Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022
Magazine 2022

తెలుగులో కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022

అక్టోబర్ 2022 కరెంటు అఫైర్స్ తెలుగులో ఉచితంగా చదవండి. వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థుల కోసం నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్ అంశాలకు చెందిన పూర్తిస్థాయి తాజా వర్తమాన అంశాలను అందుబాటులో ఉంచుతున్నాం.

ఇండియన్ అఫైర్స్

దేశంలో తొలి దశ 5జీ సేవలు ప్రారంభించిన మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1న  ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా భారతదేశంలో తొలిదశ 5G టెలిఫోనీ సేవలను లాంచ్ చేసారు. తొలి ద‌శ‌లో భాగంగా హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూర్‌, చండీఘ‌ఢ్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీన‌గ‌ర్‌, గురుగ్రాం, జామ్‌న‌గ‌ర్‌, కోల్‌కతా, ల‌క్నో, ముంబై, పుణే న‌గ‌రాల్లో 5జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

దేశ‌వ్యాప్తంగా 5జీ సేవ‌ల‌ను ప్రారంభించేందుకు ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో, వొడ‌ఫోన్ ఐడియా వంటి టెలికాం ఆప‌రేట‌ర్లు క‌స‌రత్తు సాగిస్తున్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి ప్ర‌తి ఒక్క‌రికీ 5జీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని టెలికాం మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ తెలిపారు. దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన తొలి కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్‌ నిలిచింది. 5జీ స్ప్రెక్టం వేలం ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ 1.5 ల‌క్ష‌ల కోట్లు ఆదాయం సమకూరింది.

పూర్తి డిజిటల్ అక్షరాస్యత పంచాయతీగా పుల్లంపర

తిరువనంతపురం జిల్లాలోని పుల్లుంపర గ్రామ పంచాయతీ దేశంలో మొదటి సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన ఘనతను సాధించింది. ఆగస్ట్ 2021లో ప్రారంభించబడిన ఈ చొరవ ద్వారా పుల్లుంపర గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 3174  పౌరులకు డిజిటల్ పరికరాలను ఉపయోగించడంలో శిక్షణ అందించడం ద్వారా ఈ ఘనత సాధించారు.

ఏటా అక్టోబర్ 1 న నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), భారత పౌరులలో పెన్షన్ మరియు పదవీ విరమణ ప్రణాళికను ప్రోత్సహించడానికి ఏటా అక్టోబర్ 1 వ తేదీని నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ గా జరుపుకోనుంది. సెప్టెంబర్ 2022 నాటికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో మొత్తం 5.72 కోట్ల చందాదారులు రిజస్టర్ అయ్యాయి ఉన్నారు. వీరి నిర్వహణలో మొత్తం 7,99,467 కోట్ల ఆస్తులు ఆదా చేయబడి ఉన్నాయి.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఇండియాలో పెన్షన్ సిస్టమ్ యొక్క పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం 2003లో ఏర్పాటు చేయబడింది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం 19 సెప్టెంబర్ 2013 పరిధిలో పనిచేస్తుంది. PFRDA ప్రభుత్వ ఉద్యోగులచే సభ్యత్వం పొందిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ని నియంత్రిస్తోంది. ప్రస్తుతం PFRDA చైర్‌పర్సనుగా శ్రీ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫైజాబాద్ కంటోన్మెంట్ పేరు మార్పు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ కంటోన్మెంట్ పేరును అయోధ్య కంటోన్మెంటుగా మార్చే ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇది వరకే 2018 లో ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా పేరు మార్చింది. ఫైజాబాద్ నగరం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు తూర్పున 130 కిలోమీటర్ల దూరంలో సరయూ నది ఒడ్డున ఉంది.

మోడీ @ 20 : డ్రీమ్స్ మీట్ డెలివరీ" బుక్ విడుదల

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆక్లాండ్‌లో కివీ ఇండియన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు 2022 కార్యకమంలో "మోడీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ" పుస్తకాన్ని ఆవిష్కరించారు. కివీ ఇండియన్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ అనేవి న్యూజిలాండ్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులను వారి అసాధారణ విజయాలు మరియు సహకారాలకు గాను అందిస్తారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ కూడా పాల్గొన్నారు.

కాశ్మీర్‌లో తొలిసారిగా పక్షుల పండుగ

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ యొక్క పహల్గామ్‌లో అక్టోబర్ 6న తొలిసారిగా బర్డ్ ఫెస్టివల్ 2022 నిర్వహించారు. ఈ పక్షుల పండుగను జమ్మూ & కాశ్మీర్ పర్యాటక శాఖ మరియు శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ సహకారం ద్వారా నిర్వహించారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పక్షుల పండుగ ప్రారంభోత్సవ వేడుకకు జమ్మూ కాశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రియులు, పక్షి ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

టిఆర్ఎస్, భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్పు

తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. ప్రస్తుత్తం ప్రాంతీయ పార్టీగా ఉన్న ఈ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు, పార్టీ పేరును టీఆర్‌ఎస్‌ నుండి బీఆర్‌ఎస్‌గా మార్చుతున్నట్లు పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

టిఆర్ఎస్ పార్టీని 27 ఏప్రిల్ 2001న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో కేసీఆర్ స్థాపించారు. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, కొత్తగా ఏర్పాటు  అయినా తెలంగాణాలో ఈ పార్టీ మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే పార్టీ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వరుసగా రెండవ సారి అధికారంలోకి వచ్చింది.

లక్నోలో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 81వ సెషన్

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరియు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా 08 అక్టోబర్ 2022న లక్నోలో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 81వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. రోడ్ నిర్మాణంలో ఆధునిక సాంకేతికతల కోసం చేర్చించేందుకు ఈ వార్షిక ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తారు.

యూఎన్ వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్‌లో మోడీ ప్రసంగం

11 అక్టోబర్ 2022న హైదరాబాద్‌లో జరిగిన 2వ ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ (UNWGIC) లో ప్రధానమంత్రి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సంధర్బంగా ప్రపంచ సంక్షోభ సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి అంతర్జాతీయ సమాజం సంస్థాగత విధానం అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.

ఐక్యరాజ్యసమితి నిర్వహించిన జియోస్పేషియల్ ఇంటర్నేషనల్ కాంగ్రెసును "జియో - ఎనేబుల్ ది గ్లోబల్ విలేజ్ - నో వన్ షుడ్ బి లెఫ్ట్ బెహేండ్" అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సమావేశాలను జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు నాలెడ్జ్ సర్వీసెస్ సెక్టార్‌లో పరిశోధనలు బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.

తమిళనాడులో స్లెండర్ లోరిస్ అభయారణ్యం

అంతరించిపోతున్న స్లెండర్ లోరిస్ కోసం భారతదేశం యొక్క మొదటి అభయారణ్యం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం నోటిఫై చేసింది. తమిళనాడులోని కరూర్ & దిండిగల్ జిల్లాల్లో 11,806 హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలోని మొట్టమొదటి “కడవూర్ స్లెండర్ లోరిస్ అభయారణ్యంకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తమిళనాడు ప్రభుత్వ 1972 వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 26 (A)(1)(b) ప్రకారం స్లెండర్ లోరిస్ ప్రత్యేక సంరక్షణ జాబితాలో ఉన్నాయి.

5వ సౌత్ ఏషియన్ జియోసైన్సెస్ కాన్ఫరెన్స్

5వ సౌత్ ఏషియన్ జియోసైన్సెస్ కాన్ఫరెన్స్ 2022, రాజస్థాన్ రాజదాని జైపూర్‌లో అక్టోబర్ 14 న ప్రారంభం అయ్యింది. సహజ వాయువు మరియు చమురు ఉత్పత్తులకు సంబధించి మెరుగైన పరిశోధన ఆలోచనలు పంచుకునేందుకు నిర్వహించిన ఈ మూడు రోజుల సదస్సులో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటుగా భారతదేశం నలుమూలల నుండి 100 మంది నిపుణులు హాజరయ్యారు.

ఇండియాలో ఓమిక్రాన్ BF.7 కేసు నమోదు

వేగంగా పరివర్తనం చెందగల ఓమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసును గుజరాత్ బయోటెక్నాలజీ పరిశోధన సంస్థ నివేదించింది. భారతదేశంలో కనుగొనబడిన ఈ కొత్త వేరియెంట్ ఇటీవలే కాలంలో చైనా నుండి ఉద్భవించినట్లు తెలుస్తోంది. ఓమిక్రాన్ సబ్-వేరియంట్లు ఓమిక్రాన్ అంతలా ప్రమాదం కాకున్నా అతి వేగవంతమైన సంక్రమణ రేటును కనబర్చుతున్నాయి.

75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం

దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత మెరుగు పర్చేందుకు దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (DBU) అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. దీనికి సంబంధించిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు.

2022-23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంగతిని ప్రస్తావించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం దేశంలోని 75 జిల్లాల్లో 75 డిబియులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆనాడు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అంతర్జాతీయ సోలార్ అలయన్స్ 5వ అసెంబ్లీ ప్రారంభం

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఐదవ అసెంబ్లీని అక్టోబర్ 18న కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. అంతర్జాతీయ సౌర కూటమిలో ప్రస్తుతం మొత్తం 106 సభ్య దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితిలోని అన్ని సభ్యదేశాలు ఇందులో చేరడానికి అర్హులు. ప్రస్తుత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క డైరెక్టర్ జనరల్'గా అజయ్ మాథుర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ భారత పర్యటన

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మూడు రోజుల భారత్ పర్యటన నిమిత్తం అక్టోబర్ 18న భారత్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో 26/11 ఉగ్రదాడుల మృతులకు నివాళులు అర్పించారు.

ఈ నెల 20వ తేదీన గుజరాత్‌లోని కెవాడియాలో మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) బుక్‌లెట్, లోగో మరియు ట్యాగ్‌లైన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నారు. అలానే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించచారు.

ఇదే పర్యటనలో భారతదేశంలోని మొట్టమొదటి సౌరశక్తి గ్రామమైన గుజరాత్ మోధేరాలోని సూర్య దేవాలయాన్ని కూడా సందర్శించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆయన రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

జపాన్ నిహోన్షుకు జిఐ ట్యాగ్

నిహోన్షు అనే జపనీస్ ఆల్కహాలిక్ పానీయంకు ప్రత్యేక జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ లభించింది. న్యూఢిల్లీలోని జపాన్ రాయబార కార్యాలయం నిహోన్షు ఉత్పత్తి కోరకు జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోగా జిఐ ట్యాగ్ కార్యాలయం నుండి ఆమోదం లభించింది.

నిహోన్షు అనేది జపానులో పులియబెట్టిన బియ్యం నుండి తయారుచేసే ప్రత్యేక ఆల్కహాల్. ఈ ప్రక్రియలో కోజి-కిన్ - ఒక రకమైన శిలింధ్రంను ఉపయోగిస్తారు. దీనిని సాంప్రదాయకంగా పండుగలు, వివాహాలు లేదా అంత్యక్రియలు వంటి ప్రత్యేక సందర్భాలలో వినియోగిస్తారు.

అస్సాం అంతటా కటి బిహు ఉత్సవాలు

అస్సాం రాష్ట్రవ్యాప్తంగా కటి బిహు వేడుకను ఘనంగా నిర్వహించారు. కటి బిహు అనేది అస్సాం రైతుల వార్షిక వ్యవసాయ పండగ. దీనిని అస్సామీ క్యాలెండర్‌లో 'కటి' నెల మొదటి రోజున జరుపుకుంటారు. వ్యవసాయ సీజన్‌లో మంచి పంట కోసం ప్రార్థిస్తూ సాయంత్రం పూట తమ ఇళ్ల వెలుపల, అలాగే వరి పొలాల్లో దీపాలు వెలిగిస్తారు. అదే సమయంలో తులసి మొక్కను నాటి లక్ష్మీ దేవిని పూజిస్తారు.

ఆసియా అతిపెద్ద కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌ ప్రారంభం

పంజాబ్‌లోని సంగ్రూర్‌లోని లెహ్రాగాగాలో ఆసియాలోనే అతిపెద్ద కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌ను కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అక్టోబర్ 18న ప్రారంభించారు. 220 కోట్ల పెట్టుబడితో సుమారు 20 ఎకరాల్లో నిర్మించిన ఈ బయో గ్యాస్ ప్లాంటు ద్వారా 6 టన్నుల గ్యాసును ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ ప్లాంట్‌ వల్ల సంగ్రూర్‌ రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా వరి పొట్టలను కాల్చే స్థానంలో ప్రత్యామ్నాయం లభించనుంది. ఈ ప్లాంట్ 40,000–45,000 ఎకరాల పొలాల్లో పొట్టను కాల్చడం తగ్గించనుంది, దీని ఫలితంగా ఏటా 150,000 టన్నుల CO2 ఉద్గారాలు తగ్గుతాయని భావిస్తన్నారు. దీనితో పాటుగా దేశీయ ఇంధన ఉత్త్పత్తికి ఊతం ఇవ్వనుంది.

ఇస్రో LVM3 రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. 6 టన్నుల బరువును కలిగిన LVM3 (లాంచ్ వెహికల్ మార్క్ 3) రాకెట్టును, 36 ఉపగ్రహాల అనుసంధానంతో విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రయోగించింది. ఇప్పటి వరకు ఇస్రో మిషన్ అంతరిక్షంలోకి పంపిన అన్ని వాహక నౌకల కంటే ఇదే బరువైనది.

ఈ ప్రయోగంను అక్టోబర్ 23, 2022 న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి నిర్వహించారు. గగన్‌యాన్ వంటి ఎన్నో రాబోయే ఆసక్తికరమైన మిషన్ల కోసం అత్యంత అధునాతన ప్రయోగ వాహనం అయినా LVM3 రాకెట్టును ఇస్రో అభివుద్ది చేసింది.

ఈశాన్య, పశ్చిమ బంగాళాఖాతంలో సిత్రంగ్ తుపాను

అక్టోబర్ 24న ఈశాన్య, పశ్చిమ బంగాళాఖాతంలో సిత్రంగ్ తుపాను ఏర్పడింది. ఈశాన్య, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా తీరం వెంబడి ప్రయాణించిన ఈ తుపాన్ బంగ్లాదేశ్ యందు తీరం దాటింది. ఈ తుపానుకు సిత్రాంగ్ అనే పేరును థాయిలాండ్ దేశం నామకరణం చేసింది. 2020లో భారత వాతావరణ శాఖ జారీ చేసిన 169 ఉష్ణమండల తుఫాను పేర్ల జాబితా నుండి ఈ పేరు ఎంపిక చేయబడింది.

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్‌ ఏర్పాటు

ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వ్ మరియు పిలిభిత్ టైగర్ రిజర్వ్‌తో సహా 3,049 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ (TER)కి కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ఇది యూపీలో రెండవ ఎలిఫెంట్ రిజర్వ్, దేశంలో మొత్తగా 33వ ఎలిఫెంట్ రిజర్వ్. 2022 లో కేంద్రం మొత్తం మూడు ఎలిఫెంట్ రిజర్వ్ లకు ఆమోదం తెలిపింది. ఇందులో లెమ్రు ఎలిఫెంట్ రిజర్వ్ - ఛత్తీస్‌గఢ్, అగస్త్యమలై - తమిళనాడులో ఇదివరకే ప్రకటించారు.

గుజరాతీ నూతన సంవత్సర వేడుక 'బెస్తు వర్ష్'

గుజరాతీ నూతన సంవత్సర వేడుకగా భావించే బెస్తు వార్స్ ఉత్సవాలను అక్టోబర్ 26న ఘనంగా జరుపుకున్నారు. గుజరాతీ నూతన సంవత్సరం కార్తీక మాసంలో శుక్ల పక్షం యొక్క ప్రతిపాదంలో వస్తుంది, ఇది సాంప్రదాయకంగా గోవర్ధన్ పూజలో పొడిగించిన దీపావళి వేడుకల సమయంలో జరుపుకుంటారు. ఐదు రోజుల దీపావళి వేడుకల్లో భాగంగా బెస్టు వర్ష్‌గా ప్రసిద్ధి చెందిన కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. ప్రజలు ఉదయాన్నే దేవాలయాలను సందర్శించడం ద్వారా తమ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు.

ఇంటర్నేషనల్ అఫైర్స్

ఏంజెలా మెర్కెల్'కు నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు

మాజీ జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ యొక్క ప్రతిష్టాత్మక నాన్సెన్ రెఫ్యూజీ అవార్డును అందుకున్నారు. ఏంజెలా మెర్కెల్ జర్మనీ ఛాన్సలరుగా ఉన్న 2015 మరియు 2016 సమయంలో సుమారు 1.2 మిలియన్లకు పైగా సిరియా యుద్ధ శరణార్థులకు ఆశ్రయం కల్పించారు. ఆమె నైతిక మరియు రాజకీయ ధైర్యానికి గాను ఈ అవార్డు లభించింది.

నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు నార్వేజియన్ అన్వేషకుడు, శాస్త్రవేత్త, దౌత్యవేత్త మరియు మానవతావాది అయిన ఫ్రిడ్‌జోఫ్ నాన్‌సెన్ పేరు మీద ఇవ్వబడుతుంది. ఈ అవార్డును 1954 లో ప్రారంభించారు. ఈ అవార్డును యుద్ధ శరణార్థుల యొక్క మానవ హక్కులకును కాపాడిన వ్యక్తులకు లేదా సంస్థలకు అందిస్తారు.

ఒమన్‌లో భారతదేశం యొక్క రూపే డెబిట్ కార్డ్

ఒమన్‌లో భారతదేశం యొక్క రూపే డెబిట్ కార్డ్‌ను ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఒమాన్ మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఎమ్ఒయుపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాహిర్ అల్ అమ్రీని సంతకం చేసారు.

రూపే డెబిట్ కార్డ్‌ను 2013 నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. రూపే డెబిట్ కార్డ్‌ దేశీయ ఈకామర్స్ చెల్లింపులు జరిపేందుకు రూపొందించబడింది. 2013 నుండి 2020 వరకు, 1,158 దేశీయ బ్యాంకులు 603.6 మిలియన్ రూపే కార్డులను జారీ చేశాయి.

ఐఎస్ఎస్'కి వెళ్లిన మొదటి అమెరికన్ మహిళగా నికోల్ మాన్

అమెరికాకు చెందిన మెరైన్ కల్నల్ నికోల్ మాన్, అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన మొదటి స్థానిక అమెరికన్ మహిళా వ్యోమగామిగా నిలిచారు. 45 ఏళ్ళ నికోల్ మాన్ ఇటీవలే స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి బయలుదేరిన నలుగురు వ్యోమగాములలో ఒకరుగా ఉన్నారు.

అంతరిక్షంలో సినిమా షూట్ చేసిన తొలి నటుడుగా టామ్ క్రూజ్

డేర్‌డెవిల్ విన్యాసాలకు పేరుగాంచిన హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, అంతరిక్షంలో సినిమా షూట్ చేసిన మొదటి నటుడిగా అవతరించాడు. ది బోర్న్ ఐడెంటిటీ డైరెక్టర్ డౌగ్ లిమాన్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ పేరు పెట్టని చిత్రం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో షూట్ చేయనున్నారు.

ఐఎస్ఎస్'లో మొదటి యూరోపియాన్ మహిళగా సమంతా

ఇటాలియన్ వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి అధికారికంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి నాయకత్వం వహించిన మొదటి యూరోపియన్ మహిళగా నిలిచారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రకారం, భూమిపై ఉన్న బృందాలతో కమ్యూనికేషన్‌ను కొనసాగించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది ప్రతిస్పందనను సమన్వయం చేయడంతో పాటుగా కక్ష్యలో ఉన్న వ్యోమగాముల పనితీరు మరియు శ్రేయస్సుకు ఆమె బాధ్యత వహించనుంది. సమంతా క్రిస్టోఫోరెట్టి 2009 లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో చేరిన మొదటి  యూరోపియన్ మహిళగా నిలిచారు.

చైనా మొదటి సోలార్ అబ్జర్వేటరీ ప్రయోగం విజయవంతం

చైనా తన మొదటి సౌర అబ్జర్వేటరీని ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అడ్వాన్స్‌డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ (ASO-S) పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు చైనీస్‌లో కుయాఫు - 1 అని నామకరణం చేసారు. ఈ ప్రయోగం ద్వారా సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రం మరియు అది ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఉద్గారాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయనున్నారు.

ఇరాక్ కొత్త అధ్యక్షుడుగా అబ్దుల్ లతీఫ్ రషీద్

ఇరాక్ కొత్త అధ్యక్షుడుగా అబ్దుల్ లతీఫ్ రషీద్ ఎన్నికయ్యారు. 78 ఏళ్ల లతీఫ్ 2003 నుండి 2010 వరకు ఇరాక్ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 13 అక్టోబర్ 2022 న పార్లమెంటులో జరిగిన అధ్యక్ష ఎన్నికలో అబ్దుల్ లతీఫ్ 162 ఓట్లు దక్కించుకోగా, ప్రత్యర్థి కుర్ద్ బర్హమ్ సలేహ్'కు అనుకూలంగా 99 ఓట్లు నమోదు అయ్యాయి.

ఇరాక్ యందు కొంత కాలంగా రాజకీయ సంక్షభం జాడ్యమేలుతుంది. ఆ దేశ పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఏడాది జరిగిన ఇంతవరకు ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. గత నెల 28 సెప్టెంబరున, పార్లమెంటు స్పీకర్‌ను ఎన్నుకోవడానికి చట్టసభ సభ్యులు సిద్ధమవుతుండగా గ్రీన్ జోన్‌పై మూడు రాకెట్లు దాడి చేశాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రధానమంత్రికి నామినీ అయిన మహమ్మద్ షియా అల్-సుడానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం కానుంది.

స్వీడన్ కొత్త ప్రధానమంత్రిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్

కన్జర్వేటివ్ నాయకుడు ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వీడన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఉల్ఫ్ క్రిస్టర్సన్ నాయకత్వం వహించనున్నారు.

ప్రస్తుతం స్వీడన్ యొక్క అతిపెద్ద పార్టీ అయిన సోషల్ డెమోక్రాట్‌లకు నాయకత్వం వహిస్తున్న మాగ్డలీనా ఆండర్సన్ స్థానంలో మిస్టర్ క్రిస్టర్సన్ నియమితులవుతారు. మాగ్డలీనా ఆండర్సన్ 2021 లో స్వీడన్ మొదటి మహిళా ప్రధానిమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.

దుబాయ్‌లో 22వ ప్రపంచ బ్లాక్‌చెయిన్ సమ్మిట్

ప్రపంచ బ్లాక్‌చెయిన్ సమ్మిట్ 22వ గ్లోబల్ ఎడిషన్ దుబాయ్‌లోని అట్లాంటిస్‌లో అక్టోబర్ 17 నుండి 19 మధ్య నిర్వహించారు. బ్లాక్‌చెయిన్ సమ్మిట్ అనేది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై నూతన అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం మరియు పెట్టుబడిదారులతో సహా నిపుణులను ఒకచోట చేర్చే ప్రయత్నం. బ్లాక్‌చెయిన్ తదుపరి సమ్మిట్ బ్యాంకాక్‌లో డిసెంబర్ 8 నుండి 9, 2022 వరకు జరగనుంది.

బంగ్లాదేశ్‌లో గ్లోబల్ యూత్ క్లైమేట్ సమ్మిట్ 2022

బంగ్లాదేశ్‌లోని అక్టోబర్ 20వ తేదీన గ్లోబల్ యూత్ క్లైమేట్ సమ్మిట్‌ 2022 ఎడిషన్ ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 20-22 మధ్య జరిగే మూడు రోజుల సమ్మిట్‌లో 70 దేశాల నుండి 650 మందికి పైగా యువత పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లోని అత్యంత వాతావరణ దుర్బర ప్రాంతమైన ఖుల్నా, ఈ ఈవెంటుకు వేదిక అయ్యింది. వాతావరణ సంక్షోభంలో యువత కర్తవ్యంను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా

బ్రిటిష్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ కేవలం ఆరు వారాల పదివీకాలం తర్వాత అక్టోబర్ 20న తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 6, 2022 న ప్రమాణస్వీకారం చేసిన లిజ్ ట్రస్, తాను తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయం, మినీ బడ్జెట్ యందు పేలవమైన కేటాయింపుతో బ్రిటన్ ఆర్థిక మార్కెట్లను కుప్పకూల్చడంతో కేవలం 45 రోజుల స్వల్ప నిడివిలో రాజీనామా చేయాల్సి వాల్సింది. దీనితో అతి తక్కువకాలం బ్రిటిష్ ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచింది.

ఎఫ్‌ఏటీఎఫ్ 'గ్రే లిస్ట్' నుంచి పాకిస్థాన్ తొలగింపు

ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF), నాలుగేళ్ళ తరువాత పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్ జాబితా నుండి తొలగించింది. పాకిస్తాన్‌ 2018 నుండి పారిస్ ఆధారిత గ్లోబల్ యాంటీ టెర్రరిజం వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిషేదిత జాబితాలో ఉంచబడింది. ఈ జాబితాలో ఉన్న దేశాలు అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలపై పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇటీవలి కాలంలో మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో పాకిస్తాన్ గణనీయమైన పురోగతి కనబరచడంతో, అక్టోబర్ 21 న పారిస్‌లో జరిగిన ప్లీనరీలో ఎఫ్‌ఏటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ యొక్క సమీక్షను అంగీకరించడానికి భారతదేశంతో సహా మొత్తం 39 మంది సభ్యు దేశాలు సమ్మతిని తెలియజేశాయి.

అదే సమయంలో మనీలాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాల కారణంగా మయన్మార్‌ను అధిక-రిస్క్ (బ్లాక్ లిస్ట్) దేశాల జాబితాలో చేర్చబడింది. ఈ జాబితాలో ఇప్పటికే ఉత్తర కొరియా మరియు ఇరాన్ దేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో 70 కంటే తక్కువ స్కోర్లు సాధించిన దేశాలు హై రిస్క్ కంట్రీగా పరిగణించబడతాయి.

బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునక్

భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునక్ యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క నూతన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీనితో రిషి సునక్ బ్రిటన్ యొక్క మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రిగా చరిత్రకెక్కారు. అదే సమయంలో బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత ఈ ఏడాది బ్రిటన్ ప్రధాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడవ వ్యక్తిగా కూడా నిలిచాడు.

ఇటీవలే బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లిజ్ ట్రస్, వినాశకరమైన పన్ను తగ్గింపు బడ్జెట్ ఆర్థిక మరియు రాజకీయ గందరగోళానికి దారితీసిన తర్వాత, చరిత్రలో అతి తక్కువ కాలం సేవలందించిన ప్రధానమంత్రిగా పదవీ విరమణ చేశారు. బ్రిటన్ ప్రస్తుతం అనిశ్చితమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది.

 

వార్తల్లో వ్యక్తులు

డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా అజయ్ భాదూ

గుజరాత్ రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ అజయ్ భాదూ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అజయ్ భాదూ గతంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు.

అరుణాచల్ గవర్నర్ బిడి మిశ్రాకు అదనపు బాధ్యతలు

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బిడి మిశ్రాకు మేఘాలయ అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పదవీకాలం అక్టోబర్‌తో పూర్తికావడంతో ఆ బాధ్యతలు బిడి మిశ్రాకు అప్పగించారు.

గెయిల్ నూతన చైర్మన్‌గా సందీప్ కుమార్ గుప్తా

గెయిల్ (ఇండియా) లిమిటెడ్ కంపెనీ కొత్త ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా సందీప్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. సందీప్ కుమార్ గుప్తా గతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యందు డైరెక్టర్ (ఫైనాన్స్)గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఐఏఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇస్రో శాస్త్రవేత్త అనిల్ కుమార్

సీనియర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ అనిల్ కుమార్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పారిస్‌లో గత నెల 18-22 మధ్య జరిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (IAF) యొక్క వార్షిక కాన్ఫరెన్స్ అయినా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ (IAC) లో  ఈ ఎన్నిక జరిగింది. అనిల్ కుమార్  ప్రస్తుతం ఇస్రోలో అసోసియేట్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

IACC కొత్త జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ లలిత్ భాసిన్

ప్రముఖ న్యాయవాది లలిత్ భాసిన్ ఇండియన్ అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (IACC) యొక్క కొత్త జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. IACC జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు, భాసిన్ ఛాంబర్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు మరియు ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ 10 అక్టోబర్ 2022 అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో మరణించారు. ఆరు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంతో 7 సార్లు పార్లమెంటు సభ్యునిగా మరియు 10 సార్లు శాసనసభ సభ్యునిగా విజయం సాధించారు.

ములాయం సింగ్ యాదవ్ 1989 లో మొదటిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. 1992లో సమాజ్ వాదీ పార్టీ (సోషలిస్ట్ పార్టీ)ని స్థాపించాడు. ఆ తర్వాత 1993 లో రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2003లో మూడవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. 1996లో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో దేవెగౌడ మంత్రివర్గంలో భారతదేశ రక్షణ మంత్రిగా కూడా పనిచేసారు.

ఐపియూ ప్యానెల్లో భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మరియు భువనేశ్వర్ లోక్‌సభ సభ్యురాలు అయినా అపరాజిత సారంగి ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU ) ఎగ్జిక్యూటివ్ కమిటీకి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రువాండాలోని కిగాలీలో జరిగిన ఎన్నికలో ఒడిశాకు చెందిన అపరాజిత సారంగి మొత్తం 18 ఓట్లలో 12 సాధించారు.

ఈ విజయంతో యూనియన్ యొక్క 15 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీలో భారతదేశం తరపున ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు. అంతర్జాతీయ కమిటీలో భారత్ తన ప్రతినిధిని కలిగి ఉండటం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

1887లో స్థాపించబడిన ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ యందు 178 మంది సభ్యులు ఉన్నారు. ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ దౌత్యం ద్వారా శాంతి, ప్రజాస్వామ్యం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి పార్లమెంటులు మరియు పార్లమెంటేరియన్‌లకు అధికారం ఇస్తుంది.

కువైట్‌లో భారత తదుపరి రాయబారిగా ఆదర్శ్ స్వైకా

గల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి కీలక భాగస్వామి అయిన కువైట్‌లో భారత కొత్త రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త ఆదర్శ్ స్వైకా నియమితులయ్యారు. ఆదర్శ్ స్వైకా ప్రస్తుతం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

బోస్నియాలో భారత కొత్త రాయబారిగా పార్థ సత్పతి

బోస్నియా మరియు హెర్జెగోవినాలో భారత తదుపరి రాయబారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పార్థ సత్పతి నియమితులయ్యారు. పార్థ సత్పతి ప్రస్తుతం హంగేరీలో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలో ఈ బాధ్యతలు ఆయన స్వీకరించనున్నారు. బోస్నియా మరియు హెర్జెగోవినాలు యూరప్ ఖండంలో రెండు చిన్న దేశాలు.

స్లోవాక్ రిపబ్లిక్‌లో భారత తదుపరి రాయబారిగా అపూర్వ శ్రీవాస్తవ

స్లోవాక్ రిపబ్లిక్‌కు తదుపరి భారత రాయబారిగా సీనియర్ ఫారిన్ ఆఫీసర్ అపూర్వ శ్రీవాస్తవ నియమితులయ్యారు. అపూర్వ శ్రీవాస్తవ ప్రస్తుతం టోరెంటోలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్లోవాక్ రిపబ్లిక్ యూరోప్ ఖండంలో ఒక చిన్న దేశం. దీని రాజధాని నగరం బ్రాటిస్లావా.

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్

భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ విరమణ చేసిన ఒక రోజు తర్వాత నవంబర్ 9న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ హోదాలో 2024 నవంబర్ 10 వరకు కొనసాగున్నారు.

జస్టిస్ డివై చంద్రచూడ్ 2016 నుండి సుప్రీం కోర్టు న్యామూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ గతంలో భారత 16వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా భారతి దాస్

1988-బ్యాచ్ ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS) అధికారిని భారతి దాస్, భారత కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) గా బాధ్యతలు స్వీకరించారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కేంద్ర ప్రభుత్వానికి అకౌంటింగ్ విషయాలపై ముఖ్య సలహాదారునిగా వ్యవహరిస్తారు.

అత్యంత ఉదారమైన భారతీయ పరోపకారిగా శివ్ నాడార్

ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ 2022 లిస్ట్‌లో హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ రూ. 1161 కోట్ల వార్షిక విరాళంతో దేశంలో అత్యంత ఉదారమైన వ్యక్తిగా నిలిచారు. ఈ జాబితాలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ రెండవ స్థానంలో నిలువగా, రిలయన్స్‌కు చెందిన ముఖేష్ అంబానీ కుటుంబం మూడవ స్థానంలో నిలిచింది.

అలానే ఏవి బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా మరియు కుటుంబం నాల్గవ స్థానంలో ఉండగా. భారతదేశపు అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ మరియు అతని కుటుంబం ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు.

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా జాక్సే షా

సావీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ మరియు క్రెడాయ్ మాజీ చైర్మన్ జక్సే షా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు. శ్రీ జక్సే షా 21 అక్టోబర్ 2022 నుండి మూడు సంవత్సరాల కాలానికి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

1997లో ఏర్పాటైన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ & ప్రమోషన్, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న స్వయంప్రతిపత్త సంస్థ. ఇది దేశీయ అక్రిడిటేషన్లు మరియు నాణ్యత ప్రమోషన్ కార్యకలాపాను నిర్వర్తిస్తుంది.

UNHRC స్పెషల్ రిపోర్టరుగా కేపీ అశ్విని

కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన డాక్టర్ కెపి అశ్విని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క ప్రత్యేక రిపోర్టర్‌గా నియమితులయ్యారు. దీనితో ఈ పదవిని అలంకరించిన మొదటి ఆసియా మరియు భారతీయ మహిళగా నిలిచారు.

అంబేద్కరైట్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి స్కాలర్ అయినా అశ్విని, జాత్యహంకారం మరియు కులతత్వం వంటి సమస్యలపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నారు.

అంధుల టీ20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్

క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) 3వ అంధుల టీ20 ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌ని ప్రకటించింది. 3వ బ్లైండ్ టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది డిసెంబర్ 5 నుండి 17 మధ్య ఇండియాలో జరగనుంది. ఇందులో ఇండియాతో పాటుగా నేపాల్, బాంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్లు పాల్గొనున్నాయి.

ప్రభుత్వ పథకాలు

ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 3.0 ప్రారంభం

న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో గాంధీ జయంతి సందర్భంగా కిరణ్ రిజిజు, అనురాగ్ సింగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 3.0ని ప్రారంభించారు. అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ కార్యక్రమం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31, ఏక్తా దివస్ రోజున ముగుస్తుంది. దేశ పౌరులలో శారీరక ఫిట్నెస్ పెంపొందించాలనే లక్ష్యంతో 2019లో ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ నాంధి పలికారు.

'సత్య నిష్ఠ' యాప్‌ను ప్రారంభించిన హిమాచల్ సీఎం

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ రాష్ట్ర పోలీసుల సహాయార్థం 'సత్య నిష్ఠ' యాప్‌ను ప్రారంభించారు. కాంగ్రా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుశాల్ శర్మ మార్గదర్శకత్వంలో రూపొందిన ఈ యాప్, నేరస్థుల డేటాబేస్‌ను కంపైల్ చేయడంతో పాటుగా నేరాలను అధ్యయనం చేయడంలో, నేరాల దర్యాప్తులో పోలీసులకు సహ్యపడనుంది.

ప్రెసిడెంట్ ముర్ము 'హర్‌స్టార్ట్', స్టార్టప్ ప్లాట్‌ఫారమ్‌

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, మహిళా పారిశ్రామికవేత్తల కోసం గుజరాత్ విశ్వవిద్యాలయం రూపొందించిన 'హర్ స్టార్ట్' అనే స్టార్టప్ వేదికను 04 అక్టోబర్ 2022న  ప్రారంభించారు. గుజరాత్ యూనివర్శిటీ స్టార్టప్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కౌన్సిల్ (GUSEC) రూపొందించిన ఈ వేదిక ద్వారా మహిళా వ్యవస్థాపకులకు వ్యాపార సలహాలను, సహాయాన్ని అందించనున్నారు.

'మా భారతి కే సపూత్ ' వెబ్‌సైట్‌ ప్రారంభం

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సాయుధ బలగాల యుద్ధంలో మరణించిన వారి సంక్షేమ నిధికి సహకారం అందించడం కోసం ' మా భారతి కే సపూత్ ' పేరుతొ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. త్రివిధ దళాల సైనిక కార్యకలాపాలలో ప్రాణాలను అర్పించిన లేదా తీవ్రంగా గాయపడిన సాయుధ సిబ్బంది కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి ఈ నిది ఉపయోగపడనుంది. ఈ నిధిలో జమయ్యే విరాళాలు మొత్తం అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా అందించబడుతుంది.

భోపాల్‌లో హిందీ ఎంబీబీఎస్ పాఠ్య పుస్తకాలు ఆవిష్కరణ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి హిందీ వెర్షన్ పాఠ్యపుస్తకాలను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో విడుదల చేసారు. త్వరలో హిందీ అధికారిక భాషగా ఉన్న రాష్ట్రాలలో మరికొన్ని కోర్సులకు చెందిన పుస్తకాలను హిందీలో అనువాదించి విడుదల చేయనున్నారు.

పిఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అక్టోబర్ 17న న్యూ ఢిల్లీలోని ఇండియ‌న్ అగ్రికల్చ‌ర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో పీఎం కిసాన్ స‌మ్మాన్ స‌మ్మెల‌న్ 2022ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతికత ఆధారిత ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తేనున్నారు. అదే సమయంలో అగ్రి స్టార్టప్‌లను, వాటాదారులను ఒకే వేదిక ద్వారా కనెక్ట్ చేయనున్నారు. ఈ సందర్భంగా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఆరు వందల ప్రదాన్ మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను కూడా ప్రధాని ప్రారంభించారు.

ఇదే కార్యక్రమం కింద దేశంలోని 30 వేలకు పైగా ఎరువుల రిటైల్ దుకాణాలను దశలవారీగా ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చనున్నారు. దీనికి సంబంధిచిన ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన - వన్ను నేషన్ వన్ ఫర్టిలైజర్ పథకాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రాలు రైతులకు అన్నిరకాల వ్యవసాయ సేవలు అందివ్వనున్నాయి. ఇదే కేంద్రాలు వ్యవసాయ-ఇన్‌పుట్‌లు, మట్టి, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్ష సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నాయి.

మధ్యప్రదేశ్‌లో కొత్త టైగర్ రిజర్వ్‌ ఏర్పాటు

మధ్యప్రదేశ్ వన్యప్రాణి బోర్డు, పన్నా టైగర్ రిజర్వ్ (PTR) పరిధిలో 'దుర్గావతి టైగర్ రిజర్వ్' పేరుతో కొత్త రిజర్వ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పన్నా టైగర్ రిజర్వ్ పరిధిలో నాలుగింట ఒక వంతు కెన్-బెత్వా నదుల అనుసంధానం కారణంగా మునిగిపోతుండంతో 2,339 చదరపు కిలోమీటర్ల కొత్త టైగర్ రిజర్వ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

దుర్గావతి టైగర్ రిజర్వ్ నరిసింగ్‌పూర్, దామోహ్ మరియు సాగర్ జిల్లాల్లో విస్తరించి ఉండనుంది. కొత్త రిజర్వ్‌కు పులులను సహజంగా తరలించడానికి పీటీఆర్‌ను దుర్గావతితో అనుసందించడానికి గ్రీన్ కారిడార్ అభివృద్ధి చేయనున్నారు.

రోజ్‌గార్ మేళాను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, వచ్చే ఏడాది కాలంలో పిఎస్‌యుఎస్‌లలో 10 లక్షల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకునేందుకు రోజ్‌గార్ మేళా  పేరుతొ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించి. ఈ కార్యక్రమంను అక్టోబర్ 22న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

100% గృహ కుళాయి కనెక్షన్లు పూర్తిచేసిన రాష్ట్రంగా గుజరాత్

గుజరాత్‌ 100 శాతం 'హర్ ఘర్ జల్' రాష్ట్రంగా ప్రకటించబడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గుజరాత్ రాష్ట్రంలోని మొత్తం 91,73,378 ఇళ్లకు మంచి నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఘనతను సాధించారు. 'నో వన్ ఈజ్ లెఫ్ట్ అవుట్' మోటోతో 2019 లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా 2024 నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు మంచినీటి కుళాయిలు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.

బిజినెస్ & ఎకానమీ అఫైర్స్

ఎస్బీఐ 4వ ఎడిషన్ 'గ్రామ సేవా' కార్యక్రమం ప్రారంభం

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఆరు రాష్ట్రాలలో 4వ విడుత 'గ్రామ సేవా కార్యక్రమాన్ని' ప్రారంభించింది. ఎస్బీఐ ఫౌండేషన్ యొక్క ఫ్లాగ్‌షిప్ పథకం కింద హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు మరియు వెస్ట్ బెంగాల్ వంటి ప్రతిష్టాత్మక రాష్ట్రాలలో 30 మారుమూల గ్రామాలను దత్తత తీసుకోనుంది. ఆయా గ్రామాలలో 'గ్రామ సేవా కార్యక్రమం' ద్వారా విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలను మెరుగుపర్చనుంది.

యెస్ బ్యాంక్ ఎండీ & సీఈఓగా ప్రశాంత్ కుమార్

ప్రముఖ బ్యాంకర్ ప్రశాంత్ కుమార్, వచ్చే మూడేళ్ల కాలానికి యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. దీనికి ముందు ప్రశాంత్ కుమార్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసారు.

ఎస్‌బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండిగా కిషోర్ కుమార్

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నూతన మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కిషోర్ కుమార్ పోలుదాసు నియమితులయ్యారు. కిషోర్ కుమార్  గతంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2009లో స్థాపించబడింది.

బంధన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ

బంధన్ బ్యాంక్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీని నియమించుకున్నట్లు ప్రకటించింది. కోల్‌కతాలో ప్రధాన కేంద్రంగా సేవలు అందిస్తున్న బంధన్ బ్యాంకు 2015 లో స్థాపించబడింది. ప్రస్తుత్తం దేశ వ్యాప్తంగా 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 5,639 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు మరియు 2.63 కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్‌లను కలిగి ఉంది.

కర్ణాటక బ్యాంకుకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు

కర్నాటక బ్యాంక్ ప్రతిష్టాత్మక నేషనల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ 'DX 2022' అవార్డును సొంతం చేసుకుంది. BFSI సెగ్మెంట్ క్రింద డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో బెస్ట్ ప్రాక్టీస్ కోసం మూడు విభాగాలలో “ఇన్నోవేటివ్ ఎక్సలెన్స్”కి గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయబడింది. దీనిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అందిస్తుంది.

డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్

వైమానిక దళంలో లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచంద్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చే రూపొందించబడిన లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ భారత వైమానిక దళంలోకి చేర్చబడింది. ప్రచండ అనేది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైన సియాచిన్‌లో కూడా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది.

37వ సీఆర్పీఎఫ్ డీజీగా సుజోయ్ లాల్ థాసన్

సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి సుజోయ్ లాల్ థాసన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 37వ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. లాల్ థాసన్ ఇది వరకు సశాస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ), ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

ఐటీబీపీ డీజీగా అనీష్ దయాళ్ సింగ్

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అనిష్ దయాల్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ హోదాలో డిసెంబర్ 31, 2024 వరకు కొనసాగనున్నారు.

IBSAMAR ఏడవ ఎడిషన్‌లో పాల్గొననున్న ఐఎన్ఎస్ తార్కాష్

IBSAMAR 7వ ఎడిషన్‌లో పాల్గొనేందుకు INS తార్కాష్ దక్షిణాఫ్రికాకు చేరుకుంది. అక్టోబర్ 10 నుండి 12 మధ్య జరగనున్న ఈ ఉమ్మడి నావెల్ వ్యాయాయం యందు భారతదేశం, బ్రెజిలియన్ మరియు దక్షిణాఫ్రికా నౌకాదళాలాలు పాల్గున్నాయి.

ఈ నౌకాదళ సముద్ర విన్యాసాలలో ఇండియన్ నేవీకి చెందిన టెగ్ క్లాస్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్, ఐఎన్ఎస్ తార్కాష్, చేతక్ హెలికాప్టర్ మరియు మెరైన్ కమాండో ఫోర్స్ (మార్కోస్) సిబ్బంది ప్రాతినిధ్యం వహించాయి. IBSAMAR అనగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా మారిటైమ్ అని అర్ధం. దీనిని 2008లో మొదటిసారి ప్రారంభించారు.

గాంధీనగర్‌లో 12వ డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభం

ద్వైవార్షిక డిఫెన్స్ ఎక్స్‌పో 12 వ ఎడిషన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లో అక్టోబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతీయ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి మద్దతు ఇవ్వడానికి, నూతన ఉత్పత్తులు ప్రదర్శించడానికి మరియు భాగస్వామ్యాలను ఏర్పరచడానికి ఈ ద్వైవార్షిక ప్రదర్శన నిర్వహించబడుతోంది. ఈ ఏడాది 'పాత్ టు ప్రైడ్' అనే థీమ్‌పై ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

భారత్, అమెరికా 'టైగర్ ట్రయంఫ్' ఎక్సర్సైజ్

భారత, అమెరికా మిలిటరీలు, 'టైగర్ ట్రయంఫ్' ఎక్సర్సైజ్ పేరుతో అక్టోబర్ 20 నుండి 22 మధ్య విశాఖపట్నంలో మూడు రోజుల ఉమ్మడి మానవతా సహాయక విన్యాసాన్ని నిర్వహించాయి. ఇరు దేశాల మధ్య ఇది ​​రెండవ త్రి-సేవా సైనిక విన్యాసం. భారతదేశం ఇంతకుముందు రష్యాతో మాత్రమే ట్రై-సర్వీస్ కసరత్తులు నిర్వహించింది.

రిపోర్టులు & ర్యాంకులు

చక్కెర ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా భారత్‌

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా మరియు రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. 2021-22 ఏడాదికి సంబంధించి దేశంలో రికార్డు స్థాయిలో 5000 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి చేయబడింది. దీని నుండి దాదాపు 3574 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసారు.

బాల్య వివాహాల రేటులో జార్ఖండ్ అగ్రస్థానం

దేశంలో బాల్య వివాహాల జాబితాలో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా డెమోగ్రాఫిక్ శాంపిల్ సర్వే ప్రకారం, జాతీయ సగటులో18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్న ఆడవారి శాతం అత్యధికంగా జార్ఖండ్‌లో 5.8 శాతం నమోదు అయ్యింది.

పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 54.9% మంది అమ్మాయిలు 21 ఏళ్లు నిండకముందే పెళ్లి చేసుకుంటుండగా, జార్ఖండ్‌లో ఈ సంఖ్య 54.6%, జాతీయ స్థాయిలో 29.5% ఉన్నట్లు సర్వే తెలిపింది. 18 ఏళ్ళ లోపు వివాహం చేసుకునే జాబితాలో కేరళలో 0.0% నమోదు చేసింది.

18 ఏళ్లలోపు గల వివాహాల్లో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం తక్కువ వయస్సు గల వివాహాలలో ఏపీ అత్యధికంగా 29.3% బాల్య వివాహాలు నమోదు కాగా, తెలంగాణాలో 23.5%, కర్ణాటక 21.3% మరియు తమిళనాడు 12.8% బాల్య వివాహాలు నమోదు కబడ్డాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ అత్యల్పంగా 6.3% నమోదు చేసింది.

భారతదేశపు మొట్టమొదటి 24x7 సోలార్‌ విల్లెజ్'గా మోధేరా

గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని మోధేరాను భారతదేశంలోని మొట్టమొదటి 24x7 సౌరశక్తితో పనిచేసే గ్రామంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మెహసానా జిల్లాలో పుష్పవతి నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం, చౌళుక్యుల కాలం నాటి సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు గుజరాత్ మరియు కేంద్ర ప్రభుత్వం సుమారు సుమారు 65 కోట్ల వ్యయం వెచ్చించారు. ఇందులో భాగంగా మోధేరాలోని దాదాపు 1600 ఇళ్లు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసారు. గ్రామంకు 3 కిలోమీటర్లు దూరంలో 15 మెగావాట్ల బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చేసారు.

అక్టోబర్ 9న ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో గ్రామంలోని ప్రజలు తమ కరెంటు బిల్లుల్లో 60% నుంచి 100% వరకు ఆదా చేసుకోనున్నారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి అమ్మే వెసులుబాటు కూడా కల్పించారు. అంతకుముందు రోజు, గుజరాత్‌లోని మొధేరా, మెహసానాలో ₹ 3,900 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు.

CRII ర్యాంకింగులో ఇండియాకు 123వ స్థానం

కమిట్‌మెంట్ టు రిడ్యూసింగ్ ఇనెక్కువాలిటీ ఇండెక్స్ (CRII) లో భారత్ 123 వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగులో 2020లో ఇండియా 129 ర్యాంకులో ఉండగా, 2022లో 6 ర్యాంకులు మెరుగుపడి 123 వ ర్యాంకులో నిలిచింది. ఈ జాబితాలో నార్వే ముందు ఉండగా, జర్మనీ మరియు ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ మరియు డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ (డిఎఫ్‌ఐ) రూపొందించిన ఈ ఇండెక్స్,  ప్రజా సేవలు (ఆరోగ్యం, విద్య మరియు సామాజిక రక్షణ), పన్నులు మరియు కార్మికుల హక్కులు సంబంధించిన ప్రభుత్వాల పనితీరు ఆధారంగా రూపొందించబడుతుంది.

ప్రపంచ వన్యప్రాణుల జనాభాలో 69% క్షీణత నమోదు

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) లివింగ్ ప్లానెట్ నివేదిక ప్రకారం 1970 నుండి 2018 మధ్యకాలంలో ప్రపంచ వన్యప్రాణి జనాభాలో సగటున 69% క్షీణత నమోదు అయ్యింది. ఇందులో లాటిన్ అమెరికా మరియు కరేబియన్‌ దీవులలో అత్యంత దారుణంగా 94% క్షీణత నమోదు కాగా, ఆఫ్రికాలో 66 శాతం, ఆసియాలో 55 శాతం జంతు జనాభా కనుమరుగు అయిపోయాయి. అలానే మంచినీటి జవులలో 83 శాతం క్షీణత నమోదు కావడం గమనార్హం.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారతదేశంకు 107వ స్థానం

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) 2022లో భారతదేశం 121 దేశాల జాబితాలో 107వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగులో గతేడాది 116 దేశాల్లో భారత్‌ 101వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్ (99వ స్థానం), నేపాల్ (81వ స్థానం), బంగ్లాదేశ్ (84వ స్థానం) కంటే వరుసగా రెండో ఏడాది కూడా భారత్ ఆకలి దేశంగా ఉంది. ఆకలి సూచికలో 109వ స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కంటే భారత్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ముందుర నిలిచింది.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, పిల్లల మరణాల నమోదు వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్ అందిస్తుంది. 2022 నివేదిక కోసం 136 దేశాల డేటా సేకరించగా, వాటిలో 121 దేశాలకు ర్యాంకింగ్ కల్పించింది. ఈ జాబితాలో చైనా, హంగరీ, మాంటెనెగ్రో, ఉజ్బెకిస్థాన్, రష్యా, సౌదీ అరేబియా సహా 17 దేశాలు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. ఈ సంవత్సరం ఏ దేశాన్ని అత్యంత ప్రమాదకరమైన విభాగంలో చేర్చలేదు.

పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2022లో హర్యానా అగ్రస్థానం

2022 పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ (PAI)లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో హర్యానా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. భారతదేశ రాష్ట్రాలలో పాలనపై బెంగళూరుకు చెందిన పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (PAC) రూపొందించిన PAI యొక్క ఏడవ ఎడిషన్ నివేదిక అక్టోబర్ 14న వెలువడింది. ఈ జాబితాలో హర్యానా అగ్రస్థానంలో నిలువగా, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

10 చిన్న రాష్ట్రాలలో సిక్కిం అగ్రస్థానంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వరుసగా రెండు మరియు మూడవ స్థానాలను పొందాయి. కార్మిక ఉత్పాదకత, కార్మికుల వేతనాలు, ప్రజా వ్యయం, సామాజిక భద్రతా, ప్రభుత్వ పాలన వంటి వివిధ అంశాల పనితీరు ఆధారంగా ఈ ర్యాంకు అందిస్తారు.

పీఎంఏవై (అర్బన్) అవార్డులు 2022

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో 'బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్' కేటగిరీలో ఉత్తరప్రదేశ్ మొదటి ర్యాంకు దక్కించుకోగా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాత రెండు స్థానాలలో నిలిచాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన 'ఇండియన్‌ అర్బన్‌ హౌసింగ్‌ కాన్‌క్లేవ్‌'లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ అవార్డులను అందజేశారు.

ఆల్ టైమ్ అత్యుత్తమ భారతీయ చిత్రంగా 'పథేర్ పాంచాలి'

లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే యొక్క ఫీచర్ ఫిలిం 'పథేర్ పాంచాలి' ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం క్రిటిక్స్ (FIPRESCI) ద్వారా ఆల్ టైమ్ అత్యుత్తమ భారతీయ చిత్రంగా ప్రకటించబడింది. ప్రజాభిప్రయం ద్వారా ఈ సంస్థ నిర్వహించిన భారతీయ సినిమా చరిత్రలో టాప్ 10 చిత్రాల జాబితాలో పథేర్ పాంచాలి అగ్రస్థానంలో నిలిచింది.

పథేర్ పాంచాలి అనేది 1955లో విడుదలైన భారతీయ బెంగాలీ భాషా నాటక చిత్రం, సత్యజిత్ రే రచన మరియు దర్శకత్వం వహించారు. దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించింది. ఇది ప్రామాణికత మరియు సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే సమాంతర సినిమా ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన చిత్రాలలో ఒకటి. ఇది కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు, పని కోసం తన గ్రామాన్ని వదిలి పట్టణానికి వలసపోయిన ఒక ఒక పేద బెంగాలీ పూజారి కథ.

అవార్డులు & గౌరవాలు

నోబెల్ ప్రైజ్ విజేతలు 2022

స్వీడిష్ నోబెల్ ప్రైజ్ కమిటీ 2022 నోబెల్ ప్రైజ్ విజేతలను ప్రకటించింది. విజేతలకు 10 డిసెంబర్ 2022 న నిర్వహించే నోబెల్ ప్రైజ్ అవార్డు కార్యక్రమంలో అందజేస్తారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేయబడ్డాయి. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు పారిశ్రామికవేత్త ఆయినా ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ అవార్డులు అందిస్తారు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ లేదా మెడిసిన్, సాహిత్యం మరియు శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు అందజేయబడతాయి. విజేతకు 10 మిలియన్ల SEK (స్వీడిష్ క్రోన్స్) ప్రైజ్ మనీ అందిస్తారు.

నోబెల్ ప్రైజ్ 2022 - మెడిసిన్

2022 మెడిసిన్ లేదా ఫిజియాలజీ నోబెల్ బహుమతిని స్వీడిష్ జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబో అందుకున్నారు. అంతరించిపోయిన హోమినిన్స్ మరియు మానవ పరిణామం యొక్క జన్యువులకు సంబంధించిన అతని ఆవిష్కరణలకు గాను ఈ అవార్డు లభించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జన్మించిన పాబో ఉప్ప్సల విశ్వవిద్యాలయంలో ఈజిప్టాలజీ మరియు మెడిసిన్ పట్టా అందుకున్నారు.

స్వాంటే పాబో సైబీరియాలోని ఒక గుహలో కనుగొనబడిన ఒక చిన్న వేలు ఎముక నుండి డిఎన్ఏ వేరు చేసి, డెనిసోవా అనే తెలియని హోమినిన్‌ను కనుక్కోవడం ద్వారా పాపులర్ అయ్యారు. ఈయన యొక్క ఆవిష్కరణ ద్వారా కనీసం రెండు అంతరించిపోయిన హోమినిన్ జనాభా యురేషియాలో నివసించినట్లు కనుగొనబడింది. ఇందులో నియాండర్తల్ మరియు డెనిసోవాన్లు ఉన్నారు. అలానే హోమో సేపియన్‌లు దాదాపు 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి తరలిపోయినట్లు ఈ పరిశోధనలు వెల్లడిసున్నాయి.

స్వాంటే పాబో తండ్రి, సునే బెర్గ్‌స్ట్రోమ్ కూడా 1982లో మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. నోబెల్ గ్రహీత యొక్క పిల్లలు కూడా నోబెల్ బహుమతిని గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి.

నోబెల్ ప్రైజ్ 2022 - ఫిజిక్స్

2022 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి వరించింది. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన అలెన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌లకు ప్రపంచ అత్యున్నత పురస్కారం దక్కింది. ఫోటాన్‌లలో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో వీరు చేసిన అద్భుత ప్రయోగాలకు గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు.

నోబెల్ ప్రైజ్ 2022 - లిటరేచర్

ఫ్రెంచ్ రచయిత యానీ ఎర్నాక్స్ సాహిత్యంలో 2022 నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. స్వీయ జీవితాన్ని, తన చుట్టూ ఉండేవారి జీవితాలను ఆధారంగా చేసుకుంటూ యూరప్ మహిళల వేదనను అక్షరబద్దం చేసినందుకు గాను ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

82 ఏళ్ళ యానీ 1942 లో నార్మాండీలోని ఇవాటాలో జన్మించారు. తన ఐదు దశబ్దాలో రచనా వాస్యాంగంలో 30 లోపే రచనలు చేసినా, యూరోపియన్ మహిళల సమస్యలను ఎలాంటి దాపరికం లేకుండా ప్రపంచానికి చెప్పడం ద్వారా ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. నోబెల్ సాహిత్య బహుమతిని యిప్పటి వరకు 16 మంది మహిళలు అందుకున్నారు. యానీ 17వ మహిళా రచియతగా నిలిచారు.

నోబెల్ ప్రైజ్ 2022 - కెమిస్ట్రీ

రసాయన అణువులను చిటికెలో కలపడానికి ఉపయోగపడే 'క్లిక్ కెమిస్ట్రీ మరియు ప్రాణమున్న జీవుల్లో సైతం ఆ విధానం పనిచేసేలా 'బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ' అభివృద్ధి చేసినందుకు గాను అమెరికన్ శాస్త్రవేత్తలు ' కెరోలిన్ ఆర్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డాల్ మరియు డెన్మార్కు చెందిన కె బారీ షార్ప్‌లెస్‌లకు సంయుక్తంగా 2022 కెమిస్ట్రీ నోబెల్ బహుమతి ప్రకటించబడింది.

వీరిలో కె బారీ షార్ప్‌లెస్‌'కు ఇది రెండవ నోబెల్ బహుమతి. షార్ప్‌లెస్‌కు 2001లో "చిరల్లీ ఉత్ప్రేరక ఆక్సీకరణ ప్రతిచర్యలు"పై చేసిన కృషికి నోబెల్ కెమిస్ట్రీ బహుమతి లభించింది. 1901లో అవార్డు ప్రారంభించినప్పటి నుండి రెండు నోబెల్ బహుమతులు పొందిన ఐదవ వ్యక్తిగా బారీ షార్ప్‌లెస్ నిలిచారు.

నోబెల్ పీస్ 2022 (నోబెల్ శాంతి బహుమతి)

2022 ఏడాదికి సంబంధించి నోబెల్ శాంతి బహుమతిని బెలార‌స్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల అడ్వ‌కేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్దం జరుగుతున్న సమయంలో శాంతిక కోసం కృషి చేస్తున్న రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్ మరియు ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ లకు అందించారు.

రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్  గత 30 ఏళ్ళ నుండి సోవియెట్ పాలనలో శిక్షించిన, బంధించిన, అణచివేసిన కొన్ని లక్షల మంది ప్రజల జ్ఞాపకశక్తిని పునరుద్ధరించేందుకు కృషి చేసింది. ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆక్రమిత క్రిమియాలో యుద్ధ నేరాలు, యుక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత చోటు చేసుకున్న రాజకీయ అణచివేతలను పర్యవేక్షించింది.

బెలారస్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకర్త అలెస్ బియాలియాస్కీ ప్రజలకు ప్రభుత్వాలపై ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా, పౌరులలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.

నోబెల్ ప్రైజ్ 2022 : ఎకనామిక్స్

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ముగ్గురు అమెరికన్ ఎకానమిస్ట్​లను వరించింది. బ్యాంకులు మరియు ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన కోసం ఎస్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ మరియు ఫిలిప్ డైబ్విగ్'లు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి వీరు చేసిన పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు నోబెల్‌ కమిటీ వెల్లడించింది.

 

డాక్టర్ వివేక్ లాల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

భారతీయ అమెరికన్‌ డాక్టర్ వివేక్ లాల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. భారత సంతతికి చెందిన జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వివేక్ లాల్‌ను, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విత్ గ్రేట్‌ఫుల్ రికగ్నిషన్' అనే కొటేషన్‌తో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ కంపెనీ న్యూక్లియర్ టెక్నాలజీ సంబంధిత రంగంలో గ్లోబల్ అగ్రగామిగా ఉంది.

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డులు 2022 ప్రదానం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 2022 ఏడాదికి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్ జీవన్ మిషన్ ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌ మొదటి అవార్డు తెలంగాణకు దక్కగా, రెండోది హర్యానాకు, మూడో అవార్డు తమిళనాడుకు లభించాయి.

చిన్న రాష్ట్రాలు మరియు యుటిల కేటగిరిలో, అండమాన్ మరియు నికోబార్ మొదటి అవార్డును గెలుచుకోగా, దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ రెండవ అవార్డును, సిక్కిం మూడవ అవార్డును గెలుచుకున్నాయి. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమం అనేది స్వచ్ఛ్ భారత్ మిషన్ యొక్క పరిమాణాత్మక మరియు గుణాత్మక రూపం. ఇది గ్రామీణ సమాజ పారిశుద్ధ్య స్థితిని మరియు పనితీరును అంచనా వేస్తుంది.

జల్ జీవన్ మిషన్ ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ ప్రథమ అవార్డును పుదుచ్చేరి అందుకోగా గోవాకు ద్వితీయ, తమిళనాడుకు తృతీయ అవార్డు లభించింది. జల్ జీవన్ మిషన్ ఫంక్షనాలిటీ అనేది గ్రామీణ నీటి వినియోగాల పనితీరును మరియు గృహ నీటి నాణ్యతను అంచనా వేస్తుంది. జల్ జీవన్ మిషన్ కింద గత మూడేళ్ళలో పది కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయిల ద్వారా సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరును ప్రభుత్వం అందిస్తుంది.

ఇండోర్‌కు ఆరవ సంవత్సరం క్లీనెస్ట్ సిటీ అవార్డు

స్వచ్ఛ భారత్ మిషన్ కింద పట్టణ ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛత సర్వేలో ఇండోర్ వరుసగా ఆరవ సారి భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. ఈ జాబితాలో సూరత్ మరియు నవీ ముంబై ర్వాతి రెండు స్థానాల్లో నిలిచాయి. మధ్యప్రదేశ్‌ను ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ప్రకటించబడింది. అలానే కర్ణాటకలోని శివమొగ్గ నగరం ఫాస్టెస్ట్ మొవర్ సిటీ అవార్డు అందుకుంది.

శ్రీజేష్, పునియాలకు గోల్ కీపర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ సవితా పునియా మరియు వెటరన్ భారత పురుషుల జట్టు గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ లకు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) యొక్క గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు.

2014లో అవార్డ్‌ను ప్రారంభించినప్పటి నుంచి వరుసగా మూడేళ్లపాటు గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్ (మహిళలు) గెలుచుకున్న మూడో అథ్లెట్ సవితా పునియా. అలానే పిఆర్ శ్రీజేష్ వరుసగా రెండేళ్ళు పాటు గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న రెండవ క్రీడాకారుడిగా నిలిచాడు.

ఐఐటీఎం శాస్త్రవేత్తకు దేవేంద్ర లాల్ మెమోరియల్ మెడల్

పూణేకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్, అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ (AGU) యొక్క 2022 దేవేంద్ర లాల్ మెమోరియల్ మెడల్‌ను అందుకున్నారు. ఎర్త్ మరియు స్పేస్ సైన్సెస్‌లో చేసిన అత్యుత్తమ పరిశోధనలకు గాను ఈ అవార్డు ఆయనకు లభించింది.

సస్త్ర రామానుజన్ ప్రైజ్ 2022

2022 సంవత్సరానికి గాను సస్త్ర రామానుజన్ బహుమతిని  అమెరికా బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన యున్‌కింగ్ టాంగ్‌కు ఇవ్వబడుతుంది. ఈ అవార్డును షణ్ముగ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ & రీసెర్చ్ అకాడమీ (SASTRA) 2005 నుండి అందిస్తుంది. విజేతకు 10 వేల డాలర్ల ప్రైజ్ మనీఅందజేస్తారు.

హైదరాబాద్'కు 'వరల్డ్ గ్రీన్ సిటీ' అవార్డు

దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (AIPH) 2022 లో హైదరాబాద్ నగరం వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ దక్కించుకుంది. దీనితో పాటుగా లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరో అవార్డు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు హైదరాబాద్ సహా మొత్తం 18 నగరాలు ఎంపికవ్వగా భాగ్యనగరం విజేతగా నిలిచింది.

శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలకకు బుకర్ ప్రైజ్

శ్రీలంక రచయిత, షెహన్ కరుణతిలక తన రచన "ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మెయిడా " కోసం ప్రతిష్టాత్మక బ్రిటన్ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్నారు. ఈ పుస్తకం 1990 శ్రీలంక అంతర్యుద్ధ సమయంలో యుద్ధ ఫోటోగ్రాఫర్ మరియు జూదగాడు మాలి అల్మెయిడా యొక్క అనుభవాలకు సంబంధించింది. అదే సమయంలో షెహన్ కరుణతిలక, ఫిలిప్ మైఖేల్ ఒండాట్జే తర్వాత బుకర్ ప్రైజ్ అందుకున్న రెండవ శ్రీలంక రచయితగా నిలిచాడు. 1969 లో ప్రారంభించిన బుకర్ ప్రైజ్, ఏటా ఉత్తమ  రచనలకు ఇవ్వబడుతుంది.

అమెరికన్ చరిత్రకారిణి బార్బరాకు సర్ సయ్యద్‌ అవార్డు

ప్రముఖ అమెరికన్ చరిత్రకారిణి ప్రొ. బార్బరా మెట్‌కాఫ్‌కు 2022 ఏడాది కోసం సర్ సయ్యద్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయబడింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ(AMU) వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 205వ జయంతి సందర్భంగా ఈ వార్షిక అవార్డును ప్రకటించారు. ఇండియా మరియు పాకిస్తాన్ ముస్లింలకు సంబంధించి ఆమె రాసిన అద్భుతమైన ఛారిత్రత్మక రచనలకు గాను ఏ అవార్డును అందించారు.

కరీమ్ బెంజెమాకు బాలన్ డి'ఓర్ 2022 అవార్డు

రియల్ మాడ్రిడ్ ఫార్వర్డ్ కరీమ్ బెంజెమా 2022 ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైన పురుషుల బాలన్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. కరీమ్ బెంజెమా ఈ అవార్డును అందుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాదిలో ప్రదర్శించిన అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఈ అవార్డు అందుకున్నారు.

బార్సిలోనా మిడ్‌ఫీల్డర్ అలెక్సియా పుటెల్లాస్ 2022 ఏడాది కోసం మహిళల బ్యాలన్ డి'ఓర్‌ను గెలుచుకుంది. దీనితో ఈ బహుమతిని బ్యాక్‌టు బ్యాక్ విజేతగా నిలిచిన మొదటి మహిళా క్రీడాకారిణిగా పుటెల్లాస్ చరిత్ర సృష్టించింది. పారిస్‌లోని థియేటర్ డు చాటలెట్‌లో జరిగిన వేడుకలో ఈ అవార్డులను అందజేశారు. బాలన్ డి'ఓర్ అవార్డు అనేది వార్షిక ఫుట్‌బాల్ అవార్డు.

ఐఐటీ మద్రాస్'కు జాతీయ మేధో సంపత్తి అవార్డు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ 2021-22 ఏడాదికి గాను నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవార్డ్స్ గెలుచుకుంది. 2021-22 మధ్యకాలంలో నూతన ఆవిష్కరణలకు సంభందించి ఐఐటీ మద్రాస్ దాదాపు 120 పేటెంట్స్ పోండంతో ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అందిస్తుంది.

హైదరాబాదీ హలీమ్‌కు 'మోస్ట్ పాపులర్ జీఐ' అవార్డు

తెలంగాణకు చెందిన హైదరాబాదీ హలీం మోస్ట్ పాపులర్ జీఐ అవార్డును గెలుచుకుంది. హైదరాబాదీ హలీమ్‌ 2010లో జీఐ హోదా మరియు ట్యాగ్‌ని అందుకున్న భారతదేశంలో మొదటి మాంసాహార వంటకం. ఈ అవార్డును ప్రజాభిప్రాయం ఆధారంగా, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రదానం చేయబడింది.

తెలంగాణ రాష్ట్రం నుండి హైదరాబాద్ హలీంతో పాటుగా నిర్మల్ టాయ్స్ & క్రాఫ్ట్స్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల్ శారీ, బనగానపల్లి మామిడి వంటి ఉత్పత్తులు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును కలిగి ఉన్నాయి.

మరో రెండు భారతీయ బీచ్‌లకు 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్

మరో రెండు భారతీయ బీచ్‌లకు 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ లభించింది. లక్షద్వీప్‌లోని మినీకాయ్ తుండి బీచ్ మరియు కద్మత్ బీచ్‌లు కొత్తగా అంతర్జాతీయ పర్యావరణ లేబుల్ "బ్లూ ఫ్లాగ్" సర్టిఫికేషన్ అందుకున్నాయి. దీనితో భారతదేశంలో ప్రస్తుతం ఉన్న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ బీచ్‌ల సంఖ్యా 12కి చేరుకుంది.

ఈ జాబితాలో ఇప్పటికే శివరాజ్‌పూర్-గుజరాత్, ఘోఘ్లా-డియ్యు, కాసర్కోడ్ మరియు పాడుబిద్రి-కర్ణాటక, కప్పాడ్-కేరళ, రుషికొండ- ఆంధ్రప్రదేశ్, గోల్డెన్-ఒడిశా, రాధానగర్- అండమాన్ మరియు నికోబార్, కోవలం -తమిళనాడు మరియు పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్‌లు ఉన్నాయి.

ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ డెన్మార్క్ (FEE) అందించే ఎకో-లేబుల్ - బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. దీనికి అర్హత సాధించడానికి కఠినమైన పర్యావరణ, భద్రత-సంబంధిత ప్రమాణాలు పాటించాలి. పర్యాటక రంగంలో సుస్థిరతను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందిచబడుతుంది.

'RRR' కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు

సాటర్న్ అవార్డ్స్ 2022లో తెలుగు చిత్రం 'RRR' బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ నటించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్‌లో విడుదలైన కేవలం మూడు రోజుల్లో 3.5 కోట్ల వసూళ్లు రాబట్టింది.

సాటర్న్ అవార్డ్స్ అనేవి అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మరియు హారర్ ఫిల్మ్స్ కేటగిరిలో ప్రతి సంవత్సరం అందించే అమెరికన్ అవార్డులు. వీటిని ఏడాదిలో ఉత్తమ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ మరియు హారర్ చిత్రాలకు అందిస్తారు.

స్పోర్ట్స్ అఫైర్స్

నేషనల్ గేమ్స్ 2022 విజేతలు

36వ నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా 2022 క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తుంది.ఈ క్రీడలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 12 వరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ లలో నిర్వహించనున్నారు. సుమారు 36 క్రీడా ఈవెంట్‌లతో జరిగే జాతీయ క్రీడల పోటీల్లో దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా క్రీడాకారులు పోటీ పడనున్నారు

మహాత్మా మందిర్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ 2022లో ఒలింపియన్ ఫెన్సర్ భవానీ దేవి మహిళల సాబర్ ఈవెంట్‌లో వరుసగా మూడో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్‌కు చెందిన జగ్మీత్ కౌర్‌పై 15-3 తేడాతో విజయం సాధించడం ద్వారా ఈ ఘనత దక్కించుకుంది. తమిళనాడుకు చెందిన భవానీ దేవి గతంలో 2011 మరియు 2015 ఎడిషన్లలో బంగారు పతకాలను గెలుచుకుంది.

ఒలింపిక్ రజత పతక విజేత మరియు రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన మీరాబాయి చాను మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. మరో మణిపూర్‌ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత ఖుముచ్చమ్ సంజితా చాను 82 కిలోలు వెయిట్ లిఫ్టింగ్ పోటీలో రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

అహ్మదాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ 2022 టెన్నిస్ అరేనాలో కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ దేవ్, ఆదిల్ కళ్యాణ్‌పూర్ ద్వయం, గుజరాత్‌కు చెందిన ధ్రువ్ హిర్పారా, మాధ్విన్ కామత్‌లను 6-3, 6-4తో ఓడించి పురుషుల డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచారు.

మహిళల రైఫిల్ షూటింగ్‌లో ఒలింపిక్ పతక విజేత ఎలవెనిల్ వలరివన్ 16-10తో కర్ణాటకకు చెందిన తిల్లోటమా సేన్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలానే కేరళ వాయనాడ్‌లోని వజవట్టకు చెందిన జోస్నా క్రిస్టీ జోస్ నేషనల్ గేమ్స్ 2022లో మహిళల ఫెన్సింగ్ పోటీలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన పురుషుల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో హర్యానాకు చెందిన అనిష్ భన్వాలా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల 1500 మీటర్ల పరుగులో ఆర్మడ్ సర్వీసెస్‌కు చెందిన పర్వేజ్ ఖాన్ బంగారు పతకం సాధించాడు.

అండర్-20 ప్రపంచ ఛాంపియన్ యాంటిమ్ పంఘల్ జాతీయ క్రీడలు 2022 లో మహిళల 53 కేజీల రెజ్లింగ్‌ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఒలింపియన్ స్విమ్మర్ సజన్ ప్రకాష్ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కర్ణాటక ఆటగాడు అనీష్ ఎస్ గౌడను 1:51.88 నిమిషాలతో తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

36 వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌కు చెందిన పూజా పటేల్ యోగాసనలో స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారిణిగా అవతరించింది. ఈ ఏడాది జాతీయ క్రీడల్లో యోగాసనాలతో సహా మరో ఐదు క్రీడాంశాలను తొలిసారిగా నిర్వహిస్తున్నారు. అలానే టోక్యో ఒలింపియన్ శ్రీహరి నటరాజ్ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీలో గెలవడం ద్వారా తన ఆరో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

అక్టోబర్ 12న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకలకు గుజరాత్‌ క్రీడా శాఖామంత్రి హర్ష్‌ సంఘ్వీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వీసెస్‌ స్పోర్ట్స్‌ కంట్రోల్‌బోర్డు(ఎస్‌ఎస్‌సిబి) జట్టు 61 స్వర్ణాలతో మొత్తం 128పతకాలతో అగ్రస్థానంలో నిలవగా తర్వాత రెండు స్థానాలలో మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాలు నిలిచాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 2 స్వర్ణ, 9 రజత, 5 కాంస్యాలతో మొత్తం 16పతకాలతో 21వ స్థానంలో నిలవగా, తెలంగాణ 8 స్వర్ణ, 7 రజత, 8 కాంస్యాలతో మొత్తం 23పతకాలతో 15వ స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యమివ్వనుంది.

భారత జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్ 2025 వరకు సస్పెన్షన్

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్ డోపింగ్ ఉల్లంఘన కింద నాలుగేళ్ల నిషేధానికి గురయ్యాడు. శివపాల్ సింగ్ నిషేధించబడిన మెటాండియోనోన్ పదార్థం ఉపయోగించినట్లు గత సంవత్సరం సెప్టెంబర్‌లో నిర్వహించిన డ్రోపింగ్ పరీక్షలో కనుగొనబడింది. ఈ డోపింగ్ ఉల్లంఘన కారణంగా అక్టోబర్ 2025 వరకు ఆయన పోటీ నుండి సస్పెండ్ చేయబడ్డాడు.

400 టీ20లు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా రోహిత్ శర్మ

టీ20 చరిత్రలో 400 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ క్రికెటరుగా రోహిత్ శర్మ నిలిచాడు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఈ జాబితాలో మాజీ వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ 614 మ్యాచులతో అత్యధికంగా ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు. అలానే తోటి ట్రినిడాడియన్ డ్వేన్ బ్రావో 556 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, సీనియర్ పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయాబ్ మాలిక్ (481) మూడో స్థానంలో ఉన్నాడు.

భారత్ నుండి 350 కి పైగా టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్ల జాబితాలో వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ (368) రెండో స్థానంలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (361) మూడవ స్థానంలో, విరాట్ కోహ్లీ (354) నాల్గువ స్థానంలో, సురేశ్ రైనా (336) లతో 5వ స్థానంలో ఉన్నారు.

ఇరానీ కప్ 2022 విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా

హనుమ విహారి నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ ఇండియా (ROI) ఆతిథ్య మరియు డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్రను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఇరానీ కప్ 2022 విజేతగా నిలిచింది. ఇరానీ కప్ అనేది దేశీయ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ క్రికెట్ టోర్నమెంట్. ఇది ఏటా ఆ ఏడాది రంజీ ట్రోఫీ విజేతకు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా క్రికెట్ జట్టుకు మధ్య నిర్వహించబడుతుంది.

ఇరానీ ట్రోఫీని 1959-60 సీజన్‌లో రంజీ ట్రోఫీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించబడింది. దీనికి అత్యధిక కాలం భారత క్రికెట్ బోర్డు అధికారిగా పనిచేసిన జేఆర్ ఇరానీ పేరును నామకరణం చేసారు.

ఐబీఎస్‌ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్‌లో పంకజ్ అద్వానీకి స్వర్ణం

భారతదేశపు ప్రముఖ క్యూయిస్ట్, పంకజ్ అద్వానీ కౌలాలంపూర్‌లో జరిగిన 2022 ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా తన కెరీరులో 25వ బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఏకపక్షంగా జరిగిన ఫైనల్‌లో మరో భారతీయుడు సౌరవ్ కొఠారీని 4-0తో ఓడించి వరుసగా ఐదవసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షద గరుడ్'కు కాంస్యం

బహ్రెయిన్‌లోని మనామాలో జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ హర్షదా గరుడ్ మహిళల 45 కిలోల కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్‌ 2022

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ యొక్క ఏడవ ఎడిషన్ అక్టోబర్ 11, 2022 న భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహిళల యూత్ ఫుట్‌బాల్ టోర్నమెంటుకు భారత్ తొలిసారి ఆతిధ్యం ఇస్తుంది. అక్టోబర్ 11 నుండి 30 అక్టోబర్ 2022 మధ్య జరగనున్న ఈ టోర్నమెంటుకు భువనేశ్వర్ (ఒడిశా), మార్గోవో (గోవా) నవీ ముంబై (మహారాష్ట్ర) నగరాలు వేదికలు కానున్నాయి.

ఈ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ యందు మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నమెంటులో ఆతిథ్య భారత్‌తో పాటు మొరాకో మరియు టాంజానియాలు మొదటిసారి అరంగేట్రం చేశాయి. చివరిగా 2018 లో నిర్వహించిన ఈ టోర్నమెంటులో స్పెయిన్ విజేతగా నిలిచింది.

భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్‌పై మూడు ఏళ్ళ నిషేధం

భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ డోపింగ్ ఉల్లంఘన కారణంగా మార్చి 29, 2022 నుండి మూడేళ్లపాటు అన్ని పోటీల నుండి నిషేధించబడినట్లు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (AIU) ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 7న పాటియాలాలో ఏఐయూ సేకరించిన శాంపిల్‌లో స్టానోజోలోల్ అనే నిషేధిత స్టెరాయిడ్‌ పాజిటివ్ రావడంతో ఈ ఏడాది మేలో తాత్కాలిక సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రస్తుతం అది ధ్రువీకరణ కావడంతో నిషేధం ఎదుర్కోనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఆమె 65.06 మీటర్ల జాతీయ రికార్డును నెలకొల్పడం ద్వారా కమల్‌ప్రీత్ కౌర్ పాపులర్ అయ్యారు.

ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రుద్రంక్ష్ పాటిల్'కు స్వర్ణం

కైరోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) రైఫిల్/పిస్టల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ యొక్క పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రుద్రంక్ష్ పాటిల్ స్వర్ణ పతకం సాధించాడు. దీనితో అభినవ్ బింద్రా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడుగా నిలిచాడు. ఈ విజయంతో 2024 పారిస్ ఒలింపిక్స్ యందు ఆడేందుకు బెర్త్ ఖరారు చేసుకున్నాడు.

మహిళల ఆసియా కప్ 2022 భారత్ కైవసం

టీ20 మహిళల ఆసియా కప్‌ 2022 ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంకపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా అత్యధిక మహిళల టీ20 ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకున్న రికార్డును మెరుగుపర్చుకుంది. మొత్తం 8 మహిళా ఆసియా కప్పులు నిర్వహించగా భారత్ 7 సార్లు విజేతగా నిలిచింది. మిగిలిన ఒక్కసారి 2018 లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది.

బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

భారత మాజీ క్రికెటర్ మరియు 1983 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) యొక్క 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానంలో త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అదే సమయంలో బీసీసీఐ సెక్రెటరీగా జైషా రెండవ టర్మ్ కొనసాగనున్నారు.

100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యర్రాజీ జాతీయ రికార్డు

బెంగళూరులో జరిగిన 61వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 12.82 సెకన్లలో 100 మీటర్ల హర్డిల్స్‌ రేస్ పూర్తిచేసిన మొదటి భారతీయ మహిళగా జ్యోతి యర్రాజీ నిలిచింది. 22 ఏళ్ల ఆంధ్ర క్రీడాకారిణి అయినా జ్యోతి గత నెలలో లాఫ్‌బరో అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో ఆమె నెలకొల్పిన 13.11 సెకన్ల రికార్డును కూడా అదిగిమించింది.

U23 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సజన్ భన్వాల్'కు కాంస్యం

అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 77 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సజన్ భన్వాల్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. స్పెయిన్‌లో జరిగిన ప్లే-ఆఫ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన డిమిట్రో వాసెట్స్కీని ఓడించడం ద్వారా అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ గ్రీకో-రోమన్ రెజ్లర్‌గా నిలిచాడు.

అదే విధంగా అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా అమన్ సెహ్రావత్ రికార్డు నెలకొల్పారు. ఫైనల్‌లో టర్కీ రెజ్లర్ అహ్మెట్ డుమాన్‌పై 12-4 తేడాతో 18 ఏళ్ల అమన్ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు.

ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 విజేతలుగా రంకిరెడ్డి & చిరాగ్ శెట్టి

భారత స్టార్ టెన్నిస్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 కిరీటాన్ని దక్కించుకున్నారు. అక్టోబర్ 30న ప్యారిస్‌లో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో చైనీస్ తైపీకి చెందిన లు చింగ్ యావో మరియు యాంగ్ పో హాన్‌లను ఓడించడం ద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి భారతీయ టెన్నిస్ జోడిగా రికార్డు నమోదు చేసారు.

Post Comment