
800 మీటర్ల రన్నింగ్ 3 నిముషాల 45 సెకండ్స్ 4 నిముషాల 45 సెకండ్స్
లాంగ్ జంప్ 3.5 మీటర్లు 3.0 మీటర్లు
షార్ట్ ఫుట్ (7.26 కేజీ ) 4.5 మీటర్లు -
ఫీజికల్ ఎఫిసిఎన్సీ టెస్ట్ సమయనికి గర్భవతులైన మహిళా అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు

Post Comment