కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ & షెడ్యూల్, సిలబస్
Latest Jobs UPSC

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ & షెడ్యూల్, సిలబస్

నియామక బోర్డు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
నియామక పరీక్షా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఎంబీబీఎస్
వయో పరిమితి 21 - 32 ఏళ్ళ మధ్య

వైద్య గ్రాడ్యుయేట్లను వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మెడికల్ సర్వీసులలో వైద్య అధికారులుగా నియమించేందుకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు యుపిఎస్‌సి ఈ నియామకాలు చేపడుతుంది. యేటా ఏప్రిల్ నెలలో ఉద్యోగ ప్రకటన విడుదల చేసి, జులైలో నియామక రాతపరీక్ష పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేస్తారు.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపికైన వారు రైల్వే, భారత ఆర్డినెన్సు ఫ్యాక్టీరీస్, ఢీల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢీల్లీ మున్సిపల్ కౌన్సిలో మెడికల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు.

కంబైన్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా నియమించే మెడికల్ అధికారుల పోస్టులు
1 రైల్వే అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్స్
2 భారత ఆర్డినెన్సు ఫ్యాక్టరీస్ అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్స్
3 కేంద్ర ఆరోగ్య సర్వీసులలో జూనియర్ స్కేల్ ఆఫీసర్స్
4 ఢీల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనరల్ మెడికల్ ఆఫీసర్స్
5 ఢీల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో గ్రేడ్ 2 మెడికల్ ఆఫీసర్స్

ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు ఇండియా లేదా నేపాల్, భూటాన్ పౌరులయి ఉండాలి
  • 1962కు ముందు భారతదేశంకు వలస వచ్చిన టిబెటన్ అభ్యర్థులు కూడా అర్హులు.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబిబిఎస్ పూర్తిస్థాయి ఉతీర్ణతై ఉండాలి.
  • దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు కేటగిరి వారీగా 3 నుండి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 200/-
ఎస్సి, ఎస్టి, మహిళలు, వికలాంగులు ఎటువంటి ఫీజు లేదు

దరఖాస్తు ప్రక్రియ

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కు పోటీపడే అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వ్యక్తిగత, విద్య వివరాలు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. దరఖాస్తు సమయంలో చేసే చిన్న తప్పిదాలు రేపు నియామక సమయంలో అనర్హుతకు దారితీసే అవకాశం ఉంటుంది. మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, రిజర్వేషన్ కేటగిరి ఎంపిక, వయోపరిమితి ఎంపిక, పరీక్షా కేందం, ఆప్షనల్ సబ్జెక్టుల నమోదు సమయంలో పలుమార్లు పునఃపరిశీలించండి.

తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్ విశాఖపట్నం

పరీక్ష విధానం & ఇంటర్వ్యూ

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రెండు దశలలో నిర్వహించబడుతుంది. మొదటి దశలో రెండు పేపర్లుతో కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్ 2 గంటల వ్యవధితో 250 మార్కులకు ఇవ్వబడుతుంది. ప్రశ్నపత్రాలు ఎంబిబిఎస్ స్థాయి సిలబస్ తో ఇవ్వబడతయి. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 100 మార్కులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఫలితాలు విడుదల చేస్తారు.

పేపర్ I  (సమయం 2 గంటలు, మార్కులు 250)
సిలబస్ ప్రశ్నల సంఖ్యా
కార్డియాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ మరియు సైకియాట్రీతో సహా జనరల్ మెడిసిన్ 96
పీడియాట్రిక్స్ 24
పేపర్ II  (సమయం 2 గంటలు, మార్కులు 250)
ENT, ఆప్తాల్మాలజీ, ట్రామాటాలజీ మరియు ఆర్థోపెడిక్స్ సహా శస్త్రచికిత్స 40
గైనకాలజీ & ప్రసూతి 40
ప్రివెంటివ్ & సోషల్ మెడిసిన్ 40

Post Comment