జపాన్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు
Abroad Education

జపాన్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు

ఆసియా నుండి విదేశీ విద్యార్థులను ఆకర్షించే దేశాల జాబితాలో జపాన్ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో అమెరికా, చైనాల తర్వాత నెంబర్ 3 లో జపాన్ ఉంది. ప్రపంచంలో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలలో జపాన్ ఒకటి, ఉత్తమ విద్యావ్యవస్థను కలిగిన ఈ దేశం ఉన్నత విద్యా విధానంలో ప్రపంచ దేశాలకు ఆదర్శప్రయంగా నిలుస్తుంది. ప్రపంచం ఉపయోగించే 30% మానవ అవసరాలను జపానీస్ కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి. ఎలెక్ట్రానిక్, వాహన రంగాల మానుఫ్యాక్చరింగులో, కొన్ని దశాబ్దాలుగా జపాన్ నెంబర్ 1 గా ఉంది. ఇలా అభివృద్ధి చెందిన దేశం, విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంది.

Advertisement

ఉన్నత విద్య కోసం ఏటా 170 కి పైగా దేశాల నుండి  1,50,000 లకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు  జపానులో అడుగు పెడుతున్నారు. ఇండియన్ విద్యార్థులు కూడా ఈ మధ్య కాలంలో జపాన్ లో ఉన్నత విద్య చేసేందుకు ఆకర్షితులు అవుతున్నారు. గత నాలుగు ఐదేళ్లలో ఏటా 10 నుండి 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం జపాన్ బాట పట్టారు. భారతీయతను పోలివుండే ఇక్కడ సాంప్రదాయ జీవన విధానం, అమెరికా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే 10 నుండి 15 లక్షలతో ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే అవకాశం ఉండటం, ఎడ్యుకేషన్ పూర్తయ్యాక జపాన్ కంపెనీలలో స్థిరపడే వెసులుబాటు ఉండటం వంటివి అంశాలు భారతీయ విద్యార్డులను జపాన్ వైపు ఆకర్షితమయ్యేలా చేస్తున్నాయి.

జపాన్ విద్యావ్యవస్థ

జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 6+3+3 = 12 పద్దతిలో ఉంటుంది. మొదటి ఆరు ఏళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, తర్వాత 3 ఏళ్ళు లోయర్ సెకండరీ పాఠశాల విద్యను, చివరి మూడేళ్లు అప్పర్ సెకండరీ పాఠశాల విద్యను అందిస్తారు. 12 సంవత్సరాల పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఉన్నత విద్య ప్రారంభమవుతుంది. ఉన్నత విద్య కోసం జపానుకు వెళ్లే విదేశీ విద్యార్థులు ఐదు రకాల యూనివర్శిటీలలో అడ్మిషణలు కల్పిస్తారు. 1) సాంకేతిక కళాశాలలు, 2) ప్రొఫెషనల్ ట్రైనింగ్ కాలేజీలు (ప్రత్యేక శిక్షణా కళాశాలల పోస్ట్ సెకండరీ కోర్సు), 3) జూనియర్ కళాశాలలు, 4) విశ్వవిద్యాలయాలు (అండర్ గ్రాడ్యుయేట్) మరియు 5) గ్రాడ్యుయేట్ పాఠశాలలు.

కోర్సు ఎంపిక

విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తున్నాము అంటే, దానికి సంబంధించి బలమైన కారణం ఉండాలి. అందులో ప్రధానమైనది మీరు ఎంపిక చేసుకునే స్టడీ ప్రోగ్రాం. మెజారిటీ విదేశీ యూనివర్సిటీలు స్పెషలైజ్డ్ కోర్సులను ఎంపిక చేసుకునే విద్యార్థులకు మాత్రమే త్వరితగతిన అడ్మిషన్లు కల్పిస్తాయి. ఈ కోర్సు కోసం ఇంత దూరం వస్తున్నాడా అనే కోర్సులకు అడ్మిషన్లు కల్పించావు. వీసా జారీచేసే అధికారులు కూడా దీని కోసమే ఎక్కువ వాకాబు చేస్తారు. ఇదంతా ఉన్నత విద్య పేరుతో, విహారానికి వచ్చే విద్యార్థులను జల్లెడపట్టే ప్రక్రియలో భాగం. కావున మీరు ఎంపిక చేసుకునే కోర్సు. దానికి చెందిన భవిష్యత్ ప్రణాళిక పై మీకు స్ఫష్టమైన అవగాహనా ఉండాలి.

జపాన్ యూనివర్శిటీలు మెడిసిన్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఆర్కిటెక్చర్, అగ్రికల్చర్, సోషియాలజీ, ఇన్ఫర్మేషన్ సైంక్, వెల్ఫేర్, డిజైనింగ్, ఆర్ట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ , గేమ్స్, యానిమేషన్ వంటి అంశాలలో అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, అడ్వాన్సుడ్ డిప్లొమా, డాక్టరేట్ కోర్సులు అందిస్తున్నాయి. ఏఈ కోర్సుల వ్యవధి రెండు నుండి గరిష్టంగా 5 ఏళ్ళు ఉంటాయి. వీటితో పాటుగా షార్ట్ టర్మ్ స్టూడెంట్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్స్, జాపనీస్ లాంగ్వేజ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

జపాన్ యూనివర్శిటీల అడ్మిషన్ కోసం దరఖాస్తు

జపనీస్ యూనివర్శిటీలలో అడ్మిషన్ పొందాలంటే అడ్మిషన్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ (EJU) ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిని జాసో (జపాన్ స్టూడెంట్ సర్వీసెస్ ఆర్గనైజేషన్) 2002 లో ప్రవేశపెట్టింది. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం జూన్ మరియు నవంబర్లలో రెండుసార్లు నిర్వహిస్తారు. జపాన్ కాకుండా, జపాన్ వెలుపల 17 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇండియాలో ఈ పరీక్షా కేంద్రం ఢిల్లీలో అందుబాటులో ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత స్కోరు ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.

వీటిపాటుగా TOEFL, IELTS, or TOEIC, L&R score లలో ఏదోకటి కలిగి ఉండాలి. కొన్ని యూనివర్శిటీలు జాపనీస్ లాంగ్వేజ్ ప్రోఫిసెన్సీ సర్టిఫికెట్  కూడా పరిగణలోకి తీసుకుంటాయి.

జపాన్ స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియ

జపాన్ స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసే ముందు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ నుండి సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ (COE) పొందాల్సి ఉంటుంది. జపాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, మీరు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీని సంప్రదించడం ద్వారా మీ జపాన్ రాకకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు డాక్యూమెంట్స్ రూపంలో అందించాల్సి ఉంటుంది. వివరాలు ఖచ్చితంగా ఉంటె జపాన్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ద్వారా అనుమతి జారీచేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు కనీసం రెండు నుండి 3 నెలలు పడుతుంది.

సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ జారీ అయినా వెంటనే సంబంధిత ధ్రువపత్రాన్ని యూనివర్సిటీ ద్వారా మీకు అందిస్తారు. COE సహాయంతో మీకు దగ్గరలో ఉండే జపాన్ వీసా సెంటరులో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా దరఖాస్తు రుసుము చెల్లించకా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ డేటా సేకరణ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. సంబంధిత తేదీలలో, అవసరమయ్యే డాకుమెంట్స్ లతో, వీసా సెంటరులో హాజరుకావాల్సి ఉంటుంది. వీసా అధికారి అన్ని వివరాలు పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటె రెండు నుండి మూడు వారాలలో వీసా జారీ చేస్తారు.

జపాన్ స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము

Single-entry visa 3,000 Yen
Double-entry or multiple-entry visa 6,000 Yen
Transit Visa 700 Yen

వీసా ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్

  • ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ (COE).
  • కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
  • 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
  • నేర చరిత్ర లేనట్లు police certificates.

5 Most recognized schools in Japan

  1. The University of Tokyo
  2. Kyoto University
  3. Tokyo Institute of Technology
  4. Tohoku University
  5. Osaka University

ఉపయోగపడే వెబ్‌సైట్లు

Cost of study in Japan

యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోల్చుకుంటే జపాన్ స్టడీ బడ్జెట్ 50% నుండి 60% తక్కువ ఉంటుంది. జపాన్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను 4 నుండి 5 లక్షల రూపాయల వరకు, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ 5 నుండి  8లక్షల లోపు ఖర్చుతో పూర్తిచేయొచ్చు. వీసా చార్జీలు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే చాల తక్కువ, అలానే నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ కూడా దాదాపు భారతీయ నెలవారి బడ్జెట్ మాదిరిగానే వుంటుంది. సాధారణ ఇండియన్ ప్రీమియం ఇనిస్టిట్యూట్ పెట్టె ఖర్చుతో జపాన్లో ఉన్నత విద్య పూర్తిచేయొచ్చు.

విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే జపాన్ ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.

Study program Average annual fee
Undergraduate program 4 నుండి 5 లక్షల వరకు
Postgraduate master's degree 5 నుండి 10 లక్షల వరకు
Doctoral degree  6 నుండి 8 లక్షల వరకు
Management programs  10 నుండి 15 లక్షల వరకు
Living expenses Average Budget 
Accommodation 3 నుండి 4 లక్షలు
Living costs నెలకు 20 వేల వరకు
visa and permit గరిష్టంగా 6000 వరకు
Health & insurance లక్ష రూపాయలు వరకు

Scholarships & Education Loans

Advertisement

Post Comment