నేషనల్ ఫెలోషిప్ & స్కాలర్షిప్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ (ఎస్టీ) స్టూడెంట్స్ పథకం, షెడ్యూల్డ్ కులాల (ఎస్టీ) విద్యార్థులకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. నిరుపేదలైన ఎస్టీ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా యూజీ మరియు పీజీ విద్యతో పాటుగా ఎంఫిల్, పీహెచ్డీ వంటి పరిశోధన విద్యను పూర్తిచేయొచ్చు. ఎంఫిల్/పీహెచ్డీ చదివే ఎస్టీ విద్యార్థులకు అందించే ఫెలోషిప్ ద్వారా, వారికీ అత్యున్నత పరిశోధన సంస్థల్లో పనిచేసే అవకాశం దొరుకుతుంది.
ఒకప్పుడు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఆర్జీఎన్ఎఫ్) మరియు ఎస్టీ విద్యార్థులకు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో అమలు చేసే ఈ పథకాన్ని 2014-15 విద్యా సంవత్సరం నుండి నేషనల్ ఫెలోషిప్ & స్కాలర్షిప్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ పేరుతో అమలుచేస్తున్నారు. దీని ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్'తో పాటుగా, ఎంఫిల్, పీహెచ్డీ చేసే పరిశోధన విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఆఫర్ చేస్తున్నారు.
స్కాలర్షిప్ పేరు | నేషనల్ ఫెలోషిప్ & స్కాలర్షిప్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ |
ఎవరు అర్హులు | వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉండే ఎస్టీ విద్యార్థులకు |
దరఖాస్తు ముగింపు తేదీ | 15-04-2022 |
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ | 22-04-2022 |
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ | 22-04-2022 |
ఫెలోషిప్ : సమాజంలో అత్యంత తక్కువ అక్షరాస్యత ఉండే ఎస్టీ కుటంబాలకు చెందిన విద్యార్థులను క్వాలిఫైడ్ ప్రొఫిషినల్స్'గా తీర్చిదిద్దడంతో పాటుగా వారిని యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా ప్రోత్సహించేందుకు ఈ ఫెలోషిప్ అందిస్తున్నారు. ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందిన పరిశోధన విద్యార్థులకు, యూజీసీ/ఐసిఏఆర్ ఫార్మేట్ జూనియర్ ఫెలోషిప్ ఆఫర్ చేస్తున్నారు. దేశంలో యూజీసీ గుర్తింపు పొందిన అన్ని యూనివర్సిటీలలో చదివే రెగ్యులర్ ఎంఫిల్/పీహెచ్డీ విద్యార్థులు దీనికి అర్హులు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు మరో మూడేళ్లు వ్యవధితో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
ఈ ఫెలోషిప్ ఏటా 750 మంది ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులకు ఆఫర్ చేస్తారు. అందుబాటులో ఉన్న ఈ సీట్లలో 3 శాతం వికలాంగులైన ఎస్టీ విద్యార్థులకు, 30 శాతం మహిళా విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో 50 శాతం ఆదిమ గిరిజన జాతులకు (PVTG), 50 శాతం నిరుపేద గిరిజనుల (బీపీఎల్ కుటుంబాలకు) చెందిన విద్యార్థులతో భర్తీచేస్తారు.
M.Phil | Ph.D | |
Fellowship | 25000/- PM | Rs.28000/- PM |
Contingency | 10000/- per year for Humanities & Social Sciences. 12000/-per year for Science, Engineering Technology. |
20500 per year for Humanities & Social Sciences. 25000 per year for Science, Engineering Technology |
House Rent Allowance | As per rules of the University/Institutio ns/Colleges | As per rules of the University/Institutio ns/Colleges |
Escorts/Reader Assistance | 2000/- p.m in case of physically handicapped and blind candidates for all the subjects | 2000/- p.m in case of physically handicapped and blind candidates for all the subjects |
స్కాలర్షిప్ : స్కాలర్షిప్ పథకాన్ని అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే ఎస్టీ విద్యార్థులకు అందజేస్తారు. ఇందులో సాధారణ డిగ్రీలతో పాటుగా ఇంజనీరింగ్, మెడిసిన్, మానేజ్మెంట్, అగ్రికల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు న్యాయ విద్య వంటి అన్ని యూజీ మరియు పీజీ కోర్సులకు అందిస్తారు. ఈ పథకం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నోటిఫై చేసిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఈ స్కాలర్షిప్ దేశ వ్యాప్తంగా ఏటా 1000 మంది ఎస్టీ విద్యార్థులకు అందిస్తారు.
Component | Details | Remark |
Tuition Fees | full tuition fee and other non-refundable dues in respect of Government/Governmentfunded institutions. | There will be a ceiling of Rs.2.50 lakhs per annum per student for private sector institutions |
Books & Stationery | 3,000/- | per annum per student without bills/vouchers |
Living expenses | 2200/- per month | Amount will be provided as per actuals subject to maximum ceiling 26400/- per annum |
Computer & Accessories | 45000/- One time assistance tenure) | Computer may be Desktop/Laptop etc. |
ఎవరు అర్హులు
వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షలోపు ఉండే ఎస్టీ విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, రెగ్యులర్ ఎంఫిల్ లేదా పీహెచ్డీ కోర్సులో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసి ఉండాలి. ఫెలోషిప్ కోసం ఎంపికైన విద్యార్థులకు ఇంకెటువంటి స్కాలర్షిప్ పథకాలకు అర్హులు కారు. సీనియర్ ఫెలోషిప్'కు అర్హుత సాధించిన విద్యార్థులు యూజీసీ/ఐసిఏఆర్ నిబంధనలు సంతృప్తపర్చాలి.
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసే ఎస్టీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ పూర్తిచేసి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నోటిఫై చేసిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ విద్యసంస్థలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసి ఉండాలి. విద్యార్థి కుటుంబ ఆదాయం వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షలోపు ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
ఫెలోషిప్ సంబంధిత నోటిఫికేషన్ వార్తా పత్రికలు మరియు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంచుతారు. అర్హుత కలిగిన అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రూపొందించిన పోర్టల్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ కమిటీ ఆమోద అనంతరం ఫెలోషిప్ ఆఫర్ చేస్తారు. స్కాలర్షిప్ కోసం అర్హుత కలిగిన విద్యార్థులు, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులలో అర్హులను గుర్తించి, వారికీ స్కాలర్షిప్ జమ చేస్తారు.
దరఖాస్తు చేసే ముందు ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, ఆధార్ కార్డు, అకాడమిక్ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, అడ్మిషన్ ధ్రువపత్రం అందుబాటులో ఉంచుకోండి.
సామజిక కేటగిరి | రిజర్వేషన్ కోటా |
ఓబీసీ | 27 % |
షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ ) | 15% |
షెడ్యూల్డ్ ట్రైబల్ (ఎస్టీ) | 7.5% |
డిజాబిలిటీ | 5% |
ఉమెన్ కోటా | 50% (మొత్తం స్కాలర్షిప్ లలో) |