20వ ఎడిషన్ ఇండియా ఫ్రాన్స్ నేవల్ ఎక్సర్‌సైజ్ ‘వరుణ’ ప్రారంభం
భారతదేశం మరియు ఫ్రెంచ్ నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల 20వ ఎడిషన్ ‘వరుణ’ అరేబియా సముద్రంలో 30 మార్చి నుండి 03 ఏప్రిల్ 2022 మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ రెండు నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాలు 1993లో ప్రారంభించబడ్డాయి. ఈ విన్యాసానికి 2001లో ‘వరుణ’ అని నామకరణం చేశారు. ఇది భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలలో కీలక భాగంగా మారింది. ఈ ఎక్సర్‌సైజ్’లో రెండు నౌకాదళాలకు చెందిన ఓడలు, జలాంతర్గాములు, సముద్ర గస్తీ విమానం, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లతో సహా వివిధ విభాగాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
సిమ్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండురుగా లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ మహల్
సిమ్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండురుగా (ARTRAC) లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎస్ మహల్ బాధ్యతలు స్వీకరించరు. ఈ మార్చి 31 న ఈ హోదాలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా పదవీ విరమణ చేయడంతో, ఆ స్థానంలో ఈయన నియమించబడ్డారు.
ఎన్డీయే కొత్త కమాండెంట్‌గా వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్
వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ నుండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ) కమాండెంట్ నియామకాన్ని స్వీకరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయినా కొచ్చర్, 01 జూలై 1988న భారత నౌకాదళంలో కెరీర్ ప్రారంభించారు. వైస్ అడ్మిరల్ కొచర్ ఇది వరకు భారత నావికాదళానికి చెందిన వెస్ట్రన్ ఫ్లీట్‌కు కమాండర్‌గా ఉన్నారు, అతను అనేక క్లిష్టమైన మిషన్‌లు మరియు విదేశీ ద్వైపాక్షిక వ్యాయామాలకు నాయకత్వం వహించారు. భారతదేశం యొక్క ఏకైక విమాన వాహక నౌక INS విక్రమాదిత్యకు నాయకత్వం వహించిన ఘనత ఆయనకు దక్కింది.
ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే సింగపూర్ పర్యటన
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 6 వరకు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని ప్రాంతీయ హెచ్‌ఏడీఆర్ కోఆర్డినేషన్ సెంటర్ (ఆర్‌హెచ్‌సిసి), ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ (ఐఎఫ్‌సి)లను భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ఎం నరవాణే సందర్శించారు. మల్టీ-నేషన్ HADR రెస్పాన్స్ మెకానిజం ద్వారా సముద్ర భద్రతను పెంపొందించే చర్యల గురించి ఆరా తీశారు.
మూడు రోజుల పర్యటనలో సింగపూర్ అగ్ర సైనిక నాయకత్వంతో చర్చలు జరిపారు. అలానే బ్యాటిల్ బాక్స్ బంకర్‌ను సందర్శించారు. సింగపూర్‌లోని క్రాంజీ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, మరణించిన వారికి నివాళులు అర్పించారు.
భారత ఆర్మీ తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యం యొక్క 29వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన ప్రస్తుత జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే స్థానంలో 01 మే 2022 న బాధ్యతలు చేపట్టనున్నారు. మనోజ్ పాండే ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కొనసాగుతున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే, బాంబే సాపర్స్ నుండి కమీషన్ పొందిన తర్వాత డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో చేరారు. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుండి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా మనోజ్ పాండే నిలిచారు.
ఐఎన్ఎస్ వాగ్‌షీర్ జలాంతర్గామి ప్రారంభం
ప్రాజెక్ట్ 75 కింద నిర్మించిన ఆరు జలాంతర్గాములలో చివరిదైన ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామిని రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఇది జలాంతర్గామి పూర్తిస్థాయి పోరాట యోగ్యమైనదిగా నిర్ధారించడానికి ఒక సంవత్సరం సమయం వరకు కఠినమైన పరీక్షలు మరియు ట్రయల్స్‌కును జరపనున్నారు.
మిలటరీ తదుపరి డీజీగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్
లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ తదుపరి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌గా నియమితులయ్యారు. మే 1వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన కతియార్ జూన్ 1986 లో రాజ్‌పుత్ రెజిమెంట్ యొక్క 23వ బెటాలియన్‌లో నియమించబడ్డారు.
ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు
ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. సైనిక్ స్కూల్ బీజాపూర్ మరియు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి, అతను 15 డిసెంబర్ 1984న జేఏటీ రెజిమెంట్ ద్వారా అథిమిలో ప్రవేశించారు.