ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022 | మొత్తం ఖాళీలు 1400
Defence Jobs Latest Jobs

ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022 | మొత్తం ఖాళీలు 1400

ఇండియన్ నేవీ అగ్నివీరుల భర్తీకి నియామక ప్రకటన విడుదల చేసింది. సెయిలర్ విభాగంలో మేలో ప్రారంభమయ్యే ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (AA) మరియు సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) బ్యాచులలో 1400 ఖాళీలను భర్తీ చేసేందుకు అవివాహిత భారతీయ పురుష మరియు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతుంది. 60 శాతం మార్కులతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

Advertisement

ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (AA)

నౌకాదళంలో యాంత్రిక సమస్యలను చక్కదిద్దే సెయిలర్లను ఆర్టిఫిషర్ అప్రెంటీస్ ద్వారా భర్తీచేస్తారు. స్టీమ్ పవర్ మిషనరీ, డీజిల్ మరియు గ్యాస్ టుర్బన్స్ ఇంకా ఇతర మిస్సైల్ సంబంధించే పనులు నిర్వహిస్తారు. ఇంటర్ ఫిజిక్స్ తో కెమిస్ట్రీ, బయాలజీ సైన్స్ లలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఈ సబ్జెక్టులో 60 శాతం మార్కులు సాధించటం తప్పనిసరి.

అభ్యర్థుల వయసు 17 నుండి 20 ఏళ్ళలోపు ఉండాలి. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ గా ఎంపికైన వారికీ ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో 9 వారల పాటు ప్రాథమిక శిక్షణ ఇస్తారు. ప్రాథమిక శిక్షణ తర్వాత వివిధ నేవల్ యూనిట్స్ , షిప్స్ యందు ప్రొఫిషినల్ ట్రైనింగ్ ఇస్తారు.

సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR)

నౌకాదళానికి చెందే రాడార్లు, సోనార్లు, క్షిపణులు, యుద్ధ ఆయుధాల ఆపరేటింగ్ వంటి అనేక విధులు నిర్వర్తించే సెయిలర్స్ కోసం ఎస్ఎస్ఆర్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో మాథ్స్, ఫిజిక్స్ తో పాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ లలో ఏదో ఒకటి చదివినవారు ఎస్ఎస్ఆర్ పరీక్షకు అర్హులు.

అభ్యర్థుల వయసు 17 నుండి 21 ఏళ్ళ లోపు ఉండాలి. ఎంపికైన వారికీ ఫీజికల్ ఫిట్నెస్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో విజవంతమైన వారికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో 22 వారాల పాటు ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఆతర్వాత దేశవ్యాప్తంగా ఉన్న నేవెల్ యూనిట్స్, షిప్స్ లలో ప్రొఫిషినల్ ట్రైనింగ్ అందిస్తారు.

నేవీ అగ్నివీర్ 2022 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 08 డిసెంబర్ 2023
దరఖాస్తు తుదిగడువు 17 డిసెంబర్ 2023
అడ్మిట్ కార్డు డిసెంబర్ 2022
ఎగ్జామ్ జనవరి 2023
ఫలితాలు మార్చి 2023

నేవీ అగ్నివీర్ ఎలిజిబిలిటీ

  • జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • వయోపరిమితి:  01 ఆగష్టు 2022 నుండి 31 జులై 2005 మధ్య జన్మించి ఉండాలి.
  • విద్య అర్హుత: గణితం ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ (10+2)
  • అవివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  • రాతపరీక్షలో ఉత్తీర్ణతైన అభ్యర్థులు ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులు కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.

నేవీ అగ్నివీర్ దరఖాస్తు విధానం

అర్హుత కలిగిన అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభించే ముందు కావాల్సిన సమాచారమంతా అందుబాటులో ఉంచుకోండి. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తులో పొందుపరిచే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపించబడుతుంది.

నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ నియామక తీరు

  • నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ కింద శిక్షణతో కలుపుకుని గరిష్టంగా 4 ఏళ్లలో కాలపరిమితితో నియామకాలు చేపట్టనున్నారు.
  • నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సైనికులలో కేవ‌లం 25 శాతం మంది సిబ్బందిని మాత్ర‌మే రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వీళ్ళు 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా సైనికులు వాలెంటరీ రిటైర్మెంట్ పద్దతితో ఇంటికి పంపబడతారు.
  • నాలుగేళ్ళ తర్వాత విరమించబడ్డ సిబ్బందికి, విరమణ సమయంలో సేవనిధి పేరిట 12 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు.
  • ఈ పథకం పరిధిలో ఎంపికైన వారికీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటివి లభించవు.
  • విరమణ పొందిన సైనికులకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ అందజేస్తారు.
  • అలానే ఉద్యోగంలో ఉన్నంతవరకు 48 లక్షల నాన్‌ కాంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్సు కల్పిస్తారు.
  • రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
  • అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

నేవీ అగ్నివీర్ ఎంపిక విధానం మరియు వేతనాలు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్మీడియేట్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రాతపరీక్షకు ఆహ్వానిస్తారు. రాతపరీక్షలో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో ఫీజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక పూర్తిచేస్తారు.

అగ్నిప‌థ్ స్కీమ్‌ ద్వారా ఎంపికైన అగ్నివీరులకు మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల వేతనం అందజేస్తారు. ఇందులో 9 వేల రూపాయలు కార్పస్ నిధికి జోడిస్తారు. మిగిలిన 21 వేలు అందజేస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తంలో  9 వేలు కార్పస్ నిధికి  జోడిస్తుంది. రెండవ ఏడాది నుండి ఏటా 10 శాతం చెప్పున వేతనాన్ని పెంచి చెల్లిస్తారు. అంటే రెండవ ఏడాది 33 వేలు, మూడవ ఏడాది 36 వేల ఐదువందలు, అలానే చివరి ఏడాది 40 వేలు వేతనాన్ని అందజేస్తారు.

నెలవారీ జీతం చేతికి ఇచ్చే జీతం కార్పస్ ఫండ్ (అభ్యర్థి + ప్రభుత్వం)
మొదటి ఏడాది 30,000/- 21,000/- 18,000 /-
రెండవ ఏడాది 33,000/- 23,100/- 19,800/-
మూడవ ఏడాది 36,500/- 25,580/- 21,900/-
నాలుగో ఏడాది 40,000/- 28,000/- 24,000/-

నేవీ అగ్నివీర్ ఎగ్జామ్ నమూనా

పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ పద్దతిలో, గంట నిడివితో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంటర్మీడియేట్ స్థాయి సిలబస్ తో మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవెర్నెస్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల నుండి ఇస్తారు. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఋణాత్మక మార్కులు లేవు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం
మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవెర్నెస్, ఇంగ్లీష్ 100 ప్రశ్నలు 100 మార్కులు 60 నిముషాలు

ఫీజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ & మెడికల్ టెస్ట్

రాతపరీక్షలో పరీక్షలో అర్హుత పొందిన అభ్యర్డులకు ఫీజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు 7 నిముషాల వ్యవధిలో 1.6 కిలోమీటర్ల పరుగును పూర్తిచేయాల్సి ఉంటుంది. అలానే 20 గుంజీలు, 10 పుష్-అప్స్ టాస్క్ కూడా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫీజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తారు.

నేవీ అగ్నివీర్ సిలబస్

SCIENCE : Physical World and Measurement, Kinematics, Laws of Motion, Work, Energy and Power, Motion o System of Particles and Rigid Body/ Gravitation. Mechanics of Solids and Fluids, Heat Thermodynamics, Oscillations, Waves, Electrostatics, Current Electricity. Magnetic Effect of Current and magnetism, Electromagnetic Induction and Alternating Current, Electromagnetic Waves.

Optics, Dual Nature of Matter and Radiations, Atomic Nucleus/ Solid and Semi-Conductor Devices, Principles of Communication. Metals and Non Metals, Organic Chemistry, Food, Nutrition and Health, Physiology and Human Diseases, Computer Science.

MATHEMATICS : Relations and Functions, Logarithms, Complex Numbers, Quadratics Equations, Sequences and Series, Trigonometry. Cartesian System of Rectangular Coordinates, Straight Lines Family of Straight Lines, Circles. Conic Section, Permutations and Combinations, Vectors, Exponential and Logarithmic Series, Sets and Set Theory, Statistics.

Introduction to ThreeDimensional Geometry, Probability Function, Limits and Continuity, Differentiation, Applications of Derivatives. Indefinite Integrals Binomial Theorem, Matrices, Determinants, Definite Integrals.

ENGLISH : Passage, Preposition, Correction of sentences, Change active to passive/ passive to active voice. Change direct to indirect/indirect to direct, Verbs/Tense/Non Finites, Punctuation. Substituting phrasal verbs for expression, Synonyms and Antonyms, Meanings of difficult words. Use of adjective, Compound preposition, Determiners (use of a, the, any etc), Use of pronouns.

GENERAL AWARENESS : Culture and Religion, Geography : Soil, Rivers, Mountains, Ports, Inland Harbours, Freedom Movement. Sports : Championships/ Winners/ Terms/ No of Players, Defence, Wars and Neighbours, current Affairs. Important National Facts about IndiaHeritage, Arts, Dance, History, National-Languages, Bird, Animal, Song, Flag, Monuments, Capitals & Currencies.

Common Names, Full forms and Abbreviations, Discoveries, Diseases and Nutrition, Award and Authors, Eminent Personalities, Spatial, Numerical, Reasoning & Associative Ability, Sequences, Spellings Unscrambling, Coding and Decoding.

Advertisement

Post Comment