ఈ స్కాలర్షిప్ స్కీమ్ కింద డిగ్రీ మరియు పీజీ పూర్తిచేసిన డిజాబిలిటీ విద్యార్థులకు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సి, ఆర్‌ఆర్‌బి, బ్యాంకింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటుగా జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్ వంటి ప్రవేశ మరియు అర్హుత పరీక్షలకు పూర్తిస్థాయి ఉచిత కోచింగ్ అందిస్తుంది.
ఈ ఉచిత కోచింగ్ కేంద్ర, రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రభుత్వాల ఆదీనంలో ఉండే కోచింగ్ ఇనిస్టిట్యూట్లు, స్టడీ సెంటర్లతో పాటుగా, యూనివర్సిటీలు, డ్రీమ్డ్ వర్సిటీలు మరియు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ కోచింగ్ సంస్థలు, ఎన్జిఓలు సహాయంతో అందిస్తారు.
స్కాలర్షిప్ పేరు | ఫ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ స్కీమ్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ |
ఎవరు అర్హులు | డిగ్రీ మరియు పీజీ పూర్తిచేసిన డిజాబిలిటీ విద్యార్థులు |
దరఖాస్తుకు ఆఖరు తేదీ | 15-01-2022 |
ఈ పథకం పరిధిలో అర్హుత సాధించిన విద్యార్థులకు ఏడాది ఉచిత కోచింగుతో పాటుగా ప్రతినెలా స్టైపెండ్ అందిస్తారు. ఈ కోచింగ్ గరిష్టంగా 12 నెలలు అందిస్తారు. ఈ కోచింగ్ అదనంగా ఇంకో ఏడాది విద్యార్థి అవసరం అనుకుంటే దాన్ని తిరిగి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హుత పొందిన విద్యార్థులు 85 శాతం హాజరు నామోదు చేయాల్సి ఉంటుంది. కారణం లేకుండా వరుసగా 15 రోజులు క్లాసులకు గైహాజరు అయితే స్కాలర్షిప్ నిలిపివేస్తారు.
స్టైపెండ్ | లోకల్ విద్యార్థులకు 2,500/- రూపాయలు, బయట నుండి వచ్చే విద్యార్థులకు నెలకు 5,000/- రూపాయల స్టైపెండ్ ప్రతినెల అందిస్తారు. |
స్పెషల్ అలోవెన్సు | స్పెషల్ అలోవెన్సు కింద డిజాబిలిటీ విద్యార్థుల సహాయకుల కోసం నెలలకు 2,000/- అందిస్తారు. |
ఎవరు అర్హులు
కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండే విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అర్హులు. విద్యార్థి 40% డిజాబిలిటీ కలిగి ఉండాలి. విద్యార్థి గ్రాడ్యుయేషన్ లేదా పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు సమయానికి విద్యార్థి దగ్గర డిజాబిలిటీ సర్టిఫికెట్. ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, ఆదాయ ధ్రువపత్రం, అకాడమిక్ సర్టిఫికెట్లు, మొబైల్ లింక్డ్ ఆధార్ కార్డు కలిగివుండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఉద్యోగ, ప్రవేశ లేదా అర్హుత పరీక్షా సంబంధిత ప్రకటన వెలువడిన తరవాత దరఖాస్తు స్థానిక కోచింగ్ ఇనిస్టిట్యూట్ల ద్వారా ఆహ్వానిస్తారు. అర్హుత ఉండే విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అవసరమయ్యే ధ్రువపత్రాల సహాయంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాటు చేయబడిన కమిటీ అర్హులను గుర్తించి, స్టైపెండ్ అందిస్తారు.