Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ 04 జూన్ 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ 04 జూన్ 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం

వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అంశాలు పూర్తి తెలుగులో చదవండి. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించాం.

నైజీరియా కొత్త అధ్యక్షుడిగా బోలా టినుబు ప్రమాణ స్వీకారం

నైజీరియా కొత్త అధ్యక్షుడిగా బోలా టినుబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో జరిగిన అత్యంత వివాదాస్పదమైన నైజీరియా అధ్యక్ష ఎన్నికల్లో బోలా అహ్మద్ టినుబు విజయం సాధించారు. ఈ ఎన్నికలలో ఆయన కేవలం 37 శాతం ఓట్లతో గెలుపొందారు. గత రెండు నెలలలో వివిధ న్యాయపరమైన అంశాలు ఆయన ప్రమాణస్వీకరణకు అడ్డురావడంతో తాజాగా ఆ దేశ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు.

ఆఫ్రికా దేశాలలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నైజీరియా, ప్రస్తుతం అత్యధిక అప్పులు, ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరులైన చమురు ఉత్పత్తులు ఎగుమతి క్షిణించడంతో ఈ రుణాల ఊబి నుండి బయటపడం ఇప్పుడే సాధ్యమయ్యేపని కాదు. వీటితో పాటుగా తిరుగుబాట్లు, బందిపోటు మరియు మత ఘర్షణలతో దేశానికి ముప్పు పొంచివుంది.

  • నైజీరియా అధికారిక నామం : ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా
  • రాజధాని నగరం : అబ్యూజా
  • అధికారిక కరెన్సీ : నైజీరియన్ నైరా
  • ఆఫ్రికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశం

ఎన్విరాన్‌మెంటల్ ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎతిహాద్ ఎయిర్‌వేస్

యూఏఈ యొక్క జాతీయ విమానయాన సంస్థ అయిన ఎతిహాద్ ఎయిర్‌వేస్, 2023 ఏడాదికి గాను ఎన్విరాన్‌మెంటల్ ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. దీనితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ రేటింగ్స్ 'టాప్ 10 ఎయిర్‌లైన్స్'లో మూడవ స్థానంలో నిలిచింది.

ఏవియేషన్ పరిశ్రమలో ఎయిర్‌లైన్ రేటింగ్స్ అవార్డులు అత్యుత్తమమైనవిగా పరిగణించబడుతాయి. ఈ రేటింగ్ నూతన ఆవిష్కరణలు, రూట్ నెట్‌వర్క్‌లు మరియు సేఫ్టీ స్కోర్‌ వంటి కఠినమైన ప్రమాణాల ఆధారంగా రూపొందించబడుతుంది. గడిసిన మే 2023లో విడుదల చేసిన సుస్థిరత నివేదిక ప్రకారం ప్రతి రెవెన్యూ టన్ను కిలోమీటర్ (RTK) కి CO2 ఉద్గారాలలో 26% తగ్గింపును సాధించినట్లు ఎతిహాద్ ప్రకటించింది. ఈ విజయానికి ఎతిహాద్ యొక్క ఫ్లాగ్‌షిప్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్‌ దోదాహపడినట్లు వెల్లడించింది.

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రవీణ్ శ్రీవాస్తవ

సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అధికారికంగా మే 29న ప్రమాణ స్వీకారం చేసారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీవాస్తవ అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1988-బ్యాచ్ రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.

గత ఏడాది డిసెంబరులో సురేష్ ఎన్ పటేల్ పదవీకాలం పూర్తయిన తర్వాత శ్రీవాస్తవ తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనరుగా బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి 1964లో ఏర్పాటైన అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ. దీనికి 2003లో పార్లమెంట్ ద్వారా చట్టబద్ధమైన హోదా కల్పించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని జంబూ జూ జాతికి అంకితం

జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రతిష్టాత్మక అభివృద్ధి చేయబడిన జంబూ జూ మే 29వ తేదీన ప్రజలకు అంకితం చేయబడింది. దీనికి జమ్మూ నగర స్థాపకుడు కింగ్ జంబూ లోచన్ పేరును నామకరణం చేసారు. ఈ జూ ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద జూగా పరిగణించబడుతుంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలో నగ్రోటా ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఈ జంతు ప్రదర్శనశాల,  కత్రాలోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రజలకు ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారనుంది.

70కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ  జూలో ఒక కృత్రిమ జలపాతం, పిల్లల కోసం బహిరంగ వినోద థియేటర్ మరియు పార్క్ కూడా నిర్మించారు. సందర్శకులు తిరిగేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జూలో ప్రస్తుతం రాయల్ బెంగాల్ టైగర్, ఏషియాటిక్ సింహం, చిరుతలు, ఎలుగుబంట్లు, మొసళ్ళు మొదలైన 27 రకాల జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

2023 ఐఐఎఫ్ఏ అవార్థుల విజేతలు

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 22వ ఎడిషన్ మే 26 మరియు 27 తేదీల్లో అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో నిర్వహించబడింది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ హోస్టులుగా వ్యవహరించారు. ఇది హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన వార్షిక అవార్డుల వేడుక. ఈ వేడుకను 2000 ఏడాది నుండి విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తుంది. పూర్తి అవార్డుల జాబితా

  •  ఉత్తమ చిత్రం : దృశ్యం 2
  • ఉత్తమ నటుడు : హృతిక్ రోషన్ (విక్రమ్ వేద)
  • ఉత్తమ నటి : అలియా భట్ (గంగూబాయి కతియావాడి)
  • ఇండియన్ సినిమా అచీవ్మెంట్ అవార్డు - కమల్ హాసన్
  • ఉత్తమ దర్శుకుడు : ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్)
  • ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ (జగ్జగ్ జీయో)
  • ఉత్తమ సహాయ నటి · మౌని రాయ్ (బ్రహ్మాస్త్రం)

అటల్ భుజల్ యోజన నీటి పథకం మరో రెండేళ్లు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం అటల్ భుజల్ యోజన (అటల్ జల్)ని డిసెంబర్ 2027 వరకు మరో రెండేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2020లో ప్రారంభంలో ప్రారంభించబడిన ఈ అటల్ జల్ పథకం గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్‌తో సహా ఏడు భారతీయ రాష్ట్రాల్లోని 80 జిల్లాల పరిధిలో 8,220 నీటి ఎద్దడి ఉన్న గ్రామ పంచాయతీలలో అమలు చేయబడుతుంది. ఈ పథకం ప్రధానంగా గామీణ కమ్యూనిటీలో నీటి పరిరక్షణ యందు అవగహన పెంపొందించడంతో పాటుగా స్మార్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ వైపు నడిపించేలా ప్రోత్సహిస్తుంది.

అటల్ జల్ పథకం గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేయబడుతుంది. ఈ పథకం ఐదేళ్ల వ్యవధితో మొత్తం రూ. 6000 కోట్ల వ్యయంతో 2020-21 నుండి 2024-25 మధ్య అమలులో ఉంటుంది. అయితే కోవిడ్ కారణంగా జాప్యం జరగడంతో దీనిని 2027 వరకు పొడిగించారు. ఈ పథకం కింద కొత్తగా 450,000 హెక్టార్ల వ్యవసాయ నీటిపారుదల ప్రాంతాన్ని బిందు సేద్యం మరియు పంటల వైవిధ్యీకరణ వంటి సమర్థవంతమైన నీటి ఆదా పద్ధతుల క్రిందకు తీసుకురావాలని యోచిస్తోంది.

టెహ్రీలో G20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం

జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో మూడు రోజుల అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంను ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ (టెహ్రీ)లో మే 25-27 మధ్య నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ అడిషనల్ సెక్రటరీ రాహుల్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర రక్షణ & పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. ఈ సమావేశానికి 20 సభ్య దేశాలు, 10 ఆహ్వానిత దేశాలతో పాటుగా ఇంటర్ పోల్, యూఎన్‌ఒడిసి, ఓఈసీడీ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా హాజరయ్యాయి.

ఈ సమావేశంలో ప్రధానంగా అవినీతి ఆస్తుల పునరుద్ధరణ, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులను అదుపులోకి తీసుకోవడం, అవినీతిని ఎదుర్కోవడానికి సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌లు మరియు పరస్పర న్యాయ సహాయం అందించుకోవడం వంటి  కీలక అంశాలపై చర్చలు జరిపారు. అవినీతిని నిరోధించడానికి బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థలు మరియు అధికారాల సమగ్రతను మరింత ప్రోత్సహించడం కోసం అంతర్జాతీయ సహకారం, సమాచార మార్పిడి మరియు అవినీతికి సంబంధించిన ఆస్తుల రికవరీ మెకానిజమ్‌లను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

ఇది జీ20 ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం. దీనికి సంబంధించి మొదటి అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ మీటింగ్ (ACWG), హర్యానాలోని గురుగ్రామ్‌లో 2023 మార్చి 1 నుండి 3 మధ్య జరిగింది.

మహారాష్ట్రలో వీర్ సావర్కర్ 140వ జయంతి ఉత్సవాలు

ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రముఖ మరాఠీ హిందుత్వ పితామహుడు వీర్ సావర్కర్ జయంతిని మే 28న 'స్వాతంత్రవీర్ గౌరవ్ దిన్'గా జరుపుకోవాలని నిర్ణయించింది. వీర్ సావర్కర్ 140వ జయంతిని పురష్కరించుకుని ఈ ప్రకటన చేసింది. వీర్ సావర్కర్ 28 మే, 1883న రామోషి విప్లవ భూమి అయిన మహారాష్ట్రలోని భాగూర్‌లో జన్మించారు. 1922లో రత్నగిరిలో ఖైదుగా ఉన్న సమయంలో బలమైన హిందుత్వ జాతీయవాద రాజకీయ భావజాలాన్నివ్యాప్తి చేసి ప్రసిద్ధి చెందారు.

కొత్త శివసేన-బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూత్వ మరియు జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకోవడంలో భాగంగా సావర్కర్ జయంతి మరియు వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిరవహిస్తుంది. సావర్కర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారమమైన భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా ముందుకు తీసుకొచ్చారు.

సావర్కర్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే చేసిన వ్యాఖ్యల తర్వాత, షిండే మరియు ఫడ్నవీస్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో స్వాతంత్ర్యవీర్ సావర్కర్ గౌరవ్ యాత్రలకు నాయకత్వం వహించారు. సావర్కర్‌ జన్మస్థలమైన నాసిక్‌ జిల్లాలోని భాగూర్‌లో ఆయనకు అంకితం చేస్తూ థీమ్‌ పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన జయంతి రోజునే నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసింది.

మలేషియా మాస్టర్స్ 2023 విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్

కౌలాలంపూర్‌లో జరిగిన మలేషియా మాస్టర్స్ 2023 ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్ 21-19, 13-21, 21-18తో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించి తన మొదటి బీడబ్ల్యుఎఫ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకింగులో 9వ ర్యాంకులో ఉన్నాడు. తిరువనంతపురంనకు చెందిన ప్రణయ్, హైదరాబాదులోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నడు.

సిఎవిఎ ఉమెన్స్ ఛాలెంజ్ కప్ 2023 భారత్ కైవసం

ఖాట్మండులోని త్రిపురేశ్వర్‌ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ కవర్డ్ హాల్‌లో జరిగిన సెంట్రల్ ఆసియన్ వాలీబాల్ అసోసియేషన్ యొక్క ఉమెన్స్ వాలీబాల్ ఛాలెంజ్ కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో ప్రత్యర్థి కజకిస్థాన్‌ జట్టును 3-0 సెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. తొలి సెట్‌ను 25-15, రెండో సెట్‌ను 25-22, మూడో సెట్‌ను 25-18తో భారత్‌ మహళల జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చింది.

నేపాల్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహించిన ఈ క్రీడా ఈవెంట్ యందు 8 ఆసియా జట్లు పాల్గొనగా కజకిస్థాన్ రన్నరప్‌గా, నేపాల్ మూడో స్థానంలో, ఉజ్బెకిస్థాన్ నాలుగో స్థానంలో, శ్రీలంక ఐదో స్థానంలో, కిర్గిస్థాన్ ఆరో స్థానంలో, మాల్దీవులు ఏడవ స్థానంలో, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి.

న్యూరాలింక్ యొక్క క్లినికల్ ట్రయల్‌కు ఎప్‌డిఎ ఆమోదం

ఎలోన్ మస్క్ యొక్క బ్రెయిన్ - ఇంప్లాంట్ కంపెనీ అయినా న్యూరాలింక్ సంస్థ, మెదడు ఇంప్లాంట్‌ల యొక్క క్లినికల్ ట్రయల్‌ను నిర్వహించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని పొందినట్లు ప్రకటించింది. ఈ పరిశోధనలో మానవుల యొక్క మెదడుకు చిప్‌లను అమర్చడం ద్వారా పూర్తిస్థాయి మెదడు పనితీరును అంచనావేస్తారు.

ఈ పరిశోధన ద్వారా పక్షవాతం, అంధత్వం, మానసిక అనారోగ్యం, అల్జీమర్స్ మరియు డిమెన్షియా వంటి నరాల సంబంధిత అనారోగ్యాలను సమర్థవంతంగా నయం చేసే చికిత్స విధానాలను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటుగా మానవులు కృత్రిమ మేధస్సుతో పోటీపడేలా సాంకేతికతను అనుమతించాలనేది ఈ పరిశోధన యొక్క దీర్ఘకాలిక ఆశయం. ఎలోన్ మస్క్ 2016లో ఈ టెక్ కంపెనీని సహ-స్థాపించారు. ఈ సంస్థ మానవ మెదడును ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తుంది.

భారతదేశంలో కంబోడియన్ రాజు పర్యటన

కంబోడియా రాజు నోరోడమ్ సిహమోని, మే 29-31 తేదీల మధ్య 3రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారతదేశాన్ని సందర్శించారు. 1963లో ప్రస్తుత రాజు తండ్రి అయిన నోరోడోమ్ సిహనౌక్ భారతదేశాన్ని పర్యటించిన తర్వాత కంబోడియా రాజు భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య 1952లో ప్రారంభమైన దౌత్య సంబంధాలు 70వ వార్షికోత్సవం పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకుంది.

ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకరుతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అలానే రాష్ట్రపతి భవన్ ఇచ్చిన అధికారిక విందును ఆశ్వాదించారు. ఇరుదేశాల మధ్య వివిధ సైనిక మరియు రక్షణ ఒప్పందాలు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేయడానికి మరియు బలోపేతం చేయడానికి అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

  • కంబోడియా దక్షిణ ఇండోచైనీస్ ద్వీపకల్పంలో ఉన్న ఒక ఆగ్నేయాసియా దేశం.
  • రాజధాని నగరం : నమ్ పెన్
  • అధికారక కరెన్సీ : కంబోడియన్ రీల్
  • అధికారిక భాష : ఖైమర్

ఇథనాల్-డీజిల్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసిన బీపీసీఎల్

కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇథనాల్-డీజిల్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. భారత్ పెట్రోలియం యొక్క సుస్థిరత ఎజెండా మరియు 2040 నాటికీ దేశ నికర జీరో మిషన్‌కు అనుగుణంగా ఈ నూతన ఉత్పత్తుల వైపు మళ్లుతుంది.

డీజిల్‌తో కలిపిన ఇథనాల్‌ను ఇ-డీజిల్ అని పిలుస్తారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్/డీజిల్ అనేది 10 శాతం లేదా 15 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా ఏర్పడే మిశ్రమ ఇంధనం. ఇవి ఎమల్సిఫైయర్ అనే సాంకేతికత ఆధారంగా రూపొందించబడతయి. ఈ ఇంధన మిశ్రమాన్ని మైక్రో-ఎమల్షన్ అని పిలుస్తారు. ఇవి స్ప్లాష్ బ్లెండింగ్ ద్వారా తయారు చేయబడతాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేక పరికరాలు లేదా ఉష్ణోగ్రత నియంత్రణ అవసరం లేదు.

సాధారణ గ్యాసోలిన్ మరియు డీజిల్ ఉత్పత్తుల కంటే ఈ మిశ్రమ ఇథనాల్ వాహనాల ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇథనాల్ అనేది ఒక జీవ ఇంధనం. ఇది సహజంగా ఈస్ట్‌ల ద్వారా చక్కెరల కిణ్వ ప్రక్రియ ద్వారా లేదా ఇథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది.

బీపీసీఎల్ రాబోయే కాలానికి అనుగుణంగా పెట్రోకెమికల్స్‌తో పాటుగా స్థిరమైన విమాన ఇంధన ఉత్పత్తులను వైవిధ్యపరుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సంస్థ 164 పేటెంట్లను దాఖలు చేసినట్లు, వాటిలో 87 పేటెంట్లు బహుళ దేశాలలో ఆమోదం పొందినట్లు, మరో 17 ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు ఒక ప్రకటనలో నివేదించింది.

బీపీసీఎల్ యొక్క పరిశోధన విభాగం ప్రధానంగా కార్బన్ క్యాప్చర్, గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, క్లీన్ ఫ్యూయల్స్, పెట్రోకెమికల్స్ మరియు బిజినెస్ సస్టైనబిలిటీపై దృష్టి కేంద్రీకరించి, ఆయా రంగాలలో శ్రేష్ఠత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించినట్లు తెలిపింది.

బీపీసీఎల్ కొత్తగా రెండు కొత్త డిజిటల్ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో క్రూడ్ కంపార్టీబిలిటీ కోసం 'కె -మోడల్' సాంకేతికత మరియు శీఘ్ర మరియు ఖచ్చితమైన నిజ-సమయ క్రూడ్ అస్సే కోసం 'BPMARRK' అనే నూతన సాంకేతికతలు ఉన్నాయి. దీనితో చమురు మరియు గ్యాస్ రంగంలో ఈ మైలురాయిని సాధించిన ఏకైక సంస్థగా బీపీసీఎల్ నిలిచింది.

గోవా రచయిత దామోదర్ మౌజోకు 57వ జ్ఞానపీఠ్ అవార్డు

ప్రఖ్యాత గోవా రచయిత దామోదర్ మౌజోకు భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. ఈ 57వ జ్ఞానపీఠ్ అవార్డును  గోవా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై, మే 27న ఆయనకు అందజేశారు. కొంకణి సాహిత్యానికి చేసిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. దీనితో 2006లో రవీంద్ర కేలేకర్ తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండో గోవా వ్యక్తి మౌజో నిలిచారు.

దామోదర్ మౌజో ఇది వరకు 1983లో తన నవల కార్మెలిన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి విశ్వ కొంకణి సాహిత్య పురస్కారం కూడా గెలుచుకున్నారు. ఈయన కొంకణి మరియు ఇంగ్లీష్ భాషల్లో కలిపి దాదాపు 25 రచనలు చేశారు.

భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు 1965 నుండి ఇవ్వబడుతుంది. 1965లో మలయాళ రచయిత జి శంకర్ కురుప్‌కు మొదటి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. తెలుగు రాష్ట్రాల నుండి ఈ అవార్డును ఇప్పటి వరకు ముగ్గురు రచయతలు మాత్రమే అందుకున్నారు.

  • విశ్వనాథ సత్యనారాయణ - 1970 ( 6వ జ్ఞానపీఠ్ )
  • సి.నారాయణ రెడ్డి - 1988 ( 4వ జ్ఞానపీఠ్ )
  • రావూరి భరధ్వాజ - 2012 ( 48వ జ్ఞానపీఠ్ )

కర్ణాటక బ్యాంక్ ఎండీ & సీఈఓగా శ్రీకృష్ణన్ హరిహర శర్మ

కర్ణాటక బ్యాంక్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా శ్రీకృష్ణన్ హరిహర శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో జియో పేమెంట్స్ బ్యాంక్ ఎండీగా పనిచేశారు. వచ్చే మూడేళ్ళ కాలానికి అయన ఈ హోదాలో ఉండనున్నారు.

కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ మంగళూరులో ఉన్న భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంకు. ఇది 22 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 900 పైగా శాఖలను కలిగి ఉంది. ఈ బ్యాంకు 1924లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం మంగుళూరులో ఉంది.

క్వాంటం సిద్ధాంతం యొక్క గణిత నిర్మాణం పునర్నిర్మాణం

కోల్‌కతాలోని ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్స్ సైన్సెస్ పరిశోధకులు క్వాంటం సిద్ధాంతం యొక్క గణిత నిర్మాణ సమాచార సూత్రంను పునర్నిర్మించారు. ఈ పరిశోధన సంస్థకు చెందిన డా. మానిక్ బానిక్ మరియు అతని బృందం ఒకటి కంటే ఎక్కువ ఉపవ్యవస్థలను కలిగి ఉన్న మిశ్రమ క్వాంటం వ్యవస్థల గణిత నిర్మాణం యొక్క సైద్ధాంతిక హేతుబద్ధతను కనుగొన్నారు.

ఈ బృందం సమ్మిళిత క్వాంటం వ్యవస్థలకు సహజంగా ఎలాంటి వర్ణనలు అనుమతించబడవు అని నిరూపించడానికి, ఇన్ఫర్మేషన్ కాజాలిటీ సూత్రం అని పిలువబడే ఒక నొవెల్ సమాచార సూత్రం సహాయం తీసుకున్నారు. ఇటీవలే ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో ప్రచురించబడిన పరిశోధనా కథనం ప్రకారం, వివిధ గణిత శాస్త్ర అవకాశాల మధ్య క్వాంటం కంపోజిషన్ నియమాన్ని ఎంచుకోవడంలో ఇన్ఫర్మేషన్ కాజాలిటీ కీలక పాత్ర పోషిస్తుందని నిరూపించారు.

ఈ బృందం ఇన్ఫర్మేషన్ కాజాలిటీ సూత్రం, క్వాంటం మెకానిక్స్ యొక్క గణిత నిర్మాణాన్ని ఉత్పన్నం చేయడంలో ఇతర సూత్రాల కంటే ఉన్నతంగా పనిచేస్తుందని నివేదించింది. వీరి పరిశోధన క్వాంటం థియరీ యొక్క గణిత నిర్మాణానికి కొత్త భౌతిక సమర్థనను అందిస్తుంది.

క్వాంటం మెకానిక్స్ అనేది మైక్రోస్కోపిక్ ప్రపంచంలోని భౌతిక దృగ్విషయాలను వివరించే సిద్ధాంతం. ఇది పరమాణువులు మరియు సబ్‌టామిక్ కణాల స్థాయిలో ప్రకృతి యొక్క భౌతిక లక్షణాల వివరణను అందిస్తుంది. దీనిని 20 వ శతాబ్దం ప్రారంభంలో జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్, భౌతిక ప్రయోగాల ద్వారా శక్తిని ప్రదర్శించినప్పుడు బ్లాక్-బాడీ రేడియేషన్ కర్వ్, ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం వంటి ప్రయోగాత్మక పరిశీలనలను వివరించడానికి రూపొందించారు.

ఈ సిద్ధాంతాన్ని తర్వాత కాలంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నీల్స్ బోర్, లూయిస్ డి బ్రోగ్లీ, ఎర్విన్ ష్రోడింగర్ మరియు పాల్ ఎం. డిరాక్ ప్లాంక్ వంటి వారు క్వాంటం మెకానిక్స్‌గా అభివృద్ధి చేశారు. ఇది మైక్రోస్కోపిక్ ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన గణిత సిద్ధాంతం.

కాశ్మీర్ లోయలో ఖీర్ భవానీ మేళా

కాశ్మీర్ లోయలో నిర్వహించే ఖీర్ భవానీ మేళా మే 26న నుండి మే 28 మధ్య నిర్వహించబడింది. ఈ పండగను జమ్మూ మరియు కాశ్మీర్‌లోని హిందూ భక్తులు ఖీర్ భవానీ ఆలయంలో మట్టి దీపాలను వెలిగించడం మరియు మతపరమైన శ్లోకాలు పాడడం వంటి ఆచారాలతో జరుపుకుంటారు. గందర్బాల్ జిల్లాలోని తులా మూల గ్రామంలోని మాతా రాగ్న్యా దేవి (ఖీర్ భవానీ) యొక్క పవిత్ర మందిరం ఈ గొప్ప వేడుకకు కేంద్రంగా మారుతుంది.

ఈ ఆలయాన్ని మహారాజా ప్రతాప్ సింగ్ 1912 లో నిర్మించారు. ఖీర్ భవానీని 'మిల్క్ గాడెస్' అని కూడా పిలుస్తారు. ఆమెను తమ రక్షక దేవతగా, కులదేవిగా పూజిస్తారు. ఈ వేడుకను ఏటా జ్యేష్ఠాష్టమి రోజున జరుపుకుంటారు. ఖీర్ భవానీ మేళా కాశ్మీరీ పండిట్ల యొక్క అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటి.

పురాణ ఖిలా త్రవ్వకాలలో మౌర్యుల పూర్వ యుగ ఆనవాళ్లు

ఢిల్లీలోని పురానా ఖిలా వద్ద జరిగిన కొత్త తవ్వకలలో మౌర్యుల పూర్వ యుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ కొత్త త్రవ్వకాల్లో దాదాపు 1200 బీసీ నుండి 600 బీసీ నాటి కుండల ముక్కలు కనుగొనబడ్డాయి. వీటితో పాటుగా మౌర్యుల శకం నాటి 2,500 సంవత్సరాల పురాతనమైన రింగ్ బావి యొక్క అవశేషాలు, రాజపుత్ర యుగం నాటి 900 సంవత్సరాల వైకుంఠ విష్ణు విగ్రహం, గుప్తుల కాలం నాటి గజలక్ష్మీ దేవి ఫలకం కూడా బయటపడ్డాయి.

పురానా ఖిలాను షేర్ షా సూరి మరియు మొఘల్ చక్రవర్తి హుమాయున్ చేత నిర్మించబడింది. ఇది మహాభారతంలో పేర్కొన్న ఇంద్రప్రస్థ ప్రదేశంగా ఊహించబడుతుంది. తాజాగా 3వ రౌండ్ తవ్వకాలు ఈ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యాయి. మునుపటివి 2013-14 మరియు 2017-18లో మధ్య చోటు చేసుకున్నాయి. ఈ ప్రదేశంలో మౌర్యులకు పూర్వం, మొఘల్ మరియు రాజ్‌పుత్‌లతో సహా వివిధ కాలాలకు ప్రాతినిధ్యం వహించిన తొమ్మిది సాంస్కృతిక స్థాయిలు ఇప్పటివరకు బయటపడ్డాయి.

తెలంగాణలో ప్రభుత్వ డి-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ డి-అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా  మద్యం లేదా ఇతర డ్రగ్స్‌కు బానిసలైన వారికి ఉచితంగా చికిత్స, యోగా శిక్షణ మరియు కౌన్సెలింగ్‌ అందివ్వనున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డీ-అడిక్షన్ కేంద్రాలను తెరవాలని కోరుతూ ఒక సామాజిక కార్యకర్త 2016లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎన్ని వాయిదాలు ఇచ్చినా రాష్ట్ర యంత్రాంగం స్పదించకపోవడంతో రాష్ట్రంలో కొత్త డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి, హైకోర్టు అక్షింతలు వేసింది. దీనితో ప్రభుత్వం ప్రకటన వెలువర్చింది.

ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ప్రతిష్టాత్మక గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డు

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) సేఫ్టీ ఎక్సలెన్స్ కేటగిరీ కింద ప్రతిష్టాత్మకమైన గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డు 2023ని కైవసం చేసుకుంది. 2022-23 సంవత్సరంలో కార్యాలయ భద్రతను మెరుగుపరచడంలో అత్యుత్తమ సహకారం అందించినందుకు ఈ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డును 21 వ వార్షిక గ్రీన్‌టెక్ అవార్డుల కార్యక్రమంలో అస్సాం మాజీ గవర్నర్ జగదీష్ ముఖి నుండి ఆర్‌ఐఎన్‌ఎల్‌ డైరెక్టర్ & అదనపు ఛార్జ్ డైరెక్టర్ ఏకే బాగ్చి అందుకున్నారు.

21వ గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డ్ 2023 కార్యక్రమాన్ని గ్రీన్‌టెక్ ఫౌండేషన్ నిర్వహించింది. కార్పోరేట్ రంగంలో పారదర్శక, జవాబుదారీతనం, లైఫ్ సైకిల్ స్టీవార్డ్‌షిప్, ఫైర్, సేఫ్టీ, హెల్త్ మరియు సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ విలువను జోడించే సంస్థలకు ఈ అవార్డు అందజేస్తారు.

నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అపెక్స్ 2వ సమావేశం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్‌ఐసిడిఐటి) కార్యకలాపాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన అపెక్స్ మానిటరింగ్ అథారిటీ 2వ సమావేశానికి అధ్యక్షత వహించారు. మే 30న జరిగిన ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య & జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరియు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా హాజరయ్యారు. అలానే ఈ సమావేశంలో గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు మహారాష్ట్రలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పురోగతి, సవాళ్లు మరియు భవిష్యత్తు వ్యూహాలపై ప్రధానంగా చర్చలు నిర్వహించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ( NICDIT ) 2016న స్థాపించబడింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రధానంగా పారిశ్రామిక కారిడార్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, ఇవి దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడంతో పాటుగా, పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తాయి, తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసిపి)లో భాగంగా దేశంలో నాలుగు దశల్లో అభివృద్ధి చేయాల్సిన 32 ప్రాజెక్టులతో కూడిన 11 ఇండస్ట్రియల్ కారిడార్‌ల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఇవి అభివృద్ధి దశలో ఉన్నాయి. దీనికి సంబందించిన మొదటి సమావేశం గత ఏడాది జులై 7న నిర్వహించారు.

  • ఢిల్లీ - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్
  • చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్
  • కోయంబత్తూర్ -  కొచ్చి ఇండస్ట్రియల్ కారిడార్
  • అమృత్‌సర్ - కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్
  • హైదరాబాద్ - నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్
  • హైదరాబాద్ - వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
  • హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్
  • బెంగళూరు - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్
  • వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్
  • ఒడిశా ఎకనామిక్ కారిడార్
  • ఢిల్లీ నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్

మహారాష్ట్రలో జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం పాలసీకి ఆమోదం

పర్యాటక రంగంలో మహిళల సాధికారత కోసం, మహారాష్ట్ర క్యాబినెట్ 'జెండర్ ఇన్‌క్లూజివ్ టూరిజం పాలసీ' అమలుకు ఆమోదం తెలిపింది. ఆయ్ పేరుతొ ఆమోదం పొందిన ఈ పాలసీ డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం మరియు మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పాలసీ పర్యాటక రంగంలో మహిళలకు వ్యాపార మరియు ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటుగా మహిళా పర్యాటకుల సురక్షితమైన పర్యాటక అనుభవం పొందేందుకు వీలుకల్పిస్తుందని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలలో మహిళల బైక్-టాక్సీ సేవలను ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలానే ఏటా  మార్చి 1 నుండి 8 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని రిసార్ట్‌లు/యూనిట్‌లు మహిళా పర్యాటకులందరికీ ఆన్‌లైన్ బుకింగ్‌పై 50 శాతం తగ్గింపును అందిస్తాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లో సంవత్సరంలో మొత్తం 30 రోజుల పాటు మహిళా పర్యాటకులకు 50 శాతం తగ్గింపు ఆఫర్ కూడా అందుబాటులో ఉంచారు.

ఢిల్లీలో భారత్ - ఆస్ట్రియా 7వ రౌండ్ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు

భారత్ మరియు ఆస్ట్రియా మధ్య విదేశాంగ కార్యాలయాల 7వ రౌండ్ సంప్రదింపులు మే 30న న్యూఢిల్లీలో జరిగాయి. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ మరియు ఆస్ట్రియా పొలిటికల్ డైరెక్టర్ గ్రెగర్ కోస్లర్ సహ-అధ్యక్షులుగా వ్యవహరించారు.

ఈ సమావేశంలో పొరుగు ప్రాంతాలలో పరిణామాలు, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్ యుద్ధం, భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. వీటితో పాటుగా ఇరుదేశాల వాణిజ్యం మరియు పెట్టుబడులు, రక్షణ, కాన్సులర్, వలసలు, నైపుణ్యాభివృద్ధి, విద్య మరియు సాంస్కృతిక అనుసంధానాలు వంటి రంగాలలో సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై కూడా  చర్చించారు. రెండు దేశాల మధ్య సమగ్ర వలసలు మరియు చలనశీలత ఒప్పందంపై కూడా సంతకం చేశారు.

ఓపీఎస్ క్లీన్ పేరుతొ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన పంజాబ్ పోలీసులు

మాదక ద్రవ్యాల మహమ్మారితో సతమతమవుతున్న పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా, పంజాబ్ పోలీసులు ఆ రాష్ట్రవ్యాప్తంగా ' ఓపీఎస్ క్లీన్ ' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాణిజ్య స్మగ్లింగ్‌లో పాల్గొన్న వ్యక్తుల కార్యకలాపాలపై నిఘా ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా మాదకద్రవ్యాల వ్యాపారులకు సంబంధించిన స్థలాలు/ఇళ్లపై దాడులు నిర్వహించినట్లు లా అండ్ ఆర్డర్ అర్పిత్ శుక్లా తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో 5500 మంది పోలీసులతో కూడిన 650 పోలీసు బృందాలు మాదకద్రవ్యాల వ్యాపారులకు సంబంధించిన 2247 చోట్ల దాడులు నిర్వహించినట్లు నివేదించారు. భగవంత్ మాన్ నాయకత్వంలోని ఆప్ ప్రభుత్వం పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి త్రీవ ప్రయత్నం చేస్తుంది.

వందే భారత్ రైళ్ల తయారీ అవకాశం దక్కించుకున్న ఆల్‌స్టోమ్

స్లీపర్ సౌకర్యంతో కూడిన 100 వందేభారత్ రైళ్లను తయారు చేసేందుకు ఫ్రెంచ్ కంపెనీ ఆల్‌స్టామ్‌ కాంట్రాక్టు దక్కించుకుంది. ఒప్పందం విలువ ₹30,000 కోట్లు ఉన్నట్లు నివేదించారు. ఈ రైళ్లను గుజరాత్‌లోని సావ్లీలోని అల్‌స్టోమ్ ప్లాంట్‌లో తయారు తయారు చేయనున్నారు. వచ్చే ఐదేళ్ల వ్యవధిలో ఇవి డెలివరీ చేయబడతాయి. అల్‌స్టోమ్ ఒక్క రైలు నిర్మాణానికి ₹150.9 కోట్ల అత్యల్ప బిడ్ వేయడం ద్వారా ఈ అవకాశం దక్కించుకుంది

ఆల్‌స్టామ్‌ రూపొందించే ఈ కొత్త వందే భారత్ రైళ్లు గంటకు 200 కిమీ వేగంతో నడిచేలా రూపొందించబడ్డాయి. ఇవి పాత రైళ్ల కంటే మరింత సౌకర్యవంతంగా మరియు సమర్థవంతంగా గమ్యాన్ని చేరుకోనున్నాయి. మొదటి రైలు 2024 మొదటి త్రైమాసికంలో డెలివరీ చేయబడుతుందని భావిస్తున్నారు. ఇండియన్ రైల్వేస్ యొక్క రోలింగ్ స్టాక్ ప్రొక్యూర్‌మెంట్ విభాగం అయినా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈ కాంట్రాక్టును అందజేసింది. ఇటీవలి సంవత్సరాలలో భారతీయ మార్కెట్‌లో తన ఉనికిని విస్తరిస్తున్న ఆల్‌స్టోమ్‌కు ఈ ఒప్పందం ఒక ప్రధాన విజయంగా చెప్పొచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలకు మెట్రో రైళ్ల తయారీ కాంట్రాక్టులు కూడా ఈ కంపెనీయే దక్కించుకుంది.

జెనీవాలో జీ20 3వ ఎంప్లాయిమెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రధాన కార్యాలయంలో జీ20 ఇండియన్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో మూడవ ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం మే 31 నుండి జూన్ 2 తేదీలలో విజయవంతంగా నిర్చవహించబడింది. ఈ మూడు రోజుల సమావేశంలో జి20 సభ్యులు, ఆహ్వానిత దేశాలు, అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సమావేశానికి కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారతదేశంలో ఉపాధి అవకాశాలు, పెరుగుతున్న నిరుద్యోగం మరియు నిరుద్యోగిత సవాళ్లు వంటి ముఖ్యమైన అంశాల యందు చర్చలు జరిపారు. ఉపాధిపై కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం, నైపుణ్యాల అభివృద్ధి, సామాజిక రక్షణ, అందరికీ మంచి పనివంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ ఏడాది ఇండోరులో జరిగే జీ20 లేబర్ & ఎంప్లాయ్‌మెంట్ మినిస్టీరియల్ సమావేశంలో దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు బయటకు రానున్నాయి.

ఉపాధి సవాళ్లను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ సమావేశం హైలైట్ చేసింది. అందరికీ మంచి పనిని ప్రోత్సహించడానికి ఇతర దేశాలు మరియు సంస్థలతో కలిసి పనిచేయడానికి జీ20 దేశాలు కట్టుబడి ఉన్నట్లు నివేదించాయి.

భారత హెలికాప్టర్ల కోసం పెర్ఫార్మన్స్-బేస్డ్ నావిగేషన్

హెలికాప్టర్‌ల మార్గనిర్దేశం కోసం పనితీరు ఆధారిత నావిగేషన్‌ను ఉపయోగించిన మొదటి ఆసియా దేశంగా భారత్ నిలిచింది. ఈ నావిగేషన్ గగన్ ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఈ నావిగేషన్ ఆధారంగా జూన్ 8న మొదటి హెలీకాఫ్టర్ ముంబైలోని జుహూ నుండి పూణేకి ప్రయాణించింది. విజయవంతమైన ఈ ప్రయోగం భారత విమానయాన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు. ఇది దేశంలోని హెలికాప్టర్ల మార్గాన్వేషణ కోసం పనితీరు ఆధారిత నావిగేషన్‌ను స్వీకరించడానికి మార్గం సుగమం చేయనుంది.

సాంప్రదాయ జీపీఎస్ కంటే పిబిఎన్ సాంకేతికత హెలికాప్టర్ పైలట్‌లకు మరింత ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. ఇది భద్రతను మెరుగుపరచడానికి మరియు ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది. హెలికాప్టర్‌లను మరింత ఖచ్చితమైన మార్గాల్లో ఎగరడానికి అనుమతిస్తుంది, ఇది సమయం మరియు ఇంధనాన్నికూడా ఆదా చేస్తుంది. రద్దీగా ఉండే గగనతలంలో ఇది మరింత సమర్దవంతంగా పనిచేయనుంది.

ప్రపంచ వాతావరణ సంస్థ మొదటి మహిళా అధిపతిగా సెలెస్టే సౌలో

అర్జెంటీనాకు చెందిన ప్రముఖ మెటీరోలాజిస్ట్ సెలెస్టే సౌలో, ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క మొదటి మహిళా అధిపతిగా ఎన్నికయ్యారు. జూన్ 1, 2023న జెనీవాలో జరిగిన వరల్డ్ మెటీరోలాజికల్ ఆర్గనైజషన్ కాంగ్రెస్‌లో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. సౌలో 2014 నుండి అర్జెంటీనా నేషనల్ మెటీరోలాజికల్ సర్వీస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అదే సమయంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుంజయ్ మోహపాత్ర ప్రపంచ వాతావరణ సంస్థ మూడవ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ఇది హైడ్రాలజీ మరియు జియోఫిజిక్స్‌పై అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి బాధ్యత వహించే ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. దీనిని 1950లో స్థాపించారు. ఇందులో 193 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

ఎయిమ్స్ నాగ్‌పూర్‌కు ఎన్ఎబీహెచ్ గుర్తింపు

నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఎబీహెచ్) గుర్తింపు పొందిన మొదటి ఎయిమ్స్ ఇనిస్టిట్యూట్‌గా నిలిచింది. ఎన్ఎబీహెచ్ అక్రిడిటేషన్ అనేది రోగి సంరక్షణ, భద్రత మరియు ఇన్ఫెక్షన్ నియంత్రణతో సహా అనేక రంగాలలో ఆసుపత్రి యొక్క ఉత్తమ పనితీరు ఆధారంగా అందించబడుతుంది. ఉన్నత నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఆసుపత్రి నిబద్ధతకు ఇది ఒక గుర్తింపు.

నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ అనేది దేశంలోని హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్ కోసం అక్రిడిటేషన్ అందించేందుకు ఏర్పాటు చేయబడ్డ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రాజ్యాంగ బోర్డ్. దీనిని 2005లో ఏర్పాటు చేసారు. ఇది భారతదేశంలోని ఆసుపత్రులకు వివిధ ప్రమాణాల ఆధారంగా గుర్తింపు కల్పిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది .

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై పొగాకు హెచ్చరికలను తప్పనిసరి చేసిన కేంద్రం

ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్‌లలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలను మరియు నిరాకరణలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2004 కింద నిబంధనలను సవరిస్తూ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మే 31, 2023న ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనితో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ మరియు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరిగా పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ స్ట్రీమింగ్ సమయంలో పొగాకు ఉత్పత్తులు లేదా వాటి ఉపయోగం ప్రదర్శించబడినప్పుడు స్క్రీన్ దిగువన ఈ స్థిర సందేశం చూపించాల్సి ఉంటుంది. అలానే ప్రోగ్రామ్ ప్రారంభంలో మరియు మధ్యలో కనీసం 30 సెకన్లు ఉండే పొగాకు వ్యతిరేక ఆరోగ్య సందేశాలు ప్రదర్శించాలి. హెచ్చరికలు తప్పనిసరిగా ప్రోగ్రామ్ ఉన్న భాషలోనే ఉండాలి. అవి స్పష్టంగా మరియు సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. కొత్త నిబంధనలు డిసెంబర్ 1, 2023 నుండి అమలులోకి వస్తాయి.

ధూమపానం ప్రారంభించే యువకుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను ప్రభుత్వం అమలు చేస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్, ఇండియా వారి అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని దాదాపు 27% మంది యువకులు ధూమపానంకు అలవాటు పడ్డారు. ఈ సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. పొగాకు క్యాన్సర్‌కు కారణమవుతుంది.

శ్రీలంక టూరిజంకు అతిపెద్ద సోర్స్ మార్కెట్‌గా భారత్

శ్రీలంక టూరిజంకు అతిపెద్ద సోర్స్ మార్కెట్‌గా భారత్ తిరిగి అగ్రస్థానం దక్కించుకుంది. గడిసిన మే 2023లో, భారతదేశం నుండి 20,971 మంది పర్యాటకులు శ్రీలంకను సందర్శించారు. ఇది మొత్తం శ్రీలంక పర్యాటకుల శాతంలో 28%. శ్రీలంకలో పర్యాటకానికి భారతదేశం రెండవ అతిపెద్ద మూలాధార మార్కెట్‌గా ఉన్న మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల.

భారతదేశం, శ్రీలంకలో పర్యాటకానికి అతిపెద్ద మూల మార్కెట్‌గా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు ఒక కారణం. ఈ దేశం యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యానికి ఆకర్షితులయ్యే భారతీయ పర్యాటకులకు శ్రీలంక ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది.

భారత పర్యాటకుల రాక పెరగడానికి మరొక కారణం శ్రీలంకలో భద్రతా పరిస్థితి మెరుగుపడటం. 2009లో చోటుచేసుకున్న అంతర్యుద్ధం నుండి ఆ దేశం కోలుకుంటుంది మరియు ఇటీవలి సంవత్సరాలలో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇది భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు శ్రీలంకను మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చింది.

భారతదేశం 2070 నాటికి నికర సున్నాని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది

భారతదేశం 2070 నాటికి నికర సున్నాని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ ఒక ప్రకటనలో తెలియజేసారు. కొరియాలోని సియోల్‌లో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ సింపోజియం 2023 లో జరిగిన రౌండ్‌టేబుల్ ఉన్నత స్థాయి చర్చలో ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత్ గతంలో 2027, ఆ తర్వాత 2050 నాటికీ ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులు పెడితే 2027 నాటికి భారతదేశం నికర సున్నాని సాధించగలదని బన్సాల్ గతంలో చెప్పారు, కాకుంటే ఇది భారత్ అధికారిక లక్ష్యం కాదని వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ యొక్క 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26)లో కూడా ప్రకటించారు.

భారత్ 2070 లక్ష్యం ప్రతిష్టాత్మకమైనది, అయితే భారతదేశం సరైన చర్యలు తీసుకుంటే అది సాధించబడుతుంది. భారత్ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం వైపు అడుగులు వేస్తుంది, అయినప్పటికీ, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇది మరింత చేయవలసి ఉంటుంది. 2070 నాటికి నికర సున్నాని సాధించడం భారతదేశ ప్రధాన ఆశయం. ఇది వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంతోపాటు ఆర్థిక వృద్ధిని కూడా పెంచుతుంది.

ఇండియన్ ఎనర్జీ మేజర్‌లకు సురినామ్ ఆతిథ్యం

దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ జూన్ 19 నుండి 23 మధ్య చమురు మరియు గ్యాస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. ఈ సమావేశాన్ని "ఇండియన్ ఎనర్జీ మేజర్స్" కాన్ఫరెన్స్ అని పిలుస్తారు. దీనిని సురినామీస్ ప్రభుత్వం మరియు భారత పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా నిర్వహించాయి.

ఈ సమావేశం ముఖ్యంగా భారతదేశం నుండి ఇంధన కంపెనీలను ఆకర్షించాలనే లక్ష్యంతో నిర్వహించారు. ఈ సదస్సు భారతదేశం మరియు సురినామ్ మధ్య వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలను కూడా పెంచుతుందని భావిస్తున్నారు. ఇంధన రంగంలో ఇప్పటికే పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసి ఉన్నాయి.

సురినామ్‌లో కనీసం 3-4 బిలియన్ బారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇవి ఇటీవలి సంవత్సరాలలో కనుగొనబడ్డాయి. భారతదేశం కూడా సహజ వాయువు కోసం అన్వేషిస్తోంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85% విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. సురినామ్ యొక్క చమురు మరియు వాయువు సంభావ్యత గురించి మరింత తెలుసుకోవడానికి మరియు పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది.

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ఎంహెచ్60ఆర్ హెలికాప్టర్ మెయిడెన్ ల్యాండింగ్

భారత నావికాదళానికి చెందిన MH-60 రోమియో హెలికాప్టర్, స్వదేశీ విమాన వాహక నౌక అయినా ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మొదటిసారిగా విజయవంతంగా ల్యాండ్ అయింది. లాక్‌హీడ్ మార్టిన్ కార్పొరేషన్ తయారు చేసిన ఈ మల్టీ పర్పస్ హెలికాప్టర్, మే 31న అరేబియా సముద్రంలో విక్రాంత్ విమాన వాహక నౌకపై విజయవంతంగా ల్యాండ్ చేయబడింది.

ఈ ల్యాండింగ్ భారత నావికాదళానికి ఒక ముఖ్యమైన మైలురాయి, ఎందుకంటే ఎంహెచ్60ఆర్ హెలికాప్టర్ ఒక భారతీయ విమాన వాహక నౌకపై ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. ఎంహెచ్60ఆర్ అనేది ఒక బహుముఖ అమెరికన్ నేవీ హెలికాప్టర్. ఇది జలాంతర్గామి వ్యతిరేక యుద్ధంతో పాటుగా, శోధన మరియు రెస్క్యూ వంటి అనేక రకాల మిషన్‌ల కోసం ఉపయోగించవచ్చు.

ఈ హెలికాప్టర్‌లో డిప్పింగ్ సోనార్, రాడార్ మరియు తుపాకీతో సహా వివిధ రకాల సెన్సార్లు మరియు ఆయుధాలు అమర్చబడి ఉంటాయి. ఇది 1,000 నాటికల్ మైళ్ల పరిధిని కవర్ చేయడంతో పాటుగా 12 గంటలకు పైగా గాలిలో ఉండగలదు. ఇది 16 మంది ప్రయాణికులు లేదా 12,000 పౌండ్ల సరుకును మోసుకెళ్లగలదు. ఇది రాబోయే కాలంలో భారత నౌకాదళానికి విలువైన ఆస్తిగా పరిగణించబడుతుంది.

టీసీఎస్ నూతన సీఈవోగా కృతివాసన్

కె కృతివాసన్ జూన్ 1, 2023న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 2023లో ఈ హోదా నుండి వైదొలిగిన రాజేష్ గోపీనాథన్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. కృతివాసన్ టీసీఎస్ యందు గత 34 ఏళ్లలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్‌తో సహా అనేక సీనియర్ పదవులను నిర్వహించారు.

కృతివాసన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్‌లో గ్రాడ్యుయేట్, మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ పట్టా పొందారు. 55 ఏళ్ల టీసీఎస్ చరిత్రలో కృతివాసన్ ఐదవ సీఈఓ. అదే సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ బిజినెస్ గ్రూప్ నుండి నియమితులైన మొదటి సీఈఓ.

సోలార్ ఎనర్జీ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా అజయ్ యాదవ్

అజయ్ యాదవ్ మే 31, 2023న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన బీహార్ కేడర్‌కు చెందిన 2005-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అజయ్ యాదవ్ గతంలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు.

యాదవ్ పునరుత్పాదక ఇంధన రంగంపై లోతైన అవగాహన కలిగిన అనుభవజ్ఞుడైన బ్యూరోక్రాట్. ఈయన భారతదేశంలో సౌరశక్తిని ప్రోత్సహించే లక్ష్యంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నాయకత్వం వహిస్తారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి మరియు అమలు, సోలార్ పార్కుల నిర్వహణ మరియు సౌరశక్తిని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటారు.

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థ, ఇది జాతీయ సౌర మిషన్ అమలును సులభతరం చేయడానికి 9 సెప్టెంబర్ 2011లో స్థాపించబడింది. ఇది సౌరశక్తి రంగానికి అంకితమైన ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పేరు మార్పు

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యానగర్‌గా మార్చనున్నారు. మరాఠా సామ్రాజ్యం రాణి అయినా అహల్యాబాయి హోల్కర్ 298వ జయంతి సందర్భంగా మే 31, 2023న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ప్రకటన చేశారు.

అహల్యాబాయి హోల్కర్ భారతదేశంలోని మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన 17వ శతాబ్దపు రాణి. ఈమె దైవభక్తి మరియు నిరాడంబరమైన పరిపాలనకు ప్రసిద్ధి చెందారు. ఈమె పరిపాలనలో అనేక దేవాలయాలు మరియు ఇతర ప్రజా పనులను నిర్మించిన ఘనత ఆమెకు దక్కించుకున్నారు. ఆమె దైవభక్తి మరియు సామాజిక సంక్షేమం పట్ల నిబద్ధత మరియు జ్ఞాపకార్థం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పర్వతారోహణ కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా ఎన్‌సిసి క్యాడెట్‌గా షాలినీ

లక్నోకు చెందిన 20 ఏళ్ల షాలినీ సింగ్ హిమాలయ ప్రాంతంలో పర్వతారోహణ కోర్సును పూర్తి చేసిన భారతదేశంలో మొదటి మహిళా ఎన్‌సిసి క్యాడెట్‌గా నిలిచారు. సీనియర్ వింగ్ ఎన్‌సిసి క్యాడెట్ అయినా షాలినీ సింగ్, 67 యూపీ బెటాలియన్‌లో సభ్యరాలుగా ఉన్నారు.

కోర్సు పూర్తి చేసేందుకు ఏర్పాటైన 45 మంది ఎన్‌సీసీ క్యాడెట్ల బృందంలో ఆమె ఒక్కరే మహిళా క్యాడెట్ కావడం గమనార్హం. ఈ కోర్సులో విజయం సాధించడానికి, ఆమె డ్రింగ్ వ్యాలీలో మంచుతో కప్పబడిన పర్వతాల గుండా 15,400 అడుగుల పర్వతారోహణ చేశారు.

ప్రధానమంత్రి స్వనిధిని యాప్ ప్రారంభించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి మొబైల్ యాప్‌ను 01 జూన్ 2023న ప్రారంభించారు. ఈ యాప్ వీధి వ్యాపారుల రుణ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు ఆ పథకానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని వారికి అందించడానికి ఉపయోగపడనుంది.

ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం ప్రారంభమై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ 01, 2020న అందుబాటులోకి తీసుకొచ్చింది. వీధి వ్యాపారులలో స్వయం ఉపాధి, స్వీయ-పోషణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కోవిడ్-19-ప్రభావిత వీధి వ్యాపారులకు వారి జీవనోపాధిని పునఃప్రారంభించేందుకు అవకాశం కల్పించింది.

నలంద చరిత్రపై ప్రఖ్యాత రచయిత అభయ్ కొత్త పుస్తకం

పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా వారు నలందపై ప్రఖ్యాత రచయిత అభయ్ కె. రచించిన కొత్త పుస్తకాన్ని ప్రచురించబోతున్నట్లు ప్రకటించారు. నలంద పేరుతో ఈ పుస్తకం అక్టోబర్ 2024లో విడుదల కానుంది. ఈ పుస్తకం పురాతన భారతీయ విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనాన్ని మరియు మేధో పరాక్రమాన్ని అన్వేషిస్తుంది. ఈ పుస్తకం నలంద యొక్క పుట్టుక నుండి విధ్వంసం మరియు పునర్జన్మ వరకు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని పరిచయం చేయనుంది.

అభయ్ బీహార్‌లోని నలంద జిల్లాలోని రాజ్‌గిర్ సమీపంలో పుట్టి పెరిగాడు. ఢిల్లీ యూనివర్సిటీ , జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. 2003లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరిన ఈయన ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈయన 2013లో సార్క్ లిటరసీ అవార్డు అందుకున్నారు.

ఐదు నూతన సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపిన సిద్ధరామయ్య ప్రభుత్వం

సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఐదు నూతన సంక్షేమ పథకాలకు ఆమోదం తెలిపింది. ఇవి రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి రూ.5,000 కోట్లు అవసరం కానున్నాయి. వీటి అమలు కోసం పన్నులు, రుణాల సమ్మేళనం ద్వారా నిధులు సేకరించున్నారు.

  • గృహ జ్యోతి: ఈ పథకం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బిపిఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు తమ సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి 1 లక్ష రూ. ఆర్థిక సాయం అందిస్తారు.
  • గృహ లక్ష్మి: ఈ పథకం ద్వారా బిపిఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు తమ సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి రూ. 50,000 సహాయం అందిస్తారు.
  • అన్న భాగ్య: ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందజేస్తుంది.
  • శక్తి: ఈ పథకం ద్వారా వితంతువులు లేదా ఒంటరి తల్లులకు నెలకు రూ. 2,000. సాయం అందిస్తారు.
  • యువనిధి: ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు నెలకు 2,000. రూ ఆర్థిక సహాయం అందిస్తారు.

నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌గా దేవ్ షా

ఫ్లోరిడాలోని లార్గోలో 8వ తరగతి చదువుతున్న దేవ్ షా జూన్ 1, 2023న స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఛాంపియన్‌గా నిలిచాడు. 14 ఏళ్ల ఈ భారతీయ-అమెరికన్ ఈ పోటీలో గెలవడానికి "ప్సామ్మోఫైల్" అనే పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చేశాడు. విజేతకు $ 50,000 బహుమతి అందించబడుతుంది.

ఈ పోటీలో వర్జీనియాలోని ఆర్లింగ్‌టన్‌కు చెందిన 14 ఏళ్ల ఎనిమిదో తరగతి విద్యార్థిని ఛార్లెట్ వాల్ష్‌, 14వ రౌండ్‌లో "డేవిలీ" అనే స్కాటిష్-మూలాలు లేని పదాన్ని తప్పుగా వ్రాయడంతో రెండవ స్థానంలో నిలిచింది. వాషింగ్టన్, డీసీ వెలుపల నేషనల్ హార్బర్, మేరీల్యాండ్‌లో జరిగిన మూడు రోజుల ఈ పోటీలో మొత్తం 220 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీ 1925లో ప్రారంభమైంది. 14 ఏళ్ళ లోపు విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులు.

చెన్నైలో కలైంజర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్

చెన్నైలో 25 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దిగవంత డీఎంకే అధినేత కరుణానిధి శత జయంతి సందర్భంగా లోగోను ఆవిష్కరించిన టీఎన్ సీఎం స్టాలిన్ ఈ ప్రకటన చేసారు. 5,000 సీటింగ్ కెపాసిటీతో త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. దీనికి కలైంజర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని పేరు పెట్టనున్నారు. భారతదేశంలోని టాప్ 5 అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లు.

  1. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC) - న్యూఢిల్లీ
  2. బాంబే కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్ (BEC) - ముంబై
  3. లులు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (LICC) - కొచ్చి
  4. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) - హైదరాబాద్
  5. మహారాష్ట్ర స్టేట్ ఎగ్జిబిషన్ సెంటర్ (MSEC) - నాగ్‌పూర్

జూన్ 3న గోవా మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 3వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గోవా మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మడ్గావ్ రైల్వే స్టేషన్ నుండి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఈ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మరియు గోవాలోని మడ్‌గావ్ స్టేషన్ మధ్య నడుస్తుంది. ఈ హై-స్పీడ్ రైలు సుమారు ఏడున్నర గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుందని భావిస్తున్నారు, ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే ఇది ప్రయాణీకులకు ఒక గంట ప్రయాణ సమయాన్ని ఆదా చేయనుంది.

ఇది దేశంలో మొత్తంగా 19వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు. స్వదేశీంగా తయారు చేయబడుతున్న ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వినూత్న కవాచ్ సాంకేతికతతో సహా ప్రపంచ-స్థాయి సౌకర్యాలు మరియు అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం దేశంలో గంటకు 160 కిమీ గరిష్ట వేగంతో నడిచే అత్యంత వేంగవంతమైన రైళ్లుగా ఉన్నాయి.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డీజీగా జనార్దన్ ప్రసాద్

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త డైరెక్టర్ జనరల్‌గా జనార్దన్ ప్రసాద్ నియమితులయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851లో స్థాపించబడింది, ఇది దేశంలో దేశంలోని బొగ్గు మరియు ఇతర ఖనిజ వనరులను పరిశోధించడానికి మరియు అంచనా వేయడానికి నిర్దేశించబడింది. ఇది భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధిలో విధులు నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.

జిఎస్ఐ ప్రస్తుతం భారతదేశం యొక్క భౌగోళిక సర్వేలు మరియు అధ్యయనాలను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం, పరిశ్రమ మరియు సాధారణ ప్రజలకు ప్రాథమిక భూ విజ్ఞాన సమాచారాన్ని అందించే ప్రధాన ప్రదాతగా కూడా ఉంది.

తెలంగాణాలో ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్‌

ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్‌ తెలంగాణలో రూపుదిద్దుకుంటుంది. ఈ ఆలయాన్ని హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ మరియు సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. ఇది సిద్దిపేటలోని బూరుగుపల్లిలో గల గేటెడ్ విల్లా కమ్యూనిటీ అయిన చార్విత మెడోస్‌లో ఏర్పాటు చేయబడుతుంది.

ఐఐటీ హైదరాబాద్‌లోని సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కెవిఎల్ సుబ్రమణ్యం మరియు అతని పరిశోధనా బృందం ఈ కాన్సెప్ట్ మరియు డిజైన్‌ను అభివృద్ధి చేసింది. 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న 3డి ప్రింటెడ్ టెంపుల్ యందు మూడు గర్భాలయాలు ఉన్నాయి. మొదటి గర్భయంలో అడ్డంకులను తొలగించే గణేశుడిని, రెండవ గర్భంలో శివాలయం, మూడవ గర్భం కమలం రూపంలో పార్వతీ దేవికి కేటాయించబడింది.

తమిళనాడులో వైకాసి విశాఖ ఉత్సవాలు

తమిళనాడులో 2023 ఏడాదికి సంబంధించి వైకాసి విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. వైకాసి విశాఖం అనేది తమిళ క్యాలెండర్ ప్రకారం వైకాసి నెలలో (వైశాఖ మాసం మే - జూన్) జరుపుకునే హిందూ పండుగ. తమిళ మాసం వైకాసిలో ఇది అతి ముఖ్యమైన పండుగ. ఇది యుద్ధం, జ్ఞానం మరియు విజయం యొక్క హిందూ దేవుడు మురుగన్ యొక్క పుట్టిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు.

వైకాసి విశాఖ నాడు మురుగన్ కు అంకితం చేయబడిన అనేక దేవాలయాలలో పెద్ద ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో దేవుడి ప్రతిమను మోసే అలంకరించబడిన రథం ఉంటుంది. భక్తులు రథాన్ని వీధుల గుండా లాగుతారు, మరికొందరు కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తారు. అలానే నదీ స్థానాలు, ఆలయ దర్శనాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

22 రోజుల పాటు తెలంగాణ దశబ్ద ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు

జూన్ 2 తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమానికి ప్రాముఖ్యతనిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన జరుపుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు రోజుకో వేడుక చెప్పున తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

తేదీ దినోత్సవం మంత్రిత్వ శాఖ /ప్రాముఖ్యత
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆవరణలో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు వేదిక వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా మరియు ఇతర పథకాల విజయాలను హైలైట్ చేశారు.
జూన్ 4 భద్రతా దినోత్సవం (సురక్షా దినోత్సవం) రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషికి గౌరవార్థం దీనిని జరుపుకున్నారు.
జూన్ 5 తెలంగాణ విద్యుత్ విజయోత్సవం ఇది ఇంధన శాఖ సాధించిన విజయాలుకు గుర్తుగా జరుపుకున్నారు.
జూన్ 6 తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఫెస్టివల్ ఇది పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ కారిడార్ల ప్రగతికి నిర్దేశించబడింది
జూన్ 7 ఇరిగేషన్ వాటర్ డే సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేశారు.
జూన్ 8 ఊరురా చెరువుల పండుగ ప్రతి గ్రామంలోని నీటి వనరుల వద్ద వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ, బోనాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు.
జూన్ 9 తెలంగాణ సంక్షేమ సంబరాలు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం ద్వారా విస్తరించిన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి మరియు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించారు.
జూన్ 10 తెలంగాణ గుడ్ గవర్నెన్స్ డే రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసారు.
జూన్ 11 తెలంగాణ సాహిత్య దినోత్సవం రవీంద్రభారతిలో జిల్లా స్థాయి కవి సమ్మేళనాలు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు జరుపుకున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
జూన్ 12 తెలంగాణ రన్ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించారు.
జూన్ 13 తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులు అందజేశారు.
జూన్ 14 తెలంగాణ వైద్య దినోత్సవం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక పరిణామాలకు సంబంధించిన సమాచారం, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరవేశారు.
జూన్ 15 తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం తెలంగాణ గ్రామాలు సాధించిన ప్రగతిని ప్రభుత్వం ప్రదర్శించింది. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, మండల ఎంపీపీలను సన్మానించారు.
జూన్ 16 “తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను కార్యక్రమాల్లో వివరించారు.
జూన్ 17 తెలంగాణ గిరిజన పండుగ కొత్తగా ఏర్పాటైన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు తెలియజేసారు.
జూన్ 18 తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ఫెస్టివల్ మిషన్ భగీరథ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని 100 శాతం తాగునీటి సరఫరా రాష్ట్రంగా మార్చడాన్ని వివిధ కార్యక్రమాల్లో ద్వారా తెలియజేసారు.
జూన్ 19 తెలంగాణ గ్రీన్ ఫెస్టివల్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు.
జూన్ 20 తెలంగాణ విద్యా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను ఇందులో వివరించారు. ఇదే సందర్భంగా 10,000 లైబ్రరీలు, 1,600 డిజిటల్ క్లాస్‌రూమ్‌లను కూడా విద్యార్థులకు అంకితం చేసారు.
జూన్ 21 తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు ఇతర మత ప్రార్థనా స్థలాల వద్ద వివిధ ధార్మిక కార్యక్రమాలు జరుపుకున్నారు
జూన్ 22 తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ గ్రామాలు, పట్టణాలు, నగరాలు, పాఠశాలలు అమరవీరులకు నివాళులర్పించి మౌనం పాటించారు. ట్యాంక్ బండ్ వద్ద అమరవీరుల స్మారకార్థం, వారి త్యాగాలను స్మరించుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం ప్రారంభించారు.

అమృత్ భారత్ కింద 1,275 రైల్వే స్టేషన్లు అప్‌గ్రేడ్

అమృత్ భారత్ కింద 1,275 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వేలు చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2022లో ప్రారంభించబడింది. ఈ పథకం 2024 నాటికి భారతదేశం అంతటా 1,275 రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా రైల్వే స్టేషన్లు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మరియు సేవల పరంగా అప్‌గ్రేడ్ చేయబడతాయి.

మెరుగైన మౌలిక సదుపాయాలు: స్టేషన్లు కొత్త ప్లాట్‌ఫారమ్‌లు, ఫుట్‌బ్రిడ్జ్‌లు మరియు వెయిటింగ్ రూమ్‌లతో అప్‌గ్రేడ్ చేయబడతాయి. అవి వై-ఫై, డిజిటల్ డిస్‌ప్లేలు మరియు సిసిటివి కెమెరాలు వంటి ఆధునిక సౌకర్యాలతో కూడా అమర్చబడతాయి.

మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు: స్టేషన్‌లలో ప్రయాణీకుల కోసం మెరుగైన సీటింగ్, రిఫ్రెష్‌మెంట్ ప్రాంతాలు మరియు టాయిలెట్లు వంటి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. వికలాంగులైన ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

మెరుగైన సేవలు: స్టేషన్లలో పార్శిల్ బుకింగ్, క్యాటరింగ్ మరియు పార్కింగ్ వంటి మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. వారికి ఇ-టికెటింగ్ మరియు నగదు రహిత చెల్లింపులకు కూడా సౌకర్యాలు కల్పిస్తారు

మెరుగైన భద్రత: సీసీ టీవీ కెమెరాలు మరియు ఇతర భద్రతా చర్యలతో అప్‌గ్రేడ్ చేయబడిన స్టేషన్‌లు మరింత సురక్షితంగా ఉంటాయి.

మెరుగైన కనెక్టివిటీ: అప్‌గ్రేడ్ చేయబడిన స్టేషన్‌లు బస్సులు మరియు టాక్సీలు వంటి ఇతర రవాణా మార్గాలకు మెరుగ్గా కనెక్ట్ చేయబడతాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వేలకు ఒక పెద్ద ముందడుగు. ఈ పథకం ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని మరియు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.

జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ విజేతగా భారత్

ఒమన్‌లోని సలాలాలో ఇక్కడ జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ 2023లో ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. పురుషుల జూనియర్ ఆసియాలో భారత్ గెలవడం ఇది నాల్గొవసారి. గతంలో2004, 2008 మరియు 2015లో విజేతగా నిలిచింది. పాకిస్తాన్ కూడా 1988, 1992 మరియు 1996 లలో విజేతగా నిలిచింది.

ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికైన వివేక్ సాగర్ ప్రసాద్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఫైనల్‌లో భారత్‌కు ప్రసాద్‌ తొలి గోల్‌ అందించగా, రెండో గోల్‌కు కూడా సహకరించాడు. భారత్‌ తరఫున మరో గోల్‌ అభిషేక్‌ చేశాడు.

ఫుకోట్ కర్నాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం భారత్-నేపాల్ అవగాహన ఒప్పందం

నేపాల్‌లో ఫుకోట్ కర్నాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (480MW)ను అభివృద్ధి చేయడానికి జూన్ 1, 2023న భారతదేశం మరియు నేపాల్ దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సమక్షంలో ఎన్‌హెచ్‌పీసీ చైర్మన్ ఆర్కే విష్ణోయ్, వీయూసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ప్రసాద్ రిజాల్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.

ఫుకోట్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పశ్చిమ నేపాల్‌లోని కర్నాలీ నదిపై అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 480 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సగటున ఏడాదికి సుమారు 2448 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు దాదాపు రూ. 12,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు.

ఫుకోట్ కర్నాలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అభివృద్ధి భారతదేశం-నేపాల్ ఇంధన సహకారంలో ఒక ప్రధాన మైలురాయి. రెండు దేశాల్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కూడా ఇది దోహదపడుతుంది.

బయోగ్యాస్ ప్రాజెక్టుల కోసం ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్‌ ప్రారంభం

భారత ప్రభుత్వం బయోగ్యాస్ ప్రాజెక్ట్‌ల కోసం ఏకీకృత రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. గోబర్ధన్ యూనిఫైడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అని పిలువబడే వెబ్సైట్, భారతదేశంలో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌లను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది జల్ శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ఇది పాన్ ఇండియా స్థాయిలో బయోగ్యాస్/సీబీజీ రంగంలో పెట్టుబడులు మరియు భాగస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఒక స్టాప్ రిపోజిటరీగా పనిచేస్తుంది.

గోబర్ధన్ యూనిఫైడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రయోజనాలు

  • బయోగ్యాస్ ప్రాజెక్టుల నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుంది.
  • భారతదేశంలోని బయోగ్యాస్ ప్రాజెక్టులపై సమాచార కేంద్రీకృత రిపోజిటరీని అందిస్తుంది.
  • బయోగ్యాస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
  • భారతదేశంలో స్థిరమైన బయోగ్యాస్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని సులభతరం చేస్తుంది

భారతదేశంలో బయోగ్యాస్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో గోబర్ధన్ యూనిఫైడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఒక ముఖ్యమైన దశ. భారతదేశంలో బయోగ్యాస్ ప్రాజెక్టుల సంఖ్యను పెంచడానికి ఈ పోర్టల్ సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇది శిలాజ ఇంధనాలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

గోబర్ బంధన్ యోజన అనేది గ్రామీణ ప్రాంతాల్లో వంట మరియు విద్యుత్ అవసరాల కోసం బయోగ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అమలుచేస్తున్న ఒక పథకం. ఈ పథకం 2022లో ప్రారంభించబడింది. దీని పరిధిలో 2024 నాటికి గ్రామీణ భారతదేశంలో 10 మిలియన్ బయోగ్యాస్ ప్లాంట్‌లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో గోబర్ బంధన్ యోజన ఒక ముఖ్యమైన దశ.

ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యక్ష హోదాలో యూఏఈ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క అధ్యక్ష పదవిని గెలుచుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన 19వ ప్రపంచ వాతావరణ శాస్త్ర కాంగ్రెస్ సందర్భంగా ఈ ఎన్నిక జరిగింది. యుఎఇ మాజీ పర్యావరణ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ మాండౌస్ ప్రపంచ వాతావరణ సంస్థ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతను 2023 నుండి 2027 వరకు నాలుగు సంవత్సరాల పాటు ఈ హోదాలో  కొనసాగుతారు.

డాక్టర్. అల్ మాండౌస్ ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవంతో అత్యంత గౌరవనీయమైన వాతావరణ శాస్త్రవేత్తగా గుర్తించబడ్డారు. ఈయన ఇది వరకు నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ అండ్ సిస్మోలజీ డైరెక్టర్ జనరల్‌గా సహా యూఏఈ ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులలో పనిచేశారు.

వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు డాక్టర్ అల్ మాండౌస్ తన అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వాతావరణ సేవలను అందించడంలో డబ్ల్యూఎంఓ పాత్రను బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని వెల్లడించారు.

గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023

వాక్ ఫ్రీ ఫౌండేషన్ యొక్క గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2023 తాజాగా విడుదల అయ్యింది. తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మంది ఆధునిక బానిసత్వంలో జీవిస్తున్నారని ఈ ఇండెక్స్ అంచనా వేసింది. 2016లో 40.3 మిలియన్ల మంది బానిసత్వంలో ఉండగా గత ఐదేళ్ల కాలంలో 25% పెరుగుదల నమోదు అయినట్లు పేర్కొంది. ఈ జాబితాలో జి20 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.

ఆధునిక బానిసత్వం అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాలలో ఉత్తర కొరియా, ఎరిట్రియా, మౌరిటానియా, సౌదీ అరేబియా, టర్కియే, తజికిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్ మరియు కువైట్ దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో స్విజర్లాండ్, నార్వే, జర్మనీ, నెదర్లాండ్స్ మరియు స్వీడెన్ దిగువ స్థానంలో నిలిచాయి. అత్యధిక బానిసత్వ జనాభా దేశాలలో ఆరు జి20 దేశాలు కూడా టాప్‌లో ఉన్నాయి. ఇందులో భారతదేశం (11 మిలియన్లు), చైనా (5.8 మిలియన్లు), రష్యా (1.9 మిలియన్లు), ఇండోనేషియా (1.8 మిలియన్లు), టర్కియే (1.3 మిలియన్లు) మరియు యునైటెడ్ స్టేట్స్ (1.1 మిలియన్లు) అగ్రస్థానంలో నిలిచాయి.

ప్రభుత్వం విధించిన బలవంతపు శ్రమతో సహా ప్రపంచ సరఫరా గొలుసులలో బలవంతపు కార్మికులకు ఆజ్యం పోయడంలో G20 దేశాలు పోషించిన పాత్రను ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఆధునిక బానిసత్వంలో నివసిస్తున్న ప్రజలందరిలో సగానికి పైగా జి20 దేశాలలో ఉన్నట్లు నివేదించింది.

మేఘాలయ రిజర్వేషన్ల సమీక్షించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు

మేఘాలయ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబందించిన 1972 రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించడానికి నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ప్రతిపక్ష వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్డెంట్ బసయావ్‌మోయిట్ చేసిన నిరవధిక నిరాహార దీక్ష తర్వాత జూన్ 1, 2023న ఈ ప్యానెల్‌ను ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ టిఆర్‌ వర్మ అధ్యక్షత వహిస్తారు.

ఈ ప్యానెల్‌లోని ఇతర సభ్యులుగా నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొ. హరే కృష్ణ దేబ్, నార్త్ ఈస్టర్న్ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డా. బి.పి.సింగ్, మేఘాలయ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్, డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాజీ డైరెక్టర్ బీకే డే ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను ఆగస్టు 2023 చివరి నాటికి సమర్పించనుంది. ఈ నివేదిక మేఘాలయలో రిజర్వేషన్లపై చర్చకు ముఖ్యమైన సహకారం మరియు రాష్ట్ర రిజర్వేషన్ విధానం యొక్క భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతుంది.

మేఘాలయలో రిజర్వేషన్ సమస్య సుదీర్ఘ కాలంగా కొనసుగుతుంది. 1972 రిజర్వేషన్ విధానం ప్రకారం గారోస్‌కు 40%, ఖాసీ-జైంతియా తెగలకు 40%, ఇతర తెగలకు 5% మరియు సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 15% కోటా కల్పిస్తున్నారు. ఈ రిజర్వేషన్ విధానం గత 50 ఏళ్లుగా అమలులో ఉంది. అయితే ఈ రిజర్వేషన్ విధానం ప్రస్తుత కులాల ప్రాతిపదికన సరైనది కాదని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మేఘాలయలోని గిరిజన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం ఇప్పటికీ అవసరమని నమ్ముతున్నారు.

ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి అనుకూలంగా మరియు వ్యతిరేకంగా ఉన్న అన్ని వాదనలను పరిగణనలోకి తీసుకునే బాధ్యత నిపుణుల కమిటీకి ఉంటుంది. ఈ విధానాన్ని తొలిసారిగా అమలు చేసినప్పటి నుంచి మేఘాలయలో చోటుచేసుకున్న జనాభా మార్పులను కూడా కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. మేఘాలయలో రిజర్వేషన్లపై చర్చకు కమిటీ నివేదిక ముఖ్యమైన సహకారం అవుతుంది.

లాటివాన్ పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిగా ఎడ్గార్స్ రింక్విక్స్‌

లాట్వియా పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిగా ఎడ్గార్స్ రింకెవిక్స్‌ ఎన్నికయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి అయినా రింకెవిక్స్, మాజీ ప్రధాని వాల్డిస్ డోంబ్రోవ్‌స్కిస్‌ను 61 ఓట్లతో ఓడించి విజయం సాధించారు. లాట్వియాలో రాజకీయ అనిశ్చితి ఉన్న సమయంలో రింకేవిక్స్ ఎన్నిక జరిగింది. ఈ  దేశం ప్రస్తుతం క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ మరియు పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తతలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్ల ద్వారా దేశాన్ని నడిపించడం మరియు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం రింకెవిక్స్‌కు కత్తి మీద సామే.

లాట్వియా ఉత్తరఐరోపాలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న మూడు దేశాలలో ఇది ఒక దేశం. ఈ దేశానికి ఉత్తరసరిహద్దులో ఎస్టోనియా, దక్షిణసరిహద్దులో లిథువేనియా, తూర్పుసరిహద్దులో రష్యా, ఆగ్నేయ సరిహద్దులో బెలారస్ దేశాలు ఉన్నాయి. రాజధాని నగరం రిగా,  అధికారిక భాష లాట్వియన్. ప్రస్తుత ప్రధానిగా క్రిస్జానిస్ కరిష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

బెస్ట్ ఇండియన్ బ్రాండ్స్ 2023 జాబితాలో టీసీఎస్, రిలయన్స్

ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్ ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2023లో భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. బహుళజాతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ మరియు కన్సల్టింగ్ కంపెనీ అయిన టిసిఎస్ వరుసగా ఐదవ సంవత్సరం అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ 12% పెరిగి రూ.1.09 లక్షల కోట్లకు (US$14.2 బిలియన్లు) చేరుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండవ స్థానం దక్కించుకుంది. ఈ కంపెనీ బ్రాండ్ విలువ 26% పెరిగి రూ.65,320 కోట్లకు (US$8.3 బిలియన్లు) చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో కూడా రూ. 49,027 కోట్ల (US$6.3 బిలియన్) బ్రాండ్ విలువతో 5వ స్థానంలో నిలిచి టాప్ 5లో చోటు దక్కించుకుంది. 2023లో భారతదేశంలోని టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్‌లు..

  1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)
  2. రిలయన్స్ ఇండస్ట్రీస్
  3. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
  4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
  5. రిలయన్స్ జియో
  6. ఇన్ఫోసిస్
  7. మారుతీ సుజుకి
  8. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL)
  9. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)
  10. ఐసీఐసీఐ బ్యాంక్

యూజీసీ 2023 కొత్త మార్గదర్శకాలు విడుదల

కేంద్ర ప్రభుత్వం, యూజీసీ (ఇన్‌స్టిట్యూషన్స్ డీమ్డ్ టు బి యూనివర్శిటీలు) రెగ్యులేషన్స్, 2023ని విడుదల చేసింది. కొత్త నిబంధనలు జాతీయ విద్యా విధానం (NEP) 2020 కు అనుగుణంగా ఫ్రేమ్‌వర్క్‌ చేయబడ్డాయి. కొత్త నిబంధనల ప్రకారం డీమ్డ్ విశ్వవిద్యాలయాల అర్హత ప్రమాణాలను సడలించబడ్డాయి. ఇప్పుడు, కనీసం 500 మంది విద్యార్థులతో సహా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఏదైనా సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

డీమ్డ్ విశ్వవిద్యాలయాల కోసం మరింత ప్రజాస్వామ్య మరియు పారదర్శక పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీమ్డ్ విశ్వవిద్యాలయం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇప్పుడు అకడమిక్ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడుతుంది. అదే సమయంలో వైస్-ఛాన్సలర్‌ను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియమిస్తుంది.

కొత్త నిబంధనల ప్రకారం డీమ్డ్ విశ్వవిద్యాలయాలలో విద్యావేత్తలకు ఎక్కువ ప్రాధాన్యతలు ఇవ్వబడ్డాయి. డీమ్డ్ యూనివర్సిటీలు ఇప్పుడు 50 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో సహా కనీసం 150 కోర్సులను అందించాల్సి ఉంటుంది. కనీసం 50% మంది అధ్యాపక సభ్యులు పీహెచ్డీలు కలిగివుండాలి. ఈ కొత్త నిబంధనలు జూలై 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు.

21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా భారతీయ ఉన్నత విద్యావ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు ఈ కొత్త నిబంధనలు అవకాశం కల్పించనున్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ హోదా కోసం దరఖాస్తు చేసుకునేలా మరిన్ని సంస్థలను ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. డీమ్డ్ యూనివర్సిటీలు ఇప్పుడు రెగ్యులర్ యూనివర్శిటీల మాదిరిగానే నిబంధనలు మరియు ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

Post Comment