ఆసియా దేశాలు వాటి రాజధానులు, కరెన్సీ, భాషలు
Study Material

ఆసియా దేశాలు వాటి రాజధానులు, కరెన్సీ, భాషలు

ఆసియా భూమిపై అతిపెద్ద ఖండం. ఇది 44,579,000 చదరపు కిలోమీటర్లు (17,212,000 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది. భూమి యొక్క మొత్తం భూభాగంలో 30% మరియు భూమి యొక్క మొత్తం ఉపరితల వైశాల్యంలో 8.7% విస్తరించి ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 60% ఈ ఖండంలోనే నివశిస్తున్నారు.

Advertisement

ఆసియా తూర్పున పసిఫిక్ మహాసముద్రం , దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా ఉంది. ఆసియాను భౌగోళికంగా ఆరు భాగాలుగా విభజిస్తారు. అవి ఉత్తర ఆసియా ( సైబీరియా ), మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా ( మిడిల్ ఈస్ట్) దక్షిణ ఆసియా ( భారత ఉపఖండం ) తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా ( ఈస్ట్ ఇండీస్ మరియు ఇండోచైనా). ఆసియాలో మొత్తం 48 దేశాలు ఉన్నాయి. వీటితో పాటుగా తైవాన్, హాంగ్ కాంగ్, మకావో ప్రాంతాలు చైనా ఆదీనంలో ఉన్నాయి.

ఆసియా దేశాలు వాటి రాజధానులు

నెం దేశం రాజధాని కరెన్సీ లాంగ్వేజ్
1 ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ఆఫ్ఘాని (AFN) పాష్టో, పెర్షియన్
2 బహ్రెయిన్ మనమా బహ్రెయిన్ దినార్ (BHD) అరబిక్ & ఇంగ్లీష్
3 బాంగ్లాదేశ్ ఢాకా టాకా (BDT) బెంగాలీ
4 భూటాన్ థింపూ నగుల్ట్రోమ్ (BTN) జొంగ్ఖా
5 బ్రూనై బందర్ సెరి బెగవాన్ బ్రూనై డాలర్ (BND) మలయ్ & ఇంగ్లీష్
6 కంబోడియా నమ్ పెన్ రీల్ ఖైమర్
7 చైనా బీజింగ్ యువాన్ (CNY) చైనీస్ & మంగోలియన్
8 ఈస్ట్ తైమూర్ దిలీ యూఎస్ డాలర్ (USD) టేటం & పోర్చుగీస్
9 ఇండియా న్యూఢిల్లీ ఇండియన్ రూపీ (INR) హిందీ
10 ఇండోనేషియా నుసంతారా (న్యూ), జకార్తా (ఓల్డ్) ఇండోనేసియా రూపీ (IDR) ఇండోనేషియా
11 ఇరాన్ టెహ్రాన్ రియల్ ఇరానియన్ (IRR) పెర్షియన్
12 ఇరాక్ బాగ్దాద్ ఇరాకీ దినార్ (IQD) తుర్క్మెన్ & సిరియాక్
13 ఇజ్రాయెల్ జెరూసలేం యి-హా-ష్హ్ ( AM ) అరబిక్
14 జపాన్ టోక్యో జాపనీస్ యెన్ (JPY) జపనీస్
15 జోర్డాన్ అమ్మన్ జోర్డాన్ దినార్ (JOD) అరబిక్
16 కజకిస్తాన్ నూర్-సుల్తాన్ టెంగే (KZT) కజఖ్ & రష్యన్
17 ఉత్తర కొరియా ప్యోంగ్యాంగ్ వాన్ (KPW) కొరియన్
18 దక్షిణ కొరియా సియోల్ వాన్ (KRW) కొరియన్
19 కువైట్ కువైట్ సిటీ కువైట్ దినార్ ( KWD ) అరబిక్
20 కిర్గిజ్'స్థాన్ బిష్కెక్ సోమ్ (KGS) కిర్గిజ్ & రష్యన్
21 లావోస్ వియంటియాన్ కిప్ (LAK) లావో & ఫ్రెంచ్
22 లెబనాన్ బీరుట్ లెబనీస్ పౌండ్ ( LBP) అరబిక్ & ఫ్రెంచ్
23 మలేషియా కౌలాలంపూర్ రింగ్‌గిట్  MYR) మలాయ్ & ఇంగ్లీష్
24 మాల్దీవులు మాలే మాల్దీవియాన్ రూపియ (MVR) ధివేహి & ఇంగ్లీష్
25 మంగోలియా ఉలాన్‌బాతర్ టోగ్రగ్ (MNT) మంగోలియన్
26 మయన్మార్ నాయపైడా కయాట్ (MMT) బర్మీస్
27 నేపాల్ ఖాట్మండు నేపాలీ రూపాయి(NPR) నేపాలీ
28 ఒమన్ మస్కట్ ఒమానీ రియాల్ (OMR) అరబిక్
29 పాకిస్తాన్ ఇస్లామాబాద్ పాకిస్తాన్ రూపాయి(PKR) ఇంగ్లీష్ & ఉర్దూ
30 పాలస్తీనా జెరూసలేం ఈజిప్టు పౌండ్ (EGP) అరబిక్
31 ఫిలిప్పీన్స్ మనీలా ఫిలిప్పీన్ పెసో (PHP) ఫిలిపినో & ఇంగ్లీష్
32 ఖతార్ దోహా రియాల్ ( QAR ) అరబిక్
33 సౌదీ అరేబియా రియాద్ సౌదీ రియాల్ (SAR) అరబిక్
34 సింగపూర్ సింగపూర్ సింగపూర్ డాలర్ (SGD) మలయ్ & ఇంగ్లీష్
35 శ్రీలంక కొలంబో శ్రీలంక రూపాయి (SKR) సింహళ & తమిళం
36 సిరియా డమాస్కస్ సిరియన్ పౌండ్ (SYP) అరబిక్
37 తైవాన్ తైపీ న్యూ తైవాన్ డాలర్ (TWD) తైవాన్
38 తజికిస్తాన్ దుషన్‌బే సోమోని (TJS) తజికి
39 థాయిలాండ్ బ్యాంకాక్ బట్ (THB) థాయ్
40 టర్కీ అంకారా టర్కిష్ లిరా(TRY) టర్కిష్
41 తుర్క్‌మెనిస్తాన్ అష్గబాత్ తుర్క్మెనిస్తాన్ మనాట్ ( TMT) రష్యన్
42 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి యుఎఇ దిర్హామ్ (AED) అరబిక్
43 ఉజ్బెకిస్తాన్ తాష్కెంట్ ఉజ్బెక్ సోమ్ (UZS) ఉజ్బెక్ & రష్యన్
44 వియత్నాం హనోయి డాంగ్ (VND) వియత్నామీస్
45 యెమెన్ సనా యెమెన్ రియాల్ (YER) అరబిక్
46 సైప్రస్ నికోసియా యూరో గ్రీకు, టర్కిష్
47 ఆర్మేనియా యెరెవాన్ అర్మేనియన్ డ్రామ్ అర్మేనియన్
48 అజర్‌బైజాన్ బాకు అజర్‌బైజాన్ మనత్ అజర్‌బైజాన్

డిపెండెన్సీలు లేదా ఇతర భూభాగాలు

నెం దేశం రాజధాని కరెన్సీ లాంగ్వేజ్
1 తైవాన్ తైపీ సిటీ న్యూ తైవాన్ డాలర్ మాండరిన్ చైనీస్
2 హాంగ్ కాంగ్ విక్టోరియా హాంగ్ కాంగ్ డాలర్ చైనీస్, ఇంగ్లీష్
2 మకావో హవాయి మకావో డాలర్ చైనీస్, ఇంగ్లీష్

Advertisement