ఎల్‌శాట్‌ ఇండియా 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Exams to study abroad

ఎల్‌శాట్‌ ఇండియా 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు, పరీక్ష తేదీ

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌శాక్‌) అనేది యూఎస్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఏటా ప్రపంచ వ్యాప్తంగా యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి అనేక దేశాల్లో 60 వేలకు పైగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన న్యాయ విద్య ప్రవేశాలను కల్పిస్తుంది.

ఎల్‌శాక్‌ సంస్థ నిర్వహించే ఎల్‌శాట్‌ ప్రవేశ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 920 సెంటర్లలో జరుగుతుండగా, దానికి లక్ష నలభైవేలకు పైగా అభ్యర్థులు హాజరౌతున్నారు. ఎల్‌శాట్‌ ఇండియా అర్హుతతో ఇండియాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ లా ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్ పొందొచ్చు.

Exam Name LSAT INDIA 2023
Exam Type Eligibility
Eligibility For LLB, LLM
Exam Date 11 June 2023
Exam Duration 2.20 Hours
Exam Level National Level

లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ 2009 నుండి ఇండియాలో తమ సేవలను అందిస్తుంది. ఇండియా లా కాలేజీలకు అనుగుణంగా ఎల్‌శాట్‌ ఇండియా పేరుతో ఎల్ఎల్ఎం, ఎల్ఎల్‌బి కోర్సులలో అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్షా నిర్వహించిన మొదటి ఏడాది దాదాపు 30 వేలకు పైగా లా ఆశావహులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

2019 నుండి ఎల్‌శాక్‌ ఇండియా విద్యార్థులకు అంతర్జాతీయ లా యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.ఎల్‌శాట్‌ ఇండియాలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థికి 4 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు.

ఎల్‌శాక్‌ కోర్సులు

  • బీబీఏ ఎల్ఎల్‌బి : బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మిస్ట్రేషన్ అండ్ లా (5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు)
  • బీఏ ఎల్ఎల్‌బి : బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లా  (5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు)
  • బీకామ్ ఎల్ఎల్‌బి : బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అండ్ లా (5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు)
  • బీఎస్సీ ఎల్ఎల్‌బి : బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ లా (5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు)
  • బీటెక్ ఎల్ఎల్‌బి : బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ లా (6 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సు)
  • ఎల్ఎల్‌బి : బ్యాచిలర్ ఆఫ్ లా (3 ఏళ్ళ కోర్సు)
  • ఎల్ఎల్ఎం : మాస్టర్ ఆఫ్ లా ( 1 లేదా 2 ఏళ్ళు )

ఎల్‌శాట్‌ ద్వారా అడ్మిషన్ పొందే యూనివర్శిటీలు

  • ఆసియన్ లా కాలేజ్ (www.alc.edu.in)
  • ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ & రీసెర్చ్ (www.isbrbangalore.in/)
  • ఇండోర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లా (www.indoreinstituteoflaw.org)
  • అర్కా జైన్ యూనివర్సిటీ (www.arkajainuniversity.ac.in)
  • శోబిత్ యూనివర్సిటీ (www.shobhituniversity.ac.in)
  • వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ (www.vgu.ac.in)
  • కళింగ యూనివర్సిటీ (www.kalingauniversity.ac.in)
  • మోడీ యూనివర్సిటీ (www.modyuniversity.ac.in)
  • జిస్ యూనివర్సిటీ (www.jisuniversity.ac.in)
  • గీతం స్కూల్ ఆఫ్ లా (www.vspgsl.gitam.edu)
  • లవ్లీ ప్రొఫిషనల్ యూనివర్సిటీ (www.lpu.in)

ఎల్‌శాట్‌ ఎలిజిబిలిటీ

  • ఎల్ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత గ్రూపుల్లో ఇంటర్మీడియట్/10+2 పూర్తిచేసి ఉండాలి
  • ఎల్ఎల్ఎం కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎల్ఎల్‌బి లేదా దానికి సమానమైన డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి

ఎల్‌శాట్‌ ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ 10/11/2023
దరఖాస్తు తేదీలు 26 మే 2023
ఎగ్జామ్ తేదీ  8, 9, 10, 11 జూన్ 2023
ఫలితాలు జులై 2023

ఎల్‌శాట్‌ రిజిస్ట్రేషన్

ఎల్‌శాట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ఆసక్తి అభ్యర్థులు లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ అధికారిక (www.discoverlaw.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

దరఖాస్తు రకం/ ఎగ్జామ్ సెంటర్లు దరఖాస్తు ఫీజు జీఎస్టీ తో కలుపుకుని
 ఎల్‌శాట్‌ ఇండియా 3800/- 4484/-
 ఎల్‌శాట్‌ ఇండియా (మెటీరియల్స్ ప్యాకేజి) 4700/- 5546/-
 ఎగ్జామ్ సెంటర్లు విజయవాడ హైదరాబాద్

ఎల్‌శాట్‌ ఎగ్జామ్ నమూనా

ఎల్‌శాట్‌ కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 2 గంటల 20 నిముషాల నిడివితో జరుగుతుంది. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. అందులో సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 1 నుండి 3 మార్కులు కేటాయిస్తారు.

నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. ఎల్ఎల్ఎం, ఎల్ఎల్‌బి మరియు పీహెచ్డీ ప్రోగ్రామ్ లకు సంబంధించి వేరు వేరు ప్రశ్న పత్రాలు ఇవ్వబడతయి. ఇందులో ఉండే ప్రశ్నల సంఖ్యా, సిలబస్ మినహా రెండు పరీక్షలు ఒకేరీతిలో నిర్వహించబడతాయి.

క్వశ్చన్ పేపర్ అభ్యర్థి యొక్క విశ్లేషణ సామర్థ్యంతో పాటుగా కఆలోచన పరిధిని పరీక్షించే విధంగా ఉంటుంది. ఈ పరీక్షలో అనలాటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మరియు రీడింగ్ కంఫ్రహెన్షన్ నుండి మొత్తం 92 ప్రశ్నలు ఇవ్వబడతయి.

 సిలబస్ ప్రశ్నలు సమయం
అనలిటికల్ రీజనింగ్ 23 2.20 గంటలు
లాజికల్ రీజనింగ్ (1) 22
లాజికల్ రీజనింగ్ (2) 23
రీడింగ్ కంఫ్రహెన్షన్ 24
మొత్తం 92 ప్రశ్నలు

ఎల్‌శాట్‌ యందు ఒక ప్రశ్నకు ఎన్ని మార్కులు అనేది ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ కొన్ని అంచనాల ప్రకారం ప్రశ్నల స్థాయి ఆధారంగా 1 నుండి 3 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు కనుక, అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం చేసే అవకాశం ఉంటుంది. ఎల్‌శాట్‌ యందు 120 నుండి 150 మార్కులు స్కోర్ సాధించిన వారు మంచి పెర్సెంటైల్ ర్యాంక్ పొందే అవకాశం ఉంటుంది.

Post Comment