50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు జనవరి 2024
Current Affairs Bits 2024 January

50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు జనవరి 2024

50 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు సమాదానాలు జనవరి 2024. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. ఇటీవలే హట్టి కమ్యూనిటీకి ఎస్టీ హోదా మంజూరు చేసిన రాష్ట్రం ఏది ?

  1. బీహార్
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. అస్సాం
  4. హిమాచల్ ప్రదేశ్
సమాధానం
4. హిమాచల్ ప్రదేశ్

2. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నూతన అధ్యక్షుడు ఎవరు ?

  1. ఫెలిక్స్ షిసెకెడి
  2. విలియం రూటో
  3. సిరిల్ రామఫోసా
  4. హకైందే హిచిలేమా
సమాధానం
1. ఫెలిక్స్ షిసెకెడి

3. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది?

  1. ఇండియా & మయన్మార్
  2. ఇండియా & ఆఫ్ఘనిస్తాన్
  3. ఇండియా & యూఏఈ
  4. ఇండియా & ఆస్ట్రేలియా
సమాధానం
3. ఇండియా & యూఏఈ

4. భారతదేశ మొట్టమొదటి ఆల్-గర్ల్స్ సైనిక్ స్కూల్‌ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

  1. తెలంగాణ (ములుగు)
  2. తమిళనాడు (రామేశ్వరం)
  3. జమ్మూ & కాశ్మీర్ (శ్రీనగర్)
  4. ఉత్తరప్రదేశ్ (బృందావన్‌)
సమాధానం
4. ఉత్తరప్రదేశ్ (బృందావన్‌)

5. ప్రభుత్వ కార్యక్రమాల డిజిటల్ యాక్సెస్ కోసం కే-స్మార్ట్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం ?

  1. కర్ణాటక
  2. గుజరాత్
  3. మహారాష్ట్ర
  4. కేరళ
సమాధానం
4. కేరళ

6. భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో గరిష్ట శిక్ష ఎన్నేళ్లు ?

  1. 7 సంవత్సరాలు
  2. 10 సంవత్సరాలు
  3. 5 సంవత్సరాలు
  4. 15 సంవత్సరాలు
సమాధానం
2. 10 సంవత్సరాలు

7. 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?

  1. నంద్ కిషోర్ సింగ్
  2. బీవీఆర్ సుబ్రహ్మణ్యం
  3. సుమన్ బేరీ
  4. అరవింద్ పనగారియా
సమాధానం
4. అరవింద్ పనగారియా

8. ఇస్రో తొలి ఎక్స్-రే పోలారిమీటర్‌ ప్రయోగం ఏ తేదీన నిర్వహించింది ?

  1. 1 డిసెంబర్ 2023
  2. 3 జనవరి 2024
  3. 1 జనవరి 2024
  4. 31 జనవరి 2023
సమాధానం
3. 1 జనవరి 2024

9. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ మెగా ప్రాజెక్ట్‌ అనేది దేనికి సంబంధించింది ?

  1. ఓషన్ నాలెడ్జ్ యాక్షన్ నెట్‌వర్క్
  2. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్
  3. రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్
  4. రిస్క్ నాలెడ్జ్-యాక్షన్ నెట్‌వర్క్
సమాధానం
3. రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్

10. పీఎం విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది ?

  1. జమ్మూ & కాశ్మీర్
  2. చండీగఢ్
  3. లడఖ్
  4. లక్షద్వీప్
సమాధానం
1. జమ్మూ & కాశ్మీర్.  

11. ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ పెన్షన్‌ల కింద అవ్వాతాతలకు ఎంత అందిస్తుంది  ?

  1. రూ. 2,500/-
  2. రూ. 2,750/-
  3. రూ. 3,000/-
  4. రూ. 3,500/-
సమాధానం
3. రూ. 3,000/-

12. విపత్తు ముందస్తు హెచ్చరిక కోసం రహత్ వాణి కేంద్రం ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. తమిళనాడు
  2. ఉత్తరాఖండ్
  3. ఒడిశా
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
4. ఉత్తరప్రదేశ్

13. అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏ ఉత్పత్తి కోసం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డు అందుకుంది ?

  1. అరకు కాఫీ
  2. ఉప్పాడ జమ్దానీ చీర
  3. పొందూరు కాటన్ చీరలు
  4. మంగళగిరి చేనేత
సమాధానం
1. అరకు కాఫీ

14. వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్ కోసం ఇటీవలే నామినేషన్ పొందిన భారతీయ నగరం ఏది ?

  1. భూపాల్ (మధ్యప్రదేశ్)
  2. ఇండోర్ (మధ్యప్రదేశ్)
  3. ఉదయపూర్ (రాజస్థాన్)
  4. పైవి అన్నీ సరైనవి
సమాధానం
4. పైవి అన్నీ సరైనవి

15. డిజిటల్ స్కెంజెన్ వీసాలు జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశం ఏది ?

  1. ఇంగ్లాండ్
  2. జర్మనీ
  3. ఫ్రాన్స్
  4. డెన్మార్క్
సమాధానం
3. ఫ్రాన్స్

16. ఇటీవలే మంచు చిరుతపులిని తమ జాతీయ జంతువుగా ప్రకటించిన ఆసియా దేశం ఏది ?

  1. బంగ్లాదేశ్
  2. మయన్మార్
  3. భూటాన్
  4. కిర్గిజిస్తాన్
సమాధానం
4. కిర్గిజిస్తాన్

17. తంగైల్ చీరలు ఏ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది ?

  1. కేరళ
  2. గుజరాత్
  3. ఆంధ్రప్రదేశ్
  4. పశ్చిమ బెంగాల్
సమాధానం
4.పశ్చిమ బెంగాల్

18. ఐఐటీ మద్రాస్ పరిశోధకులు కింది వాటిలో ఏ మొక్క నుండి క్యాన్సర్ ఔషధం కనుగొన్నారు ?

  1. టెర్మినలియా బెలెరికా
  2. నోథాపోడైట్స్ నిమ్మోనియానా
  3. ఎంబ్లికా అఫిసినాలిస్
  4. సరకా ఇండికా లిన్
సమాధానం
2. నోథాపోడైట్స్ నిమ్మోనియానా

19. మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ?

  1. కంచన్ చౌదరి భట్టాచార్య
  2. కిరణ్ బేడీ
  3. రష్మీ శుక్లా
  4. అర్చన రామసుందరం
సమాధానం
3. రష్మీ శుక్లా

20. కింది వాటిలో ఇటీవలే ఒడిశా నుండి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏది ?

  1. కోరాపుట్ కాల జీర రైస్
  2. డంగారియా శాలువ
  3. సిమిలిపాల్ కై చట్నీ
  4. పైవి అన్నీ సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

21. ఈ ఏడాది ఇండియా క్లీనెస్ట్ సిటీ అవార్డుల కింద టాప్ 5లో నిలిచిన తెలుగు సిటీ ఏది ?

  1. విజయవాడ
  2. హైదరాబాద్
  3. విశాఖపట్నం
  4. తిరుపతి
సమాధానం
3. విశాఖపట్నం (4వ స్థానం)

22. బిల్కిస్ బానో కేసు కింది వాటిలో ఏ సందర్భానికి సంబంధించింది ?

  1. 2002 గుజరాత్ అల్లర్లు
  2. 2023 మణిపూర్ హింస
  3. 1993 బొంబాయి అల్లర్లు
  4. 2020 ఢిల్లీ అల్లర్లు
సమాధానం
1. 2002 గుజరాత్ అల్లర్లు

23. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 విజేత ఎవరు ?

  1. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి
  2. రంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్
  3. మహమ్మద్ షమీ
  4. ఆప్షన్ 1& 2 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1& 2 సరైనవి

24. వుషు క్రీడా విభాగంలో 2023 అర్జున్ అవార్డు విజేత ఎవరు ?

  1. రీతు నేగి
  2. పుఖ్రంబం సుశీల చాను
  3. నౌరెమ్ రోషిబినా దేవి
  4. దివ్యకృతి సింగ్
సమాధానం
3. నౌరెమ్ రోషిబినా దేవి

25. చదరంగం విభాగంలో 2023 ద్రోణాచార్య అవార్డు గ్రహీత ?

  1. శివేంద్ర సింగ్
  2. ఆర్బీ రమేష్
  3. లలిత్ కుమార్
  4. మహావీర్ ప్రసాద్ సైనీ
సమాధానం
2. ఆర్బీ రమేష్

26. భారత జాత్యహంకార వ్యాఖ్యలపై ఇటీవలే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన దేశం ఏది ?

  1. శ్రీలంక
  2. మయన్మార్
  3. బంగ్లాదేశ్
  4. మాల్దీవులు
సమాధానం
4. మాల్దీవులు

27. పృథ్వీ విజ్ఞాన్ పథకం కింది వాటిలో దేనికి ఉద్దేశించబడింది ?

  1. సోలార్ విద్యుత్ అభివృద్ధి
  2. అంతరిక్ష పరిశోధనలు
  3. గ్రీన్ ఇంధనాల పరిశోధనలు
  4. ఎర్త్ సైన్స్ పరిశోధనలు
సమాధానం
4. ఎర్త్ సైన్స్ పరిశోధన  

28. నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ (నామ్) సమావేశాలు ఏ నగరంలో జరిగాయి ?

  1. దుబాయ్ (యూఏఈ)
  2. కంపాలా (ఉగాండా)
  3. ఢిల్లీ (ఇండియా)
  4. లండన్ (యూకే)
సమాధానం
2. కంపాలా (ఉగాండా) 

29. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక రచయత ఎవరు ?

  1. జనరల్ మనోజ్ పాండే
  2. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే
  3. జనరల్ బిపిన్ రావత్
  4. జనరల్ అనిల్ చౌహాన్
సమాధానం
2. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే

30. బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు ?

  1. 7వ సారి
  2. 3వ సారి
  3. 5వ సారి
  4. 2వ సారి
సమాధానం
3. 5వ సారి

31. ఇటీవలే ఇండియాతో గ్రీన్ ఫ్యూయల్స్ అలయన్స్ చొరవను ప్రకటించిన దేశం  ?

  1. ఆస్ట్రేలియా
  2. ఫ్రాన్స్
  3. డెన్మార్క్
  4. యూఏఈ
సమాధానం
3. డెన్మార్క్

32. ఇటీవలే మదీనాను సందర్శించిన మొట్టమొదటి ముస్లిమేతర భారతీయ మహిళ ఎవరు ?

  1. నిర్మలా సీతారాం
  2. సుప్రియా సూలే
  3. మహువా మోయిత్రా
  4. స్మృతి ఇరానీ
సమాధానం
4. స్మృతి ఇరానీ

33. నయీ సోచ్ నయీ కహానీ అనే రేడియో కార్యక్రమంను ప్రారంభించింది ఎవరు ?

  1. స్మృతి ఇరానీ
  2. నరేంద్ర మోడీ
  3. రాహుల్ గాంధీ
  4. సచిన్ టెండూల్కర్
సమాధానం
1. స్మృతి ఇరానీ

34. ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు ?

  1. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
  2. రిషి సునక్
  3. జార్జియా మెలోని
  4. గాబ్రియేల్ అట్టల్‌
సమాధానం
4. గాబ్రియేల్ అట్టల్‌

35. ఇటీవలే కుక్కల ఉత్పత్తి & అమ్మకాన్ని నిషేధించిన ఆసియా దేశం ఏది ?

  1. పాకిస్తాన్
  2. శ్రీలంక
  3. దక్షిణ కొరియా
  4. చైనా
సమాధానం
3. దక్షిణ కొరియా

36. డోర్‌స్టెప్ కార్గో పికప్ సర్వీస్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏది ?

  1. టీఎన్ఎస్‌టీసీ
  2. కేఎస్ ఆర్‌టీసీ
  3. టీఎస్ ఆర్‌టీసీ
  4. ఏపీఎస్‌ ఆర్‌టీసీ
సమాధానం
4. ఏపీఎస్‌ ఆర్‌టీసీ

37. భారతదేశంలో అతి పొడవైన వంతెన ఏది ?

  1. భూపేన్ హజారికా వంతెన
  2. మహాత్మా గాంధీ సేతు
  3. దిబాంగ్ నది వంతెన
  4. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్
సమాధానం
4.ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్

38. ఈక్వెస్ట్రియన్‌ గేమ్ కేటగిరిలో అర్జున అవార్డును అందుకున్న మొదటి భారతీయ మహిళ క్రీడాకారిణి ?

  1. పుఖ్రంబం సుశీల చాను
  2. దివ్యకృతి సింగ్
  3. నౌరెమ్ రోషిబినా దేవి
  4. రీతు నేగి
సమాధానం
2. దివ్యకృతి సింగ్

39. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ యెంత ?

  1. 55వ స్థానం
  2. 86వ స్థానం
  3. 80వ స్థానం
  4. 77వ స్థానం
సమాధానం
3. 80వ స్థానం

40. ఇటీవలే మహారాష్ట్ర ఏర్పాటు చేసిన అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ వేటికి ఉద్దేశించబడింది ?

  1. ఆసియా ఏనుగుల సంరక్షణ
  2. ఇండియన్ జెయింట్ స్క్విరెల్ సంరక్షణ
  3. పులుల సంరక్షణ
  4. కానిడ్ అడవి కుక్కల సంరక్షణ
సమాధానం
4. కానిడ్ అడవి కుక్కల సంరక్షణ

41. ఇటీవలే దావోస్‌లో జరిగిన నాల్గవ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశ లక్ష్యం ఏంటి ?

  1. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపు
  2. ఆఫ్గనిస్తాన్ యందు శాంతి స్థాపన
  3. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి స్థాపన
  4. పాలస్తీనాలో శాంతి స్థాపన
సమాధానం
3. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి స్థాపన

42. 2024లో ఐయూసీఎన్ రెడ్ లిస్టులోచేర్చబడ్డ ఇండియన్ జంతువు ?

  1. పిగ్మీ హాగ్
  2. పాండిచ్చేరి షార్క్
  3. హిమాలయన్ వోల్ఫ్
  4. అండమాన్ ష్రూ
సమాధానం
3. హిమాలయన్ వోల్ఫ్

43. భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ హోదాను పొందిన జాతీయ పార్కు ఏది ?

  1. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
  2. సరిస్కా టైగర్ రిజర్వ్
  3. గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్
  4. పెంచ్ నేషనల్ పార్క్
సమాధానం
4. పెంచ్ నేషనల్ పార్క్

44. ఇండియన్ ఆర్మీ సర్వశక్తి ఆపరేషన్ 2024 ఏ ప్రాంతంలో నిర్వహించారు ?

  1. మణిపూర్
  2. లడఖ్
  3. జమ్మూ & కాశ్మీర్
  4. పంజాబ్
సమాధానం
3. జమ్మూ & కాశ్మీర్

45. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

  1. తమిళనాడు
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఉత్తర ప్రదేశ్
  4. తెలంగాణ
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్

46. 2024లో భారతదేశపు సాంప్రదాయ భాషల్లో చోటు దక్కించుకున్న భాష ఏది ?

  1. పాళీ
  2. తమిళం
  3. ప్రాకృతం
  4. ఫార్సీ
సమాధానం
4. ఫార్సీ

47. దేశంలో సమగ్ర కుల గణనను నిర్వహించిన రెండవ రాష్ట్రం ఏది ?

  1. బీహార్
  2. పంజాబ్
  3. తమిళనాడు
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
4. ఆంధ్రప్రదేశ్ 

48. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన ఐదవ దేశం ఏది ?

  1. యూఏఈ
  2. రష్యా
  3. జపాన్
  4. ఇండియా
సమాధానం
3. జపాన్

49. 2024 గాను తెలుగు రాష్ట్రాల నుండి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు ?

  1. పద్మా సుబ్రహ్మణ్యం
  2. వెంకయ్య నాయుడు
  3. కొణిదెల చిరంజీవి
  4. ఆప్షన్ 2 & 3 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 2 & 3 సరైనవి

50. ఇటీవలే భారతరత్న అవార్డు అందుకున్న కర్పూరీ ఠాకూర్‌ ఏ రాష్ట్రానికి చెందివారు ?

  1. ఉత్తరప్రదేశ్
  2. పశ్చిమబెంగాల్
  3. బీహార్
  4. గుజరాత్
సమాధానం
3. బీహార్

Post Comment