Advertisement
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ 2022
Scholarships

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ 2022

డిజాబిలిటీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్'ను 40 శాతం అంగవైకుల్యం (డిజాబిలిటీ) కలిగిన ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు డిప్లొమా విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.  ఫైనాన్సియల్, మెంటల్ ,సైకాలాజికల్ కారణాలతో 50 శాతం డిజాబిలిటీ విద్యార్థులు ఉన్నత విద్య నుండి డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈ శాతాన్ని తగ్గించి వారందరికి గౌరవప్రదమైన కాలేజీ విద్యను అందించేందుకు ఈ స్కాలర్షిప్ అమలుచేస్తున్నారు.

స్కాలర్షిప్ పేరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్
ఎవరు అర్హులు 40% డిజాబిలిటీ కలిగిన యూజీ, పీజీ విద్యార్థులు
దరఖాస్తు ముగింపు తేదీ 31-10-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 15-11-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 15-11-2022

ఈ పథకం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయబడువుతుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 17 వేలకు పైగా డిజాబిలిటీ విద్యార్థులు ఏటా ఈ స్కాలర్షిప్ వలన లబ్ది పొందుతున్నారు. ఈ పథకం కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే అందిస్తారు. ఈ స్కాలర్షిప్'కు అర్హుత పొందిన విద్యార్థులకు మైంటెనెన్సు అలోవెన్సు, ఫీజు రీయింబర్సమెంట్, బుక్ గ్రాంట్ అమౌంట్ మరియు డిజాబిలిటీ అలోవెన్సులు గరిష్టంగా ఏడాదిలో 10 నెలలు అందిస్తారు.

మైంటెనెన్సు అలోవెన్సు (నెలకు) హాస్టలర్స్ డేస్ స్కాలర్స్
గ్రూప్ I : ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, మానేజ్మెంట్ వెటర్నరీ గ్రూపులకు చెందిన యూజీ & పీజీ కోర్సులకు. అలానే AICTE మరియు యూజీసీ గుర్తింపు కలిగిన గ్రాడ్యుయేట్ & డిప్లొమా కోర్సులు 1600/- 750/-
గ్రూప్ II : ప్రొఫిషినల్ కోర్సులయిన ఫార్మసీ, హోటల్ మానేజ్మెంట్, లా, పారామెడికల్, మాస్ కమ్యూనికేషన్, ట్రావెల్-టూరిజం-హాస్పిటాలిటీ మరియు ఫైనాన్సియల్ కోర్సుల వంటివి 1100/- 700/-
గ్రూప్ III : గ్రూప్ 1, 2 పరిధిలో లేని సాధారణ డిగ్రీలు బిఎ, బీఎస్సీ, బీకాం etc 950/- 650/-
గ్రూప్ IV : ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు 900/- 550/-
బుక్ గ్రాంట్ (ఏడాదికి) 1500/- 1500/-

 

డిజాబిలిటీ టైప్ డిజాబిలిటీ అలోవెన్సు (ఏడాదికి)
దృష్టి లోపం (visually impaired) 4,000/-
వినికిడి లోపం (hearing impaired) 2,000/-
శారీరక వైకుల్యం (physically disabled) 2,000/-
మానసిక వైకుల్యం (intellectual disabilities) 4,000/-
ఇతర వైకుల్యాలు (Other disabilities) 2,000/-

ఫీజు రీయింబర్సమెంట్ కేటగిరిలో విద్యార్థి చేరిన కోర్సు ఆధారంగా, ఏడాదికి గరిష్టంగా 1.5 లక్ష వరకు అందిస్తుంది. ఇందులో ట్యూషన్ ఫీజుతో పాటుగా, ఎన్రోల్మెంట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు, స్పోర్ట్స్, మెడికల్, లైబరీ, మ్యాగజైన్ అలోవెన్సులు వంటివి ఉంటాయి.

ఎవరు అర్హులు

40 శాతం కనీస డిజాబిలిటీ కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు కలిగిన కాలేజీలు, యూనివర్సిటీలు, ఇనిస్టిట్యూట్లలలో చదివే విద్యార్థులు, ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసే ముందు విద్యార్థి, డిజాబిలిటీ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, అకాడమిక్ సర్టిఫికెట్, ఫొటోగ్రాఫ్, ఫీజు రిసిప్టులు మరియు ఆధార్ కార్డు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

ఈ స్కాలర్షిప్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎంపవర్మెంటు ఆఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ ద్వారా అందిస్తారు. దీనికి సంబంధించి దరఖాస్తు నోటిఫికేషన్ స్థానిక వార్తాపత్రికల్లో మరియు న్యూస్ ఛానెళ్లలో పబ్లిష్ చేస్తారు. అర్హుత ఉండే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం, అర్హుత ఉండే విద్యార్థులకు రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రభుత్వాల సిపార్సు మరియు అకాడమిక్ మెరిట్, డిజాబిలిటీ వాయిటేజ్ అనుసారం, విద్యార్థి బ్యాంకు అకౌంట్లలో స్కాలర్షిప్ జమ చేస్తారు.

అందుబాటులో ఉండే స్కాలర్షిప్'లలో 30 శాతం బాలికలకు రిజర్వ్ చేయబడి ఉంటాయి. అలానే ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందిస్తారు. ఈ పథకం పరిధిలో గరిష్టంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి టాప్ 25 వేల మందికి స్కాలర్షిప్ జమ చేస్తారు.

Post Comment