Advertisement
దిక్ష పోర్టల్ : ఉచిత సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు
Online Education Useful websites

దిక్ష పోర్టల్ : ఉచిత సీబీఎస్ఈ, ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు

దిక్ష పోర్టల్ పాఠశాల విద్యకు సంబంధించి స్టూడెంట్స్ మరియు టీచర్స్ మధ్య నాలెడ్జ్ షేరింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం. దీన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) సహాయంతో భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రూపొందించాయి.

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి ఓపెన్ ఆన్లైన్ లెర్నింగ్ కంటెంట్ అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఉపాధ్యాయులకు వృత్తి పరమైన నైపుణ్యం పెంచే కంటెంటుతో పాటుగా స్టేట్, సెంట్రల్ సెకండరీ బోర్డుకు చెందిన 1 నుండి 12 వ తరగతి అకాడమిక్  పుస్తకాలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతుంది.

ఇంగ్లీష్, హిందీతో పాటుగా మరో పది భారతీయ భాషల్లో ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈ, స్టేట్ బోర్డులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తుంది. దిక్ష లెర్నింగ్ కంటెంట్ వెబ్సైటులో కాకుండా మొబైల్ యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఈ చిన్న మొబైల్ యాప్ ద్వారా మీ పాఠశాల విద్యకు సంబంధించిన పూర్తి డిజిటల్ కంటెంట్ మీరు పొందొచ్చు.

ఈ లెర్నింగ్ వేదికను ప్రతి రోజు 50 వేలకు పైగా విద్యార్థులు సందర్శిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో దేశ వ్యాప్తంగా ఎడ్యుకేషన్ రంగం మూసుకుపోయినా..దిక్ష లాంటి ఆన్‌లైన్ లెర్నింగ్ వేదికలు విద్యార్థులకు యెంతగానో ఉపయోగపడ్డాయి.

దిక్ష పాఠశాల విద్యార్థులకు సంబంధించి మూడు ఆన్లైన్ కోర్సులను అందిస్తుంది. అందులో న్యూట్రషన్ అండ్ సప్లయింగ్ సిస్టం, ఎలిమెంటరీ లాంగ్వేజ్ కోర్సు, కాపీ ఆఫ్ ఎర్లీ రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ డెవలప్మెంట్ వంటివి ఉన్నాయి. అలానే ఉపాధ్యాయలకు వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు, ఆధునిక టీచింగ్ టెక్నిక్స్ అందుకేందుకు దాదాపు 230 కోర్సులు అందుబాటులో ఉంచింది.diskha courses