March 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023 Telugu Current Affairs

March 2023 Current Affairs Questions In Telugu

కరెంట్ అఫైర్స్ మార్చి 2023 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాధానాలను సాధన చేయండి. మార్చి 2023 నెలలో చోటుచేసుకున్న సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

1. ఈ కింది వారిలో ఇటీవలే భారత్‌ను సందర్శించిన విదేశీ ప్రధాని ఎవరు ?

  1. షేక్ హసీనా (బంగ్లాదేశ్)
  2. మియా మోట్లీ (బార్బడోస్)
  3. జార్జియా మెలోనీ (ఇటలీ)
  4. దినేష్ గుణవర్దన (శ్రీలంక)
సమాధానం
3. జార్జియా మెలోనీ (ఇటలీ) 

2. ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ 2023కి ఆతిధ్యం ఇచ్చిన దేశం ఏది ?

  1. దక్షిణాఫ్రికా
  2. ఆస్ట్రేలియా
  3. ఇంగ్లాండ్
  4. ఇండియా
సమాధానం
1. దక్షిణాఫ్రికా  

3. బయోఏషియా సమ్మిట్ 2023 ఏ నగరంలో నిర్వహించారు ?

  1. న్యూఢిల్లీ
  2. విశాఖపట్నం
  3. గాంధీనగర్
  4. హైదరాబాద్
సమాధానం
4. హైదరాబాద్ 

4. కింది వారిలో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన మొదటి మహిళా ఎమ్మెల్యే ఎవరు ?

  1. రానో ఎమ్ షైజా
  2. హేకానీ జఖాలు
  3. రోసీ థాంప్సన్
  4. ఫాంగ్నోన్ కొన్యాక్
సమాధానం
2. హేకానీ జఖాలు  

5. ఇటీవలే విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్ ఏది ?

  1. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
  2. బయోఏషియా సమ్మిట్
  3. జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్
  4. 1 మరియు 3 సరైనవి
సమాధానం
4. 1 మరియు 3 సరైనవి  

6. ఇటీవలే ఆస్కార్ అవార్డు దక్కించుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏది ?

  1. ఆల్ దట్ బ్రీత్స్
  2. ఎండ్ ఆఫ్ సెంటన్స్
  3. ది ఎలిఫెంట్ విస్పరర్స్
  4. పైవి ఏవీ కావు
సమాధానం
3. ది ఎలిఫెంట్ విస్పరర్స్  

7. సశాస్త్ర సీమ బల్‌ డైరెక్టర్ జనరల్‌ ఎవరు ?

  1. ఎస్‌ఎల్ థాసేన్
  2. అనిస్ దయాల్‌
  3. రష్మీ శుక్లా
  4. ప్రదీప్ చంద్రన్ నాయర్
సమాధానం
3. రష్మీ శుక్లా

8. ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన త్రిపుర ముఖ్యమంత్రి ఎవరు ?

  1. కాన్రాడ్ కె సంగ్మా
  2. ప్రిస్టోన్ టైన్‌సాంగ్
  3.  నీఫియు రియో
  4. మాణిక్ సాహా
సమాధానం
4. మాణిక్ సాహా  

9. భారతదేశం - బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ప్రాజెక్టు దేనికి సంబంధించింది ?

  1. డీజిల్ & పెట్రోలియం సరఫరా
  2. సహజ వాయువుల సరఫరా
  3. త్రాగునీటి సరఫరా
  4. నదీ జలాల సరఫరా
సమాధానం
1. డీజిల్ & పెట్రోలియం సరఫరా  

10. చైనా కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. లీ కెకియాంగ్
  2. లి కియాంగ్
  3. జి జిన్‌పింగ్
  4. యాంగ్ షాంగ్‌కున్
సమాధానం
2. లి కియాంగ్

11. ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ ఏది ?

  1. హుబ్బల్లి (కర్ణాటక)
  2. కొల్లాం జంక్షన్ (కేరళ)
  3. గోరఖ్‌పూర్ జంక్షన్ (ఉత్తర ప్రదేశ్)
  4. ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్‌)
సమాధానం
1. హుబ్బల్లి (కర్ణాటక)

12. మిథనాల్‌తో నడిచే భారతదేశపు మొదటి బస్సు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

  1. కర్ణాటక (బెంగుళూరు)
  2. తెలంగాణ (హైదరాబాద్)
  3. మహారాష్ట్ర (ముంబై)
  4. ఉత్తరప్రదేశ్ (లక్నో)
సమాధానం
1. కర్ణాటక (బెంగుళూరు)  

13. దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు కిలిగిన రాష్ట్రం ?

  1. రాజస్థాన్
  2. కేరళ
  3. బీహార్
  4. జార్ఖండ్
సమాధానం
3. బీహార్ 

14. పీఎం మిత్ర పథకం కింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. స్మార్ట్ సిటీ అభివృద్ధి
  2. ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి
  3. మెట్రో కారిడార్ అభివృద్ధి
  4. టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు
సమాధానం
4. టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు  

15. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

  1. రోమ్
  2. నెదర్లాండ్
  3. కాంగో
  4. జెనీవా
సమాధానం
2. నెదర్లాండ్  

16. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో భారతదేశ స్థానం ?

  1. 123వ స్థానం
  2. 124వ స్థానం
  3. 125వ స్థానం
  4. 126వ స్థానం
సమాధానం
4. 126వ స్థానం

17. ఆసియా ఖో ఖో ఛాంపియన్‌షిప్‌ 2023 ఏ రాష్ట్రంలో నిర్వహించారు ?

  1. ఒడిశా
  2. అస్సాం
  3. ఆంధ్రప్రదేశ్
  4. తమిళనాడు
సమాధానం
2. అస్సాం 

18. తెలంగాణాలో ఇటీవలే ప్రారంభించిన నూతన సంక్షేమ పథకం ఏది ?

  1. దళిత బందు
  2. కంటి వెలుగు
  3. ఆరోగ్య మహిళ
  4. న్యూట్రిషన్‌ కిట్‌
సమాధానం
3. ఆరోగ్య మహిళా 

19. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ తీర్థయాత్ర కారిడార్ ఎక్కడ నిర్మించబోతున్నారు ?

  1. ఉత్తరప్రదేశ్
  2. ఉత్తరాఖండ్
  3. హిమాచల్ ప్రదేశ్
  4. జమ్మూ & కాశ్మీర్
సమాధానం
2. ఉత్తరాఖండ్  

20. డబ్ల్యుపిఎల్ 2023 విజేత ఎవరు ?

  1. ముంబై ఇండియన్స్
  2. గుజరాత్ జెయింట్స్
  3. యూపీ వారియర్స్
  4. ఢిల్లీ క్యాపిటల్స్‌
సమాధానం
1. ముంబై ఇండియన్స్  

21. ఆరోగ్య హక్కును చట్టంగా చేసిన తొలి రాష్ట్రం ఏది ?

  1. ఒడిశా
  2. రాజస్థాన్
  3. ఆంధ్రప్రదేశ్
  4. కేరళ
సమాధానం
2. రాజస్థాన్ 

22. పరువు నష్టం కేసుతో అనర్హత వేటుకు గురైన మొదటి భారత ఎంపీ ఎవరు ?

  1. రషీద్ మసూద్
  2. లాలూప్రసాద్ యాదవ్
  3. రాహుల్ గాంధీ
  4. మహమ్మద్ ఫైజల్ పడిప్పురా
సమాధానం
3. రాహుల్ గాంధీ  

23. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతక విజేత ?

  1. నిఖత్ జరీన్
  2. నీతు ఘంఘాస్
  3. లోవ్లినా బోర్గోహైన్
  4. పై అందరూ
సమాధానం
4. పై అందరూ 

24. బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నూతన ప్రెసిడెంట్ ఎవరు ?

  1. మార్కస్ ట్రోయ్జో
  2. డేవిడ్ మాల్పాస్
  3. మాట్ కమిన్
  4. దిల్మా వానా రౌసెఫ్
సమాధానం
4. దిల్మా వానా రౌసెఫ్  

25. వన్యప్రాణి సంరక్షణ అవార్డు అందుకున్న మొదటి కాశ్మీర్ మహిళా ?

  1. అలియా మీర్‌
  2. గౌరీ మౌలేఖి
  3. కృతి కారంత్
  4. అదితి లాహిరి
సమాధానం
1. అలియా మీర్‌  

26. స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ అమెరికన్ ఎవరు ?

  1. జయశ్రీ ఉల్లాల్
  2. లక్ష్మణ్ నరసింహన్
  3. నీల్ మోహన్
  4. రాజ్ సుబ్రమణ్యం
సమాధానం
2. లక్ష్మణ్ నరసింహన్  

27. కింది వాటిలో క్వాడ్ సభ్య దేశం కానిది ఏది ?

  1. ఆస్ట్రేలియా
  2. అమెరికా
  3. రష్యా
  4. జపాన్
సమాధానం
3. రష్యా 

28. కింది వాటిలో ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించిన ఆర్టికల్ ఏది ?

  1. ఆర్టికల్ 326
  2. ఆర్టికల్ 324
  3. ఆర్టికల్ 361
  4. ఆర్టికల్ 341
సమాధానం
2. ఆర్టికల్ 324 

29. మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ దినోత్సవం ఏది ?

  1. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమెటిక్స్
  2. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్
  3. వరల్డ్ కంజ్యూమర్ రైట్స్ డే
  4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సమాధానం
4. అంతర్జాతీయ మహిళా దినోత్సవం  

30. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు ?

  1. మార్చి 23
  2. మార్చి 28
  3. మార్చి 25
  4. మార్చి 21
సమాధానం
1. మార్చి 23 

Advertisement

One Comment

Post Comment