మొక్కల అధ్యయనాన్ని వృక్షశాస్త్రం (బోటనీ) అంటారు. వృక్షశాస్త్రాన్ని స్థూలంగా పుష్పించని ముక్కలు (క్రిప్టోగామ్‌లు) మరియు పుష్పించే మొక్కలుగా ( ఫనెరోగామ్‌లు) వర్గీకరిస్తారు. క్రిప్టోగామ్‌లను తిరిగి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా వర్గాలుగా విభజిస్తారు.
పుష్పించే మొక్కలలో రెండు వర్గాలు ఉన్నాయి అవి ఆవృత బీజాలు (యాంజియోస్పెర్మ్) మరియు వివృత బీజాలు (జిమ్నోస్పెర్మ్). ఆవృత బీజాలు తిరిగి రెండు రకాలు. అవి ఏకదళ బీజాలు (మోనోకోట్స్) మరియు ద్విదళ బీజాలు (డికాట్). పోటీపరీక్షలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ అంశాలకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలను ప్రయత్నించండి.
1. వృక్షరాజ్యపు ఉభయచరాలు అని వేటిని అంటారు ?
- జిమ్నోస్పెర్మ్స్
- థాలోఫైటా
- బ్రయోఫైటా
- టెరిడోఫైటా
సమాధానం
3. బ్రయోఫైటా
2. 'థాలాస్' పదానికి సరైన అర్ధం గుర్తింపుము ?
- ఈకలు వంటి పత్రాలు కలిగిన మొక్కలు
- నిర్మాణాత్మక విభేదనం లేని మొక్క దేహం
- పుష్పించే మొక్కల కాండం
- నగ్న విత్తనాలు కలిగిన మొక్కలు
సమాధానం
2. నిర్మాణాత్మక విభేదనం లేని మొక్క దేహం
3. క్రింది వాటిలో లైకెన్‌లకు సరిపోయే సరైన వాక్యాన్ని ఎంపిక చేయండి ?
- బ్రయోఫైటా, టెరిడోఫైటా సహజీవనం వలన లైకెన్లు ఏర్పడతాయి
- థాలోఫైటా, బ్రయోఫైటా సహజీవనం వలన లైకెన్లు ఏర్పడతాయి
- ఫంగస్, శైవలాల సహజీవనం వలన లైకెన్లు ఏర్పడతాయి
- గాలిలో తేలియాడే మొక్కలను లైకెన్లు అంటారు
సమాధానం
3. ఫంగస్, శైవలాల సహజీవనం వలన లైకెన్లు ఏర్పడతాయి
4. క్రింది వాటిలో కవచ రహిత విత్తనాలు ఉండే మొక్క ఏది ?
- పెన్సిలియం నోటేటాం
- సైకాస్ బెడ్‌డోమీ
- మార్సిలియా క్వాడ్రిఫోలియా
- మాంజిఫెరా ఇండికా
సమాధానం
2. సైకాస్ బెడ్‌డోమీ
5. లివర్‌వోర్ట్‌లు, హార్న్‌వోర్ట్‌లు & నాచులు అనేవి ఏంటి ?
- జిమ్నోస్పెర్మ్స్
- థాలోఫైటాలు
- బ్రయోఫైటాలు
- టెరిడోఫైటాలు
సమాధానం
3. బ్రయోఫైటా
6. బ్రయోఫైటా సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం ?
- థాలాయిడ్ లేదా ఆకులతో కూడిన బహుళ సెల్యులార్ గ్రీన్ ప్లాంట్స్
- బ్రయోఫైట్స్‌లో అలైంగిక పునరుత్పత్తి ఫ్రాగ్మెంటేషన్ లేదా జెమ్మాల ద్వారా జరుగుతుంది
- బ్రయోఫైటాలు క్లోరోప్లాస్ట్‌లను కలిగి ఉంటాయి.
- పైవి అన్నీ
సమాధానం
4. పైవి అన్నీ
7. జిమ్నోస్పెర్మ్ సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం ?
- జిమ్నోస్పెర్లు బహిర్గతమైన విత్తనం లేదా అండాశయం కలిగి ఉంటాయి
- జిమ్నోస్పెర్లు క్లోరోప్లాస్ట్‌లను కలిగి ఉండవు
- 1 మరియు 2 సరైనవి
- పైవి అన్ని
సమాధానం
1. జిమ్నోస్పెర్లు బహిర్గతమైన విత్తనం లేదా అండాశయం కలిగి ఉంటాయి
8. పెన్సిలియం నోటేటాం అనేది ఒక ?
- ఒక శైవలం
- ఒక శిలీంధ్రం
- ఒక లైకెన్
- ఒక బాక్టీరియా
సమాధానం
2. ఒక శిలీంధ్రం
9. వృక్షరాజ్యంలో అతి పురాతనమైన ముక్కలు ఏవి ?
- జిమ్నోస్పెర్మ్స్
- థాలోఫైటా
- బ్రయోఫైటా
- టెరిడోఫైటా
సమాధానం
2. థాలోఫైటా
10. క్లామిడోమోనాస్ అనేది ఒక ?
- ఒక శైవలం
- ఒక శిలీంధ్రం
- ఒక లైకెన్
- ఒక బాక్టీరియా
సమాధానం
1. ఒక శైవలం
11. జైగోటిక్ మియోసిస్ కనిపించే మొక్కలు ?
- ఫ్యూకస్
- ఫునేరియా
- క్లామిడోమోనాస్
- మార్చాంటియా
సమాధానం
3. క్లామిడోమోనాస్
12. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ?
- సైకాస్ - డైయోసియస్
- పినస్ - డైయోసియస్
- సాల్వినియా - హెటెరోస్పోరస్
- ఈక్విసెటమ్ - హోమోస్పోరస్
సమాధానం
2. పినస్ - డైయోసియస్
13. ఆల్గే యొక్క కలోనియల్ రూపానికి ఉదాహరణ ఏది ?
- క్లోరెల్లా
- స్పిరోగైరా
- ఉలోథ్రిక్స్
- వోల్వోక్స్
సమాధానం
4. వోల్వోక్స్
14. కింది వాటిలో ప్రొటీన్ అధికంగా ఉండే ఆల్గే ?
- చారా
- స్పిరోగైరా
- ఉలోథ్రిక్స్
- స్పైరోలినా
సమాధానం
4. స్పైరోలినా
15. ఆల్జినిక్ యాసిడ్ కలిగి ఉండే జీవులు ?
- బ్రౌన్ ఆల్గే
- రెడ్ ఆల్గే
- గ్రీన్ ఆల్గే
- డయాటమ్‌లు
సమాధానం
1. బ్రౌన్ ఆల్గే
16. లామినరియా ఆల్గే సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
- లామినరియా ఒక రకమైన బ్రౌన్ ఆల్గే
- లామినరియా ఆల్గే ఐయోడిన్ కలిగి ఉంటుంది
- లామినరియా ఆల్గే ఆల్జినిక్ యాసిడ్ కలిగి ఉంటుంది
- పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని
17. ఫాబేసీ కుటుంబానికీ సంబంధించి సరైన వాఖ్యాన్ని గుర్తించండి ?
- ఫాబేసి కుటుంబాన్ని లెగ్యుమినోసి అని కూడా అంటారు
- ఫాబేసి పువ్వులు వెక్సిల్లరీ ఎస్టివేషన్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి
- 1 మరియు 2 సరైనవి
- పైవి అన్ని
సమాధానం
4. పైవి అన్ని