Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 11 ఆక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 11 ఆక్టోబర్ 2023

రోజువారీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 11, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

మేరా యువ భారత్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

దేశ నిర్మాణం కోసం అపారమైన యువశక్తిని వినియోగించుకునేందుకు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ 'మేరా యువ భారత్‌ను' ఏర్పాటుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సంస్థ యువత అభివృద్ధి మరియు యువత-నేతృత్వంలోని అభివృద్ధి కోసం ఒక సమగ్ర ఎనేబుల్ మెకానిజమ్‌గా పనిచేస్తుంది.

ఈ కార్యక్రమం జాతీయ యువజన విధానంలో 15-29 సంవత్సరాల వయస్సు గల యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది. యుక్తవయస్కుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ప్రోగ్రామ్స్ విషయంలో 10-19 సంవత్సరాల వయస్సులో ఉండే యువత దీని లబ్ధిదారులుగా అర్హులు. మేరా యువ భారత్ ప్రధానంగా యువతలో నాయకత్వ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి వంటి కీలక రంగాల్లో దృష్టి సారిస్తుంది.

భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్రర్యం యొక్క కీలకమైన తరుణంలో 2047 నాటికి అమృత్‌ భారత్‌ను నిర్మించేందుకు, రాబోయే 25 ఏళ్లలో దేశంను అభివృద్ధి పథంలో నడిపేందుకు యువ భాగస్వామ్యం కోసం ప్రభుత్వం యోషిస్తుంది. యువత దేశం యొక్క భవిష్యత్తును నిర్వచించడంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటుంది. విజన్ 2047కి అనుగుణంగా గ్రామీణ, పట్టణ యువత మరియు రూర్బన్ యువతను ఒకే వేదిక కిందకు తీసుకురాగల ఫ్రేమ్‌వర్క్ రూపొందుతుంది.

యువతను సామాజిక ఆవిష్కర్తలుగా, సంఘాల్లో నాయకులుగా మార్చేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుంది. శ్రామికశక్తిలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు అవకాశాలను వారికీ అందిస్తుంది. యువతలో వ్యవస్థాపకత మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది.

యువతకు నాణ్యమైన వైద్యం, విద్య అందుబాటులో ఉంచడంతో పాటుగా, వారిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, మాదకద్రవ్య దుర్వినియోగాన్ని తగ్గించం, వారిలో స్వచ్ఛంద సేవ, సమాజ సేవను ప్రోత్సహించం వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

యువత అభివృద్ధికి మేరా యువ భారత్‌ కార్యక్రమం ప్రత్యేక వేదిక అవుతుంది. యువత-ఆధారిత కార్యక్రమాలు మరియు పథకాలను అమలు చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల ప్రయత్నాలను ఇది సమన్వయం చేస్తుంది. యువత అభివృద్ధికి సహాయక పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రైవేట్ రంగం మరియు పౌర సమాజ సంస్థలతో కూడా ఇది పని చేస్తుంది.

ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌ 2.0 ప్రారంభం

కేంద్ర మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్, ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ( IGMS) 2.0 పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పబ్లిక్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్‌ యొక్క ఆటోమేటెడ్ అనాలిసిస్ ఇన్ ట్రీ డాష్‌బోర్డ్ (DARPG) పోర్టల్‌ను ప్రారంభించారు. ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ 2.0 డ్యాష్‌బోర్డ్‌ను ఐఐటీ  కాన్పూర్ అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయడం కోసం డిసెంబర్ 14, 2021న అడ్మినిస్ట్రేటివ్ పబ్లిక్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ 2.0 భారతదేశంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని, ప్రభావాన్ని మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఇది ఫిర్యాదులను గుర్తించడానికి, ప్రాధాన్యతనివ్వడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి మరియు వాటిని సకాలంలో పరిష్కరించేలా చూసేందుకు సహాయపడుతుంది. ఈ డ్యాష్‌బోర్డ్ పబ్లిక్ ఫిర్యాదుల స్వభావం మరియు పోకడలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ఇది ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ 2.0 డ్యాష్‌బోర్డ్ భారతదేశంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని, ప్రభావాన్ని మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు. ప్రజా ఫిర్యాదులను త్వరగా మరియు సమర్ధవంతంగా పరిష్కరిస్తారని మరియు పౌరులు తమకు అందుతున్న ప్రతిస్పందనతో సంతృప్తి చెందారని నిర్ధారించడానికి ఇది ప్రభుత్వానికి సహాయపడుతుంది.

గ్లోబల్ ఐటి సేవల పవర్‌హౌస్‌గా హైదరాబాద్

హైదరాబాద్, ఇటీవలి కాలంలో గ్లోబల్ ఐటి సేవల పవర్‌హౌస్‌గా ఉద్భవించింది. ఈ నగరంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబీఎం, టిసిఎస్ మరియు ఇన్ఫోసిస్‌తో సహా అనేక బహుళజాతి మరియు భారతీయ ఐటీ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ ఐటి పరిశ్రమ విలువ $100 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది 600,000 మందికి పైగా ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధిని అందిస్తుంది.

గ్లోబల్ ఐటీ సర్వీసెస్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ ఆవిర్భవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలకు నిలయంగా ఉంది. ఇవి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ మరియు ఐటీ గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దుతున్నాయి. ముంబై, బెంగళూరు వంటి ఇతర ప్రధాన భారతీయ నగరాల కంటే హైదరాబాద్‌లో తక్కువ జీవన వ్యయం ఉండటం కూడా ఈ రంగానికి కలిచొచ్చింది.

హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్యపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇది ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి అనేక కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో ఆధునిక విమానాశ్రయం, మెట్రో రైలు వ్యవస్థ మరియు రోడ్ నెట్‌వర్క్‌లతో సహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. భారత ఐటీ హబ్‌గా పేరుగాంచిన బెంగళూరు నగరం ఇటీవలే కాలంలో ట్రాఫిక్ సమస్యలు, అధిక జీవన వ్యయ కారణాలతో క్రమంగా తన హోదాను కోల్పోవడం కూడా దీనికి సహాయపడింది.

ముంబైలో ల్యాండ్‌స్కేప్ & గార్డెనింగ్ ఎక్స్‌పో 2023

ల్యాండ్‌స్కేప్ అండ్ గార్డెనింగ్ ఎక్స్‌పో 2023 యొక్క 16వ ఎడిషన్, అక్టోబర్ 11-12 తేదీలలో ముంబైలోని గోరేగావ్‌లోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ యందు నిర్వహబడింది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబైలోని గార్డెన్స్ డిపార్ట్‌మెంట్, వరల్డ్ కౌన్సిల్ ఆన్ అర్బన్ గ్రీన్ లివింగ్ కాన్సెప్ట్స్ మరియు ట్రీ కల్చర్ సంయుక్తంగా ఈ ఎక్స్‌పోను నిర్వహించాయి. ఇలాంటి ఎక్స్‌పోను ముంబై నిర్వహించడం ఇదే మొదటిసారి.

ఈ ఎక్స్‌పోలో ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ మరియు హార్టికల్చర్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అనేక సెమినార్‌లు మరియు వర్క్‌షాప్‌లు నిర్వహించబడాయి. భారతదేశం మరియు విదేశాల నుండి 10,000 మంది సందర్శకులు దీనికి హాజరయ్యారు. ఎగ్జిబిటర్లు ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ మరియు హార్టికల్చర్‌కు సంబంధించిన అనేక రకాల ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించారు.

ప్రో కబడ్డీ లీగ్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ సెహ్రావత్

అక్టోబర్ 9-10వ తేదీలలో ముంబైలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (PKL) యొక్క 9వ ఎడిషన్ ఆటగాళ్ల వేలంలో తెలుగు టైటాన్స్‌కు చెందిన పవన్ సెహ్రావత్ రూ. 2.6 కోట్ల టాప్ బిడ్‌ను పొందాడు. దీంతో ఇప్పటివరకు పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సెహ్రావత్ ప్రస్తుతం భారత జాతీయ కబడ్డీ జట్టుకు కెప్టెన్ మరియు ప్రపంచంలోని అత్యుత్తమ కబడ్డీ క్రీడాకారులలో ఒకరిగా ఉన్నాడు. ఈయన దూకుడు రైడింగ్ నైపుణ్యాలకు మరియు ఒకే రైడ్‌లో బహుళ పాయింట్లను స్కోర్ చేయగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు.

ఇకపోతే తాజా వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడుగా ఇరానియన్ మొహమ్మద్రెజా షాద్లౌయ్ చియానెహ్ నిలిచాడు. ఈయన్ని ₹2.35 కోట్లకు పుణెరి పల్టన్ కొనుగోలు చేసింది. ఇది 23 ఏళ్ల లీగ్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి చెల్లించిన అత్యధిక పైకం. ఈ జాబితాలో కోటి మార్కును చేరిన ఇతర ఆటగాళ్లలో మణిందర్ సింగ్ - బెంగాల్ వారియర్స్ (2.12 కోట్లు), ఫజెల్ అత్రాచలి - గుజరాత్ జెయింట్స్ (1.60 కోట్లు), సిద్ధార్థ్ దేశాయ్ - హర్యానా స్టీలర్స్ (1 కోటి) ఉన్నారు.

ప్రో కబడ్డీ లీగ్ అనేది భారతీయ పురుషుల ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్. ఇది 2014లో ప్రారంభించబడింది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కబడ్డీ లీగ్, ఇది భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా కబడ్డీ క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సహాయపడింది. ఈ లీగ్ యందు పాట్నా పైరేట్స్ అత్యధికంగా 3 టైటిల్స్ సాధించింది.

మానసిక ఆరోగ్యం & కౌన్సెలింగ్ సేవల కోసం యూపీ ప్రభుత్వానికి అవార్డు

మానసిక ఆరోగ్యం మరియు కౌన్సెలింగ్‌లో టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించినందుకు యూపీ ప్రభుత్వానికి అవార్డు లభించింది. ఈ అవార్డును భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించింది . ఉత్తరప్రదేశ్‌ జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పింకీ జోవల్‌ ఈ అవార్డును అందుకున్నారు.

గత ఏడాది జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సంధర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టెలిమనస్ సేవల క్రింద, వ్యక్తులందరికీ ఉచిత మానసిక ఆరోగ్య సేవల కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవంను యేటా అక్టోబర్ 10వ తేదీన జరుపుకుంటారు. ఇది మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి మరియు మద్దతును ప్రోత్సహించడానికి రూపొందించబడింది.

మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది, కానీ ఇది తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది. జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం మనందరికీ మానసిక ఆరోగ్యం ఉందని మరియు మన మానసిక క్షేమాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యమని గుర్తుచేస్తుంది. వయస్సు, జాతి, లింగం లేదా సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మానసిక ఆరోగ్య సమస్యలు ఎవరినైనా ప్రభావితం చేయగలవని గుర్తుంచుకోవడం ముఖ్యం.

బెంగళూరులో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించిన బీహార్

బీహార్ పరిశ్రమల శాఖ బెంగళూరులో పెట్టుబడిదారుల సదస్సును నిర్వహించింది. ఆ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పెంపొందించడానికి ఈ సమ్మిట్ కీలక వేదికగా నిలిచింది. బ్రిటానియా, ఐబీఎం, యూఎస్టీ గ్లోబల్, సినాప్సిస్, షాహీ ఎక్స్‌పోర్ట్స్, గోకుల్‌దాస్, రేమండ్ మరియు అరవింద్ లైఫ్‌స్టైల్ వంటి పరిశ్రమల దిగ్గజాలతో సహా 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ సమ్మిట్‌కు హాజరయ్యాయి.

బీహార్ ప్రభుత్వం లెదర్ మరియు టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎలక్టానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ & ఈ-వాహనాల వంటి అధిక ప్రాధాన్యత గల రంగాలలో సంభావ్య పెట్టుబడిదారులకు వివిధ ప్రోత్సాహకాలను అందించింది. ఇది బీహార్‌లో పరిశ్రమలను స్థాపించడానికి ఆసక్తి ఉన్న కంపెనీలకు ప్లగ్ & ప్లే సౌకర్యాలు మరియు మద్దతును కూడా అందించింది.

బీహార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపడంతో సమ్మిట్ విజయవంతమైంది. ఈ సమ్మిట్ వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతాయని, బీహార్ ప్రజలకు కొత్త ఉద్యోగాలు, అవకాశాలు లభిస్తాయని బీహార్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

మూడు కీలకమైన ఖనిజాల మైనింగ్ కోసం రాయల్టీ రేట్లు ఆమోదం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి, 3 కీలకమైన మరియు వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేటును పేర్కొనడానికి గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 ('MMDR చట్టం') యొక్క రెండవ షెడ్యూల్ సవరణకు ఆమోదించింది. ఈ ఖనిజాల జాబితాలో లిథియం, నియోబియం మరియు అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ (REEలు) ఉన్నాయి.

ఇటీవల, గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి మరియు నియంత్రణ) సవరణ చట్టం 2023ను పార్లమెంటు ఆమోదించింది. ఇది ఆగస్టు 17, 2023 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లిథియం మరియు నియోబియంతో సహా ఇతర ఆరు ఖనిజాలను అణు ఖనిజాల జాబితా నుండి తొలగించింది. తద్వారా లిథియం, నియోబియం, యురేనియం మరియు థోరియంతో సహా 24 క్లిష్టమైన మరియు వ్యూహాత్మక ఖనిజాల మైనింగ్ లీజు మరియు లైసెన్స్‌ల వేలంకు ద్వారం తెరిచింది. ఈ ఖనిజాల మైనింగ్ కోసం వేలం ద్వారా ప్రైవేట్ రంగానికి రాయితీలను కూడా మంజూరు చేస్తుంది.

తాజాగా రాయల్టీ రేటు స్పెసిఫికేషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల దేశంలో తొలిసారి లిథియం, నియోబియం మరియు ఇతర అరుదైన ఖనిజాల బ్లాక్‌లను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వంకు వీలు కల్గుతుంది. ఖనిజాలపై రాయల్టీ రేటు అనేది బ్లాకుల వేలంలో బిడ్డర్లకు అందించే ముఖ్యమైన ఆర్థికపరమైన అంశం. ఈ ఖనిజాల సగటు అమ్మకపు ధర (ASP) గణన పద్ధతిని కూడా గనుల మంత్రిత్వ శాఖ తయారు చేసింది, ఇది బిడ్ పారామితులను నిర్ణయించడానికి వీలు కల్పిస్తుంది.

గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 యొక్క రెండవ షెడ్యూల్ వివిధ ఖనిజాలకు రాయల్టీ రేట్లను అందిస్తుంది. రెండవ షెడ్యూల్‌లోని ఐటెమ్ నెం.55, రాయల్టీ రేటు ప్రత్యేకంగా అందించబడని ఖనిజాల కోసం రాయల్టీ రేటు సగటు అమ్మకపు ధర (ASP)లో 12% గా నిర్దేశిస్తుంది. అయితే లిథియం, నియోబియం మరియు అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ కోసం రాయల్టీ రేటు ప్రత్యేకంగా అందించబడకపోతే, వారి డిఫాల్ట్ రాయల్టీ రేటు సగటు అమ్మకపు ధరలో 12% ఉంటుంది. ఈ రేటు ఈ ఖనిజాలకు లాభదాయకం కాదని ప్రభుత్వం భావిస్తుంది. వీటికి సహేతుకమైన రాయల్టీ రేటును ఈ క్రింది విధంగా పేర్కొనాలని నిర్ణయించబడింది.

  • లిథియం - లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ ధరలో 3%,
  • నియోబియం –సగటు విక్రయ ధరలో 3% (ప్రాథమిక మరియు ద్వితీయ మూలాల కోసం),
  • రేర్ ఎర్త్ ఎలిమెంట్స్- రేర్ ఎర్త్ ఆక్సైడ్ యొక్క సగటు విక్రయ ధరలో 1%

ఈ ఖనిజాలకు గతంలో వర్తించే 12% రాయల్టీ రేటు కంటే ఈ రాయల్టీ రేట్లు తక్కువగా కేటాయించబడింది. ఈ నిర్ణయం ఈ రంగంలో పెట్టుబడిని ఆకర్షించడానికి మరియు భారతదేశంలో ఈ కీలకమైన ఖనిజాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి మరియు ఎలక్ట్రానిక్స్‌తో సహా వివిధ రకాల పరిశ్రమలకు లిథియం, నియోబియం మరియు అరుదైన మూలకాలు అవసరం. భారతదేశం ప్రస్తుతం ఈ ఖనిజాల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది, కాబట్టి వీటి దేశీయ ఉత్పత్తి దేశ అభివృద్ధికి, దేశ ఆర్థిక భద్రతకు ముఖ్యమైనది.

టిబెట్ హిమానీనదాలను ప్రభావితం చేస్తున్న థార్ ఎడారి ధూళి

భారతదేశంలోని థార్ ఎడారి నుండి వచ్చే ధూళి టిబెటన్ పీఠభూమిలోని హిమానీనదాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. నేచర్ క్లైమేట్ చేంజ్ అనే జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, థార్ ఎడారి నుండి వచ్చే ధూళి హిమానీనదాల ఆల్బెడోను తగ్గిస్తుందని నివేదించింది. ఈ దూళీ సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించి, తిరిగి హిమానీనదాలు ఎక్కువ సూర్యరశ్మిని గ్రహించేలా చేసి వేగంగా కరిగేందుకు కారణమౌతున్నాయని పేర్కొంది.

ఈ పరిశోధనలో భాగంగా టిబెటన్ పీఠభూమి యొక్క ఉపగ్రహ డేటా మరియు మంచు కోర్లను విశ్లేషించారు. ఇటీవలి దశాబ్దాలలో హిమానీనదాలపై నిక్షిప్తమైన ధూళి పరిమాణం గణనీయంగా పెరిగిందని కనుగొన్నారు. ధూళి వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే హిమానీనదాలు తక్కువ ప్రభావితమైన వాటి కంటే వేగంగా కరిగిపోతున్నాయని కూడా వారు కనుగొన్నారు.

టిబెటన్ పీఠభూమి ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ వెలుపల అతిపెద్ద హిమానీనదాలకు నిలయంగా ఉన్నాయి. ఈ హిమానీనదాలు ప్రాంతీయ వాతావరణాన్ని నియంత్రించడంలో మరియు మిలియన్ల మందికి నీటి వనరులను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో టిబెట్ పీఠభూమి హిమానీనదాలపై థార్ ఎడారి నుండి దుమ్ము ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతుంది. ఇది మరింత హిమానీనదాల కరగడంకు కారణమై ఈ ప్రాంతంలోని నీటి వనరులు మరియు పర్యావరణ వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపనుంది.

థార్ ఎడారి నుండి వెలువడే ధూళి ఉద్గారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ అధ్యయనం యొక్క ఫలితాలు హైలైట్ చేస్తున్నాయి. ఎడారిలో చెట్లు మరియు పొదలను నాటడం ద్వారా దుమ్ము కణాలను బంధించడంతో పాటుగా దుమ్ము తుఫానులకు దోహదపడే అటవీ నిర్మూలన మరియు ఇతర భూ వినియోగ పద్ధతులను తగ్గించడం కూడా ముఖ్యం.

Post Comment