తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ : పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సాయం
Scholarships

తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ : పాఠశాల విద్యార్థులకు ఆర్థిక సాయం

తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకంను అధికారికంగా రాజీవ్ విద్యా దీవెన పథకం అంటారు. తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అంగవైకుల్య విద్యార్థులకు స్వల్ప మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు.

స్కాలర్షిప్ పేరు తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్
స్కాలర్షిప్ టైప్ ఫైనాన్సియల్ అసిస్టెన్స్
స్కాలర్షిప్ పరిధి క్లాస్ V నుండి క్లాస్ X విద్యార్థులు
స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ 75% కనీస హాజరు & 2 లక్షలలోపు కుటుంబ ఆదాయం

అదే విధంగా ఈ పథకాన్ని 9 మరియు 10వ తరగతి చదివే బీసీ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. కుటంబ ఆదాయం రెండుల లక్షలోపు ఉండే విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఇది పాఠశాల విద్యకు నిరుపేదలను చేరువ చేయాలనే ఆలోచనతో రూపొందించబడింది.

ఈ పథకం పరిధిలో ఉండే బాలురులకు నెలకు 100 రూపాయలు, బాలికలకు నెలకు 150 రూపాయల చెప్పున ఏడాదిలో గరిష్టంగా 10 నెలలు అందజేస్తారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే 9 మరియు 10 వ తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నెలకు 350 రూపాయలు, డే స్కాలర్ విద్యార్థులకు 150 రూపాయలు స్కాలర్షిప్ అందిస్తారు.

అదే విధంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునే 9 మరియు 10 వ తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు బుక్స్ మరియు ఇతర విద్యా అవసరాల కోసం ఏడాదికి 1000/- ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అందిస్తారు, అలానే డే స్కాలర్ విద్యార్థులకు ఏడాదికి 750/- విద్యా సాయని అందజేస్తారు.

రాజీవ్ విద్యా దీవెన పథకం చెల్లింపులు

క్లాస్ 5 నుండి క్లాస్ 8 క్లాస్ 9 నుండి క్లాస్ 10
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ బాలురులు : 100/- హాస్టల్ : 350/-
బాలికలు : 150/- డే స్కాలర్ : 150/-
ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ - హాస్టల్ : 1000/-
- డే స్కాలర్ : 750/-

తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ

మండల, జిల్లా, మున్సిపల్ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 5 నుండి 10వ తరగతి చదువుకునే ఎస్సీ, ఎస్టీ, వికలాంగు విద్యార్థులు ఈపథకం పరిధిలోకి వస్తారు. వీరి కుటుంబ ఆదాయం రెండు లక్షలోపు ఉండాలి. విద్యార్థుల హాజరు తగినంత ఉండాలి. 9 మరియు 10 చదువుతున్న బీసీ విద్యార్థులు కూడా అర్హులు.

తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు విధానం

తెలంగాణ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ ఈపాస్ వెబ్సైటులో అందుబాటులో ఉండే లింక్ ద్వారా పాఠశాల ప్రిన్సిపాల్ లేదా విద్యార్థి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు తప్పులు దొర్లకుండా నమోదు చేసి, తగిన ధ్రువపత్రాలతో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన దరఖాస్తును హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెరిఫై చేసి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ జమ చేస్తారు.

వచ్చే ఏడాది రెన్యువల్ చేసే సమయంలో ప్రిన్సిపాల్ లేదా విద్యార్థి పాత దరఖాస్తు నెంబర్ మరియు ఆధార్ నెంబర్ సాయంతో తిరిగి రెన్యువల్ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. సదురు దరఖాస్తును హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆమోదం తెలిపిన తర్వాత స్కాలర్షిప్ అందజేస్తారు.

Post Comment