ఏయూ దూరవిద్య యూజీ కోర్సులు – అడ్మిషన్లు & ట్యూషన్ ఫీజులు
Distance Education

ఏయూ దూరవిద్య యూజీ కోర్సులు – అడ్మిషన్లు & ట్యూషన్ ఫీజులు

ఆంధ్ర యూనివర్సిటీ, దూరవిద్య ద్వారా బీఏ, బీకామ్, బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీలను ఆఫర్ చేస్తుంది. మూడేళ్ళ నిడివితో అందిస్తున్న ఈ కోర్సులకు మొదటి ఏడాది ప్రవేశాలతో పాటుగా, లాటరల్ ఎంట్రీ ద్వారా మధ్యలో ఆపేసిన బ్యాచిలర్ డిగ్రీలను పూర్తి చేసేందుకు రెండు మరియు మూడవ ఏడాదిలలో కూడా ప్రవేశం కల్పిస్తుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఏటా జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో నిర్వహిస్తుంది.

Advertisement

ఏయూ దూరవిద్య బీఏ కోర్సుల సమాచారం

దూరవిద్య ద్వారా వివిధ ఆర్ట్స్ సబ్జెక్టుల కాంబినేషన్స్ సంబంధించి దాదాపు 13 రకాల బీఏ డిగ్రీలను ఏయూ ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులు మూడేళ్ల నిడివితో అందిస్తుంది. అలానే జనరల్ డిగ్రీలను మధ్యలో నిలిపేసిన అభ్యర్థులకు కరస్పాండెన్స్ విధానం ద్వారా ఆ డిగ్రీలను పూర్తిచేసే అవకాశం కల్పిస్తుంది. కోర్సులు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

బీఏ దూరవిద్య డిగ్రీలో జనరల్ డిగ్రీల మాదిరి గానే పార్ట్ 1 లో లాంగ్వేజ్ పేపర్లు, పార్ట్ 2 యందు 3 ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. వీటికి అదనంగా కొన్ని ఫౌండేషన్ పేపర్లు జోడించబడతాయి. వీటికి సంబంధించిన పబ్లిక్ పరీక్షలను ఏడాది చివరిలో ఒక్కో పేపర్ 3 గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో కనీసం 35 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణతలగా పరిగణిస్తారు.

ఏయూ దూరవిద్య బీఏ చేసేందుకు అర్హతలు

  • ఇంటర్ (10+2) పూర్తిచేసి ఉండాలి.
  • ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తిచేసిన కూడా అర్హులు
  • మూడేళ్ళ డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 1 లేదా 2 ఏళ్ళ ఫ్రీ యూనివర్సిటీ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు.
  • లాటరల్ ఎంట్రీ  ద్వారా రెండో ఏడాదిలో చేరేందుకు మొదటి ఏడాది రెగ్యులర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  • లాటరల్ ఎంట్రీ  ద్వారా మూడో ఏడాదిలో చేరేందుకు రెండేళ్ల రెగ్యులర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి

ఏయూ దూరవిద్య బీఏ కోర్సు స్వరూపం

మొదటి ఏడాది ద్వితీయ ఏడాది తృతీయ ఏడాది
పార్ట్ I ఇంగ్లీష్
తెలుగు/హిందీ/సంస్కృతం
ఫౌండేషన్ కోర్సు I
ఇంగ్లీష్
తెలుగు/హిందీ/సంస్కృతం
ఫౌండేషన్ కోర్సు II
పార్ట్ II పేపర్ I - మెయిన్ 1
పేపర్ I - మెయిన్ 2
పేపర్ I - మెయిన్ 3
కంప్యూటర్ కోర్సు
ఎన్విరాన్మెంటల్ స్టడీస్
పేపర్ II - మెయిన్ 1
పేపర్ II - మెయిన్ 2
పేపర్ I1 - మెయిన్ 3
కంప్యూటర్ కోర్సు
పేపర్ III & IV  - మెయిన్ 1
పేపర్ III  & IV- మెయిన్ 2
పేపర్ III  & IV- మెయిన్ 3
కంప్యూటర్ కోర్సు

ఏయూ దూరవిద్య బీఏ సబ్జెక్టు కాంబినేషన్లు

1 హిస్టరీ  ఎకనామిక్స్ పొలిటిక్స్
2 హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటిక్స్
3 హిస్టరీ  ఎకనామిక్స్ తెలుగు
4 హిస్టరీ పొలిటిక్స్ ఇంగ్లీష్
5 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటిక్స్ ఇంగ్లీష్
6 ఎకనామిక్స్ పొలిటిక్స్ ఇంగ్లీష్
7 హిస్టరీ పొలిటిక్స్ తెలుగు
8 హిస్టరీ పొలిటిక్స్ సోషియాలజీ
9 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటిక్స్ సోషియాలజీ
10 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటిక్స్ ఎకనామిక్స్
11 హిందీ హిస్టరీ పొలిటిక్స్
12 పొలిటిక్స్  ఎకనామిక్స్ జాగ్రఫీ
13  పొలిటిక్స్  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ

ఏయూ దూరవిద్య బీఏ ట్యూషన్ ఫీజులు

డిగ్రీ ఏడాది ట్యూషన్ ఫీజు
మొదటి ఏడాది 3,700/-
ద్వితీయ ఏడాది 1,700/-
తృతీయ ఏడాది 1,700/-
మొత్తం  7,100/-

ఏయూ దూరవిద్య బీకామ్ కోర్సుల సమాచారం

ఏయూ మూడేళ్ళ నిడివితో బీకామ్ దూరవిద్య కోర్సును  అందిస్తుంది. అలానే జనరల్ డిగ్రీలను మధ్యలో నిలిపేసిన అభ్యర్థులకు కరస్పాండెన్స్ విధానం ద్వారా ఆ డిగ్రీలను పూర్తిచేసే అవకాశం కల్పిస్తుంది. కోర్సులు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

బీకామ్ దూరవిద్య డిగ్రీలో జనరల్ డిగ్రీల మాదిరి గానే పార్ట్ 1 లో లాంగ్వేజ్ పేపర్లు, పార్ట్ 2 యందు 4 ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. వీటికి అదనంగా కొన్ని ఫౌండేషన్ పేపర్లు జోడించబడతాయి. వీటికి సంబంధించిన పబ్లిక్ పరీక్షలను ఏడాది చివరిలో ఒక్కో పేపర్ 3 గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో కనీసం 35 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణతలగా పరిగణిస్తారు.

ఏయూ దూరవిద్య బీకామ్ చేసేందుకు అర్హతలు

  • ఇంటర్ (10+2) పూర్తిచేసి ఉండాలి.
  • ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పూర్తిచేసిన కూడా అర్హులు
  • మూడేళ్ళ డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 1 లేదా 2 ఏళ్ళ ఫ్రీ యూనివర్సిటీ కోర్సులు పూర్తిచేసిన వారు కూడా అర్హులు.
  • లాటరల్ ఎంట్రీ  ద్వారా రెండో ఏడాదిలో చేరేందుకు మొదటి ఏడాది రెగ్యులర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
  • లాటరల్ ఎంట్రీ  ద్వారా మూడో ఏడాదిలో చేరేందుకు రెండేళ్ల రెగ్యులర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి

ఏయూ దూరవిద్య బీకామ్ కోర్సు స్వరూపం

మొదటి ఏడాది పార్ట్ I ఇంగ్లీష్
తెలుగు/హిందీ/సంస్కృతం
ఫౌండేషన్ కోర్సు I
పార్ట్ II ఫైనాన్సియల్ అకౌంటింగ్
బిజినెస్ ఎకనామిక్స్
బిజినెస్ ఆర్గనైజషన్ & మానేజ్మెంట్ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
కంప్యూటర్ కోర్సు
ద్వితీయ ఏడాది పార్ట్ I ఇంగ్లీష్
తెలుగు/హిందీ/సంస్కృతం
పార్ట్ II ఎన్విరాన్మెంటల్ స్టడీస్
ఫైనాన్సియల్ అకౌంటింగ్
బిజినెస్ స్టాటిస్టిక్స్
ఫైనాన్సియల్ సర్వీస్ & బ్యాంకింగ్ ఇన్సూరెన్స్
కంప్యూటర్ కోర్సు
తృతీయ ఏడాది పార్ట్ I ఫౌండేషన్ కోర్సు II
పార్ట్ II కార్పొరేట్ అకౌంటింగ్
కాస్ట్ & మానేజ్మెంట్ అకౌంటింగ్
బిజినెస్ లా
ఆడిటింగ్
అకౌంటింగ్ I
అకౌంటింగ్ II

ఏయూ దూరవిద్య బీకామ్ ట్యూషన్ ఫీజులు

డిగ్రీ ఏడాది ట్యూషన్ ఫీజు
మొదటి ఏడాది 4,400/-
ద్వితీయ ఏడాది 2,000/-
తృతీయ ఏడాది 2,000/-
మొత్తం  8,400/-

'బీకామ్ కస్టమర్ సర్వీస్ మానేజ్మెంట్ - ఏడాదికి 20,000/- (మొత్తం మూడేళ్లకు 80,000/-)

ఏయూ దూరవిద్య బీఎస్సీ కోర్సుల సమాచారం

ఏయూ మూడేళ్ళ నిడివితో బీఎస్సీ మ్యాథ్స్, బయాలజీ సంబంధించి దూరవిద్య కోర్సును అందిస్తుంది. కోర్సులు తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి.

బీఎస్సీ దూరవిద్య డిగ్రీలో జనరల్ డిగ్రీల మాదిరి గానే పార్ట్ 1 లో లాంగ్వేజ్ పేపర్లు, పార్ట్ 2 యందు 3 ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. వీటికి అదనంగా కొన్ని ఫౌండేషన్ పేపర్లు జోడించబడతాయి. వీటికి సంబంధించిన పబ్లిక్ పరీక్షలను ఏడాది చివరిలో ఒక్కో పేపర్ 3 గంటల నిడివితో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో కనీసం 35 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణతలగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది 50 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది.

ఏయూ దూరవిద్య బీకామ్ చేసేందుకు అర్హతలు

  • బీఎస్సీ ఎంపీసీ కోర్సులకు ఇంటర్ (10+2) ఎంపీసీ పూర్తిచేసి ఉండాలి.
  • బీఎస్సీ సీబీజీ కోర్సులకు ఇంటర్ (10+2) బైపీసీ పూర్తిచేసి ఉండాలి.

ఏయూ దూరవిద్య బీఎస్సీ కోర్సు స్వరూపం (ఎంపీసీ & సీబీజీ)

మొదటి ఏడాది పార్ట్ I ఇంగ్లీష్
తెలుగు/హిందీ/సంస్కృతం
ఫౌండేషన్ కోర్సు I
పార్ట్ II మ్యాథమెటిక్స్ (పేపర్ I & ప్రాక్టికల్ I )
ఫిజిక్స్ (పేపర్ I & ప్రాక్టికల్ I )
కెమిస్ట్రీ (పేపర్ I & ప్రాక్టికల్ I )
బోటనీ (పేపర్ I & ప్రాక్టికల్ I )
జూవాలిజి (పేపర్ I & ప్రాక్టికల్ I )
కంప్యూటర్ సైన్స్ (పేపర్ I & ప్రాక్టికల్ I )
స్టాటిస్టిక్స్ (పేపర్ I & ప్రాక్టికల్ I )
ఎకనామిక్స్ (పేపర్ I & ప్రాక్టికల్ I )
జాగ్రఫీ (పేపర్ I & ప్రాక్టికల్ I )
కంప్యూటర్ కోర్సు
ద్వితీయ ఏడాది పార్ట్ I ఇంగ్లీష్
తెలుగు/హిందీ/సంస్కృతం
పార్ట్ II ఎన్విరాన్మెంటల్ స్టడీస్
మ్యాథమెటిక్స్ (పేపర్ II & ప్రాక్టికల్ II )
ఫిజిక్స్ (పేపర్ II & ప్రాక్టికల్ II )
కెమిస్ట్రీ (పేపర్ II & ప్రాక్టికల్ II )
బోటనీ (పేపర్ II & ప్రాక్టికల్ II )
జూవాలిజి (పేపర్ II & ప్రాక్టికల్ II )
కంప్యూటర్ సైన్స్ (పేపర్ II & ప్రాక్టికల్ II )
స్టాటిస్టిక్స్ (పేపర్ II & ప్రాక్టికల్ II )
ఎకనామిక్స్ (పేపర్ II & ప్రాక్టికల్ II )
జాగ్రఫీ (పేపర్ II & ప్రాక్టికల్ II )
కంప్యూటర్ కోర్సు
తృతీయ ఏడాది పార్ట్ I ఫౌండేషన్ కోర్సు II
పార్ట్ II మ్యాథమెటిక్స్ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
ఫిజిక్స్ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
కెమిస్ట్రీ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
బోటనీ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
జూవాలిజి (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
కంప్యూటర్ సైన్స్ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
స్టాటిస్టిక్స్ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
ఎకనామిక్స్ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )
జాగ్రఫీ (పేపర్ III & IV - ప్రాక్టికల్ III & IV )

ఏయూ దూరవిద్య బీఎస్సీ సబ్జెక్టు కాంబినేషన్లు

1 మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ
2 మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్
3 మ్యాథమెటిక్స్  స్టాటిస్టిక్స్ కంప్యూటర్స్
4 మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్
5 మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ జాగ్రఫీ
6 మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ జాగ్రఫీ
7 కెమిస్ట్రీ బోటనీ జువాలజీ

ఏయూ దూరవిద్య బీఎస్సీ ట్యూషన్ ఫీజులు

డిగ్రీ ఏడాది ట్యూషన్ ఫీజు
మొదటి ఏడాది 5,000/- (సీబీజెడ్ 6000/-)
ద్వితీయ ఏడాది 4,000/-
తృతీయ ఏడాది 4,000/-
మొత్తం  13,000/-

Advertisement

Post Comment